top of page

అవ్వ ఔదార్యం

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #AvvaAudaryam, #అవ్వఔదార్యం, #TeluguStories, #తెలుగుకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


'Avva Audaryam' - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 03/11/2024

'అవ్వ ఔదార్యం' తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


 సాయిబాబా మందిర మానేజింగ్ ట్రస్టీ రామచంద్రరావు గారికి గుండెపోటు వచ్చిందని అందరూ ఆందోళన పడుతు వారిని అడ్మిట్ చేసిన కార్పోరేట్ హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు. 


 కాలనీలో బాబా గుడికి స్థలం కేటాయించి తమ స్వంత డబ్బుతో మందిర నిర్మాణం పూర్తి చేయించి వచ్చే భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించడమే కాకుండా దాతల సాయంతో అన్నదానం చేయిస్తు ఎందరో పేదలకు కడుపు నింపుతున్నారు. 


 అటువంటి ధర్మదాత అన్నదాత రామచంద్రరావు గారు అనారోగ్యం పాలయేరంటె బాబా గుడి వద్ద పువ్వులు కొబ్బరికాయలు అమ్ముకునే దుర్గమ్మ మనసు తల్లడిల్లింది. 

 

 తనకు బ్రతుకు తెరువు చూపిన దేవుడు రామచంద్రరావు గారు గుండెనొప్పితో ప్రాణాపాయంలో ఉన్నారని తెలిసి ఆయన ఆరోగ్యం బాగై మామూలు మనిషి కావాలని ఉపవాస దీక్ష ప్రారంభించి

తను పొదుపు చేసి దాచిన డబ్బుతో బాబా గారికి వెండి పాదుకలు చేయిస్తానని మొక్కుకుంది. 


 రెండు రోజుల తర్వాత అన్ని పరీక్షలు జరిపి రామచంద్రరావు గారికి గుండె ఆపరేషన్ జరపగా ప్రాణాపాయం నుంచి కోలుకున్నారు. 


 విషయం తెల్సి దుర్గమ్మ ఆనందపడింది. సాయిబాబాయే బాబుగారిని కాపాడినాడని సంతోషించి ఉపవాస దీక్ష విరమించి బాబా ప్రసాదం, విభూతి తీసుకెళ్లి పెట్టింది. ఆమె మంచి మనసుకు రామచంద్రరావు గారు ఎంతో ప్రభావితమయారు. ఈ సంవత్సరం ఘనంగా బాబా గారి

వార్షికోత్సవం జరపాలని నిర్ణయించారు మానేజ్మెంటు. 


 ఈసారి సాయిబాబా స్థాపన పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గుడి ప్రాంగణం రంగురంగుల దీపాలతో అలంకరించి దేదీప్యమానంగా కనబడుతోంది గుడికి విరాళాలు వస్తుదానం చేసిన దాతల సన్మానానికి వేదిక ఏర్పాట్లు జరిగాయి. 


 సాయంకాలం మందిర ట్రస్టీ గారి చేతుల మీదుగా సత్కారం చెయ్యడానికి నిర్వాహకులు ఏర్పాటు చేసారు. 


 సాయంకాలమైంది. వేదిక మీద అతిథుల స్వాగతానికి సన్నద్ధమయారు.. కార్లు వరుసగా గుడి ప్రాంగణానికి చేరుకుంటున్నాయి. 


 ముందుగా మానేజింగ్ ట్రస్టీ రామచంద్రరావు గారిని తర్వాత ప్రముఖ వ్యాపారవేత్తలు  మిగతా అతిథుల్ని ఆలయ నిర్వాహకులు పూల దండలు బుకేలతో స్వాగతం పలికి కుర్చీలలో ఆశీనుల్ని చేసారు. 


 మేనేజ్ మెంజ్ చైర్మెన్ సంవత్సర పురోభివృద్ధి నిర్వహణ దాతల సహకారం  ప్రశంసిస్తు నివేదిక సమర్పించారు. 


 పేరు పేరున దాతలను వేదిక మీదకు పిలిచి శాలువ కప్పి సన్మానిస్తున్నారు. 


 కార్యక్రమం చివర్న గుడి ప్రాంగణంలో పవ్వులు కొబ్బరికాయలు అమ్ముతు బాబా గారి పాదాలకు వెండి పాదుకలు విరాళ మిచ్చిన దుర్గమ్మ వంతు వచ్చింది. చేతి కర్ర సాయంతో మెల్లిగా అడుగులేస్తు ముసలి అవ్వ వేదిక మీదకు వచ్చింది. 


 రామచంద్రరావు గారు ఆమె సేవాభావాన్ని ప్రశంసించి శాలువ కప్పి సాయిబాబా ప్రతిమను చేతిలో పెట్టారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. ప్రసార మాద్యమాల విలేకర్లు ఫోటోగ్రాఫర్లు అవ్వ ఇంటర్వ్యూ తీసుకున్నారు. 


 అవ్వ ఇంటర్వ్యూలో తన గతం చెబుతు " పేరు దుర్గమ్మనీ, రిక్షా తొక్కే భర్త తాగుడుతో చనిపోతే ఇళ్లలో పాచి పనులు చేసుకుంటు కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపితే, ఫేక్టరీలో పని చేసే కొడుకు పెళ్లి చేసుకుని ఒంటరిదాన్ని  చేసి వెళిపోతే బతుకు మీద విసుగు కలిగి ఎలకలమందు మింగితే దేవుడిలా అయ్యగారు హాస్పిటల్లో చేర్పించి ప్రాణం పోసి బాబాగుడి వద్ద పువ్వులు కొబ్బరికాయలు అమ్ముకునేల బతుకుతెరువు చూపారని కంటనీరు పెట్టుకుంది. రోజూ ఏపారంలో వచ్చిన డబ్బుల్లోంచి బాబా వాటా డబ్బు వేరుపెట్టి ప్రతి సంవత్సరం తన వంతు విరాళంగా ఏదో వస్తువు ఇస్తుంటానని, ఈసారి అయ్యగారి ప్రాణాలు కాపాడిన బాబా గారికి నావంతుగా వెండి

పాదాలు చేయించాననీ " ముగించింది అవ్వ దుర్గమ్మ. 


 మర్నాడు వార్తా పత్రికలన్నీ దుర్గమ్మ ఫోటోతో ఆమె ఔదార్యాన్ని ప్రశంసిస్తు  'మందిరంలో మాణిక్యం' అని గొప్పగా వ్రాసాయి. 


 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


38 views0 comments

Commentaires


bottom of page