#GottapuSrinivasaRao, #గొట్టాపుశ్రీనివాసరావు, #అతిసర్వత్రవర్జయేత్, #AthiSarvathraVarjayeth, #TeluguMoralStories, #నైతికకథలు
Athi Sarvathra Varjayeth - New Telugu Story Written By - Gottapu Srinivasa Rao
Published In manatelugukathalu.com On 09/11/2024
అతి సర్వత్ర వర్జయేత్ - తెలుగు కథ
రచన: గొట్టాపు శ్రీనివాస రావు
"ఏమోయ్... రేపు నీ పుట్టిన రోజు కదా!" అద్దం ముందు తలదువ్వుకుంటూ తన భార్యను ప్రేమగా అడిగాడు మూర్తి.
"ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసేస్తే రేపు మళ్లీ శుభాకాంక్షలు తెలియజేయవలసిన అవసరం లేదని అనుకుంటున్నారా?" తెలివిగా అడిగింది మూర్తి భార్య శాలిని.
ఆమెకు తనభర్త మతిమరుపు గురించి బాగా తెలుసు. మూర్తి చాలా తెలివైనవాడు. చక్కని జ్ఞాపక శక్తి కలిగిన వాడు. అతడు చదువుకుంటున్నప్పుడు జ్ఞాపకశక్తికి సంబంధించిన పోటీలలో ప్రథమ బహుమతులు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చదువు పూర్తి చేసుకుని కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం, పెళ్ళి అవ్వడం అన్నీ చకచకా పూర్తయిపోయాయి.
ఆఫీసులో మూర్తికి మించిన పనిమంతులు ఎవరూ లేరు. అయితే రోజూ తెల్లవారున లేవగానే వ్యాయామం చేయడం, బస్సులో ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు టికెట్‌కి సరిపడా చిల్లర తీసుకువెళ్లడం, అందరికంటే ముందుగానే ఆఫీసుకు హాజరు అవ్వడం, అందరికంటే ముందుగానే తన పని పూర్తి చేసుకోవడం మూర్తికి అలవాటు.
అయితే కొద్ది రోజుల క్రితం మూర్తి ఒక కొత్త మొబైల్ కొన్నాడు. ధర ఎక్కువ కావడంతో దానిలో ఉండే ఫీచర్స్ కూడా ఎక్కువే. దానిలో ఫీచర్స్ అన్నీ చూసి తెగ మురిసిపోయాడు. ఇక మొబైలే అతడి జీవితం అయిపోయింది. ఎవరినైనా పలకరిస్తే మొబైల్ లోనే వాట్సప్ లోనో, ఫేస్ బుక్‌లోనో పలకరించేవాడు. కానీ ఎదురుగా కనబడినా పట్టించుకుండేవాడు కాదు. ఉదయం లేచిన తర్వాత వ్యాయామం మానేసాడు. బద్ధకంగా లేవడం ఆఫీసుకు టైం అయిపోతుందంటూ తొందర తొందరగా పరిగెత్తడం అవసరమైన పేర్లు, నెంబర్లు మొబైల్లో వెతుక్కోవడం ప్రారంభించాడు.
ఇంక మొబైల్ చేతిలో లేకపోతే మన వాడికి రోజు గడవదు అన్నట్లు ఉండేది. ఇలా మొబైల్ చూసుకుంటూ ఓ రోజు ఆఫీసుకు బయలుదేరాడు. జేబులో చిల్లర డబ్బులు వేసుకోవడం మర్చిపోయాడు. టికెట్ తీసుకోవడం మర్చిపోయాడు. బస్సులో కండక్టర్ చేత నానా మాటలు అనిపించుకున్నాక టికెట్ తీసుకున్నాడు. మొబైల్ చార్జర్ మర్చిపోయాడు. అతను మొబైల్ అధునాతనమైనది కావడంతో ఏ ఇతర మొబైల్ చార్జరూ దానికి పనిచేయలేదు. దాంతో మొబైల్ పనిచేయలేదు. వేరొకరి మొబైల్‌లోఎవరికి ఫోన్ చేయాలన్నా, నెంబర్స్ గుర్తులేవు.
ఇంటిదగ్గర తన కళ్లద్దాలు కూడా మర్చిపోయాడు. తన భార్య తనకు ఫోన్ చేసినా, అతడి ఫోను అందుబాటులో లేదు. ఆఫీసులో ఏ పని చేద్దామన్న డాక్యుమెంట్లు చదవలేక పోవడం వలన ఆఫీస్ పని కూడా చేయలేకపోయాడు. పూర్తిగా మొబైల్ మీద ఆధారపడటం వల్ల ఏ పని చేయలేకపోయాడు. మధ్యాహ్నం భోజనం సమయం అయింది. బస్సు కండక్టర్ తిట్టాడు అన్న కోపం మనసులో ఉంచుకొని క్యారేజ్ అక్కడే బస్సులోనే మరిచిపోయాడన్న విషయం అప్పుడు గుర్తొచ్చింది.
మధ్యాహ్నం భోజనం లేదు. సాయంకాలం ఎలాగోలా ఇంటికి చేరుకున్నాడు. భార్య ఎదురుగా నిలబడి ఉన్నది. చేతిలో అతడు బస్సులో మరిచిపోయిన క్యారేజ్ ఉంది. చాలా కోపంగా చూస్తోంది.
"ముందు నాకు దారి తప్పుకో అర్జెంటు పని ఉంది" అని చెప్పి తొందరగా ఇంట్లోకి వెళ్లి మొబైల్ ఛార్జింగ్ పెట్టేసాడు. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చాడు. ఇంకా తన భార్య కోపంగానే చూస్తూ ఉంది.
"ఏమిటి ఈ రోజు ఇంత కోపంగా ఉన్నావ్? అసలు ఏం జరిగింది చెప్పు. పక్క వీధిలో కండక్టర్ కేరేజ్ తిరిగి ఇచ్చేస్తూ ఏమైనా అన్నాడా? " అడిగాడు.
"అది కాదు" అని చెప్పింది.
"ఇంకేంటి మరి.. కండక్టర్ టికెట్ తీసుకోవడం ఆలస్యం అయిందనీ, చిల్లర తీసుకెళ్లలేదని ఏమైనా అన్నాడా?"
"అదీ కాదు" ఆమె అంది.
"మాఅమ్మతో ఏమైనా గొడవా?" రెట్టించి అడిగాడు మూర్తి.
"నిన్న సాయంకాలం మీరు నాతో ఏమన్నారో గుర్తుందా?" అడిగిందామె.
అప్పుడు గుర్తుకు వచ్చింది మూర్తికి. ఆరోజు తన భార్య పుట్టినరోజు. ఆలోచనలో పడ్డాడు.
'అవును. మన మనసుకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలంటే పుట్టినరోజు ముందురోజు అర్ధరాత్రి12 గంటల ఒక్క నిమిషానికి శుభాకాంక్షలు తెలియజేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పాను కదా! అవును చెప్పాను.
కానీ మొబైల్‌లో వాట్సప్, ఫేస్ బుక్, స్నేప్ చాట్, యూట్యూబ్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి చూసుకుంటూ అసలు విషయం మరిచిపోయాను..'
తనను తాను నిందించుకుంటూ మౌనంగా ఉండిపోయాడు మూర్తి.
"ఈరోజు నాపుట్టినరోజు అన్న విషయం మీరు మర్చిపోయారు." అని చెప్పి బుంగమూతి పెట్టుకొని తాను ఇంటిలోకి వెళ్ళిపోయింది శాలిని.
వెంటనే ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి, ఇంకా మొబైల్ మీద ఆధారపడితే మతిమరుపు ఇంకా ఎక్కువ అయిపోతుందని అనుకుంటూ అప్పటి నుండి మొబైల్ అతివాడకం, ప్రతీదానికి మొబైల్‌పై ఆధారపడడం తగ్గించేసాడు మూర్తి.
ఇంక మళ్ళీ తన జ్ఞాపకశక్తి తనకు రావాలని గట్టిగా కోరుకుని, ఆచరణకు సిద్ధం అయ్యాడు. తన ప్రయత్నంలో కృతకృత్యుడయ్యాడు.
సమాప్తం
గొట్టాపు శ్రీనివాస రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: గొట్టాపు శ్రీనివాస రావు
నమస్తే అండీ!
మీకు ధన్యవాదములు🙏
నావివరాలు
పూర్తి పేరు: గొట్టాపు శ్రీనివాస రావు
జన్మస్థలం: సాలూరు
తల్లిదండ్రులు: నాగమ్మ, శివున్నాయుడు
భార్య: హారిక
పిల్లలు: శివనగేష్, ఆదిత్య
చదువు
ఉద్యోగం పేరు: పాఠశాల సహాయకుడు
ఉద్యోగంలో చేరినతేది-మొదటిస్టేషన్/స్కూల్: 19-10-2009
పనిచేసిన స్థలాలు-హోదా
1. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గడసాం, దత్తిరాజేరు మండలం, విజయనగరం జిల్లా
2. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాంచాలి , పాచిపెంట మండలం, పార్వతీపురం మన్యం జిల్లా.
3. మండల ప్రాధమికోన్నత పాఠశాల, మంచాడ వలస, పాచిపెంట మండలం, పార్వతీపురం మన్యం జిల్లా.
అభిరుచులు: సాహిత్య పఠనం , రచన
ప్రచురణ అయిన పుస్తకాలు: 1. మరువలేను నిన్ను మాతృమూర్తి
2. క్రియా నిఘంటువు (తెలుగు నుండి ఇంగ్లీషు)
3. విశ్వా గజల్స్
అవార్డులు: 1. నేషన్ బిల్డర్
ఇన్నర్ వీల్ క్లబ్, సాలూరు
2. పార్వతీపురం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ 2024 అవార్డు
సేవాకార్యక్రమాలు: సాహిత్య సేవ
కథలో ఏదో వెల్తి ఉంది సార్