#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #AthadeHari, #అతడేహరి, #ద్విపద
![](https://static.wixstatic.com/media/acb93b_3f62c84a7f614a9aa154c1c35caaa888~mv2.jpg/v1/fill/w_940,h_788,al_c,q_85,enc_auto/acb93b_3f62c84a7f614a9aa154c1c35caaa888~mv2.jpg)
Athade Hari - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 25/01/2025
అతడే హరి - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
(ద్విపద )
నరహరి రూపుని నమ్మిన చాలు
కరువును తొలగించి కలిగించు మేలు/
పాపుల దండించు ప్రభువును దల్చు!
శ్రీహరి సన్నిధి సేవగ మల్చు/
దేవళమందున దేవుని గనుము!
పావనమౌ ధర్మపథమున చనుము!
మ్రొక్కుచు కృష్ణుని పూజలు సల్పు!
సొక్కుచు శౌరిపై చూపును నిల్పు!
పావనచరితుని భక్తిగ కొల్చు!/
జీవనమంతయు చెంతనే నిల్చు
హరికీర్తన వినగ నాపదల్ తొలగు
చరితము పాడగ సాంత్వన కలుగు /
ప్రణతులనర్చింప పాలించు వేల్పు
తనభక్తుల మనికి దయతోడ నిల్పు /
వరములొసంగెడు వరదుడె వాడు
కరములందించి నిన్ గాపాడు ఱేడు./
వెరపును బోద్రోలి విజయము నిడుచు
పరమాత్ముడౌ హరి భక్తికి పొలుచు /
ముక్తిపథంబును ముందుగ జూపి
భక్తులన్ బ్రోచును భయమును బాపి/
ముజ్జగముల నేలు మురహరి యతడు
సజ్జనులకు ఘన సఖుడటనితడు.//
![](https://static.wixstatic.com/media/acb93b_5f0667fa4fb2479ba3b15b34f01b0d51~mv2.jpeg/v1/fill/w_980,h_1136,al_c,q_85,usm_0.66_1.00_0.01,enc_auto/acb93b_5f0667fa4fb2479ba3b15b34f01b0d51~mv2.jpeg)
Profile Link:
అతడే హరి: గాయత్రి
ఆధ్యాత్మిక చింతన, దేవుడి కే మన విజయాలు అర్పించటం, దేవుడి పైన భారం వేయటం మంచిదే. అహంకారం, గర్వం ఉండవు.
కానీ, మనం మన ప్రయత్నం చేస్తూ కూడా ఉండాలి.
పి.వి. పద్మావతి మధు నివ్రితి
నమస్కారం గాయత్రి గారు, నా పేరు వెంకట ప్రసాద్. తమరు 2023 MSR కథల పోటీలకోసం వ్రాసిన "కప్పు తేనీరు" కథను ఇప్పుడే చదివాను. విలక్షణమైన కథ. మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. మీరు కథలో ఆవిష్కరించిన సున్నితమైన మానవ సంబంధాలగురించి మరికొంత చర్చించాలని ఉంది.