top of page

ఆవు అడిగిన ఐదు గంటల వ్యవధి రహస్యం!

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #AvuAdiginaAiduGantalaVyavadhiRahasyam, #ఆవుఅడిగినఐదుగంటలవ్యవధిరహస్యం, #TeluguChildrenStories


Avu Adigina Aidu Gantala Vyavadhi Rahasyam  - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 13/03/2025

ఆవు అడిగిన ఐదు గంటల వ్యవధి రహస్యం - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)


ఓ అడవిలో, సాధు జంతువు అయిన ఆవు గడ్డి మేస్తూ మేస్తూ ... చూసుకోకుండా సింహం ఉండే గుహ వైపుకు పోయింది. తిరిగి దూరంగా వెళ్లి పోవాలి అనుకుంటుండగానే, అప్పుడే గుహ బయిటికి వచ్చిన సింహం కంట్లో పడక నే పడింది.


ఏమి చేయ లేక, దిక్కుతోచని అసహాయ పరిస్థితి లో, గజ గజ వణికిపోతూ ... సింహాన్నే వేడు కుంది "నన్ను వదిలేయి" అని.


సింహం ఒప్పుకోలేదు. "ఇది యుగ ధర్మం. నిన్ను చంపి తినటం నా జాతి ధర్మం", అని సమర్థించుకుంది క్రూరంగా.


"నన్ను తినేస్తే, నా లేగ దూడ అనాథ అయిపోతుంది. దానికి ఈ దుష్ట - నక్క జిత్తుల ప్రపంచంలో రక్షణ లేకుండా పోతుంది. నా కోసం కాదు. ఆ చిన్నారి కోసం నన్ను వదిలేయి మృగరాజా. పిల్లలను చూసుకోవటం తల్లి దండ్రుల ధర్మం కదా. ఆ సృష్టి ధర్మం కోసం నన్ను వదిలెయ్యి ", అంటూ కన్నీరు మున్నీరు అయ్యింది ఆవు.


"దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటారు కదా. ఆ ధర్మం ప్రకారం దేవుడే చూసుకుంటాడు నీ దూడను. నీకా బెంగ అక్కరలేదు", అంటూ మూర్ఖంగా జవాబు ఇచ్చింది సింహం.


"నా లేగ దూడ ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. దానికి పాలు ఇచ్చి తిరిగి వస్తాను. నా తల్లి ధర్మం నెరవేర్చి వస్తాను. నాకు '5 గంటలు' సమయం గడువు ఇవ్వు" అంటూ తిరిగి విన్నవించు కుంది ఆవు, దీనాతి దీన స్వరంలో.


"సరే ఓ పది - ముప్పై (10 -30) నిముషాలలో వచ్చేయి. త్వరగా వెళ్ళు. ఆకలి దంచేస్తోంది", అంటూ కటినంగా గర్జించింది మృగ రాజు సింహం.

--- X X X ---


2)


ఈ సారి గట్టిగా ఏడ్చింది ఆవు. "లేదు లేదు ... నాకు '5 గంటల' సమయం కావాలి", అంటూ దీన స్వరంతో చేతులు జోడించి విజ్ఞప్తి చేసుకుంది.


సింహానికి '5 గంటలు' ఆవు ఎందుకు అడిగింది అర్థం కాలేదు.


"అంత ఎక్కువ సమయం (5 గంటల) ఎందుకు? అడవి నుంచి ఉడాయించటానికి కదూ? ఎంత టక్కరి దానివి. పోనీ లే దూడ కి పాలు ఇచ్చి 10-30 నిముషాల్లో తిరిగి రమ్మని కనికరిస్తే ... నన్నే బోల్తా కొట్టించాలి అని చూస్తావా. చీ, నీలాంటి నీతి లేని ఆవు కు జాలి, దయ చూపించటం నాదే బుద్ధి తక్కువ. అయినా సరే. మాట ఇచ్చాను కాబట్టి ధర్మానికి కట్టు బడి నీకు 10-30 నిముషాలు సమయం ఇస్తున్నాను. వెంటనే వెళ్ళి, నీ లేగ దూడకు పాలిచ్చి తిరిగి రా" అన్నది మృగరాజు

సింహం (కర్కోటకంగా).


ఆవు ఈసారి రెండు చేతులు జోడించి ఇలా బేల గా అన్నది, "మహా రాజా, నేను అడవి నుండి పారిపోను. తిరిగి 5 గంటల్లో వచ్చేస్తాను. నీకు ఆహారం అయిపోతాను. నా లేగ దూడ మీద ప్రమాణం చేస్తున్నాను"


సింహానికి '5 గంటల' ఎక్కువ గడువు ... అంత ఎక్కువ సేపు వ్యవధి ఎందుకో అర్థం కాలేదు. కానీ ఆవు కన్నీరు చూసి జాలి వేసింది. కానీ కుతూహలం పెరిగింది.


"అంత ఎక్కువ సేపు ... 5 గంటల వ్యవధి ఎందుకు అడుగుతున్నావు చెప్పు. జవాబు చెప్తే నిన్ను పూర్తిగా వదిలేస్తాను. నిన్ను చంపను. ఇక తిరిగి రానక్కరలేదు నా వద్దకు", అని అభయం ఇచ్చింది సింహం.


ఈ సారి ఆవు మౌనం వహించింది కన్నీరు కారుస్తూ తల వంచుకుని ఉలుకు పలుకు లేకుండా ... కిందకు నేల మీద చూస్తూ ... చేతులు కట్టుకొని. కానీ జవాబు మాత్రం ఇవ్వలేదు ఎందుకు అంత ఎక్కువ సేపు గడువు?


సింహం ఈ సారి కోపం తో గర్జించింది, అడవి అంతా దద్దరిల్లేలా, " చెప్పు, '5 గంటలు', అంత ఎక్కువ సేపు ఎందుకు?" అని

--- X X X ---


3)


గుహ లోపల నుండి వీరి సంభాషణ వింటున్న సింహం కూన (చిన్న - యువరాజు సింహం) పరుగు పరుగున వచ్చి తన తండ్రి సింహం కాళ్ళ మీద బడి "ఈ ఆవు నీతిని మించిన నీతి వంతమైన ఆవు. కరుణ - నిస్వార్థమైన సేవల చిహ్నం అయిన అమ్మలను మించిన అమ్మ. ధర్మాన్ని కూడా మించిన ధర్మ దేవత. దానిని వదిలేయి".


"లేకుంటే మన జాతి మొత్తం సర్వ నాశనం అయిపోతుంది", అని హెచ్చరించింది తన తండ్రి సింహాన్ని.


ఆవు వైపు తిరిగి కన్నీటి తో ఇలా అన్నది, "ఈ అడవి యువరాజు గా నీకు అభయం ఇస్తున్నాను. నిన్ను చంపము - తినము. మారు మాట్లాడక ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇక తిరిగి రాకు ఈ వైపుకు" అని.


ఆవు "ధన్యవాదాలు యువ రాజా" అంటూ కృతజ్ఞతా భావం తో చిన్న - పసి కూన సింహం కు దండం పెట్టి వెళ్ళిపోయింది.

--- X X X ---


4)


సాధు జంతువు ఆవు వెళ్లి పోగానే, సింహం తన కూన ను (చిన్న సింహం ను) అడిగింది ఇలా, "అంత సమయం (5 గంటల వ్యవధి) ఎందుకు అడిగింది ఆవు. ఏమిటి అందులో దాగి ఉన్న రహస్యం" అని.


కూన సింహం భోరున ఏడ్చింది.


ఇలా చెప్పింది, " 5 గంటలు ఎందుకు అడిగింది అంటే ...."


సింహం కుతూహలం గా "ఎందుకు అంత ఎక్కువ సేపు ...5 గంటల వ్యవధి ... త్వరగా చెప్పు ఆ రహస్యం ..." అంటూ గదమాయించింది.


"తన లేగ దూడకు పాలు ఇచ్చి ఆకలి తీర్చిన తరువాత

... ...

అడవి అంతా తిప్పి ... పచ్చిక మేయటానికి తన లేగ - దూడ ఎటువైపు వెళ్ళాలి... ఎటు వైపు అమాయకంగా వెళ్ళకూడదు ... దానికి చూపించాలి కదా!"


"రేపు ... భవిష్యత్తు లో ... దానికి మన లాంటి క్రూర మృగాల వైపు ... పులులు, సింహాలు, టక్కరి నక్కలు, తోడేళ్ళు ఉండే చోట్లకు ... ఎలా ఏమర్పాటు తో రాకూడదు ... అనే విషయం పై .. అదే, 'స్వయం రక్షణ రహాస్యం' పై శిక్షణ ఇవ్వటానికి"


"అంటే, దాని లేగ దూడ భవిష్యత్తు రక్షణ కొరకు ఆవు అల్లాడుతుంది అమ్మ ప్రేమతో", అని రహస్యం పురి విప్పింది కూన సింహం (అదే చిన్న సింహం - యువ రాజు).

---- X X X -----


5)


సింహం కు మతి పోయినంత పని అయ్యింది ... ఆ ఆవు యొక్క తల్లి లాంటి ధర్మ పరమైన ఆలోచనా తీరుకు. గుండె పగిలి పోయింది మేలుకొలుపు తో అనటం సబబు.


"ఈ నాటి నుండి శాఖాహారులు గా మారి పోతున్నాం మా సింహం కుటుంబం మొత్తం ... రక్తం పీల్చే తత్వం వదిలేస్తున్నాం... కష్టం - నష్టం ఇచ్చే తత్వం, జీవ హింస వదిలేస్తున్నాం ఇప్పటి నుండే".


"అంతే కాదు, పాలించే ప్రభువుల ధర్మంగా ... అందరికీ రక్షణగా ఉంటాం ... వేరే క్రూర జంతువులు కూడా ఇతర జంతువులను వేటాడకుండా - చంపకుండా చూసుకుంటాం ... మంచి నిర్మాణాత్మక పాలన ఇస్తాం ... శాంతి, అభ్యుదయం, ప్రగతి, సౌభాగ్యం, సుఖ సంతోషాల దిశగా ... ఈ క్షణం నుండి" అని గట్టిగా ... అడవి దాద్దరిల్లేలా శపథం చేసింది, ఆ మృగ రాజు సింహం.


"మీక్కావల్సి నట్టు స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ... స్వాతంత్య్ర హక్కు తో ... బ్రతకండి ... ఎవ్వరికీ ఎవ్వరూ కీడు చేసుకోకుండా", అంటూ తిరిగి గర్జించింది సింహం 'మంచితనం నిండిన హృదయంతో '. హృదయ గర్జన చేసింది అనటం సబబు.


అది విన్న అన్ని జంతువులు సంతోష పడ్డాయి. ఆవును కీర్తించాయి "అమ్మల గన్న అమ్మ ... దేవతా అమ్మ సాధు జంతువు ఆవు ... ధర్మ మాత" అంటూ.

------ X X X -----



నీతి:


1) అమ్మ మనస్సు, అమ్మ ప్రేమ 100 శాతం పవిత్రమైనది.


2) తొలి దైవం తల్లి.


3) అమ్మ వేరు. మిగతా ప్రపంచం వేరు.


4) అమ్మ మమతానురాగాలకు తిరుగు లేదు.


5) డబ్బు దురాషకు, డాలర్ వ్యామోహం కు లోనయి తల్లి దండ్రులను విస్మరించకూడదు. రోడ్డుకు - వృద్ధశ్రమాలకు వదిలేయ కూడదు.


6) ఒకరి లాభాల కొరకు ఇతరులకు నష్టం - కష్టం చేకూర్చకూడదు.


7) 1 టు 1 సంతోష పూరిత - ఆనంద పూరిత పరిష్కారాల నిర్వహణ

చేస్తే ...కీచులాటలు, మనస్పర్ధలు లేకుండా ... స్వర్గం లా మారిపోతుంది ప్రతి కుటుంబం, ఇల్లు, కార్యాలయం, దేశం ... మొత్తం ప్రపంచం.


8) మరీ ఎక్కువ తగాదాలు ఉంటే ... పెద్ద వారిని వేరే గది ఇవ్వాలి ... జోక్యం, తగాదాలు, టెన్షన్, బి.పి. లేకుండా.


9) వ్రాత పూర్వకంగా సంభాషణలు సాగిస్తే ... అవీ చిన్న స్నేహ పూరిత వాక్యాలలో ... అప్పుడు మనస్పర్ధలు రావు. ఇష్టం ఉంటే జవాబు ఇస్తారు, లేకుంటే లేదు. తగాదాలు ఉండవు.


10) వృద్ధులకు ఏదో ఒక చిన్న పని కల్పిస్తే మంచిది. ఉదాహరణకు: ఒక చిన్న కొట్టు, ట్యూషన్, తోట పని, పుస్తకాల పఠనం, ఇరుగు పొరుగు తో మాటా మంతి, వేరే వ్యాపకాలు. ... అందరూ ఏదో తగిన పని లో - వ్యాపకం లో బిజీ గా ఉంటే ... సమయం హాయి గా గడచి పోతుంది. తగాదాలకు తావు - సమయం దొరకదు.


11) అలా కూడా మనస్పర్ధలు, కక్షలు, కోప - తాపాలు, జగదాలు ఉంటే ... తరచు కుటుంబం మొత్తం ... Family counselors (కుటుంబ సలహాదారుల) వద్దకు వెళ్ళాలి తరచు. వారు ఏ మాటలు వాడాలి, వాడకూడదు ... ఏ చేతలు చేయాలి, ఏది చేయవద్దు ... ఎలా జోక్యం చేసుకోరాదు ... చెబుతారు ... శిక్షణ ఇస్తారు. అప్పుడు, ప్రతి కుటుంబం - కార్యాలయం - చోటు ... శాంతి ... సుఖ సంతోషాలతో ... మానసిక ప్రశాంతత తో ... మానసిక సంతోషం తో ... మంచి ఆరోగ్యం తో ... వర్ధిల్లుతుంది.

---------X X X ----------


------ కథ - నీతులు:- సమాప్తం -------


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






 
 
 

コメント


bottom of page