ఆరడుగులు
- Pitta Govinda Rao
- Jun 28, 2023
- 4 min read

'Araadugulu' - New Telugu Story Written By Pitta Gopi
'ఆరడుగులు' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
నాన్నా! బాత్రూమ్ లో షాంపు లేదు. తెచ్చి పెట్టండి" ఒళ్ళంతా తడితో అన్నాడు విజయ్.
బాత్రూమ్ లో షాంపు లేదని తండ్రి రామరాజు కి ముందే తెలుసు ఏమో.. విజయ్ మాటలు పూర్తి కాకుండానే ఒక ప్యాకెట్ చింపుతు..
"తెస్తున్నాను రా " అంటూ కొసరు కొసరు చేతిలో వేస్తు అన్నాడు తండ్రి.
"ఏంటి నాన్న కొంచెము వేస్తున్నావు.. సరిపోదు వేయి" గాభరా పెట్టాడు విజయ్.
"ఏంట్రా.. ఇంట్లో అందరూ ఎన్నిసార్లు తలస్నానం చేస్తే అన్ని సార్లు షాంపులా.. ఈ షాంపులకే సగం డబ్బు పోస్తే.. ఎట్టా బతికేది" అని బాత్రూమ్ లోపలికి తోసేస్తాడు రామరాజు.
"చీ.. చీ.. ఇంత పిసనారిని ఎక్కడా చూడలేదు. ఎప్పుడు మారుతాడో ఈ పిసనారి తండ్రి బాత్రూమ్ లోంచి నసుక్కున్నాడు విజయ్.
రామరాజు, ఇంటి వెనుక ఉన్న గోశాల వైపు వెళ్ళగా అక్కడ పదిమంది పనివాళ్ళు ఆవులన్నీంటికి పాలు తీస్తున్నారు.
రామరాజు వస్తూనే "అరెయ్.. ఇన్ని సంవత్సరాలు గా నా వద్ద పని చేస్తున్నారు.. నా లాభం గూర్చి ఎప్పుడు అయినా ఆలోచించారా..”
"బాగానే మేపుతూ ఎక్కువ పాలు వచ్చేలా చేస్తున్నాం కదయ్యా.. ముందు మా జీతాలు పెంచండయ్యా".. అన్నాడొక పాలేరు.
" మీకు జీతాలు పెంచుకుపోతే నా ఆస్తి ఏమి కాను రా..
కాస్త నీళ్ళు కలపండి. ఇవే పాలతో ఎక్కువ లాభం రావాలి" అన్నాడు.
చేసేది లేక నీరు కలిపి పట్టుకెళ్తాడు మరో పాలేరు.
విజయ్ ఆఫీసుకి బయలుదేరుతూ
" నాన్నా.. పాప యూనిఫామ్ చిరిగిపోయింది. నేను వచ్చే సరికి లేటు అవుతుంది. మరో డ్రెస్ ను బజారులో కొనుక్కుని రా " యూనిఫామ్ చేతికి ఇస్తు అంటాడు విజయ్.
"హ.. చిరిగిపోతే కొత్తవి తీసుకోటమేనా.. ఇటు తే.. నేను కుట్టించుకు తెస్తా" అంటూ తీసుకున్నాడు.
"వీడు ఈ జన్మలో మారడు " అంటూ విజయ్ ఆఫీసు కి పోతాడు.
బజారులో కూరగాయలు కొంటూ..
"ఎంత ఈ వంకాయలు..”
" కిలో 25 నాయినా " అంటుంది అవ్వ.
" హ.. 25 రూపాయలు హ.. 20కి ఇస్తే తీసుకుంటా " అంటూ బేరానికి దిగాడు.
"కుదరదు నాయినా! కష్టపడి వేశాం. లాభం లేకపోయినా పర్వాలేదు. నష్టం రాకూడదు కదా మాకు" అంటుంది అవ్వ.
అయినా రామరాజు తగ్గకుండా "ఇస్తే ఇవ్వు లేకపోతే ఇంకో షాపుకి పోతా " అంటూ పేచి పెడతాడు.
చేసేదిమి లేక 20కి ఇస్తుంది అవ్వ.
అదే అదనుగా షాపులన్ని తిరిగి కూరగాయలు కొంటాడు.
వస్తూ వస్తూ ఉండగా దూరం నుంచి ఎవరో వ్యక్తి రామరాజు కి దండం పెడుతూ ఏడుస్తూ వస్తూ కాళ్ళ పై పడతాడు.
"అరెయ్ సీమయ్య నువ్వా.. ఏంట్రా ఇలా కాళ్ళ పై పడ్డావు.. నా తర్వాత నువ్వే కదరా కుబేరుడు వి " అంటూ పైకి లేపాడు రామరాజు.
"అయ్యా.. నా కొడుకు, భార్యకు ఏదో వ్యాది సోకి మంచాన పడిన విషయం మీకు తెలిసిందే.. ఆస్తులు అమ్మి వైద్యం చేయించాను. వాళ్ళు కోలుకోవాలంటే ఆపరేషన్ చేయాలట! పదిలక్షలు అవుతుందయ్యా.. అప్పు ఇస్తే వాళ్ళు కు తగ్గాక వడ్డీ తో సహా చెల్లిస్తానయ్యా " ప్రాధేయపడతాడు.
"ఏంటి.. ఆస్తులు అమ్మేశావా.. అయితే నీకు అప్పు ఇస్తే తిరిగి చెల్లించటం జరగని పనే.. పో పో " అంటాడు.
"అయ్యా.. నా కొడుకు సంగతి మీకు తెలుసు కదయ్యా.. వాడు కోలుకుంటే వాడి సంపాదనే సరిపొద్దిగా. మీరిలా అంటే.. ”
"హే.. వాడు బతుకుతాడో లేదో.. ఎంత డబ్బు ఉన్నా అప్పు ఇచ్చేది లేదు. నువ్వు చెల్లించేది లేదు" అంటూ కసురుకున్నాడు.
కాళ్ళు పట్టుకుంటే.. కాలితో తన్ని పోయాడు.
ఇంటికి వెళ్తుండగా రామరాజు కి ఫోన్ వస్తుంది.
"హాలో.. ”
"మామయ్యా! పాప ఆడుకుంటూ ఇంటి ముందు డ్రైనేజీ లో పడి గాయాలు అయ్యాయి. శ్రీ సాయి మేడికేర్ హస్పిటల్ కి తీసుకెళ్ళాం. మీరు డబ్బులు పట్టుకొని రండి త్వరగా " ఏడుస్తూ అంటుంది రామరాజు కోడలు.
కంగారుగా ఆసుపత్రికి వెళ్ళిన రామరాజు icu రూం బయట ఏడుస్తూ ఉన్న కోడల్ని, అప్పుడే వచ్చిన విజయ్ ని చూసి
"అసలు మీకు ప్రవేటు ఆసుపత్రికి ఎవరు తీసుకు రమ్మన్నారు.. ఇక్కడ ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా".. అంటూ ప్రశ్నించాడు రామరాజు.
ఆ మాటకు విజయ్ కి కోపం చిర్రెత్తుకొచ్చింది.
"పాప icu లో ఉంటే ఎలా ఉందని అడగకుండా డబ్బులు గూర్చి చూస్తారేంటీ నాన్న.. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. పాప ప్రాణం పోతే మా పరిస్థితి ఏంటీ" బాధపడుతూ అంటాడు.
"హ.. కన్న తండ్రిని నాకే ఎదురు చెప్తావా.. డబ్బులు ఉన్నాయని ఇలా ఖర్చు పెడితే తర్వాత అడుక్కు తినల్సిందే. పదండి పదండి.. " అంటూ ఆసుపత్రి నుండి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తాడు.
ఎలాగోలా పాప కోలుకుంది. కానీ.. తండ్రి పిసనారి తనానికి విజయ్ మాత్రం ఈర్ష్య పడ్డాడు
తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి విజయ్ తాత గారిది. ఆయనకు ఒక్కడే కొడుకు విజయ్ తండ్రి. తాతకు ఉన్న సేవాభావం తండ్రికి లేకపోయేసరికి తండ్రి తో పాటు తనకు కూడా సమాజంలో గౌరవం లేకుండా పోయింది.
తండ్రికి 20ఎకరాలు భూమి, ఇంటి ముందు 4ఎకరాలు సువిశాల స్థలం, 2ఎకరాల్లో రెండు గోశాలలు, ఒక్కో గోశాలలో 60ఆవులు, ఎకారం చోటు లో కొబ్బరి తోట, మరో ఎకరాం చోటు లో మామిడి తోట.
ఇవి చాలవన్నట్లు విజయ్ సంపాదన నెలకు 40వేలు.
ఇన్ని ఉన్నా.. ఎవరికి దానం చేయకపోయినా ఏనాడు ఒక్క మాట అనలేదు కానీ సొంత మనుమరాలు ఆసుపత్రిలో ఉన్నా మంచి వైద్య అందిచలేదు. తండ్రి పెంచి ఈ స్థాయిలో పెట్టాడు కాబట్టి ఇన్నాళ్లు తండ్రిని ఏమీ అనలేకపోయాడు.
అనడు కూడా.. ఎందుకంటే రేపో మాపో పోయేవాడు.. ఇన్నాళ్లు భరించాం, పోయేటప్పుడు ప్రేమగా చూస్తే ఆనందంగా పోడా.. అని
అనుకున్నట్లే రామరాజు మంచాన పడ్డాడు.
చనిపోయే గడియాలు ఉండటంతో ఇంటి బయట పాడుబడిన మంచంపై వేశారు.
విజయ్ బయటకు వస్తూ.. పనివాళ్ళని పిలిచి
"మా నాన్న గారు చావు గడియాలు లెక్కపెడుతున్నాడు. ఎప్పడైనా పోవచ్చు. ముందు మా మామిడి తోటకు ఒక వైపు ఒక ఆరగడుగులు గోతిని తవ్వండి" అన్నాడు.
ఆ మాటకు పనివాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వారు.
ఆ నవ్వు విజయ్ చూడలేదు కానీ.. రామరాజు కళ్ళు వారి పై పడ్డాయి.
వారి నవ్వుకు ఆయన బాధ పడలేదు
వారికి జీతాలు పెంచనందుకు బాధ పడ్డాడు.
ఎందుకంటే వాళ్ళు తమ కుటుంభం కోసమే కాదు మా కుటుంబం కోసము ఏళ్ళు తరబడి పని చేస్తున్నారు.
ఇంత కాలం పని చేసినా తమ యజమాని పోతున్నాడని బాధపడటం లేదంటే అది తన ప్రవర్తనే కారణం అని ఆయనకు అర్థం అయింది.
ఇలా ఉంటే అక్కడ కి సీమయ్య ఏడుస్తూ
" ఏమైందయ్యా! అప్పుడే నన్ను వదిలి పోవటానికి సిద్ధం అయిపోయావా" అంటు వచ్చాడు.
"అరెయ్ సీమ.. నన్ను క్షమించరా.. నీ భార్య బిడ్డలు ఎలా ఉన్నారు"..
"వాళ్ళు బాగానే ఉన్నారు అయ్యా.. మీరేంటీ ఇలా అయిపోయారు " ఏడుస్తూ అన్నాడు సీమయ్య.
"సీమ.. ఆస్తులు అంతస్థులు, డబ్బు మోజులో మనుషులను దూరం చేసుకున్నాను. చాలా సార్లు నన్ను కళ్ళు తెరిపించే పనులు చేశావు కానీ.. నేను మారితేగా..
నీకంటే ఆస్తిపరుణ్ణి అయినా.. నీలాగా ఆస్తుల కంటే కుటుంబానికి సమాజానికి విలువ ఇవ్వలేకపోయాను. దాదాపు 40ఎకరాల కు అధిపతిని కానీ..
నా కోసం నా కొడుకు ముందుగానే ఆరడగుల గోతిని సిద్దం చేశాడు రా..
వీలైతే నీ విలువైన సలహాలు సూచనలు నా కొడుక్కి ఇస్తూ.. వాడు మంచి దానధర్మాలు చేసేలా ప్రోత్సాహం ఇవ్వురా.. ఇక నాకు మాటలు రావటం లేదు..
మళ్ళీ చెప్తున్నాను.. నీ పరిస్థితి కి బాదపడకుండా డబ్బు కోసం నిన్ను కాలితో తన్నేసినా, దైర్యంగా ఎదుర్కోవటమే కాదు.. ఏమి చేయకున్నా నా కోసం కన్నీరు పెట్టావు చూడు.. ఓపిక ఉంటే మళ్ళీ మళ్ళీ క్షమించురా సీమ అని అనాలని ఉందిరా.. క్షమించరా" అంటూ.. కన్నుమూస్తాడు రామరాజు.
రామరాజు 20 ఎకరాల ఆస్తి మధ్యలో మామిడి తోటకు గట్టు దగ్గర ఆరడగులు గోతిలో ఖననం చేశారు కుటుంబ సభ్యులు.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
@user-lx2bb3on5h • 20 hours ago
Supper Gopi
@user-wj6qz1ri9z • 1 day ago
Nice voice sir
@user-wj6qz1ri9z • 1 day ago
Really nice story Gopi garu