top of page
Writer's picturePitta Govinda Rao

అశోక విజయం

#PittaGopi, #పిట్టగోపి, #అశోకవిజయం, #AshokaVijayam, #Untouchability, #అంటరానితనం


Ashoka Vijayam - New Telugu Story Written By - Pitta Gopi

Published In manatelugukathalu.com On 09/11/2024

అశోక విజయం - తెలుగు కథ

రచన: పిట్ట గోపి


కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఎందరో ఉన్నవాళ్ళు కూడా సహాయానికి ఆశపడ్డారు. ఏది దొరికితే అది, ఎంత దొరికితే అంత అన్నట్లు. ఇక్కడ పేద ధనిక, కులం మతం అంటూ ఏమీ లేకుండా సమానత్వంతో సాగిపోయింది. 


తర్వాత మరలా ఈ సమానత్వం మర్చిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసిన అశోక్ చారిటబుల్ ట్రస్ట్, సేవ సంస్థలు, ఫీజు రీయింబర్స్మెంట్ స్, పేదలకు బియ్యం పంపిణీ, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ద్వారా అశోక్ అనే పేరు మారు మోగుతోంది. 


అశోక్ ఒక పారిశ్రామిక వేత్త. దేశంలో పెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకడిగా పేరు ఉంది. ఆయనకు ప్రపంచ దేశాల్లో కూడా పలు కంపెనీలు ఉన్నాయి. దేశంలో ఆర్థిక వ్యవస్థ సన్మార్గంలో నడవటానికి దేశం పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందటానికి గల కారణం అశోక్. అశోక్ తన సంపాదనలో 60 నుండి 70% పేదల కోసమే ఖర్చు చేస్తున్నాడంటే అతడు ఎంత దయగల హృదయం గలవాడో చెప్పనక్కర్లేదు. ఇక్కడ చెప్పల్సింది ఒకటి ఉంది. ఆలోచించాల్సింది మరొకటి ఉంది. 


ఇప్పుడు దేశంలో నంబర్ వన్ పారిశ్రామిక వేత్తల్లో ఒకడైన అశోక్ ఎందరికో సహాయం అందిస్తున్నాడు. ఎందరో లేని వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా అతని సహాయం అర్జిస్తున్నారు. తన బాల్యంలో అంటరానోడిగా చూసిన ఈ సమాజం ఇప్పుడు అదే వ్యక్తి ఇచ్చే ఆపన్నహస్తం అందుకుంటు పరమానందం పొందుతుంది. మరీ ఇప్పుడు లేని అంటరాని తనం అప్పుడు ఎందుకు.. ? అంటే ఒక వ్యక్తి అంటరాని మనిషి అని ఒక వ్యక్తి గొప్పవాడని మనుషులే నిర్ణయిస్తారా..  


అలా అయితే పుట్టుకతో వచ్చే ఈ కులాలు మనకెందుకు.. ? మతాలు మనకెందుకు.. ? ఒక వ్యక్తి ఏ కులపోడని ఊహించుకుంటే ఆ కులపోడే అవుతాడు కదా.. ? అవును. ఇప్పుడు తన సంపాదనలో సగానికి పైగా సేవ కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్న వ్యక్తి అశోక్ అంటరాని వాడిగా ముద్ర వేసిన ఒక దళిత కుటుంబంలో జన్మించిన ఆణిముత్యం. 


 మన దేశానికి భిన్నత్వంలో ఏకత్వం అనే పేరు ఒకప్పుడు బాగా అచ్చు గుద్దినట్లు ఉండేది. రాను రాను ఆ పేరు మన దేశానికి పేరుగానే మిగిలింది తప్ప ఆచరణలో మచ్చుకైనా కనపడటం లేదు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా కులమేంటీ.. ? మతమేంటీ.. ? అంటూ ఆరా తీయని వాళ్ళు లేరంటే అతశయోక్తి కాదు. దాదాపు అందరికీ ఈ అనుభవం ఎదురైయ్యే ఉంటుంది. 


అంతగా కులం, మతం అనేది మన మానవ జాతిలోకి ప్రవేశాంచింది. అగ్ర కులమైతే అందలం ఎక్కించటం, అంటరాని వాడైతే అణదొక్కటం ఈరోజుల్లో పరిపాటిగా మారింది. 


అలాంటి ఈరోజుల్లో.. 

ఆశోక్ కి జన్మనిచ్చి ఎనిమిదేళ్ళు వచ్చాక తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణించి అశోక్ ని ఒంటరి చేసి వెళ్ళిపోయారు. అశోక్ తల్లిదండ్రులు ధనవంతులు కూడా కాదు. పైగా వాళ్ళు దళితులు. గ్రామంలో అంటరాని వాళ్ళుగా ఊరి చివరలో జీవనం సాగించే ఆ తల్లిదండ్రులకు జన్మించిన అశోక్ మేధాతనంలో మాత్రం అగ్ర స్థానంలో ఉంటాడంటే నమ్మశక్యం కాదు. 


తల్లిదండ్రులు పోయాక ప్రభుత్వం ఇచ్చిన ప్రమాద భీమాతో పాటు ఉన్న చిన్నపాటి గుడిసెను అమ్మి కొంత తన జీవనానికి ఉంచుకుని మిగతాది భవిష్యత్ లో అవసరాలకు దాచుకున్నాడు. ఇప్పుడు అశోక్ ఒక అనాద. కానీ.. ! సమాజం మాత్రం అనాదగా కాదు అంటరానోడిలా చూసింది. 


ప్రభుత్వ బడిలో ఆలస్యంగా అడుగుపెట్టిన అశోక్ కి పాఠశాల గదిలో చివరన చోటు దొరికింది. కారణం మంచి విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్ అశోక్ ని అంటరాని వాడిలా చూడటంతో విద్యార్థులు కూడా అదే బాటలో ముందడుగు వేశారు. దీంతో అశోక్ చదువు నామమాత్రంగా సాగింది. 


అందరూ కలిసి బోజనం చేసే చోట తాను దూరంగా ఒంటరిగా తినాల్సి వచ్చేది. తోటి పిల్లలతో ఆటలాడాలన్నా, కలిసి తిరగాలన్నా సాద్యమయ్యేది కాదు. బడి నుంచి ఇంటికి వెళ్ళి బిచ్చమెత్తుకుని వచ్చే డబ్బులతో కడుపు నింపుకొని చదువు సాగించాడు. తన బాధలను చెప్పుకోటానికి గుడికి వెలితే గుడిలోకి కూడా రానివ్వని సమాజంలో నరకం అనుభవించాడు. ఎదుగుతున్నా కొలది దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని గుడిలోనే కాదని నిర్ణయించుకున్నాడు. అలాగే ఈ సమాజం తనను అంటరాని వాడిగా చూసినా.. తన అవసరం ఈ సమాజానికి ఉండాలి గొప్పగా ఎదగాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. 


ఆలోచన అయితే చేశాడు కానీ.. ! ఆచరణ కోసం డబ్బులు మాత్రం లేవు. బిచ్చమెత్తుకుని వచ్చే డబ్బులు తిండికే సరిపోవటం లేదు. దీంతో పస్తులుంటు డబ్బులు ఆదా చేసేవాడు. అలా కళాశాలలో అడుగు పెట్టాడు. పాఠశాల స్థాయిలో వచ్చిన మార్కులు వలన కాస్తా గౌరవం పెరిగినా.. అవమానాలు, అపవదులు తప్పలేదు. అయినా తన పంతం తన కళ్ళముందు కనపడుతుంటే రోజులును సంవత్సరాలను అలాగే గడపసాగాడు. 


ఎక్కడికి వెళ్ళినా.. ఒంటరే. ఆలోచన పంచుకుందామన్నా ఎవరు స్నేహం ఛేయని దుస్థితి. పై చదువు కోసం గతంలో దాచుకున్న డబ్బులు కొంత తీశాడు. చివరకు విదేశాల్లో చదువుల కోసం ఎంపికయ్యి అమెరికా వెళ్ళాడు. తన దేశంలో కంటే అమెరికాలోనే కులం మతం అనే బేధాలు లేవని గ్రహించాడు. మనుషులను మనిషిలానే చూసే ఆ దేశంలో అశోక్ కి కొందరు స్నేహితులు కూడా దొరికారు. అక్కడే చదువులు పూర్తి చేసి ఒక కంపెనీలో పని చేశాడు. 


కొంతకాలం తర్వాత ఇండియా వచ్చాడు. వస్తూనే తన మేధాతనంతో అమెరికా కంపెనీ సహాయంతో కోట్ల పెట్టుబడితో ఇండియాలో కార్ల కంపెనీ పెట్టాడు. దానికి తానే సీఈఓగా ఉంటూ ముందుకు నడిపించాడు. దీంతో పారిశ్రామిక రంగంలో మన దేశం పేరు వెలుగులోకి వచ్చింది. అక్కడితో ఆగక పలు కంపెనీలకు శ్రీకారం చుట్టి ఎక్కడైతే తాను పై చదువు అభ్యసించి ఈ స్థాయికి ఎదిగాడో అక్కడే కాక పలు దేశాల్లో పారిశ్రామిక రంగాన్ని విస్తరించాడు అశోక్. ఈవిధంగా అశోక్ దేశంలో పారిశ్రామికవేత్తల్లో ఒకడిగా ఎదిగి ఉన్న డబ్బుతో పదిమంది పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. 


ఒకప్పుడు దళితుడని బడిలోకి, గుడిలోకి రానివ్వని సమాజం. అంటరానోడిగా తమకు దూరంగా ఉంచే సమాజం ఈరోజు అశోక్ చేస్తున్న సహాయ సహకారాన్ని మాత్రం దర్జాగా అర్జిస్తుంది. ఇప్పుడు ఈ సేవలు అతడి పేరుతోనే అమలవుతున్నాయి. ఇవి అంటరానివి ఎందుకు కావు.. ?


 నేడు ప్రపంచ పలు కంపెనీల్లో అశోక్ కంపెనీలు ఉన్నాయి. అక్కడ తయారయ్యే అనేక వస్తువులు కొంటున్నారు, వాడుతున్నారు. ఇవి ఎందుకు అంటరానివి కావు.. ? కొన్ని కోట్ల రూపాయలకు అదిపతి. ఆయన ముట్టుకున్న డబ్బు ఎంతోమంది వాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు అంటరానిది కాదు.. ? ఓ సభ్య సమాజమా.. సిగ్గుపడు మీకు అన్నీ ఉన్నప్పుడు బయట వాళ్ళు ఆంటరాని వాళ్ళు. మీ కంటే వాళ్ళు గొప్పగా ఎదిగితే మాత్రం గోప్పవాళ్ళా.. ? 


ఇంత అవమానాలు, కష్టాలు ఎదుర్కున్నా అశోక్ ఏనాడూ తన బాల్యం గూర్చి, సమాజం గూర్చి పల్లెత్తు మాట అనలేదు. అంతెందుకు.. తాను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి అంటరాని వాడని ఈసడించుకుని అవమానించింది. అలాంటి అమ్మాయి ఈరోజు తన కొడుకు యాక్సిడెంట్ లో రోడ్డు పక్కన పడి ఉంటే అటుగా ఎవరు వచ్చిన సహాయం చేయటం లేదు. ఆమె ఎందరికో వాహనదారులకు దండం పెట్టి వేడుకుంటున్నా.. ఆపటం లేదు. ఆ సమయంలో అశోక్ తన కారు ఆపి ఇద్దరిని ఎక్కించుకుని పెద్ద ఆసుపత్రిలో చేర్చాడు.

 

"ఇలాంటి ఆసుపత్రిలో ఫీజు చెల్లించలే"మని ఆమె అన్నది. 


"ఫీజు సంగతి నేను చూసుకుంటా" నని చెప్పి చేర్పించాడు. 


ఇంతలో ఆమె అశోక్ ని గుర్తించింది. షాక్ అయింది, తేరుకుంది, కన్నీరు కార్చింది. అశోక్ ని కోరుకుంది. అయినా.. పెళ్ళి అయి పిల్లలు ఉన్న ఆమెని తాను ఎలా ఆంగీకరించగలడు.. ? బాబుకు రక్తం పోయిందని తెలిసి తానే రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడ్డాడు. 


అప్పుడు అంటరాని వాడని ప్రేమించకుండా అవమానించిన ఆమెకు అశోక్ గొప్పవాడయ్యాక ప్రేమ కల్గిందా.. ? దళితుడని ఈసడించుకున్నా ఆమె కొడుకు శరీరంలోకి అదే దళితుడి రక్తం వెళ్ళి ప్రాణాలు నిలిపింది. ఇప్పుడు అంటరానితనం అడ్డు పడలేదా.. ? 


అణగారిన వర్గాలంటు చిన్న చూపు చూసే వాళ్ళు ఎవడు పండించే పంటలు తింటున్నారు.. ? ఎవడు వాడుతున్న డబ్బులు వాడుతున్నారు.. ?


ఇకనైనా ఈ సమాజం మారాలి. కులం, మతం అంటూ కోట్లాటలు ఆపాలి. అభివృద్ధి అనేది కులాల్లోను మతాల్లోను లేదు, మానవత్వంలో ఉందని తెలుసుకోవాలి. అప్పుడే.. అప్పుడే సహయం చేయటానికి, సహాయం అర్జించటానికి మనం అర్హులం. 


 *** *** *** *** *** *** ***


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం


29 views0 comments

Comments


bottom of page