#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #AsalainaSwathantryamAnteEmiti, #అసలైనస్వాతంత్య్రంఅంటేఏమిటి, #TeluguKathalu, #తెలుగుకథలు

"అసలైన స్వాతంత్య్రం అంటే ఏమిటి?" .. దేవత లాంటి శ్రీలేఖ నేర్పిన జీవిత-పాఠం!
Asalaina Swathantryam Ante Emiti - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi
Published In manatelugukathalu.com On 01/01/2025
అసలైన స్వాతంత్య్రం అంటే ఏమిటి - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1)
ఆ రోజు ఆగస్ట్ 15. పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు చక్కగా ఏర్పాట్లు చేశారు. దయా మణి - తెలివైన - చలాకి "శ్రీలేఖ" అనే ఐదవ తరగతి విద్యార్థిని ఒక చిలుకను పంజరంలో బంధించి తెచ్చింది పాఠశాలకు. అందరికి వింతగా మరియు విడ్డూరంగా ఉన్నది ఆమె చేష్టలు. ఇలా అడిగారు శ్రీలేఖ ను "నీకు మరియూ మనుషులకు స్వేచ్చ - స్వాతంత్య్రం కావాలి. మరి పక్షులకు వద్దా?", అని.
"5 నెలలు ఆగండి. ఓర్పు వహించండి. గణతంత్ర దినోత్సవం నాడు, అదే, వచ్చే ఏడాది, జనవరి 26 రోజున మీకు సరి అయిన సమాధానం చెబుతాను", అన్నది దయా-మణి అయిన "శ్రీలేఖ" (కిల కిల నవ్వుతూ).
అందరి హృదయాలలో, పెదవుల పై నిశ్శబ్ద ప్రశ్న:- మంచి మనస్సుల - సహృదయురాలు "శ్రీలేఖ" ఇలా చేస్తుంది ఏమిటి? ఎందుకబ్బా 5 నెలలు ఆగమన్నది? ఒక నిస్సహాయ చిలుకను పంజరం నుండి స్వేచ్చగా వెంటనే విడిచి పెట్టకుండా?", అని. అందరి మెదళ్ళలో ఉత్కంఠత చోటుచేసుకుంది - రేకెత్తించింది.
------ X X X ---------
2)
26 జనవరి. గణతంత్ర దినోత్సవం రానే వచ్చింది. "శ్రీలేఖ" ఉత్తి పంజరం తో వచ్చింది పాఠశాలకు. అందులో చిలక లేదు. "దానిని స్వేచ్చగా ఈరోజే వదిలేసా మా ఇంటి దగ్గర", అన్నది "శ్రీలేఖ" సంతోషంగా, చిరునవ్వుతో - ధీమాతో.
అందరూ ఆమెను "మంచికి మరో పేరు: లేత మనస్సుల శ్రీలేఖ" అని కొనియాడారు. కుతుహలంగా, "5 నెలలు ఎందుకు ఆగావు.. చిలుకను స్వేచ్చ గా విడిచి పెట్టటానికి?" అని అడిగారు.
"చెబుతా చెబుతా.. హ హ హా.. నిదానించండి.. నిదానమే ప్రధానం మరియు రక్షణ", అన్నది కిల కిల నవ్వుతూ.
----- X X X ---------
3)
"శ్రీలేఖ" ఇలా కొనసాగించింది అసలు కారణం పురి విప్పుతూ, " పోయిన ఆగస్ట్ 15 రోజున ఇంటి వద్ద మొక్కలు నాటాను. విత్తనాలు నాటాను. ఈ ఐదు నెలలు చిలుకను మచ్చిక చేసుకున్నాను మా ఇంట్లో ఉంచుకొని.. స్నేహపూరిత వాతావరణం లో. దానికి పండ్లు పెట్టాను. ఇంట్లో గది లో మాత్రమే ఎగిరెందుకు స్వేచ్చ ఇచ్చాను. కొన్ని మాటలు నేర్పాను. నేను పిలిస్తే నా భుజం పై వాలేలా శిక్షణ ఇచ్చాను".
"ఈ ఐదు నెలలలో మొక్కలు పెరిగి చెట్లు అయ్యాయి (మా ఇంటి చుట్టూ). దాంట్లో పండ్లు కూడా బాగా కాసాయి. చిలుకకి ఉండటానికి తలుపులు లేని ఒక చిన్న ఇల్లు లాంటిది కూడా అమర్చాను ఓ చెట్టు పై. ఇప్పుడు - ఈరోజు దానిని వదిలేసాను. అది ఆ చెట్ల మీదే ఉంటుంది. నివసిస్తుంది. అక్కడి పండ్లు తింటుంది. నా దగ్గరకు వచ్చీ - పోతుంటుంది. దానికి బయిట ప్రపంచం లోని.. ఏ పెద్ద పక్షుల నుండి బెడద ఉండదు.. ఏ డేగ ల నుండి, రాబందుల నుండి ప్రమాదం ఉండదు. నా దగ్గర భరోసాగా ఉంటుంది".
"ఆ చిలుక కే కాదు. వేరే చిన్న పక్షులకు మరియు జంతువులకు కూడా తోడు - నీడ గా - ఆసరా గా నిలుస్తాయి, ఆ మొక్కలు మరియు చెట్లు. దినం పూట ఆరోగ్యకరమైన ప్రాణ వాయువు (ఆక్సిజన్) విడుదల చేసి పర్యావరణానికి మరియు ప్రాణులకు - జీవాలకు కూడా మేలు చేస్తుంది. కాలుష్యం కూడా పీల్చెస్తుంది. పెక్కు లాభాలు చెట్ల వల్ల", అంటూ "శ్రీలేఖ" ఉద్భోధించింది, తన లేత మనస్సు పురి విప్పుతూ.
"అన్ని సదుపాయాలు, సౌకర్యాలు మరియు రక్షణ కలగ చేయాలి. తిండి, మంచి నివాసం తో సహా. ఏ ఇబ్బందులూ, ప్రమాదాలు లేని వాతావరణం కూడా సృష్టించాలి. అదియే 'నిజమైన స్వాతంత్ర్యం' అంటే".
----- X X X ---------
4)
"రోడ్డుకు ప్రాణులను వదిలేస్తే.. ఎన్నో క్రూర మృగాలు - జీవులు - జిత్తుల మారి నక్కలు - తోడేళ్లు - రాబందులు మరియు అలాంటి మనుషులు.. పీక్కు తింటాయి.. రక్తం పీల్చే-స్తాయి.. జాగ్రత్త!", అని దూరదృష్టి తో కూడిన పలుకులతో ముగించింది "శ్రీలేఖ".. తన చిలుక పలుకులను. అసలైన స్వాతంత్రము అంటే ఏమిటో 'రహస్యం' పురి విప్పింది. దాని అసలైన నిర్వచనం బోధించింది. తన అనురాగ మనస్సుల వెలుగు తో అందరినీ ప్రకాశింప చేసింది శ్రీలేఖ.
అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు శ్రీలేఖ ను. పాఠశాలలో కూడా అప్పటికప్పుడే.. వివిధ మొక్కలు నాటారు, గింజలు చల్లారు. శ్రీలేఖ సలహాపై
తోట-మాలిని కూడా పెట్టుకున్నారు ఉపాధి కలిగించి సహాయం చేయటానికి ఒక నిరుపేదకు.
శ్రీలేఖ ను "1) దేవత లాంటి మనిషి -2) పర్యావరణ మరియు జంతువుల - పక్షుల:- రక్షకురాలు 3) ప్రపంచపు లేత - మంచి మనస్సుల స్నేహితురాలు, 4) దయ గల సహాయకురాలు", అనే బిరుదులు ఇచ్చి సత్కరించారు.. కొనియాడారు.. పాఠశాల వారు.
----- X X X ---------
5)
ఏడు నెలలు ఇట్టే గడచి పోయాయి. మళ్లీ ఆ రోజు:- ఆగస్ట్ 15 (తిరిగి వచ్చేసింది). మళ్లీ మరో ఏడాది యొక్క భారత - స్వాతంత్ర్య - దినోత్సవం వచ్చేసింది. కానీ ఇప్పుడు పాఠశాల పచ్చగా కళకళలాడుతూ ఉన్నది. నిండా చెట్లు - పూలు - పండ్లు - కూర గాయాల తో.. భరోసాగా - రక్షణ గా చిన్న జంతువులు - పక్షులకు - సీతాకోక చిలుకలకు, పర్యావరణానికి. అందరూ శ్రీలేఖ ను "1) అసలైన స్వాతంత్ర్యం - భరోసా ఇచ్చే దేవత 2) మంచిని పంచే పెంచే - అనురాగం - నిర్మాణాత్మక నిర్వహణ ఇచ్చే ప్రపంచపు స్నేహితురాలు" అంటూ హృదయపూర్వకంగా కొనియాడారు.
--------X X X -------
నీతి:-
అసలైన స్వాతంత్ర్యం అంటే స్వేచ్చ మాత్రమే కాదు.. రక్షణ, సౌకర్యాలు - సదుపాయాలు - భరోసా - సంతోష పూరిత నిర్వహణ మరియు ఆనంద దాయక పరిష్కారాల వ్యవస్థ కలగ చేయటం కూడా.
ఎందుకు?.. సమాజంలో క్రూర మృగాలు, రక్తం పీల్చే సింహాలు, పీక్కు తినే జిత్తుల మారి నక్కలు, తోడేళ్లు.. డేగలు, రాబందులు ఉంటాయి జాగ్రత్త!.. అలాంటి తత్వం కల మనుషులు కూడా ఉంటారు జాగ్రత్త!
---XXX-- అయిపోయింది ---XXX ---
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.
Comments