'Athi Anarthame' - New Telugu Story Written By Dr. Kiran Jammalamadaka
Published In manatelugukathalu.com On 19/07/2024
'అతి అనర్థమే' తెలుగు కథ
రచన: డా: కిరణ్ జమ్మలమడక
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
"కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే .." అని ఫోన్లో వొస్తుండగా "యెంత బాగా పాడిందో మన సుబ్బలక్ష్మి ‘మార్వలెస్ ఏం ఎస్’ "అని ఆడియో ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు సోమనాథం.
"అలా ఫోన్ చూస్తూ నడవకండి అని ఎన్ని సార్లు చెప్పాను మీకు!
అయినా.. హవ్వా! మన సుబ్బలక్ష్మి ఏమిటండీ ఏదో మీ మేనకోడలులాగా" అంది ఆయన భార్య అహల్య.
“సుబ్బలక్ష్మి అంటే ఎవరు? హ.. ఎవరు? మన ఇంటిలో మనిషికాదా ..” అని ఇంకా ఏదో అనేటంతలో
"టింగ్ టాంగ్ " అని డోర్ బెల్ మోగింది.
"ఇంత పొద్దున్నే ఎవడే? ఇంకా టిఫిన్లు కూడా తినలేదు "
అని విసుక్కుంటూ వెళ్లి తలుపు తీసాడు సోమనాథం.
ఒక యువకుడు “గుడ్ మార్నింగ్! త్వరగా మేల్కోవడం, ప్రకృతితో మమేకవడం మరియు నేను నిశ్శబ్దంగా గడపడం నాకు ప్రాధాన్యతలు, హవె ఏ గ్రేట్ డే " అని గబా గబా చదివేసి వెళ్ళిపోయాడు ఆ యువకుడు.
అసలే తెల్లగా వుండే సోమనాథం, మరింత తెల్లగా అయిపోయాడు, సరే లే అని లోపలికి వెళ్లి అహల్య ఇచ్చిన రెండో డోసు కాఫీ తాగుతూ, ఫోన్ లో పడిపోయాడు.
అప్పుడు అహల్య "మీరు స్నానం చేసి రండి లేక పొతే నా మీద వొట్టే " అని గసురుకునేసరికి విసుక్కుంటూ ఫోన్ చేత్తో పట్టుకునే స్నానానికి వెళ్ళిపోయాడు.
స్నానం చేసి, "ఈ పోస్ట్ చూడవే, మన వేటూరి రాసినదంట, ఇప్పుడే ఎంజాయ్ ది లిరిక్స్ అని ఎవడో పెట్టాడు చదువుతా విను.. దొరకునా.. దొరకునా ఇటువంటి సేవ " అని చదువుతున్న సోమనాథానికి, అప్పుడే తలుపేసి వొస్తున్న అహల్య కనపడింది.
"మళ్ళీ ఎవడు?" అన్నట్టు కనులతోనే అడిగాడు.
"ఎవడో కుర్ర కుంక, దక్షిణామూర్తి కి వాళ్ళబ్బాయి అమెరికా నుండి వాచీ పంపించాడంట మీకు చూపించమని పంపించాడట".
"పిచ్చా? వెర్రా?, వాడు ఎవడికో వాడి కొడుకు వాచీ పంపితే మనకు చూపించమని పంపడమేమిటి? వాడూ వాడి చేష్టలు.. " అన్నాడు సోమనాథం చిరాగ్గా.
సర్లెండి, అన్నం తిందురుగాని, రండి. నాకు బోలెడు పని వుంది.
అన్నం దగ్గర కూచోగానే, మళ్ళీ "టింగ్ టోంగ్ " అని డోర్ బెల్ మోగింది.
సోమనాథానికి కోపం నషాళానికి అంటింది, అసలు డోర్ బెల్ మొగితేనే ఇష్టముండని సోమనాథానికి, గంటలో మూడోసారి మోగేసరికి చిర్రెత్తుకొచ్చింది.
వెంటనే తలుపు తీయ్యటం, ఆ కుర్రాడి చొక్కా పట్టుకోవడం ఒక్క క్షణం లో జరిగిపోయాయి.
"ఎవడ్రా నువ్వు, ఏంటి మళ్ళీ వొచ్చావు " అన్నాడు.
భయపడిపోయిన ఆ కుర్రాడు "దక్షిణామూర్తి గారు పిజ్జా తెప్పించుకున్నారు, మీకు చూపించమన్నారు " అన్నాడు.
"వాడు పిజ్జా తెప్పించుకుంటే నాకెందుకు మజా చేసుకుంటే నాకెందుకు, నిన్ను వాడిని కలిపి ఉతికేస్తా ఏమనుకుంటున్నారో?"
"అది కాదు సార్, ఆయన ఫేస్బుక్ లాక్ అయిపోయిందంట, అది ఓపెన్ అవ్వటానికి రెండు మూడు రోజులు పడుతుందట "
"ఐతే?" గట్టిగా అరిచాడు సోమనాథం.
"కాదు సార్, మీరు ఈ చుట్టుపక్కలవారంతా ఆయన పెట్టిన గుడ్ మార్నింగ్ మెసేజీలుకు, ఆయన పెట్టిన పోస్టులకు లైకులు, కామెంట్లు కొడతారంటకదా, మీరు అవన్నీ మిస్ అయిపోతారని, ఆయన నన్ను ఈ రెండురోజులు పని కి పెట్టుకున్నారండి, నేను ఈ చుట్టుపక్కల వాళ్ళకి అయన ఫేస్బుక్ లో చూపించాలనుకున్నవన్నీ ఇలా.. " అని మెల్లిగా నసిగాడు.
సోమనాథం కుడి చేతిలో వున్న కుర్రోడి చొక్కా, ఎడం చేతిలో వున్న సోమనాథం స్మార్ట్ ఫోన్ జారీ పోయాయి.
ఇదే అదనుగా ఆ కుర్రోడు ఠక్కున పారిపోయాడు.
ఫక్కున అహల్య నవ్వు, వెనువెంటనే అన్న "అతి సర్వత్ర వర్జయేత్" అన్న మాటలు వినపడకపోలేదు సోమనాథానికి.
*****
కిరణ్ జమ్మలమడక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: Dr: కిరణ్ జమ్మలమడక
కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ చేసి, GE లో సీనియర్ మేనేజర్ గా, బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కిరణ్ , "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వుంటారు. తన సంస్థ ద్వారానే కాకుండా పిల్లలు , పెద్దలు ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకుసాగాలనే ఉద్దేశం తో కథలు రాయటం మొదలుపెట్టారు, ప్రముఖ పత్రికల్లో ఆయన కథలు కొన్ని ప్రచురితమయ్యాయి. తెలుగు వెలుగు 'కథా- విజయం 2019' పోటీలో భాగంగాఎన్నిక అయ్యిన "మిరప మొక్క " ప్రజాదరణ పొందినది. పదేళ్లలోపు పిల్లల కోసం రాసిన "యాత్ర", పదేళ్ల పైబడిన పిల్లల కోసం రాసిన నవల "అతీతం" లను తానా - మంచిపుస్తకం 2021 లో ప్రచురించింది.
భలే సరదాగా ఉంది