అటక పై దెయ్యం
- Mohana Krishna Tata
- Jul 24, 2023
- 3 min read

'Ataka Pai Deyyam - New Telugu Story Written By Mohana Krishna Tata
'అటక పై దెయ్యం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సుహాస్ 7వ తరగతి చదువుతున్నాడు. అమ్మ, నాన్న లతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నాడు. సుహాస్ నాన్నగారిది బ్యాంకు ఉద్యోగం. ఆయనకి ప్రమోషన్ రావడం చేత వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసారు. వైజాగ్ లో కొత్త ఇంట్లో, సుహాస్ కు ఒక పెద్ద గది. అందులో అన్ని వస్తువులు సర్దుకున్నాడు సుహాస్. ఆ ఇంట్లో సుహాస్ గది లో ఒక అటక ఉంది. దానిలో పాత సామాన్లు కొన్ని పడేసారు.
అందరూ కలిసి సరదాగా బయటకు వెళ్లారు. సుహాస్ వైజాగ్ బీచ్ లో చాలా ఎంజాయ్ చేసాడు. పార్క్ లో ఫొటోస్ తీసుకున్నాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది. అమ్మ ఇచ్చిన పాలు తాగాడు.
"అమ్మా! నిద్ర రావట్లేదు! కథ చెప్పవా?"
"అలాగే సుహాస్" అని ఒక రాజుల కథ చెప్పింది.
అటక పైన ఉన్న దెయ్యం ఈ మాటలన్నీ వింటున్నది.
మర్నాడు ఉదయం అమ్మ కు తెలియకుండా, ఫ్రిడ్జ్ లోంచి చాక్లెట్ తీసి తన రూమ్ లో కూర్చొని, తింటున్నాడు సుహాస్. వాళ్ళమ్మ రావడం గమనించిన సుహాస్, చాక్లెట్ అటక పైన పెట్టేసాడు. అమ్మ వెళ్ళాక చూస్తే అటక పైన చాక్లెట్ లేదు. అంతా వెదికాడు. సుహాస్ కు ఏమీ అర్ధం కాలేదు.
రాత్రి, అటక మీద నుంచి ఎవరో పిలుస్తున్నారు అనిపించింది సుహాస్ కు.
"సుహాస్! చాక్లెట్ చాలా బాగుంది. ఇంకొకటి కావాలి"
సుహాస్ భయపడిపొయాడు. "ఎవరది" అన్నాడు.
"బయపడకు! నేను మంచి దెయ్యాన్ని. నిన్ను ఏమీ చెయ్యను."
దెయ్యం, అలా అనగానే, సుహాస్ కు భయం పోయింది.
"దెయ్యమా? ఇక్కడేం చేస్తున్నావు?"
"నేను ఈ ఇల్లు ఖాళీ గా ఉన్నపుడు ఇక్కడకు వచ్చాను. ఈ అటక పైనే నివాసం ఉంటున్నాను. నాకు నీలాగే ఒక అబ్బాయి ఉన్నాడు. వాడికి నేను అన్నీ కొని పెట్టేవాడిని. నేను ఒక యాక్సిడెంట్ లో చనిపోయాను. నా భార్య, కొడుకు మీద ఉన్న ప్రేమతో నేను ఇంకా ఈ లోకంలోనే ఉండిపోయాను. నా ఆత్మ కు శాంతి లేదు."
"నీ కథ వింటుంటే, నాకు చాలా బాధగా ఉంది. నేను ఏం చేయగలను?"
"నిన్ను చూడాలనుకుంటున్నాను. కిందకు రా, వచ్చి ఇక్కడ కుర్చీ లో కూర్చో" అన్నాడు సుహాస్.
ఒక తెల్లటి ఆకారం, అటక నుండి కిందకు వచ్చి, కుర్చీ లో కూర్చుంది.
"నువ్వు దెయ్యం అని ఎలా నమ్మను" అన్నాడు సుహాస్.
"నేను ఎవరకు కనిపించను, నా మాట ఎవరికీ వినిపించదు, కానీ నీకు కనిపిస్తున్నాను అంటే, నాకు సాయం చేయడానికి నువ్వే కరెక్ట్"
"నీకు, ఏ పని చేస్తే, నన్ను నమ్ముతావు చెప్పు" అన్నాది దెయ్యం.
"నా హోంవర్క్ చేయగలవా?"
"నీ బుక్స్ అటక పైన పెట్టి నువ్వు పడుకో" అంది దెయ్యం
మర్నాడు ఉదయం లేవగానే, సుహాస్ అటక పైన బుక్స్ తీసి చూసాడు. హోమ్ వర్క్ తాను చేసినట్టే ఉంది. సుహాస్ చాలా హ్యాపీ.
రోజూ, ఇలాగే దెయ్యం చేత హెల్ప్ చేయించుకునే వాడు సుహాస్. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు.
ఒక రోజు దెయ్యం సుహాస్ తో "నాకు ఒక సాయం చేస్తావా?"
"ఏమిటి చెప్పు దెయ్యం ఫ్రెండ్" అన్నాడు సుహాస్
"నేను బతికున్నప్పుడు నా భార్య సుమతి, నా కొడుకు చదువు కోసం ఒక చోట సంపాదించిన డబ్బులు దాచి పెట్టాను. అక్కడ దగ్గర్లో గుడి ఉంది, అందుకే నేను అక్కడకు రాలేను"
"ఆ చోటు ఇక్కడకు ఒక కిలోమీటర్ దూరం లో ఉంది - నీ స్కూల్ వెనుక. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో ఒక బ్యాగ్ పెట్టాను. అక్కడకు ఎవరు వెళ్ళరు, అందుకే అక్కడ పెట్టాను. ఆ బ్యాగ్ తీసుకు రా.
సుహాస్, మర్నాడు స్కూల్ నుంచి వెళ్ళి, అక్కడ ఉన్న బ్యాగ్ తన స్కూల్ బ్యాగ్ లో పెట్టుకుని ఇంటికి తీసుకొని వచ్చాడు.
బ్యాగ్ ఓపెన్ చేయగానే అందులో చాలా డబ్బులు ఉన్నాయి. దెయ్యం తాను బతికున్నప్పుడు కష్టపడి సంపాదించిన డబ్బులు అవి. ఈ డబ్బులు గురించి ఫోన్ లో తన భార్యో తో చెప్పి ఇంటికి వస్తుండగా, ఆక్సిడెంట్ అయ్యిందని దెయ్యం సుహాస్ కు చెప్పింది.
"దెయ్యం చెప్పింది విన్నాకా, సుహాస్ కు చాలా బాధనిపించింది"
"ఈ బ్యాగ్ నా భార్య కు ఇవ్వాలి. తాను చాలా కష్టాల్లో ఉంది. ఈ డబ్బులతో నా కొడుకు బాగా చదువుకోవాలి. అదే నా కోరిక." అంది దెయ్యం
దెయ్యం చెప్పినట్టు, సుహాస్ తన స్కూల్ నుంచి సుమతి ఇంటికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు. సుమతి తలుపు తీసింది. సుహాస్ పక్కన దాక్కున్నాడు. ఇలాగ చాలా సార్లు చేసాడు. అప్పుడు ఎవరా? అని చూడడానికి సుమతి, సందు చివరికి వెళ్ళింది. ఈ టైం లో, సుహాస్ చేతిలో ఉన్న డబ్బు బ్యాగ్ తో ఇంట్లో దెయ్యం చెప్పిన తన గూట్లో పెట్టి, బయటకు వెళ్ళిపోయాడు.
కొన్ని రోజులు తర్వాత గూడు సర్దుతుండగా, బ్యాగ్ లో డబ్బు ను చూసి చాలా ఆనందపడింది సుమతి. తన భర్త ఫోన్ లో చెప్పిన డబ్బులు దొరికినందుకు, ఆ దేవునికి కృతజ్ఞతలు తెలిపింది.
"సుహాస్! నా కోరిక తీరింది. నా ఆత్మ కు శాంతి లభించింది. నేను ఈ లోకం లో ఇంక ఉండను. నీకు ఎప్పుడైనా, ఆపద వచ్చినప్పుడు నన్ను తలచుకో" అని చెప్పి దెయ్యం మాయమైపోయింది.
***
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
కథ కొత్త తరహాలో ఉండి పాత కాలపు స్ఫురణ గోచరిస్తున్నది-అభినందనలు.