top of page

అసలైన ఉగాది

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #AsalainaUgadi, #అసలైనఉగాది, #TeluguChildrenStories


Asalaina Ugadi  - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi

Published In manatelugukathalu.com On 26/03/2025

అసలైన ఉగాది - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


I) 

ఆ రోజు ఉగాది కి నాగేశ్వర రావు మరియు అతడి సతీమణి అన్నపూర్ణ తమ పిల్లలను కుటుంబ సమేతంగా (వారి పిల్లలతో సహా) ఆహ్వానించారు.


మామిడాకుల తోరణాలు కట్టారు. ఇల్లు శుభ్రంగా ఉంచారు.


ఎవ్వరికి కొత్త బట్టలు పెట్టలేదు. 


ఉగాది పచ్చడి కొద్దిగా నే తినిపించారు. పంచ భక్ష్య పరమాన్నాలు లేవు.

మామూలు వంటకాలు: టమాట పులుసు, ఒక కూర, చారు, పెరుగు.. ఒకే ఒక్క తీపి స్వీటు.. కాస్త బిరియాని.. తలా ఒకే ఒక్క అప్పడం.. ఒకే తీపి - స్వీట్ ఒక్కొక్కరికి. 


అందరూ అవాక్కయ్యారు.


తినటం అయ్యాక మరు కార్యక్రమం ఏమిటి?.. రెండవ భాగానికి వెళదామా.. 

--- X X X ------



* II)


తాత - అవ్వలు చిన్న క్విజ్ (ప్రశ్న - ఉత్తరాల వేడుక) నిర్వహించారు.


తాత అవ్వ ల 1 వ ప్రశ్న) 

ఉగాది పండుగ దేని వేడుక గా చేస్తారు?


అందరి జవాబు) 

ఉగాది పచ్చడి తినటానికి


తాత - అవ్వ ల జవాబు చిరునవ్వుతో) 

కాదు కాదు.. కొత్త - నూతన తెలుగు సంవత్సరం మొదలయ్యే రోజు యొక్క వేడుక జరుపు కోటానికి


పిల్లలు) 

 ఓ ఓ ఓ.. మేము జనవరి ఒకటి అందరికీ కొత్త తెలుగు సంవత్సరం అనుకున్నాము ప్రపంచంలో.. So astounding

---------------------------


2 వ ప్రశ్న) 

ఉగాది అనే పదానికి అర్థం ఏమిటి?



పిల్లల జవాబు) 

అది పచ్చడి పేరు.. స్వీట్ - తీపి పేరు.. సినిమా పేరు 


తాత - అవ్వ ల జవాబు) 

 ఉగాది పేరు - పదం.. "యుగాది" నుండి వచ్చింది.. "యుగ" అంటే యుగం లేక సంవత్సరం.. "ఆది" అంటే ప్రారంభం. ఇది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది.. తెలుగు వారి క్యాలెండర్.. అదే పంచాంగం.. ప్రకారం

----------------------------


3 వ ప్రశ్న) 

తెలుగు రాష్ట్రాల్లో నే గాకుండా ఇంకే రాష్ట్రాల్లో జరుపుకుంటారు ఈ పండుగను ఉగాది గా?


అందరి జవాబు) 

ఇంకెక్కడ జరుపు కోరు


తాత - అవ్వ ల జవాబు) 

కర్ణాటక లో 

---------------------------------


4 వ ప్రశ్న) 

భారత దేశంలో ఏ యే రాష్ట్రాల్లో ఈ రోజు 'గుడి పడ్వా' నూతన సంవత్సర ప్రారంభ రోజు పండుగ గా జరుపు కుంటారు?


అందరి జవాబు) 

ఓహ్! Is it?.. ఔనా.. మాకు తెలీదు


తాత - అవ్వ ల జవాబు) 

మహా రాష్ట్ర, గోవా ఇతరత్ర లో

------------------------------------


 తాత అవ్వ ల 5 వ ప్రశ్న) 

యే విదేశంలో ఈ ఉగాది రోజు జాతీయ సెలవు?


మనవాళ్ళు - మనవరాళ్లు) 

today holiday in foreign country?.. Wow!. May be USA.. చాలా మంది Indians అక్కడ ఉంటారు కదా.. అందుకే!


తాత - అవ్వ ల జవాబు) 

మారిషస్ లో జాతీయ సెలవు ఈ రోజు. ఆ దేశం ఆఫ్రికా ఖండం లో ఉన్నది

----------------------------------------


6 వ ప్రశ్న) 

ఉగాది పచ్చడి ఎన్ని రుచుల తో ఉంటుంది.. ఏమేమి వేసి తయారు చేస్తారు?.. దాని తాత్పర్యం ఏమిటి? ఆ రుచులు వేటిని ఉద్దేశించింది?


పిల్లలు) sweets shop వాళ్లు అమ్ముతారు కదా.. వాళ్లకు తెలియాలి ఈ జవాబు


తాత - అవ్వ ల జవాబు) 

ఉగాది పచ్చడి ఇంట్లో నే చేసుకుంటారు 6 పదార్ధాలతో 

..

i) బెల్లం అరటి పండు "తీపి", ii) చింత పండు "పులుపు", iii) వేప పువ్వు "చేదు", iv) "ఉప్పు", v) పచ్చి మిరపకాయ "కారం", vi) మామిడి పిందె "వగరు" తో.. 6 రుచులతో ఇంట్లో నే తయారు చేస్తారు. 


ఇక ఆ 6 రుచులు వేటిని ఉద్దేశించి అంటే.. 


మనుషుల్లో అన్ని రకాల గుణాలు.. అదే పెక్కు మంచి - చెడు గుణాలు - స్వభావాలు ఉంటాయి. మనం ఇతరుల మంచిని మాత్రమే ఆస్వాదించాలి - పీల్చాలి. చెడును దరి చేర నీయ రాదు. ఆనంద పూరిత పరిష్కారాలు వెతుక్కుంటూ వెళ్ళాలి రక రకాల - పలు రకాల సమస్యలు వచ్చినప్పుడు. భయ పడకుండా దిగ్విజయ జైత్ర యాత్ర లా కొన సాగించాలి జీవితాన్ని.. అదరక - బెదరక - నిర్భయంగా 

--------------------------------------------------------



7 వ ప్రశ్న) 

ఇంగ్లీష్ (English) పదానికి తెలుగు పదం ఏమిటి?


అందరూ) 

ఇంగ్లీష్ యే


తాత - అవ్వ ల జవాబు) 

"ఆంగ్లం" అంటారు.. ఇక క్విజ్ సమాప్తం.



-------------------------


తాత అవ్వ ల 8 వ ప్రశ్న) 

క్యాలెండర్ - calendar ను తెలుగులో ఏమంటారు?


అందరూ) 

క్యాలెండర్ యే


తాత - అవ్వ ల జవాబు) 

పంచాంగం అంటారు


అందరూ చప్పట్లు కొడుతూ) 

wow! ఎన్నో కొత్త విషయాలు తెలుసు కున్నాం.. All answers are from grand pa and grand ma only.. So all points to them.


అందరూ చప్పట్లు కొడతారు రెండవసారి.. తాత అవ్వలను అభినందిస్తూ.

----------------------------------------------------


* III)


పిల్లలు) 

తాత అవ్వ లకు ఇప్పుడు మేము క్విజ్.. అదే ప్రశ్నల పోటీ పెడతాము. వారు జవాబు ఇవ్వాలి.



తాత అవ్వలు చిరునవ్వుతో) అలాగే



పిల్లల 1వ ప్రశ్న) 

మాకు కొత్త బట్టలు ఎందుకు పెట్ట లేదు?


తాత అవ్వలు నవ్వుతూ) 

మీ అందరి వద్ద చాలా బట్టలు ఉన్నాయి.. డబ్బులు దుబారా చేయ వద్దు.. పొదుపుగా వాడాలి.. మనకు ఎప్పుడు అత్యవసరం పడుతుంది తెలీదు. డబ్బులు పేద వారి సహాయానికి కూడా ఇవ్వ వచ్చు.

-----------------


పిల్లల 2వ ప్రశ్న) 

ఒక్కటే sweet - తీపి పెట్టారు.. Biryaani కొద్దిగా నే పెట్టారు.. ఒక్కటే అప్పడం వేశారు ఒక్కొక్కరికి.. ఉగాది పచ్చడి కొద్దిగానే పెట్టారు.. పిండి వంటలు చేయలేదు.. ఎందుకు?



తాత అవ్వలు నవ్వుతూ)

 ఎక్కువ ఉప్పు - కారం - తీపి - నూనె పదార్థాలు తిన రాదు.. కేలరీలు ఎక్కువ అవుతుంది శరీరంలో.. ఆరోగ్యానికి మంచిది కాదు.. ఊబకాయ వస్తుంది.. లావు అవుతారు.. పెక్కు ఆరోగ్య సమస్యలు వస్తాయి

--------------------


పిల్లల 3వ ప్రశ్న) 

మాకు కార్ ఎందుకు పంపలేదు?.. బస్ స్టాండ్ నుండి మరియు రైల్వే స్టేషన్ నుండి నడుచుకుంటూ నే రావాలి అన్నారు.. ఎందుకు?


తాత అవ్వలు నవ్వుతూ)

దగ్గరే కదా.. అందుకే.. శరీరానికి వ్యాయాయం ఉండాలి రోజూ.. కనీసం అర గంట నడక అయినా పర్వాలేదు.. మరియు మనస్సు కు కూడా ఆహ్లాదం - ప్రశాంతత - వికాసం - సంతోషం వస్తుంది. ఇవి రెండు ఉంటే అనుకున్నది సాధించటం తేలిక అయిపోతుంది జీవితంలో.

------------------------------------------



* IV) 


తాత అవ్వ లు) 

.. అందాల సంధ్యా సమయం.. అదే ప్రశాంత సాయింత్రం అయ్యింది..టీవీ లో తెనుగు సినిమా 'ఉగాది' చూద్దాం.. తరువాత.. రాత్రి పడుకునే కార్యక్రమం.. TV ఆన్ చేయండి


పిల్లలు) 

తెనుగు కాదు.. తెలుగు అనాలి



తాత అవ్వ లు నవ్వుతూ)

 తెలుగు ను తెనుగు అని కూడా అనవచ్చు


పిల్లలు నవ్వుతూ) 

ఉగాది నీ యుగాది అని కూడా అనవచ్చు.


తాత అవ్వ లు నవ్వుతూ) 

యుగాది పదం కర్ణాటక లో.. అయినా అందరూ భారతీయులు కదా.. ప్రపంచం లో అందరూ.. మనుషులంతా ఒక్కటే కదా.. దేవుడు చేసిన మనుషులు, ఒకటే కుటుంబం.. అందుకే పర్వాలేదు యుగాది పద మైనా

..

ఇక టీవీ ఆన్ చేయండి. మధ్య మోతాదులో సౌండ్ పెట్టండి.. ఎక్కువ శబ్ధం చెవులకు.. అదే వినికిడి కి హాని 




అందరూ నవ్వుతూ ఉత్సాహంగా - ఉల్లాసం గా) 

తాత - అవ్వ are walking encyclopaedia.. Health care educationists.. Marvelous.. Superb.. outstanding.. wondrous.. Ha ha ha.. మేము ఇప్పటి నుండి మీరు చెప్పిన ఆరోగ్య సూత్రాలు.. చిట్కాలు తప్పక రోజూ పాటిస్తాం.. నిజంగా. 


తాత అవ్వ లు నవ్వుతూ) 

సంతోషం.. సర్వే జనా సుఖినోభవంతు.. 

రోజూ చక్కగా గడపాలి అందరూ.. సంవత్సరంలో ఏదో ఒక రోజు కాదు.. రోజూ ఉగాది లా.. ప్రతి రోజూ పండుగే లా.. అష్ట ఐశ్వర్యాలు - ఆరోగ్యాలతో.. సుఖ సంతోషాలతో.. ప్రగతి, అభ్యుదయం, సంతోషం తో జీవించాలి అందరూ.. ప్రపంచంలో.. మైత్రీ భావం తో.. స్నేహ పూరితంగా.. ఆత్మీయత అనురాగం అనుబంధంతో.. డబ్బు దురాశ, డాలర్ మోజు లేకుండా.. యుద్ధాలు - వైరాలు - కపటం కుళ్ళు కుతంత్రాలు లేకుండా జీవించాలి సర్వ మానవజాతి.. మానవ కోటి.. మంచిని పెంచుతూ పెంచుతూ..సంతోష నిర్వహణ - ఆనంద పూరిత పరిష్కారాల తో జీవించాలి.. అను క్షణం.. క్షణ క్షణం.. అదే "అసలైన ఉగాది". 


అందరూ)

అలాగే..


అంతలో అప్పుడే, టీవీ అనౌన్స్మెంట్).. 

ఇప్పుడు "ఉగాది" తెలుగు సినిమా చూస్తారు..


అందరూ నిశ్శబ్ధంగా టీవీ చూస్తూ కూర్చుంటారు. 



-------X--- చిన్న కథ సమాప్తం --X----------


నీతి: 

సర్వే జనా సుఖినోభవంతు.. 

రోజూ చక్కగా గడపాలి అందరూ.. సంవత్సరంలో ఏదో ఒక రోజు కాదు.. రోజూ ఉగాది లా.. ప్రతి రోజూ పండుగే లా.. అష్ట ఐశ్వర్యాలు - ఆరోగ్యాలతో.. సుఖ సంతోషాలతో.. ప్రగతి, అభ్యుదయం, సంతోషం తో జీవించాలి అందరూ.. ప్రపంచంలో.. మైత్రీ భావం తో.. స్నేహ పూరితంగా.. ఆత్మీయత అనురాగం అనుబంధంతో.. డబ్బు దురాశ, డాలర్ మోజు లేకుండా.. యుద్ధాలు - వైరాలు - కపటం కుళ్ళు కుతంత్రాలు లేకుండా జీవించాలి సర్వ మానవజాతి.. మానవ కోటి.. మంచిని పెంచుతూ పెంచుతూ..సంతోష నిర్వహణ - ఆనంద పూరిత పరిష్కారాల తో జీవించాలి.. అను క్షణం.. క్షణ క్షణం.. అదే "అసలైన ఉగాది". 


ధన్యవాదాలు,


పి.వి పద్మావతి మధు నివ్రితి


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






 
 
 

Comments


bottom of page