top of page
Writer's pictureNallabati Raghavendra Rao

ఔను.. వాళ్ళిద్దరూ అన్యోన్య దంపతులు


'Avunu Valliddaru Anyonya Dampathulu' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao

'ఔను.. వాళ్ళిద్దరూ అన్యోన్య దంపతులు' తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జనార్ధనబాబు, జగదీశ్వరి అన్యోన్య దంపతులు అనడానికి చాలా రిజల్ట్స్ ఉన్నాయి.. వాళ్ళిద్దరూ నంది అంటే నంది పంది అంటే పంది. ఒకరు నంది అంటే ఇంకొకరు నంది కాదు పంది అనరు. ఇద్దరిదీ ఒకటే మాట ఒకటే మాట. అందుకనే వాళ్ళ దాంపత్యపు బంధం లో బోల్డన్ని పాస్ రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి.


ఏతావాతా చెప్పుకోవాల్సింది ఏమిటంటే దేశంలో అందరి దాంపత్యాలు ఈ జంట వలె అమోఘంగా ఉంటే రకరకాల కథలు, కాకర కాయలు, కాకమ్మకథలు, టైం పాస్ కబుర్లు, కాలక్షేప వేరుశనక్కాయ విషయాలు చెప్పుకోవలసిన అవసరమే ఉండదు.


అంతెందుకు ఆనాటి ప్రింట్ పత్రికలు, ఈనాటి సామాజిక మాధ్యమాలు వెబ్సైట్లు, యూట్యూబ్ ఫేస్బుక్, వాట్సప్, బ్లాగులు అవసరమే ఉండదు.


తత్కథా విధానంబు ఎట్టిదనిన..


ఆరోజు అమావాస్య ఆదివారం..


''ఏవండీ! ఓ వారంలో రాబోయే మహిళా దినోత్సవం పండుగకు మన కాలనీలో అందరూ 5000 రూపాయలు చీరలే కట్టుకుంటారంట.


మన కాలనీ స్త్రీలు అందరూ కలిసి 3 రోజులు కార్యక్రమం నిర్వహించడానికి.. ప్రతివాళ్లు 5000 రూపాయలు ఖరీదు కల మూడేసి చీరలు కొనేసుకుంటున్నారట. నాకు 3 చీరలు అవసరం లేదు కానీ కనీసం ఒక్క చీర 5000 రూపాయలది కావాలి. నేను పోగు పెట్టుకున్న డబ్బులు డిబ్బీలో చూస్తే వెయ్యి రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా మరి?''


పుట్టుకతోనే ప్రశ్నార్థకం లాంటి ముఖకవళికలు కలిగిన జగదీశ్వరి మరింత ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి ప్రశ్నించింది భర్త జనార్ధనబాబుని.


''నిజమే నీకు మొత్తం అన్ని కూడా వెయ్యి రూపాయలు చీరలు మాత్రమే ఉన్నాయి. పాపం పెళ్లి అయిన దగ్గర నుండి ఖరీదైన చీరలు కొనలేకపోయాను కదూ. ఎలాగో సర్దుబాటు చేసుకుంటున్నావు. చూద్దాం ఇంకా టైం ఉంది కద'' అంటూ భార్యను బుజ్జగించినట్టు మాట్లాడి అప్పటికి తప్పించుకున్నాడు జనార్ధనబాబు.


మహిళా దినోత్సవం పండుగ దగ్గర కావడంతో.. చూసిచూసి భర్త 5000 రూపాయల చీర కొంటాడు అన్న నమ్మకం బాగా సన్నగిల్లిన మీదట.. ఆలోచించి ఆలోచించి తను కూడా కూసంత సన్నబడిన ఫీలింగ్ వచ్చిన జగదీశ్వరి ఒకానొక శుభ సమయాన.. ఒక మంచి ఆలోచన చేసి ఒకనాటి సాయంత్రం కవరుతో ఒక మంచి పట్టు చీర పట్టుకుని భర్త కూర్చున్న కుర్చీ దగ్గరకు వచ్చి కూర్చుని నెమ్మదిగా ఇలా అంది..


''ఏవండీ ఇదిగో ఐదు వేల రూపాయల చీర.. వినయ దుర్గా క్లాత్ సెంటర్ లో మా ఫ్రెండ్ నాలుగు చీరలు తెప్పించి సెలక్షన్ చేసుకుని ఒక చీర అవసరం లేదని పంపేద్దామనుకొని అనుకుందట. విషయం నాకు తెలిసి నేను వెళ్లి రిక్వెస్ట్ గా అడిగాను. వెయ్యి రూపాయలు ఇస్తాను.. మిగతా నాలుగు వేలు నెమ్మదిగా సరిపెడతాను ఆ చీర నాకు ఇచ్చేయ్.. అని అడిగితే.. పర్వాలేదులే.. అలాగే చెయ్యి.. అని నాకు ఇచ్చేసింది ఈ పట్టుచీర..


అందుకని మీరు కంగారు పడకండి. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాలుగు వేలు నాకు ఇవ్వండి. నేను పట్టుకెళ్ళి మా ఫ్రెండ్ కి ఇస్తాను. సరేనా'' అంటూ నవ్వుతూ తన ముఖం భర్త ముఖానికి బాగా దగ్గరగా పెట్టింది. అతను కూడా భార్యకు మరింత దగ్గరగా మొఖం పెట్టి ఇహిహి అన్నాడు నవ్వు రాకపోయినా. భార్య ముఖం వైపు ప్రేమగా చూసి మరింత ప్రేమించాడు.


''ఇదేదో బాగుంది''.. అనుకుంటూ ఆ నిమిషానికి ఊపిరి పీల్చుకున్నాడు జనార్దన్ బాబు.


***

ఏది ఆగినా ఈ కాలచక్రం తిరగటం మానదు కదా. ఈ చక్రానికి నట్టులు లూజైనా, టైట్ అయినా, నట్టులు అసలు లేకపోయినా తిరగటం మానదు కద. దీనికి ఆయిల్, పెట్రోలు, డీసులు, కిరసనా యులు, వాటర్.. ఏమి పోయినక్కరలేదు.


కాలగమనంలో కాలం.. అలా గడిచిపోతూ ఉండగా జనార్దనబాబు కింద పడి మీద పడి పైన పడి


సీట్లుకట్టో సీట్లు పాడుకొనో.. ఓ రెండు నెలల్లో మొత్తానికి 4000 సంపాదించి భార్యకు అందించాడు


ఒక సాయం సమయంలో.


ఆమె ఉబ్బి బెలూన్ లాగున అయ్యింది. అంతేనా నవ్వుతూ ప్రేమతో తన ముఖం భర్త ముఖానికి బాగా దగ్గరగా పెట్టింది. అతను కూడా భార్యకు మరింత దగ్గరగా మొఖం పెట్టి ఆమెను మరింత ప్రేమిస్తూ ఇహిహి అన్నాడు నవ్వు రాకపోయినా. భార్య ముఖం వైపు ప్రేమగా చూసి మరింత ప్రేమిం చాడు.


ఇహిహిలు, ఇకఇకలు, పకపకలు, గలగలలతో తెల్లవారిపోయింది.


జగదీశ్వరి ఆనందంగా ఉల్లి మిర్చి అల్లం జీలకర్ర వేసిన మూడు స్పెషల్ రోస్ట్ పెసరట్లు, దానికి తోడు మూడు గిన్నెల ముంబాయి రవ్వ ఉప్మ, , , గిన్నెకి తలగొట్టుగా అల్లం పచ్చడి గబగబా తయారు చేసే భర్త ముందు ఉంచింది స్టీల్ ప్లేట్ తో.


అవన్నీ మనుగుడుపు అల్లుడు మాదిరి భోంచేసిన జనార్ధనరావు.. అసలు మనుగుడుపు అంటే ఏమిటో తెలుసుకోవాలని తన మోటార్ సైకిల్ మీద బయలుదేరాడు తనకు బాగా పరిచయం ఉన్న చింతామణి శాస్త్రి గారి ఇంటికి.


అతనిబుర్ర లో ఆలోచన తరంగాలు అప్పుడే తయారు చేసిన ఆవకాయ ముక్కలు తింటున్నట్టు పరిగెడుతున్నాయి.


శాస్త్రి గారు ఏం చెప్తారు.. నా ప్రశ్నకు జవాబు ఎలా ఇస్తారు అంటూ సుదీర్ఘ ఆలోచనతో తను బండి డ్రైవ్ చేస్తూ శాస్త్రిగారి వీధిలోకి బండి టర్నింగ్ తిప్పుతున్నప్పుడు అతనికి డాం అని ఒక పెద్ద సౌండ్ వినపడింది.


విషయం ఏమిటి అని వివరంగా పరీక్షించి చూస్తే జనార్ధన బాబు తన ముందు బండి మీద వెళ్తున్న ముసలి వ్యక్తి బండిని గుద్దేశాడు.


చుట్టూ చేరిన వారందరూ ఏం మొహమాటం లేకుండా.. 'ఈ ముసలాయన తప్పు ఏమాత్రం లేదు''


అనుకోవడం స్పష్టంగా తన కర్ణభేరికి వినబడింది.


రోడ్డుమీద ఆ ముసలాయన పడిపోయాడు, తను పడిపోయాడు.. కానీ అందరూ ఆ ముసలిి ఆయనను మాత్రమే పైకి లేవదయడం తన దగ్గరికి ఒక్కరు కూడా రాకపోవడంతో కేసు ఎంత బలంగా తన మీద బిగుసుకు పోయిoదో అర్థం అయిపోయింది.. జనార్ధన బాబుకి.


ఆ ముసలాయన పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే నూటికి నూరు మంది అతని తరుపున సాక్ష్యం ఇస్తారు.


మూడు సంవత్సరాల జైలు శిక్ష తనకు తప్పదు.


అంతలోనే ఏదో అర్జెంటు విషయం కొంపలు మునిగిపోతున్నట్టు.. జనార్దన్ బాబు పరిగెత్తుకుని పారిపోతున్నట్టు.. '' పోలీసులకు ఫోన్ చేయండి''. అన్నారు ఎవరో వెనకనుండీ.


''పోలీసుల వరకు ఎందుకు రాజీ చేసుకోమనండి. ఆ ముసలాయన దెబ్బలకు.. బండి రిపేరు కు 5000 ఇస్తే సరిగ్గా సరిపోతుంది''.. అన్నారు ఇంకెవరో వెనకనుంచి.


''బాగుంది బాగుంది''. అన్నారు వేరెవరో చుట్టూవైపుల నుండి.


జనార్ధన్ బాబు గుక్కతిప్పుకోలేకపోయాడు.


''సరే.. నా దగ్గర డబ్బు రెడీగా లేదు కానీ 5వేలు ఇస్తాను. అయితే.. సాయంత్రం పట్టుకొచ్చి ఇస్తాను. అంత వరకు నా బండికి తాళం వేసి అదిగో ఆ కిల్లి కొట్టు దగ్గర పెట్టుకోండి. సాయంత్రం లోపున ఇదే సెంటర్ కు వచ్చి డబ్బు ఇచ్చి నా బండి పట్టుకెళ్తాను'' అంటూ నడుచుకుంటూ తన ఇంటి మార్గం పట్టాడు జనార్ధనబాబు.


****


శభాష్ కథ చాలా బాగా నడుస్తుంది ముదిరి పాకాన పడింది.

అనుకుంటే జనం అందరూ పప్పులో కాలు వేసినట్లు కాదు.. ఆ పప్పే పరిగెత్తుకుంటూ వచ్చి జనం కాలు మీద పడినట్టు అన్నమాట.


కథ అడ్డం తిరగ లేదండి బాబు కథ కంచికి చేరడానికి ప్రయత్నం చేస్తుంది. కంచికి చాలా దగ్గరలోకి వచ్చేసింది ట్రైన్ మీద చాలా స్పీడ్ గా వెళ్తుంది.. ఇక కంచికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంది అంతే.


ఏమిటి అనవసరపు గోల అనుకోకండి. కథ అన్యోన్య దంపతులకు సంబంధించింది కదా.. చక్కగా పట్టు చీరల మీద కథ ప్రారంభమై రసపట్టుగా జరుగుతుంది కదా.. మధ్యలో ఈ యాక్సిడెంట్లు


ఏమిటట కచ్చితంగా ఇది కథ పక్కదారి పట్టడం కాకపోతే ఇంకేమిటి అండి.. అంటూ ఎవరు అన డానికి వీలులేని విషయ సంఘటన ఇప్పుడు ప్రారంభం కాబోతుంది.


తత్కథా విధానంబు ఎట్టిదనిన..


నడుచుకుంటూ ఇంటికి వచ్చిన జనార్ధన బాబు ఫేసు చూసిన జగదీశ్వరి.. చూచాయిగా విషయం ఒక 50% కనిపెట్టేసింది.


''ఏవండీ ఏం జరిగింది?అలా ఉన్నారు బండి ఏది? అసలు ఏం జరిగింది?. '' అంటూ అడిగింది గ్లాసుతో మంచినీళ్లు అందిస్తూ.


భార్య జగదీశ్వరిని ఆప్యాయంగా 'జనార్దనీ.. అని పిలుస్తాడు జనార్థన బాబు.


''జనార్ధని.. ఒక రిస్క్ లో పడ్డాను తప్పు నాదే అందుకనే మాట్లాడలేకపోతున్నాను. నా దగ్గర వెయ్యి రూపాయలు ఉంది. కానీ అర్జెంటుగా ఒకచోట 5000 రూపాయలు కట్టాలి. బ్యాంకులో బ్యాలెన్స్ ఏమాత్రం లేదు. పోనీ బంగారాలు కుదువ పెడదాం అంటే నీ దగ్గర అవి కూడా లేవు.. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడిగి చూశాను ఎవరు సహాయ పడటం లేదు. మాయా ప్రపంచం కదా. అదేమిటో జనార్ధని గతంలో నేను సహాయపడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు నాకు సహాయపడటం లేదు. ఏం చేయా లో అర్థం కాక ఆలోచిస్తున్నాను.. '' నీరసంగా కుర్చీలో కూలిపడిపోయాడు జనార్దన బాబు.


''ఓస్ ఇంతేనా ఇంతేనా.. ఈ మాత్రం దానికి ఎందుకలా కంగారుపడి భయపడతారు. ముందు మంచినీళ్లు తాగండి'''' చాలా బలంగా ధైర్యంగా అంది జగదీశ్వరి.


''అదేమిటి అంత ధైర్యంగా చెబుతావు 4000 కావాలంటే ఇప్పుడు ఎలా వస్తాయట''.


''వస్తాయి నేను ఇస్తాను కదా.. ''


''మీ సమస్య ఏమిటి అన్నది విషయం కాదు. మీకు అర్జెంటుగా 4000 ఇస్తే బయటపడతారు. అంతే కద.. ''


''అవును నీ దగ్గర అంత డబ్బు ఎలా ఉంటుంది. మీ అమ్మగారికి ఫోన్ చేసి ఫోన్ పే తెప్పిస్తావా అది నాకు ఇష్టం లేదు. ''


''అదేం కాదు మీరు కంగారు పడకండి. మీరు నాకు చీర కొనుక్కోవడానికి 4000 ఇచ్చారు కదా. '''


''అవును అవి మీ ఫ్రెండ్ కు ఇచ్చేసావు కదా. ''


''ఇవ్వలేదు ఆ డబ్బులు నా దగ్గరే ఉన్నాయి ఎందుకంటే నేను అప్పుడే ఆలోచించాను. ఆడంబరానికి పోయి 5, 000 చీరలు ఎందుకు అని ఆ చీర ఆవిడకి ఇచ్చేసాను. అదే రంగు అదే మోడల్లో వెయ్యి రూపాయలు చీర దొరికింది. అది కొని కట్టుకున్నాను కనుక మీరు గుర్తించలేకపోయారు.


మీరు 4000 ఇచ్చి మా ఫ్రెండ్ కు అప్పు తీర్చేయమని చెప్పినప్పుడైనా అసలు విషయం చెబుదాం అనుకున్నాను. కానీ ఎందుకు చెప్పకుండా ఆ డబ్బులు నా దగ్గరే దాచానో తెలుసా.. ఇదిగో ఇలాంటిది కాకపోయినా ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు.. సడన్ గా నా దగ్గర ఉన్న ఆ నాలుగు వేల రూపాయలు డబ్బులు మీకు ఇచ్చి మిమ్మల్ని ఆనంద పరచుదామని మాత్రమే. నేను మిమ్మల్ని మోసం చేయాలని మాయ చేయాలని డబ్బులు దాచి ఉంచలేదండి నిజం. ''


పూర్తిగా చెప్పి పక్కనున్న డిబ్బి తెచ్చి భర్తకు డబ్బులు అందించింది.. జగదీశ్వరి.


''నువ్వు తప్పుగా నడుస్తున్నావని తప్పు చేస్తావని నేను ఎందుకు అనుకుంటాను.. 5000 రూపాయలు చీర కొనుక్కోకుండా నీ ఆనందం చంపుకున్నావు. ఇంతకన్నా త్యాగం ఇంకేం ఉంటుంది జనార్ధని.


భగవంతుడు నిన్ను నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం తప్పించి నేనేమీ చేయలేను. ''


అంటూ భార్య దగ్గర ఆ డబ్బులు తీసుకుని ఆనందంగా జేబులో పెట్టుకున్నాడు జనార్ధనబాబు.


''ఏవండీ మన పెళ్లికి ముందు మా నాన్నగారు మన ఇద్దరి జాతకాలు చూపించారు. ఆ సిద్ధాంతి గారు ఆయన ఏం చెప్పారో తెలుసా నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను.. మన ఇద్దరిదీ అన్యోన్యదాంపత్యమని అన్యో న్యంగా జీవితంలో కష్టసుఖాలను పంచుకుంటామని ఆయన చెప్పారు.. అంతే కాదండి పెళ్లిలో వేదమంత్రాలు మనకు అర్థం కాకపోయినా చెప్పాము కదా. అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ


పంతులుగారు చెప్పిన మంత్రాలన్నీ అన్నాం కదా.. అది అర్థం కానక్కర్లేదండి.. మన భారతీయ సంస్కృతిలోని ఆ వివాహ ఘట్టం.. మనకి కొత్త జీవితాన్ని ప్రసాదించే సమయం అది.. ఆ మహో న్నతని నిలబెట్టుకుంటూ మనం కాపరి చేయాలి కదా. ఆ రహదారిలో నేను నడుస్తున్నాను కానీ అంతకన్నా నేనే త్యాగం చేయలేదు. ''


అంటూ నవ్వుతూ తన ముఖం భర్త ముఖానికి బాగా దగ్గరగా పెట్టింది జగదీశ్వరి. అతను కూడా భార్యకు మరింత దగ్గరగా మొఖం పెట్టి ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. భార్య ముఖం వైపు ప్రేమగా చూసి మరింత ప్రేమించాడు.


( ఇది తూర్పుగోదావరి జిల్లాలో నాకు తెలిసిన కుటుంబంలో ఈ మధ్య జరిగిన ఒక యదార్థ సంఘ టనకు అక్షర రూపం. భార్య భర్తల ప్రవర్తన ఇలా ఉంటే మన భారతావని కలియుగ వైకుంఠం అవుతుంది.. ప్రయత్నించండి.. ప్రయత్నిద్దాం.. ప్రయత్నించమని చెబుదాం. )


కథా రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు.

*****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు




123 views0 comments

Comments


bottom of page