top of page
Writer's pictureVagumudi Lakshmi Raghava Rao

అశ్మకి

#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #అశ్మకి, #Asmaki


'Asmaki' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 14/10/2024

'అశ్మకి' తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


 జనమేజయ మహారాజు ప్రతిష్టాన పురమును రాజధాని గా చేసుకుని జనరంజకంగా పరిపాలన చేస్తున్నాడు. అతని ధర్మపత్ని అనంత. ఆ పుణ్య దంపతులకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వరప్రసాదం తో ప్రాచీన్వంతుడు అనే సుపుత్రుడు కలిగాడు. తలిదండ్రుల ప్రేమాభిమానాల నడుమ అల్లారు ముద్దుగా పెరిగే ప్రాచీన్వంతుడు ఎల్లప్పుడూ తూర్పు దిక్కున ఉదయించే సూర్య భగవానుని చూస్తూ ధ్యానం చేసేవాడు. తూర్పు దిక్కును చూస్తూనే జ్ఞాన సముపార్జన చేసేవాడు. తూర్పు దిక్కును చూస్తూనే ఆహారం స్వీకరించే వాడు. తూర్పు దిక్కును చూస్తూనే ఆటపాటలందు పాల్గొనేవాడు. తూర్పున ఉన్న హిమాలయ పర్వతాల ప్రత్యేకతల గురించే ఆలోచించేవాడు.

 

 చంద్ర వంశంనకు చెందిన ప్రాచీన్వంతుడు 

కుల గురువు వశిష్ట మహర్షి వద్ద తదితర మహర్షుల దగ్గర సమస్త విద్యలను అభ్యసించాడు. తూర్పు రాజ్యల గురించి సమస్తం తెలుసుకున్నాడు. తూర్పు ప్రాంతాలను పరిపాలించే రాజుల బలాలను, బలహీనతలను సమస్తం తెలుసుకున్నాడు. ప్రాచీన్వంతుడు సూర్యుడు ఉదయించే తూర్పు దేశాలన్నింటిని తన స్వశక్తి తో జయించాడు. ఆయా రాజ్యాల రాజుల వాస్తవ ఆలోచనల గురించి తెలుసుకున్నాడు. 


అలాగే కొందరి రాజుల మూర్కత్వం గురించి కూడ తెలుసుకున్నాడు. ప్రజోపయోగ కార్యక్రమాలు రూపొందించాడు. వాటిని అనుసరించమని ఆయా రాజ్యాల రాజులను ప్రాచీన్వంతుడు ఆదేశించాడు. రాజులందరూ ప్రాచీన్వంతుని ప్రజోపయోగ కార్యక్రమాలను అనుసరించడానికి మనసా వాచా కర్మణా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు.

 

 జనమేజయ మహారాజు ఒక శుభ ముహూర్తాన తన కుమారుడు ప్రాచీన్వంతుని ప్రతిష్టాన పుర రాజుగ పట్టాభిషేకం చేసాడు. ఆ పట్టాభిషేక మహోత్సవం నకు రాజులు, రారాజులు, సామంత రాజులు తదితరులందరూ వచ్చారు. ప్రాచీన్వంతుని మనఃపూర్వకంగ అభినం దించారు. 


అనంత పుట్టింటికి, సంబంధించిన యాదవ మహారాజులు అందరూ ప్రాచీన్వంతుని పట్టాభిషేక మహో త్సవానికి వచ్చారు. అందులో అందరి దృష్టిలో అశ్మకి పడింది. 

యాదవ మహారాజు కుమార్తె అశ్మకి పుట్టుక గురించి అనంతకు ఆమె పుట్టింటివారు అనేకానేక విషయాలు చెప్పారు. అనంత తల్లి అనంతతో, "అమ్మా అనంత. అశ్మకి నీ కోడలైతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. 

 అశ్మకి తల్లి అశ్మకిని ప్రసవించలేక అనేక ఇబ్బందులు పడింది.. తొమ్మిది నెలలు నిండిన అశ్మకి తల్లి గర్భం నుండి భూమి మీదకు రాలేదు.. అప్పుడు అశ్మకి తల్లి మహర్షుల మాటలను అనుసరించి అనేక యజ్ఞయాగాదులను జరిపించింది. ఆ యాగాలప్పుడు నేను కూడా వారికి కావలసిన సహాయ సహకారాలు అందించాను. 

 అనంతరం అశ్మకి తల్లి వారి రాజ్యం లో కొండల దగ్గర ఉన్న కోయలగూడెం వెళ్ళింది. అశ్మకి తల్లి కోయలలో ఉన్న పెద్ద ముత్తైదువులు చెప్పిన పద్దతులన్నిటిని అనుసరించింది.. అయినా అశ్మకి, తల్లి గర్భం నుండి భూమి మీద పడలేదు. 


అనంతరం అశ్మకి తల్లి అనేకమంది మహర్షుల మాటలను అనుసరించి కొండ జాతి వారి దగ్గరకు వెళ్ళింది.. వారు అశ్మకి తల్లిని పరిశీలించి ఆమెను మహిమ గల రాళ్ళ నడుమ నాలుగు రో జులు ఉంచి అశ్మ పూజ చేసారు.. అప్పుడు అశ్మకి తల్లి అశ్మకికి జన్మనిచ్చింది. 


 అశ్మకి ని చూసిన అశ్మకి తండ్రి మహదానందం చెంది కొండ జాతి వారికి లక్ష ఆవులను దానం చేసాడు. గో క్షీరంతో రాజ్యం లోని సమస్త దేవతలకు అభిషేకం చేయించాడు.. ఆశ్మకి బారసాల వరకు అశ్మకిని ప్రతిరోజు క్షీరాభిషేకం చేయించాడు.. 


 అశ్మకి పెరిగి పెద్దయ్యింది. ఆమె కొండ రాళ్ళ ప్రత్యేకతలను బాగా చెబుతుంది. ఎలాంటి కొండరాళ్ళతో దేవుని విగ్రహాలను తయారు చేస్తారో అశ్మకి కి తెలిసి నట్లు మరొకరికి తెలియదు." అని చెప్పింది. 


 తన తల్లి చెప్పిన మాటలను విన్న అనంత తన భర్త జనమేజయ మహారాజు కు అశ్మకి గురించి చెప్పింది. అశ్మకిని కోడలుగ చేసుకుంటే దక్షిణ ప్రాంత రాజ్యాలన్నీ మిత్ర రాజ్యాలు అవుతాయని అనంత, భర్త జనమేజయ మహారాజు తో అంది. 

 అనంత జనమేజయ మహారాజు ఇద్దరూ అశ్మకిని తమ యింటి కోడలిని చేసుకోవాలనుకున్నారు. అశ్మకి చిత్ర పటం ను అనంత తన కొడుకు ప్రాచీన్వంతునికి చూపించింది. 


 ప్రాచీన్వంతుడు అశ్మకి చిత్ర పటం చూసాడు. అశ్మకి రూపం తన మనసులో నింపుకున్నాడు. తలిదం డ్రుల మనసులోని ఆలోచనలను గ్రహించాడు. తన తల్లి అనంత ఆంతర్యాన్ని గ్రహించాడు. 


 "నేను సూర్యుడు ఉదయించే తూర్పు ప్రాంతాలన్నిటిని జయించాను. ఇక జయించిన వాటిని సక్రమం గా, చక్కగా పరిపాలించాలంటే సాధ్యమైనంతవరకు యుద్దాలకు స్వస్తి చెప్పాలి. దక్షిణ ప్రాంత రాజ్యాలను మిత్రత్వం తో బంధుత్వంతో దగ్గరకు చేర్చుకోవాలి. అశ్మకి దక్షిణ ప్రాంత యాదవ రాజు కుమార్తె. ఆమెను వివాహం చేసుకుని దక్షిణ ప్రాంతాల వారితో బంధుత్వం పెట్టుకోవాలి. శత్రు భయం లేకుండా రాజ్యాన్ని పరిపా లించాలి. ఇదే తల్లిగారి సదాలోచన" అని అనుకున్న ప్రాచీన్వంతుడు తలిదండ్రులకు తన సమ్మతిని తెలిపా డు. 


అనంతరం ప్రాచీన్వంతుడు అశ్మిక అశ్మ కళను కళ్ళారా చూడాలనుకున్నాడు. మారు వేషంలో అశ్మకి రాజ్యానికి వెళ్ళాడు. కొండ రాళ్ళను పరిశీలిస్తున్న అశ్మకి ని చూసాడు.

 

 "మిత్రులారా! ఏ ప్రాంతాలలో కొండ రాళ్ళు దండిగా ఉంటాయో ఆయా ప్రాంతాలు పవిత్రంగా ఉంటాయి. 

వాటి వలన రాజ్యాలు కూడా సురక్షితంగా ఉంటాయి. 

 కొన్ని కొండరాళ్ళు పవిత్ర దైవాలుగా మలచడానికి అనుకూలంగ ఉంటాయి. మరికొన్ని కొండ రాళ్ళు గృహ నిర్మాణాలకు అనుకూలంగా ఉంటాయి. ఇంకొన్ని కొండ రాళ్ళు రాజ్య రక్షణ చేస్తూ ఉంటాయి. మంచి నీటిని పుష్కలంగా ఇస్తాయి. సూర్య కిరణాల తేజంలో మరికొన్ని కొండ రాళ్ళు ధగధగ మెరుస్తుంటాయి. వాటి విలువ ఇంత అని చెప్పలేం. 


కొన్ని కొండ రాళ్ళ గుహలు మనుషులలోని మాలిన్యాన్ని కడిగివేసి మనుషులను మహనీయులుగ మలుస్తాయి. కొండల రాజు హిమవంతుని ప్రియ పుత్రిక పార్వతి మాత. ఆ మాత అనుగ్రహం ఉన్న వారికి కొండల ప్రత్యేకతలు బాగా తెలుస్తుంటాయి. ఆ మాత అనుగ్రహంతోనే నేను ఈ కొండల మూలాల గురించి చెప్ప గలుగుతున్నాను" అని అశ్మకి శిల్పులకు చెప్పే మాటలను ప్రాచీన్వంతుడు విన్నాడు. 


 అశ్మకి పార్వతీ మాత అంశతో జన్మించిందని ప్రాచీ న్వంతుడు అనుకున్నాడు. అశ్మకి అశ్మ కళనంత గ్రహించాడు. అనంతరం పెద్దలందరి సమక్షంలో ప్రాచీన్వంతుడు అశ్మకిని మనువాడాడు. 


 అశ్మకి తన భర్త ప్రాచీన్వంతుని అభ్యర్థనను అనుసరించి ప్రాచీన్వంతుని రాజ్యములోని కొండలన్నిటిని పరిశీలించింది. 


అంత తన భర్తతో " నాథ! మన రాజ్యం లో అనేకానేక మహోన్నత కొండలు ఉన్నాయి. ఇక్కడ చలిపులి ని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను చలి నుండి కాపాడే కొండలు ఉన్నాయి. అమృతం లాంటి మంచినీరు ఇచ్చే కొండలు కూడా మన రాజ్యంలో ఉన్నాయి. సూర్య కిరణాల ప్రభావంతో బంగారం లాగ మారే కొండలు కూడా మన రాజ్యంలో ఉన్నాయి. 


సూర్య కిరణాల ప్రభావంతో మణులుగా మారే కొండలు కూడా ఉన్నాయి. మా యాదవ రాజ్యంలోని కొన్ని కొండలు సూర్య కిరణాల ప్రభావంతో వెండిగా మారతాయి. మన రాజ్యంలోని కొన్ని కొండలు సూర్య కిరణాల ప్రభావంతో బంగారం గా మారితే మరికొన్ని కొండలు మణులుగ మారతాయి. "అని అంది. 


 అశ్మకి మాటలను విన్న ప్రాచీన్వంతుడు తన రాజ్యం ఎంత సుసంపన్నమైనదో గ్రహించాడు. ఇక తన రాజ్యంలో నిరుపేదలు ఉండకూడదు అని ధృఢ నిశ్చయానికి వచ్చాడు. 


 అశ్మకి తన భర్త ప్రాచీన్వంతుని మాటలను అనుసరించి మిత్ర రాజ్యాలలోని కొండలను, ప్రాచీన్వంతుని సామంత రాజుల రాజ్యాలలోని కొండలను పరిశీలించింది. అందరి రాజుల, రారాజుల మన్ననలను పొందింది. 


ఆయా రాజ్యాలలోని ప్రజలందరు అశ్మకిని పార్వతీ మాత లా చూసారు. ప్రాచీన్వంతుడు "బంగారం మణుల నడుమ ప్రకాసించే పార్వతీ తేజం నా భార్య అశ్మకి " అని అనుకున్నాడు. 

 అశ్మకి ప్రాచీన్వంతుల కాలంలో నిరుపేదలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయారు. కొండలు కోనలు ప్రకృతి చక్క గా సశాస్త్రీయంగా సంరక్షించబడింది. 


   శుభం భూయాత్ 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








35 views0 comments

Comments


bottom of page