top of page

బాధ్యత


'Badhyatha' New Telugu Story

Written By Hanumantha T



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“గుడ్ మార్నింగ్ వదినా” అంది రాధ.


“హాయ్ రాధా! ఏమిటి ఈ మద్యన నువ్వు వాకింగ్ రావడం లేదు, ఏమైనా సమస్యనా?” అడిగింది సుధ.


“ఏమని చెబుతానులే వదినా! స్కూల్ కి పిల్లలను రెడీ చేయాలి. తర్వాత టిఫిన్లు, మావయ్య గారికి ట్యాబ్లెట్లు, సౌకర్యాలు..ఇవన్నీ చేసేటప్పటికే పూర్తిగా అలసిపోతాను. ఇంకెక్కడి వాకింగ్ వదినా!” తన బాధ చెప్పుకుంది రాధ.


“మరి మీ ఆయన సాయం తీసుకోకూడదా రాధా” అంది సుధ.


“ఆయన పొద్దున 7 గంటలకు పోయినోడు రాత్రి 8 గంటలైనా ఇంటికి రాడు. పైగా హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ కూడా వచ్చింది” చెప్పింది రాధ.


“సరే రాధా! ఈ రోజైనా నాతో పాటు వాకింగ్ వచ్చావు. సంతోషం”.


“నిన్నటి నుండి పని మనిషి పనిలో చేరింది, ఇక అన్నీ ఆమే చూసుకుంటుంది. చాలా విసిగిపోయాను వదినా.. ఇటు పిల్లలు, అటు ఇంటిపనులు, పోటి పరీక్షలకు చదువు కొందామన్నా సమయమే దొరికేది కాదు. అన్నట్లు అక్కడ బెంచ్ పైన కూర్చొన్నది నిర్మల కదా!” అంది రాధ.


““అవును రాధా. తను కూడా డైలీ వస్తుంది పార్క్ కి. కానీ తొందరగా వెళ్తుంది. ఎందుకో నాక్కూడా తెలీదు” అంది సుధ.


“తను భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది వదిన, ఆమె భర్త R.M.P doctor. బాగా సంపాదిస్తారు ఇద్దరూ” చెప్పింది రాధ.


“అవునా! కానీ నా ఫ్రెండ్ రాజు ఇంటికి పని చేయడానికి వెళ్తుంది అని విన్నానే” అంది సుధ.


“ఏమో.. ఏ పుట్టలో ఏ పాముందో.. ఎందుకోసం వెళ్తుందో.. ఎవరికి తెలుసూ…” అంది రాధ.


“ఈ రోజుకి ఇక చాలు. ఇంటికి వెళ్దాము పద, అలాగే నిర్మల గురించి కూడా ఆరా తీస్తాను రాధ”.

**


“ఏమిటి వదినా అంత దిగులుగా ఉన్నావు?” అడిగింది రాధ.


“అవును రాధ, నిర్మల విషయం అడుగుదామని రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతను చెబుతున్నపుడు నా కళ్ళ వెంట నీళ్లు ఆగలేదు. కరోనా సమయంలో నిర్మల భర్తకు కరోనా సోకిందంట. హాస్పిటల్ ఖర్చులకే డబ్బులన్నీ అయిపోయాయంట. పైగా స్కూల్స్ కూడా సెలవులు ఇవ్వడంతో జీతాలు పడక నిర్మల చాలా ఇబ్బంది పడిందట. పిల్లల బాగోగులు, అత్తామావల మందు బిళ్లలు కూడా కొనలేని పరిస్థితిలో తన బంధువులను సాయ మడిగితే ఎవరూ ముందుకు రాలేదట.


నిర్మల భర్త ఆరోగ్యం విషమంగా తయారయినపడు వెంటిలేటర్ పై చికిత్స చేయాలన్నపుడు నిర్మల చేతిలో సరిపడా డబ్బులేదంట. అక్కడ డాక్టర్ గా పనిచేస్తున్న రాజు హాస్పిటల్ ఖర్చులన్నీ తానే భరించాడట. ఎందుకంటే రాజు కూతురు, నిర్మల పనిచేస్తున్న స్కూల్ లోనేనట చదివేది,. అలా పరిచయమయ్యారు. ఎంత ప్రయత్నించినా నిర్మల భర్త కరోనా వ్యాధి నుండి బయటపడలేదంట”.చెబుతూ బాధ పడింది సుధ.


“ఆమె ఎంత భాద అనుభవించిందో కదా వదినా! భర్త చనిపోవడంతో ఒంటరైన మహిళ.. పైగా అత్తామామల బాగోగులు తనే చూసుకోవాలి.. తలచుకొంటుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటిది ఎలా భరించిందో ఆవిడ” అంది రాధ.


“ఆప్పడి నుండే ఆమె రాజు వాళ్ళ ఇంట్లో పనికి జాయిన్ అయిందట. ఇప్పుడిప్పుడే స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతుండడంతో కుటుంబ పోషణకు ఇటు ఉద్యోగము అటు పనిమనిషిగా పని చేస్తుందట” చెప్పింది సుధ.


“ ఈవిడతో పోల్చుకుంటే మన కష్టమెంత వదినా. ఇకమీదట ఎవరి గురించైనా తొందరపడి తప్పుగా అనుకోకూడదు. సరే రేపు కలుద్దాం బాయ్ వదినా..” అంది రాధ.

సమాప్తం


T హనుమంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: పేరు: హనుమంత

జిల్లా: అనంతపురము

డిగ్రీ 3వ సంవత్సరం



Comentarios


bottom of page