top of page
Writer's pictureDhanalakshmi N

అసలైన గుర్తింపు




'Asalaina Gurthimpu' written by N. Dhanalakshmi

రచన : N. ధనలక్ష్మి

"ఏంటో ఎదవ జీవితం ఇంటర్వ్యూకి వెళ్ళినా,ఏ గవర్నమెంట్ జాబ్ రాస్తున్న రావట్లేదు .." అని హాల్ లో సర్టిఫికెట్స్ చూస్తూ బాధ పడుతూ అంటాడు సూర్య .. "ఏమయిందిరా కన్నా! ఎందుకు ఆలా బాధ పడతావు ?వస్తుందిలేయ్.. వెళ్లి ఫ్రెష్ అయి రా ఏమైనా తిందువు కానీ .."

"చాలా బాధగా భయంగా ఉంది మ్మా నాకు జాబ్ వస్తుందా ... "నా బిడ్డ కు ఏమీ తక్కువ ?? కొంచం టైం పడుతుంది లే కన్నా వెళ్లి ఫ్రెష్ అయి రా నీకు ఇస్టమైన పకోడీ చేశాను తిందువు కానీ" అంటూ సూర్య ను బలవంతంగా లోపలకి పంపిస్తారు లక్ష్మి గారు . మాటలు అన్నీ వింటారు అక్కడే ఉన్న ప్రకాష్ గారు .

"లక్ష్మీ! మనం గుడికి వెళ్లి చాలా రోజులు అయింది కదా ఎలాగూ రోజు శనివారం. వెళదాం రెడీ అవ్వండి ఇద్దరు .." "రేయ్ కన్నా! నాన్న గుడికి వెళదాం అన్నారు రెడీ అవ్వు కన్నా" అంటూ సూర్య కి చెప్పి తాను వెళ్లారు రెడీ అవడానికి .. "నాన్నా! నేను రాను ..నాకు మనసు ఏమీ బాలేదు .ప్లీజ్... మీరు, అమ్మ వెళ్ళండి "అన్నాడు సూర్య "రేయ్. మనం ఆలా వెళ్లి చాలా రోజులు అయింది. నా కోసం రా కన్నా "అంటారు ఎంతో ప్రేమతో ప్రకాశం గారు .. 'ఎపుడూ వాళ్ళ నాన్న తనని ఆలా అడిగి ఉండడు..ఎపుడూ తన ఇష్టానికి వదలివేస్తారు వస్తువైనా ,చదువుయినా అన్ని తన ఇష్టానికి విలువ ఇస్తారు నాన్న ..అలాంటిది రోజు నాన్న గుడి కి రమన్నారు..నాన్నని బాధ పెట్టడం ఎందుకు ?వెళ్లి వస్తే సరి పోతుంది. నాకు కూడా కొంచం రిలాక్స్ ఉంటుంది..'

"సరే నాన్నా" అంటూ రెడీ అయి వస్తాడు అందరూ గుడికి కలిసి వెళ్లారు ..దర్శనం చేసుకొని అడుగు మీద కూర్చుంటారు .. లక్ష్మి గారు కొబ్బరిముక్కను సూర్యకి ,ప్రకాశం చేతికి ఇస్తారు ..సూర్య కి ఎంతో రిలాక్స్ ఉంటుంది . ప్రకాశం గారు తింటూ "కన్నా! అక్కడ ఏమి జరుగుతుంది" అంటూ అడుగుతారు .. "నాన్నా! కొబ్బరికాయలను కొడుతున్నారు .." "అవును సూర్య. ఇక్కడ రాయి ఉంది ,లోపల కూడా రాయితో చేయబడ్డ విగ్రహము ఉంది కదా మనం లోపలే అంటే దేవుడి మీదే రాయితో కొట్టచ్చు కదా" అంటారు ప్రకాశం గారు "అయ్యో నాన్నా! ఆలా ఎలా చేస్తాం? లోపల ఉంది దేవుడు ..ఆలా చేయకూడదు .ఆ రాయి మీదే కొబ్బరి కాయ కొట్టచ్చు" అంటాడు సూర్య " రెండూ రాళ్లే కదా !ఎందుకు ఇంత తేడా వచ్చిందో తెలుసా?" అంటూ "నీకు ఒక కథ చెబుతాను విను" అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తారు. "ఒకప్పుడు ఒక శిల్పి కొండ పైకి వెళ్లి ఒక రాయిని కొట్టడం స్టార్ట్ చేసాడు. అప్పుడు.. రాయి 'బాబు నన్ను కొట్టదు. నేను బాధలను తట్టుకోలేను. నన్ను వదిలేసి వెళ్లి పో' అన్నది శిల్పి ఇంకో రాయి ని కొట్టడం స్టార్ట్ చేసాడు..ఆలా సుమారు పది దెబ్బలు వేసినా రాయి సైలెంట్ ఉంది ..ఆ శిల్పి ఆశ్చరంగా 'నీకు నొప్పి లేదా' అన్నాడు..'ఉంది అండి కానీ నేను తట్టుకోగలను ..మీరు నన్ను ఒక అందమైన రూపం మార్చండి' అంటుంది ..ఆలా ఎన్నో దెబ్బలను తట్టుకొని నిలబడింది శిల్పి కొన్ని రోజులకి ఒక దేవుడు రూపాన్ని తయారు చేసారు ..దేవుడి విగ్రహాన్ని చూసిన అందరూ గుడి కట్టి ,రోజూ రకరకాలు పూలతో ,పండ్లతో ,ప్రసాదాలతో దేవుడిని పూజలు చేయడం స్టార్ట్ చేసారు… గుడికి వచ్చిన వాళ్లంతా అక్కడ ఉన్న రాయి మీద కొబ్బరికాయలను కొట్టడం స్టార్ట్ చేసారు ..ఈ రాయి అయితే నేను ఒక దెబ్బ కూడా తట్టుకోలేను ఆందో అది ఇప్పుడు రోజు దెబ్బలను తింటుంది ... బాధను తట్టుకొని నిలపడ్డ రాయి ఇప్పుడు అందరిచేత గౌరవించ బడుతుంది ..అసలైన గుర్తింపు లభించింది ..

చేయాలి అనే సంకల్పం ఉండాలి ..అపుడు అందరి జీవితాలు రంగుల మయం అవుతాయి ."


"వావ్ నాన్నా! స్టోరీ చాలా బాగా ఉంది కదా కన్నా"

ఇప్పుడు నువ్వే చెప్పు బయట ఉన్న రాయి లాగా బాధలను తట్టుకోలేక ఉండిపోయి ఆలా గుర్తింపు లేకుండా ఉంటావా లేదా లోపల ఉన్న విగ్రహము లాగా బాధలను ,ఓటమిలను తట్టుకొని గుర్తింపు తెచ్చుకుంటావా చెప్పు కన్నా? అంటారు ప్రకాశం గారు .

"లేదు నాన్నా! నేను ఇంకా ఓటమికి కృంగిపోను ...ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేస్తాను ..థాంక్స్ లాట్ నాన్నా" అంటాడు .. "చూడు కన్నా ..ఆలా నువ్వు ఎన్ని కష్టాలు పడి,బాధలను ఓర్చుకుంటు నిలపడతావో అపుడే నీకు నువ్వు అంటే ఏంటో తెలుస్తుంది ..నీ శక్తి ఏంటో అవగతం అవుతుంది ..నీలో ఉన్న టాలెంట్ బయటకి వస్తుంది నీకు జాబ్ వచ్చిన ..నువ్వు చక్కగా పని చేస్తున్న సరి అయిన గుర్తింపు లేదు అని ఫీల్ అవ్వకు ..నువ్వు చేసే పని కనపడాలి ..నువ్వు కాదు ..నీ పని నిన్ను ఎవరికీ అందనంత ఎత్తులో నిలుపుతుంది ..నీ పనిని నువ్వు గౌరవించు ..అది నిన్ను కాపాడుతుంది అర్థము అయిందా"

" థాంక్స్ లాట్ నాన్న "అంటూ వాళ్ళ నాన్నను హాగ్ చేసుకొని "నాన్నా! హ్యాపీ మూమెంట్స్ లో ఒక సెల్ఫీ" అంటూ తీసుకుంటూ ఉంటారు ..ఇద్దరు వాళ్ళ అమ్మ వైపు చూస్తారు .

లక్ష్మి గారు "అంతే రా! నేను వద్దు కదా సెల్ఫీ కి' అని కోపంగా ఆంటే "అరేయ్ నా డార్లింగ్ లేకుండా మా సెల్ఫీ ఇన్ కంప్లీట్ " అంటూ ఫ్యామిలీ సెల్ఫీ దిగుతారు. సూర్య తన జాబ్ ట్రయల్స్ చేస్తూనే మొబైల్ యూస్ చేసి తనకి తెలియని వాటిని నేర్చుకుంటూ ఉన్నాడు ..ఆలా తన శ్రమకు ఫలింతంగా DRDO లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని నిజాయతీగా అందులో పని చేస్తూ మంచి ఆఫీసర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాధలు ,ఓటమి లను ఎప్పుడు అయితే తట్టుకొని నిలబడతామో అపుడే మనకు అసలైన గుర్తింపు లభింస్తుంది ..ఎందుకంటే ఓటమికి మించిన గురువు ఏది లేదు . మీ విజయం బహుశా మిమ్మలని ప్రపంచానికి పరిచయం చేయచ్చు ..కానీ ఓటమి మీకు ప్రపంచం ఆంటే ఏంటో తెలిసేలా చేస్తుంది ... మిమల్ని అందరిలో అసలైన గుర్తింపు ఉండేలా చేస్తుంది.మిమ్మల్ని మీరు బలహీనంగా భావించడం గొప్ప పాపం. మిమ్మల్ని మీరు మరింత శక్తివంతం చేయగలరని నమ్మండి ... మీరు ఏదైనా చేయగలరు ...


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి. .




66 views0 comments

Comments


bottom of page