top of page
Writer's pictureNDSV Nageswararao

అసంతృప్తి



'Asamthrupthi' - New Telugu Story Written By  NDSV Nageswararao

Published In manatelugukathalu.com On 10/06/2024

'అసంతృప్తి' తెలుగు కథ

రచన:  NDSV నాగేశ్వరరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



నాకు చాలా అసంతృప్తిగా ఉంది. సుబ్బారావు ముఖాన్ని చూసిన ప్రతిసారీ అది ఇంకా ఎక్కువ అవుతోంది. అతనికి ప్రమోషన్ రాలేదన్న బాధ అతని ప్రతి చర్య లోనూ గోచరిస్తోంది. అతనికి ప్రమోషన్ యిప్పించలేకపోయానన్న బాధ నాకూ ఉంది.


నిజం చెప్పాలంటే, సుబ్బారావు, నేను ఒకే బాస్ దగ్గర, ఒకే స్థాయిలో (క్యాడర్) పని చేశాం. ఆ సమయంలో, సుబ్బారావు తనకి ప్రమోషన్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అనే భావన తో బాస్ ని పట్టించుకోవడం మానేశాడు. మా సంస్థలో పనికి ఎంత గౌరవం యిస్తామో, బాస్ కి, ఆ ఉద్యోగానికి తగిన మర్యాదను యివ్వాలని కూడా కోరుకుంటాం. ఆ ఏడాది ప్రమోషన్ కి మాతో పాటు మరో యిద్దరు కూడా పోటీలో ఉన్నారు. చివరికి, నాతో పాటు మరొకతనికి ప్రమోషన్ వచ్చింది. ఆ రోజు మా బాస్ మీద అలిగి, సుబ్బారావు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ మాటకొస్తే నాకు కూడా అంతకుముందు ఏడాది అర్హత ఉన్నా, పదోన్నతి దక్కలేదు. కానీ, నేను నా పనిమీద గానీ, యజమాని మీద గానీ కోపం తెచ్చుకోలేదు.


తరువాత నాకు బదిలీ జరిగేవరకు అక్కడే ఉన్నాను. ఆ కాలంలో సుబ్బారావు నాతో మాట్లాడలేదు. ప్రమోషన్ వచ్చిన ఆనందంలో స్టాఫ్ అందరికీ నేను యిచ్చిన డిన్నర్ పార్టీ కూడా అతను అటెండ్ కాలేదు. నేను ఇంక ఆ విషయాన్ని వదిలేశాను.


ఐదేళ్లు గడిచింది. ఈ లోపున నేను మరో ప్రమోషన్ కూడా తీసుకుని, టీం లీడర్ గా వేరే ఊరిలో జాయిన్ అయ్యాను. బదిలీ మీద సుబ్బారావు నా ఆఫీస్ కి వచ్చాడు. అతను ఇంకా అదే స్థాయిలో ఉన్నాడు. నాకు కాస్త జాలేసింది. తెలివైనవాడు, ఆలోచన ఉన్నవాడు, ప్రమోషన్ కి అన్ని విధాల అర్హత ఉన్నవాడు. సమస్య ఏంటంటే అతని ప్రవర్తనే. ఇన్నేళ్లలో అతనిలో మార్పు వచ్చి ఉంటుందని అనుకున్నాను. 


చూడగానే ఆనందంగా అతన్ని పలకరించాను. కానీ, మొదటిసారి నన్ను చూస్తున్నట్టు అతను ప్రవర్తించాడు. సరేలే అని, నేను అతనికి పని అప్పజెప్పి, నా పనుల్లో మునిగిపోయాను. రోజులు గడుస్తున్నాయి. మళ్లీ ప్రమోషన్స్ సీజన్ వచ్చేసింది. ఈసారి ఎలాగైనా సుబ్బారావుకి ప్రమోషన్ ఇప్పించి తీరాలి అనుకున్నాను. ఒకరోజు అతన్ని పిలిచి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఏవేవి హైలైట్ చేసి చెప్పాలో అన్నీ వివరంగా చెప్పాను. ప్రతి ఏడాది ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నాడో ఏమో, అతనిలో పెద్దగా స్పందన కనిపించలేదు.


రోజులు దగ్గరికి వచ్చాయి. ఈసారి మా ఆఫీస్ నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు, సుబ్బారావుతో సహా. మిగతా ఇద్దరిలో, ఒకతను చాలా కుర్రాడు. ఏ పని ఇచ్చినా, ఇన్నోవేటివ్ గా, స్మార్ట్ గా, సమయానికి చేసేస్తాడు. ఆ ప్రాసెస్ లో ఎవరి దగ్గరకైనా వెళ్లి పని నేర్చుకుంటాడు, సలహా కోసం కింద వాళ్ళని అడగడానికి కూడా సంశయించడు. కాబట్టి, నేను చాలా మీమాంసలో ఉన్నాను, ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ కుర్రాడికి ప్రమోషన్ ఇప్పించాలా, లేదంటే ఇంకా వయసు ఉంది కాబట్టి అతన్ని వదిలేసి, ఎన్నో ఏళ్ల నుంచి పోటీపడుతున్న సుబ్బారావుని రికమెండ్ చేయాలా అని.


చాలా తర్జనభర్జన తరువాత, మా హెడ్ ఆఫీస్ లో ఇంటర్వ్యూలు నిర్వహించే పెద్దాయనకు నా సమస్య చెప్పేసాను. 'సరే, ఇద్దరినీ నేనే ఇంటర్వ్యూ చేస్తాను. కాబట్టి, నేను డిసైడ్ చేస్తానులే' అన్నాడు ఆయన. అన్నట్టుగానే ఇంటర్వ్యూలు జరిగాయి. ఆ కుర్రాడు ప్రమోషన్ సంపాదించాడు. నేను మా పెద్దాయనను అడిగాను ఏం జరిగిందీ అని. ఇంటర్వ్యూలో మా సుబ్బారావు ఎలా ప్రవర్తించాడో, ఆయన చెప్తుంటే విని, నాకు సుబ్బారావు మీద చాలా చిరాకు వేసింది. పనితనం ఉన్నా, ప్రవర్తన బాగులేకపోతే, జీవితం ఎలా ఉంటుందో సుబ్బారావుని చూస్తే అర్థమవుతుంది అని అనిపించింది. 


అందుకే, సుబ్బారావుని చూస్తుంటేనే నాకు చాలా అసంతృప్తిగా ఉంటోంది.


************


NDSV నాగేశ్వరరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు NDSV నాగేశ్వరరావు.

వృత్తి రీత్యా ప్రభుత్వ రంగ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా ముంబై లో పనిచేస్తున్నాను.

పదిహేనేళ్ల వయస్సు నుంచి రచనా వ్యాసంగం ప్రారంభించాను.

కథలు, కవితలు, పద్యాలు, నాటికలు వ్రాసాను, వ్రాస్తున్నాను. కంద పద్యం అంటే ఇష్టం. వారానికో వాట్సాప్ కథలుగా అరవైకి పైగా కథలు వ్రాసాను. తెలుగులోనే కాకుండా ఇంగ్లీషు, హిందీ, తమిళంలో కథలు వ్రాసాను.

సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు 'నేను సైతం' యూ ట్యూబ్ ఛానల్ వారు నిర్వహించిన జనవరి 2022 సంక్రాంతి కథల పోటీ లో ప్రోత్సాహక బహుమతి మరియు 'సంక్రాంతి సాహిత్య కథా రత్న' పురస్కారం లభించింది. స్టోరీ మిర్రర్ వారి ఇంగ్లీషు కథల పోటీల్లో పలు బహుమతులు లభించాయి. గత ముప్పై ఏళ్లుగా అడపా దడపా ఏదో ఒక బహుమతి వచ్చింది.

నటన నా మరో ప్రవృత్తి. ఆల్ ఇండియా రేడియో నాటకాలలో, స్టేజి మీద మరియు టివీ ఛానళ్లలో నటించాను.

మీ

NDSV నాగేశ్వర రావు


157 views6 comments

6 Comments



@sarmacvn5099

• 12 hours ago

Excellent sirooo

Like
ndsvnrao
Jun 21
Replying to

Thank you Sir

Like

Kumari Ramana

3 hours ago

👌👌👌

Like
ndsvnrao
Jun 21
Replying to

Thank you

Like

D Jyothi

3 hours ago

చాలా చాలా బాగుంది అండి కథ 👌👌👌👏👏😊

Like
ndsvnrao
Jun 21
Replying to

Thank you

Like
bottom of page