#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #ఆటలఅద్భుతం, #AtalaAdbhutham, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems
Atala Adbhutham - New Telugu Poem Written By Bhallamudi Nagaraju
Published In manatelugukathalu.com On 25/12/2024
ఆటల అద్భుతం - తెలుగు కవిత
రచన: భళ్లమూడి నాగరాజు
అద్భుతాలు ఆవిష్కరించావు
అనన్య సామాన్యమనిపించావు
అతి పిన్న వయస్సు లో
ప్రపంచ ఛాంపియన్ గా నిలిచావు
నీ ఎత్తు గడలు ..
ప్రత్యర్థి గుండెల్లో పిడుగులు
నీ విజయానికి తొలి అడుగులు
భావి తరాలకు అడుగుజాడలు
రణ రంగపు వ్యూహం తో
ఎత్తుకు పై ఎత్తులతో ..
డింగ్ లిరిన్ ని చిత్తు చేసావు
పుష్కర కాలపు
ఈ ఘన కీర్తి.. నీ స్ఫూర్తి
భారతావని మరువదు
గుకేశ్ ..
నీ అద్భుత ఖ్యాతి
..భళ్లమూడి నాగరాజు
Comments