#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #AshadamSale
, #ఆషాడంసేల్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
'Ashadam Sale' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 10/10/2024
'ఆషాడం సేల్' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
రామనాధం దిగులుగా ఉండడం గమనించిన స్నేహితుడు సోమనాధం మనసు ఉండబట్టలేక విషయం అడిగేసాడు..
"ఏమిటి రా.. ! అంత డల్ గా ఉన్నావు.. ? ఏమైనా లవ్ ఎటాక్ అయ్యిందా.. ?" అడిగాడు సోమనాధం.
"అవును రా.. మొన్న ఒక అమ్మాయి 'ఐ లవ్ యు' చెప్పింది.. ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాను.. ఒక సలహా ఇవ్వరాదు.. ?"
"దానికేం భాగ్యం.. నువ్వు మాత్రం ఒంటరిగా ఎలా ఉంటావు చెప్పు.. ? వెంటనే పెళ్లి చేసేసుకో.. నీ పెళ్ళికి నా స్థాయిలో ఒక గిఫ్ట్ చదివించేస్తాను.. "
"నీ సలహాకి థాంక్స్.. అయినా ఈ టైములో నాకు లవ్ ఎటాక్ ఏమిటి రా, వస్తే గిస్తే హార్ట్ ఎటాక్ రావాలి గాని.. ?"
"ఎందుకు రా అంతమాట అనేసావు.. ?"
"నీకు తెలుసు కదరా.. మా ఆవిడ పోయి సంవత్సరం అయింది. ఆమె ఉన్నప్పుడు నా బిజినెస్ చాలా బాగా జరిగేది.. ఇప్పుడు ఈ చీరల బిజినెస్ చేయలేకపోతున్నాను.. జనాలు నా షాప్ కి రావట్లేదు. ఇప్పుడేమో ఈ వర్షాలకి.. షాప్ అంతా మునిగిపోయింది.. జనాలు ఎవరూ షాప్ కి రావట్లేదు. ఎప్పుడు వర్షాలు వచ్చినా, ఇలాగే జరుగుతోంది. పక్కనే పోటీగా ఇంకో షాప్ వచ్చి.. జనాలు అక్కడికి వెళ్ళిపోతున్నారు.. " అని బాధను చెప్పుకున్నాడు రామనాధం.
"దీనికి మా సిస్టరే కరెక్ట్.. తను చేసే షాపింగ్ ఎవరూ చెయ్యరు.. అనుభవం చాలా ఎక్కువ.. ఫోన్ చేసి అడుగుతాను.. " అన్నాడు సోమనాధం.
"ఆ పని చెయ్యరా.. నీకు పుణ్యం ఉంటుంది.. " అన్నాడు రామనాధం.
"పుణ్యం సంగతి ఓకే.. నా పర్స్ బరువు కూడా పెంచాలి.. అసలే దాని బరువు ఈ మధ్య బాగా తగ్గింది.. "
"అలాగే.. చూద్దాం.. "
"హలో.. ఛాయా.. ! నా ఫ్రెండ్ రామనాధంకి చీరల బిజినెస్ ఉందిగా.. పాపం బిజినెస్ చాలా నష్టాల్లో ఉంది.. నీ సలహా కావాలని అడుగుతున్నాడు.. ఇదిగో వీడియో కాల్ లో మాట్లాడు.. నీకు బహుమతు వచ్చేలాగా నేను చూస్తానులే.. ఏమీ ఆలోచించకు.. మంచి సలహా ఇవ్వు.. "
"హలో రామ్ గారు.. !.. మా అన్నయ్య మీ బిజినెస్ గురించి అంతా చెప్పారు.. బాధపడకండి.. ! వర్షానికి షాప్ లోకి నీళ్ళు వచ్చి చీరలు తడిసాయి అన్నారు.. ఏమీ పర్వాలేదు.. మా ఆడవారు డిస్కౌంట్ సేల్ అంటే అసలు ఏమీ ఆలోచించరు.. డిస్కౌంట్ ఇస్తారంటే, పుట్టబోయే పిల్లకి కుడా ముందే చీరలు కొని పెట్టుకుంటారు. చీరలకి చిన్న డ్యామేజ్ ఉన్నా సరే, డిస్కౌంట్ అంటే చాలు.. తెగ కొనేస్తాము.. నేనూ అంతే అనుకోండి.. !" అంది చిన్నగా నవ్వుతూ..
'రామనాధం అనే నా పేరుని రామ్ అని ఎంత మోడర్న్ గా మార్చేసింది.. ఈమె తక్కువదేమీ కాదు.. ' అని మనసులో అనుకున్నాడు మన రామనాధం అలియాస్ రామ్.
"ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే చెప్పండి ఛాయా గారు.. ?"
"మీరు ఒక పని చెయ్యండి.. 'తడిసిన చీరల మేళా' అని ఒకటి పెట్టండి.. బాగా తడిసిన చీరలకి ఒక యాభై శాతం డిస్కౌంట్, లైట్ గా తడిస్తే, ఒక ఇరవై శాతం డిస్కౌంట్ పెట్టండి. చీరలు పడేసే కన్నా.. ఇది బెటర్ కదండీ.. ఏమైనా లాస్ వస్తే, రాబోయే ఆషాడం సేల్ లో కవర్ చేసుకోవచ్చు.. దానికీ కిటుకు తర్వాత చెబుతాను.. " అంది ఛాయ.
"థాంక్స్.. ! మీరు ఈ 'తడిసిన చీరల సేల్' ఓపెనింగ్ కి తప్పక రావాలి.. అలాగే ఈ ఆదివారం మా ఇంటికి లంచ్ కి కుడా రావాలి.. " అన్నాడు రామనాధం.
"ఓస్.. ఇంతేనా.. ! అలాగే వస్తాను.. నాకు మాత్రం పాపులారిటీ కావాలి కదా.. ! ఈ ఆదివారం మీ ఇంటికి మేము ఇద్దరం వస్తాము.. "
తడిసిన సేల్ ఓపెనింగ్ బాగా జరిగింది. ఆ ఆదివారం సోమనాధం తన సిస్టర్ తో కలిసి రామనాధం ఇంటికి భోజనానికి వచ్చాడు..
"రండి.. రండి.. మిమల్ని ఎప్పటినుంచో మా ఇంటికి లంచ్ కి పిలుద్దామని అనుకున్నాను.. ఇప్పటికి ఆ దేవుడు కరుణించాడు.. "
"మీ ఇంట్లో ఇన్ని చీరలా రామ్ గారు.. ?" అని ఆశ్చర్యంగా అడిగింది ఛాయ.
"చీరల షాప్ ఉన్న ఇంట్లో చీరలు కాకపోతే ఏముంటాయి చెప్పండి.. ?"
"అవును లెండి.. చీరలు చూసి.. ఆ విషయమే మరిచిపోయాను"
"అవును.. "
"చీరలంటే, మీకు చాలా ఇష్టం కదా.. మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను.. మా షాప్ లో సారీ సెక్షన్ లో సేల్స్ ఆఫీసర్ గా మీకు అప్పాయింట్మెంట్ ఇస్తాను.. మీరు ఇచ్చే ప్రతి సలహా కి ఒక పది చీరలు ఫ్రీ గా ఇస్తాను.. "
"సేల్స్ ఆఫీసర్ కన్నా.. 'సారీ సేల్స్ మేనేజర్' అని పెట్టండి.. చూడడానికి చాలా గొప్పగా ఉంటుంది.. అందరికీ చెప్పుకోడానికి కూడా.. "
"అలాగే.. "
"ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆషాడం సేల్స్ కోసం నా బుర్రకు పదును పెట్టి.. ఒక మంచి ఆలోచనతో వచ్చాను రామ్ గారు"
మా ఆడవారికి చీరలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఎన్ని చీరలున్నా.. కొత్తవి చూడగానే, చీరల షాప్ కనిపించినా ఆగలేరు. కాకపోతే, ఎక్కడైనా డిస్కౌంట్ సేల్ చూస్తే, అసలు ఆగలేరు. మేము జాకెట్లు కుట్టించుకోలేకపోతున్నాం.. చీరకన్నా జాకెట్టు చాలా ఎక్కువ రేట్ అవుతోంది. అందరూ ఇచ్చినట్టు కిలోల్లో కాకుండా.. మీరు చీరకొన్న వారికి అక్కడే, ఫ్రీ గా లేటెస్ట్ డిజైనర్ బ్లౌస్ కుట్టి ఇస్తే, మా ఆడవారు అంతా లైన్ కట్టేస్తారు. ఈ ఆషాడం సేల్ లో మీ షాప్ కల కల లాడిపోతుంది.
ఇంకో మాట.. ఓల్డ్ శారీస్ కోసం.. రెండు శారీస్ కొంటే, ఒక నైటీ ఫ్రీ ఆఫర్ పెట్టండి.. నైటీ కోసమైనా చీరలు కొంటారు.. ఆడవారు ఎక్కువ వేసుకునేవి ఆ నైటీ లే కదా..
ఈ రెండు సలహాలకి.. మరి నా ఇరవై చీరలు ఇంటికి పంపించాలి.. చీరలంటే ఏవో చీరలు కాదు.. మీ షాప్ లో ఖరీదైన చీరలు.. జాకెట్టు కుట్టించి మరీ ఇవ్వాలి..
"ఇంత చెప్పిన మీకు.. నేనూ ఒక ఆఫర్ ఇస్తున్నాను.. " అన్నాడు రామనాధం.
"చెప్పండి అదేంటో.. ! ఆ ఆఫర్ అనే మాట వింటే, ఏదో తెలియని ఆనందం కలుగుతోంది.. "
"మీరు నన్ను పెళ్ళి చేసుకుంటే, ఈ చీరల షాపే మీది అవుతుంది.. నేనూ మీ వాడిని అవుతాను.. "
"చీరల షాప్ కి యజమానురాలు అవడం అంటే, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని వుండాలి " అని అంగీకారంగా ఒక చిరునవ్వు నవ్వింది ఛాయ..!
*******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments