తెలుగు బాలల కథ
'Athadu Ameku Emouthadu' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah
Published In manatelugukathalu.com On 19/09/2024
'అతడు ఆమెకు ఏమౌతాడు?' తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
చింతలపల్లి అనే ఒక ఊరిలో సారంగడు అను ఒక వడ్రంగి ఉండేవాడు. అతడు చెక్క పని చేసుకుంటూ బతుకేవాడు. తలుపులు, ద్వారా బంధాలు, స్తంభాలు, దూలాలు చాల చక్కగా చేసేవాడు.
పక్కూర్లో పని ఉందని పనిముట్లతో కాలినడకన బయలుదేరాడు సారంగడు. సగం దూరం పోయేసరికి బాగా ఎండ కాసింది. ఎండకు ఒళ్ళంతా చెమటలు బట్టీ నాలుక పిడచకట్టుక పోయి దాహం వేసింది సారంగడికి.
చుట్టూ పొలాలు. ఆ పొలాల్లో రైతులు వ్యవసాయ పనులు చేసుకొంటున్నారు. వాళ్ళ దగ్గర నీళ్ళు ఉంటాయని తలచి తనకు సమీప పొలంలో పనిచేస్తున్న ఒకావిడ దగ్గరకు నడిచి ఆమెను తాగడానికి నీళ్లు అడిగాడు. ఆ రైతు మహిళా తమ కోసం తెచ్చుకున్న బిందెలోని నీళ్ళను చెంబులోకి వొంచి సారంగడికి ఇచ్చింది. సారంగడు చెంబు అందుకొని గుటగుటా ఎత్తుకొని తాగి చెంబును ఆమెకు తిరిగి ఇచ్చాడు. సారంగడు నీళ్ళు తాగాక కాస్త మనసు నెమ్మదించి ఒళ్ళు చల్లబడింది.
నీళ్ళు తాగిన సారంగడు తన దోవన తాను పోక ఆమెను "అమ్మా! పొలానికి ఆ మోటున పని చేస్తున్నాతడు మీకు ఏమౌతాడు" అని అడిగాడు.
ఆమె సూటిగా సమాధానం చెప్పకుండా చమత్కారంగా, డొంకతిరుగుడుగా చెప్పింది. " అతని నాన్న మా నాన్నను మామా అని అంటాడు. కాబట్టి అతను నాకు ఏమౌతాడో నీవే తెలుసుకో " నవ్వుతూ అంది.
సారంగడు అర్థం కాక అయోమయంలో పడ్డాడు. కొద్ది సేపు అక్కడే ఉండి ఆలోచించి ఆలోచించి చిక్కు ముడి విప్పలేక తల గోక్కుంటూ దోవ పట్టుకొని పోయాడు.
ఆమె అతను పోతున్న దోవ వైపు చూస్తూ అతని అమాయకత్వానికి నవ్వుకుంది.
సారంగడు దోవెంబడి పోతూ " అతను ఆమెకు ఏమి అవుతాడబ్బా " అని తెగ ఆలోచిస్తూ పక్కూరు చేరుకొని పనిలోకి దిగిపోయాడు.
సారంగడితో పని చేయించుకుంటున్న ఓ అరవై ఏళ్ళ యజమాని సారంగడి పనితనాన్ని గమనిస్తూ అతని దగ్గరే కుర్చోని కబుర్లు కాకరకాయలు చెప్పుతున్నాడు. ఓ మూడు రోజులు గడిచాక ఇద్దరి మధ్య చనువు పెరిగిపోయింది. అరమరికలు చెదిరిపోయాయి. ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం ప్రారంభించారు.
ఒకరోజు సారంగడు తన మెదడును తొలుస్తున్న చిక్కు ప్రశ్నకు సమాధానం కోసం యజమానిని అడిగాడు.
"అయ్యా పెద్దాయనా! మీ వద్దకు పనికి వస్తున్నప్పుడు దారిలో నాకు దప్పికై పొలంలో పనిచేస్తున్న ఒకావిడను నీళ్ళు అడిగాను. ఆమె ఇచ్చిన నీళ్ళు త్రాగాక, ఆమెను అదే పొలంలో మరోవైపు పనిచేస్తున్న ఒకతన్ని చూసి 'అతడు మీకు ఏమౌతాడు' అని అడిగాను. ఆమె నేరుగా సమాధానం చెప్పకుండా 'అతని నాన్న మా నాన్నను మామా' అని పిలుస్తాడు. కాబట్టి నీవే తెలుసుకో' అని మర్మగర్భంగా చెప్పింది. అది నాకు అర్ధం కాలేదు. ఆమెకు అతడు ఏమౌతాడో మీరైనా చెప్పుతారా?" అడిగాడు సారంగడు.
దానికి ఆ పెద్దాయన" ఏముందీ? ఆమెకు అతడు కొడుకు అవుతాడు " అని టపీమని చెప్పాడు.
దాంతో సారంగడు ఆశ్చర్యంతో నోరు వెల్ల బెట్టాడు. "అదెలా! వివరంగా చెప్పండి" అడిగాడు సారంగుడు.
"అలాగే చెపుతాను, ఉదాహరణకు ఆమె నీ భార్య, అతను నీ కొడుకు అనుకో! అతని నాన్నవైన నువ్వు నీ భార్య నాన్నను మామా అని అంటావు కదా! అప్పుడు నీ కొడుకు నీ భార్యకు కూడా కొడుకే కాదా! కాబట్టి అతడు ఆమెకు కొడుకైతాడు" అని వివరించాడు పెద్దాయన.
దానితో సారంగడి మనసున అల్లుకున్న అనుమాన మేఘాలు తొలిగి మనసు ప్రశాంతమైంది.
----------
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య
చదువు: B.com
పుట్టిన తేది: 1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య
రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.
అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.
సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.
సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.---------
Comments