top of page
Valipe Ram Chetan

అత్యాశ


'athyasa' written Valipe Ram Chetan

రచన : వలిపే రామ్ చేతన్

నగనగా రాజనగరమనే రాజ్యానికి విష్ణువర్మ అనే రాజుండేవాడు. అతడు చాలా బలవంతుడు, మంచివాడు, తెలివైనవాడు. అతడు రాజ్యాన్ని జనరంజకంగా పాలించేవాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్లుండేవారు. వారిపేర్లు విక్రమార్కుడు, హర్షవర్ధనుడు. వారిద్దరూ అత్యాశపరులు. రోజూ విష్ణువర్మను ఏదో ఒక్కటి అడుగుతుండేవారు. వారంటే రాజుకు చాలా ఇష్టం. తమ్ముళ్లేమడిగినా విష్ణువర్మ తీసుకొచ్చేవాడు. ఒకరోజు రాజసభ జరుగుతుండగా హర్షవర్ధనుడొచ్చి “అన్నయ్య! నేను మంత్రి ఆసనంలో కూర్చుంటాను”,అనన్నాడు. విష్ణువర్మ నిరాకరించబోతుండగా, మంత్రి ఆసనం నుండి లేచి, “హర్షవర్ధనుడుగారూ! ఇక్కడ కూర్చోండి”, అన్నాడు. మహారాజేమీ అనలేదు. సభ కొనసాగుతుండగా రాజగురువు “రాజైతె గౌరవంగా బ్రతకొచ్చు, ఏమైనా చేయొచ్చు”,అననుకున్నాడు. అది హర్షవర్ధనుడు గ్రహించాడు. సభ పూర్తయింది. హర్షవర్ధనుడు విక్రమార్కుడితో “మనమన్నయ్యను రాజ్యాన్ని అడుగుదాము”,అనన్నాడు. విక్రమార్కుడు సరేనన్నాడు. ఇద్దరూ కలిసి విష్ణువర్మ దగ్గరకెళ్ళి రాజ్యాన్నడిగారు.విష్ణువర్మ ఆలోచించి సరేనన్నాడు. వారిద్దరిని రాజులుగా ప్రకటించాడు ఇద్దరు తముళ్ళు వెంటనే విష్ణువర్మను సైన్యాధిపతిగా నియమించారు.విష్ణువర్మ చాలా భాధపడ్డాడు. ఇద్దరు తమ్ముళ్లు రాజ్యాన్ని అధర్మబద్ధంగా పాలిస్తున్నారు. విష్ణువర్మకు నరసింహరాజనే శత్రువుండేవాడు. పరిస్థితినవకాశంగా తీసుకుని దండయాత్రకు సిద్దమయ్యాడు. ఆ విషయం రాజులకు తెలిసింది. వారేమీ చెయ్యలేకపోయారు. విష్ణువర్మ వద్దకు వెళ్లి , " మేము శత్రువును ఎదిరించలేము. మీరే యుద్ధానికి సారధ్యం వహించండి" అని కోరారు.విష్ణు వర్మ నరసింహరాజు నోడించేశాడు. తమ్ముళ్లిద్దరు విష్ణువర్మ కాళ్ళమీద పడి “అన్నయ్యా! మమ్మల్ని క్షమించండి” అని ప్రాధేయపడి, విష్ణువర్మను రాజుగా ప్రకటించారు.


నీతి : చెప్పుడు మాటలు విని ఇంకొకరి ఆస్తిని, అధికారాన్ని, కష్టాన్ని దోచుకోవద్దు అత్యాశపడొద్దు.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

పేరు:వలిపే రామ్ చేతన్

తండ్రిపేరు:వలిపే లక్ష్మీ నరసింహ రావు (పురోహితులు)

తల్లిపేరు:వలిపే సత్యనీలిమ (కవయిత్రి, రచయిత్రి)

కలంపేరు:రామ్

6వ,తరగతి

విద్యార్థి

అభిరుచులు:కవితలు,కథలు రాయడం

ఊరు:వనపర్తి

జిల్లా:వనపర్తి


పురస్కారాలు:పద్మకవి,కవనకిరీటి,గాథ సృజన సంయమి,పర్యావరణ మిత్ర ,మాతృసేవా అవార్డు


99 views0 comments

Comentários


bottom of page