top of page
Writer's pictureSudarsana Rao Pochampalli

అశ్లీల సాహిత్య నిర్మూలన


'Asleela Sahithya Nirmulana' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 31/10/2023

'అశ్లీల సాహిత్య నిర్మూలన' తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి


ఎక్కడ లేదు అశ్లీలత వెదకన్ వెదకన్

దిక్కెక్కడ దిగజారుడు లేని తీరము దరియున్

ఒక్కటి రెండు గాదు ఓపిక నెంచన్

లెక్కకు మించిన ఈ తిక్కదనము లేదను టెట్లగున్


ఉద్యమ మూపిరి గాగన్ సరి

విద్వత్తు బెంచనెంచి జనులన్

ఉద్యుక్తులు జేయ నెంచగ జాగుగ నైనన్

అశ్లీలత యంతమొందును విశ్వాసము తోడన్


దినపత్రిక దిన చర్యయు

వారపత్రికల వాంగ్మయమున్

చలన చిత్ర చిత్ర ప్రదర్శన

చపల చిత్తుల చేష్టలు బెంచున్


వ్రాయుము కవితలు రాదగు మార్పునెంచి

వ్రాయుము నవలలు నిఖిల జనంబులు మెచ్చన్

పాడుము పాటలు పవిత్ర భావము తోడన్

మాటాడుము మంచి మర్యాదల మూటలు విప్పన్


కలములో నున్నది మసి సలిలమైన

పొలములో నున్నది ముట్ట లేనట్టి మట్టి యైన

కలము తోడనె బుట్టు కమ్మని వ్రాతల్ కవితల్

హలము దోలగ పొలము పండించు పంటలు

జీవుల కడుపు మంటలు నార్పన్.


రాతిని జెక్కి శిల్పి రమణీయంబగు ప్రతిమను జేయన్

బూతులు వల్లించి అల్పులు రమణిని రాతిగ జేయన్

చేతలుడుగక చేబట్ట వలయు మా భ్రాతల్ మరియు

అక్క చెల్లెండ్రు అశ్లీలము నిశ్శేషముగ రూపుమాపగన్.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


28 views0 comments

Comments


bottom of page