#BailadilaSanghineeNala, #బైలాడిలాసంఘిణీనాలా, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు
Bailadila Sanghinee Nala - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 18/01/2025
బైలాడిలా - సంఘిణీ నాలా - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
ఛత్తీస్‍ఘడ్ రాష్ట్రంలో ఐరన్ ఓర్ వున్న పర్వతాల ప్రాంతం బైలాడిలా. దానికి మరోపేరు బిచేలి.
బైలాడిలాా నుండి ఐరన్ ఓర్ జపానుకు ఎగుమతి 80%, 20% విశాఖ స్టీల్ ప్లాంటుకు సప్లై జరిగే రోజులవి. విశాఖ పట్నం నుండి ఉదయం ఏడున్నరకు బయలుదేరే పాసింజర్ ట్రైన్ బైలాడిలా రైల్వేస్టేషన్‍కు రాత్రి పదకొండు గంటలకు చేరుతుంది. దూరం 360 కి. మీ. మధ్యలో ఎక్కడా టిఫిన్, భోజనం దొరికే స్టేషన్ ఉండదు. అన్నీ చిన్న చిన్న స్టేషన్‍లే. మార్గంలో వున్న అరకులోయ ప్రాంతంలో రైలు ట్రాక్ ఎత్తు 935 కి. మీ.. ఒరిస్సాలో ట్రైన్ దాదాపు పదిగంటలసేపు పయనిస్తుంది. మధ్యలో నక్సల్స్ చైను లాగి దిగుతుంటారు. ఎక్కుతుంటారు. బైలాడిలా స్టేషన్ తరువాత కిరండోల్. అదే ఆ రైలు మార్గంలో చివరి స్టేషన్. N. M. D. C సంస్థ అధికారాంగం బెలాడీల కిరండోల్‍లో వుండి ఆ ఐరన్ ఓర్ కొండల త్రవ్వకాలను ఓర్ ఎగుమతి రైలు (గూడ్స్) ద్వారా నిర్వర్తిస్తుంటారు. చూడడానికి కడు రమణీయమైన పర్వత ప్రాంతం. కనులకు కడు మనోహరం.
హైదరాబాదులో NMOC ప్రధాన కార్యాలయం ఉంది. అక్కడి నుండి ఇమ్‍లీ బస్టాండులో స్టార్ట్ అయిన బస్సు బైలాడిలా మీదుగా కిరండోల్‍కు రాత్రి ఆరుగంటలకు చేరి మరుదినం ఉదయం ఏడున్నరకు బయలుదేరి భద్రాచలం మీదుగా హైదరాబాద్‍కు సాయంత్రానికి చేరుకొంటుంది. దూరం 485కి. మీ. నేను ఒక సివిల్ ఇంజనీర్. మా ఆర్గనైజేషన్‍కు బైలాడిలాలో ఒక వాటర్ ట్రీట్‍మెంట్ ప్లాంట్ నిర్మాణానికి ఆర్డర్ లభించింది. మా ఆర్గనైజేషన్‍లో ఆ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను మరో ఇంజనీరుకు తొలుత అప్పగించారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేయవలసిన కాలం ఒక్క సంవత్సరం.
ఇంజనీర్లు పోతున్నారు, వస్తున్నారు, కానీ తొమ్మిది నెలలకు 10% పని కూడా కాలేదు.
ఆ కారణంగా ప్రాజెక్టు రివ్యూ మీటింగులో మా ఎం. డిగారు ఆ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను నాకు అప్పగించారు. నేను సరే అని ఆఫీసులో మరో ఇంజనీరు వర్గం వద్ద వున్న ఫైల్స్ ను నేను హ్యాండోవర్ చేసుకున్నాను. ప్రాజెక్టును గురించి స్టడీ చేశాను. బైలాడిలాలో ప్రాజెక్టు వర్క్ నిర్వహణకు మా కంపెనీ ఇరువురు ఇంజనీర్లను వుంచింది.
ఆ ప్రాంతంలో కాంట్రాక్టర్‍గా గొప్ప పేరున్న పాపాచాన్ - కేరళ వాసి. వర్కును సబ్ కాంట్రాక్టరుకు వారికి ఇవ్వడం జరిగింది. NMOC ఆ ప్రాజెక్టును అక్కడ ప్రారంభించిన సమయంలో ఒక వైజాగ్ కాంట్రాక్టర్ గారు ఆ వర్కులో కొంత భాగం తీసికొన్నారు. ఆ కార్యాన్ని నిర్వర్తించాలంటే లేబర్‍తో అసాధ్యం. హెవీ ఎర్త్ మూల్వింగ్ మిషన్ అవసరం. ఆ కాంట్రాక్టర్ గారు పని నిరభ్యంతరంగా సకాలంలో సాగేదానికి కావలసిన ఆధునిక యంత్రాలు, టిప్పర్, డోజర్స్, లారీలు, జెసిబీలను కనుగోలు చేసి పని ప్రారంభించారు.
ప్రియ సోదరులు పాపాచాన్ బ్రతుకు తెరువు కోసం ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ కాంట్రాక్టర్ గారి దగ్గర వంట మనిషిగా చేరారు.
పది సంవత్సరాలు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఆ కాంట్రాక్టర్ సంపాదించింది చాలనుకొని యంత్రాలన్నింటినీ, తన క్రింద పనిచేసిన పిటీ కాంట్రాక్టర్స్ కు, వారి భావి జీవితం బాగుండి, వారంతా వృద్ధిలోనికి రావాలని తక్కువ వెలకు వారికి విక్రయించి, తన గుడారాన్ని క్లోజ్ చేసి వారు విశాఖపట్నం చేరారు.
ఆ సందర్భంలో పది సంవత్సరాలు ఎంతో విశ్వాసంగా తనకు తన వారందరికీ వంట వండి వేళవేళకు కడుపు నింపిన పాపాచాన్‍కు, వారు ఒక టిప్పర్‍ను ఫ్రీగా ఇచ్చారు.
మంచి మనస్సుకు మంచి రోజు అనే పెద్దల వాక్కు పాపాచాన్ గారి విషయంలో ఫలించింది. సహాయానికి తన బంధువులను కేరళ నుండి పిలిపించుకొని టిప్పర్ నడుపుతూ ఒక వెల్డింగ్ ప్యాబ్రికేషన్ షాపును ప్రారంభించారు. దశ తిరిగింది. ఐదు సంవత్సరాలు గడిచాయి. తనకు అవసరమైన మేరకు మనుషులను కేరళ నుండి పిలిపించుకొన్నాడు. పది సంవత్సరాలలో ఆ కొండ ప్రాంతంలో నెంబర్ వన్ కాంట్రాక్టర్‍గా మారిపోయారు పాపాచాన్ గారు.
వారికి మా కంపెనీ మా వాటర్ ట్రీట్‍మెంటు ప్లాంట్ నిర్మాణాన్ని సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది.
వారు కొన్ని ముఖ్యమైన ప్లాంట్ యూనిట్స్ మిస్కవేషన్ అంతా కొండపై రాయిని (గ్రానెట్) యంత్రాలతో త్రవ్వి ముగించారు. వారు చేసిన పని విలువ ఎనిమిది లక్షలు.
మాకు NMOC నుండి పేపెంట్ వచ్చేదానికి బిల్లింగ్ బ్రేకప్ షెడ్యూల్‍ను, అనగా ప్రతి కట్టడమూ వ్యాఖ్యాను దశల వారిగా వారు మాకు ప్రతి నెలా పేజేసేలా ఒక స్టేటుమెంటును, పని ప్రారంభానికి ముందే తయారు చేసి NMOC అధికారుల అప్రూవల్‍ను తీసుకొన్నారు. దాన్ని యూనిట్ వైజ్ పేమెంటు బ్రేకప్ షెడ్యూల్ అంటాము. ఒక్కొక్క సివిల్ యూనిట్ మొత్తం విలువను ఐదారు భాగాలుగా పని పూర్తి చేయవలసిన క్రమాన్ని, వ్యాల్యూను విభజిస్తాము. పాపాచాన్‍గారు కొన్ని యూనిట్స్ యాక్స్ వేషన్ కంప్లిట్ చేసి ఎనిమిది లక్షలకు వారు మావారికి వారి బిల్లును సబ్మిట్ చేశారు. వారు కంప్లీట్ చేసిన యాక్సవేషన్‍కు మాకు NMOC నుండి పేమెంట్ వచ్చేరీతిగా మా బిల్లింగ్ షెడ్యూల్ లేవు కనుక చేసిన యాక్సవేషన్‍కు మాకు NMOC పేమెంటు ఇవ్వలేదు. తన బిల్ వాల్యూ అధికం కాబట్టి పాపాచాన్ గారు, మేము పేమెంట్ వారు సబ్మిట్ చేసిన బిల్లు పేపెంటు చేయనందువలన వారు పనిని నిలిపివేశారు.
మాకు NMOC నుండి పని ఆగిపోయిందని లెటర్ వచ్చింది. మా ఎం. డి గారు మీటింగ్ కండక్టు చేశారు. ప్రాజెక్టును నాకు ట్రాన్స్ ఫర్ చేశారు.
ఫైల్స్ లో పూర్వాపరాలను చూచి నోట్ చేసుకొని, నేను బెలాడీలకు బయలుదేరాను. చెన్నై టు విజయవాడ రైలు, విజయవాడ టు భద్రాచలం బస్సు ప్రయాణం. పన్నెండున్నరకు భద్రాచలం చేరాను. బైలాడిలాలో వున్న మా ఇంజనీర్ గణేష్ మా జీప్‍లో డ్రైవర్ మున్నాతో వచ్చాడు. భద్రాచల శ్రీరామ సీతామాతలను దర్శించి, భోజనం చేసి, జీప్‍లో బైలాడిలాకు బయలుదేరాను. భద్రాచలం నుండి బచేలీ 270 కిలోమీటర్లు. నాకు హిందీ మన మాతృభాష తెలుగు వలే హిందీ కూడా వచ్చు. గణేష్ మున్నా హిందీవారు, మార్గం పదిహేను అడుగుల వెడల్పు గల గ్రావెల్ రోడ్డు, గుంటలు మిట్టపల్లాలు. అలాంటి రోడ్డును నేను అంతవరకు చూడలేదు.
"భాయ్!.. రోడ్ క్యారే ఐసాహై!.. (రోడ్డు ఏందిరా ఇలా వుంది)" గణేష్‍ను అడిగాను.
"సాబ్!.. ఏ రోడ్ ఆంధ్ర ఛత్తీస్‍ఘడ్ బార్డర్ రోడ్డు. రెండు రాష్ట్రాల గవర్నమెంట్స్ దీన్ని గురించి పట్టించుకోరు. మరో విషయం మనం పోతున్న ఏరియా అడవి, నక్సల్స్ ఏరియా. దైవం మీద భారం వేసి ముందుకు పోవాలి" హిందీలో గణేష్ చెప్పాడు.
నాకు ఆశ్చర్యం వేసింది పెదాలపై నవ్వు..
"రేయ్ గణేష్!.. నీవు భయపడుతున్నావా!.. " హిందీలో అడిగాను.
"నై సాబ్!.. " అన్నాడు గణేష్.
"ఓకే.. డరోమత్ (ఓకే భయపడకు) సబ్‍కుచ్ గుజరేగా ఈశ్వర్ కా ఇచ్చేసే. ఓ జాన్‍తాహై, కిస్‍కిస్‍కు క్యాదేనాహ్తె. సబ్ కుచ్ గుజరేగా వున్‍కా మర్జీసే బాబూ!.. " చిరునవ్వుతో చెప్పాను (సర్వం జరిగేది ఈశ్వర సంకల్పంతో, ఎవరెవరికి ఏం ఇవ్వాలి, అన్ని సంఘటనలూ వారి అభీష్ట ప్రకారమే జరుగుతాయి)
NMOC ఆఫీసర్‍ల గురించి, పాపాచాన్ గారిని గురించి మాట్లాడుకొంటూ, మేము రాత్రి పదకొండున్నరకు బెలాడీల చేరాము. మార్గమధ్యలోనే రోటి దాల్ తిన్నాము. నాకు గణేష్ లాడ్జిలో రూం బుక్ చేసి వచ్చాడు. జీప్ లాడ్జి ముందు ఆగింది. దిగాను. రూములో ప్రవేశించి డ్రస్ మార్చుకొని మంచంపై వాలిపోయాను. అలసివున్నందువల్ల, నిద్ర బాగా పట్టింది. ఉదయం ఆరుగంటలకు లేచి, కాలకృత్యాదులు ముగించుకొని ఏడుగంటలకు రెడీ అయినాను. గణేష్ వచ్చాడు.
"సార్! ప్రోగ్రామ్ క్యాహై!.. " గుడ్ మార్నింగు చెప్పి అడిగాడు.
"ఫస్ట్ నేను మిస్టర్ పాపాచాన్ గారిని కలవాలి. " హిందీలో చెప్పాను.
హోటల్‍లో టిఫిన్ చేసి పాపాచాన్ గారిని కలవడానికి, వారు నిర్మిస్తున్న క్వార్డర్స్ దగ్గరకు వెళ్ళాము. గణేష్ నన్ను వారికి పరిచయం చేశాడు. నేను వారికి నమస్కరించాను.
హిందీలో నేను వారికి వచ్చిన విషయాన్ని గురించి చెప్పాను. మూడు గంటలకు వారి ఆఫీసు వద్దకు రమ్మన్నారు. ’సరే’ అన్నాను. తరువాత నేరుగా హిల్‍టాప్, ఎక్కడ వాటర్ టిమెస్‍ట్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందో అక్కడికి వెళ్ళాము. అప్పుడు సమయం పదిగంటలు. సైట్ అంతా తిరిగి చూచాను.
తర్వాత పదకొండున్నరకు NMOC ఆఫీస్ ప్రాంగణంలో ప్రవేశించి మా ప్లాంట్‍ను చూచే ఆఫీసర్స్ నందరిని చూచి పరిచయం చేసుకొన్నారు.
"పని మూడు నెలలుగా ఆగిపోయింది. మీరు పాపాచాన్ గారికి పేపెంట్ ఇవ్వలేదట!.. " వారు అడిగారు.
"ఏం గణేష్!.. " అడిగారు ఆ ఆఫీసర్ గణేష్‍ను.
అవునని నిజాన్ని ఒప్పుకొన్నాను. తర్వాత..
"సార్!.. వున్న ప్రాబ్లమ్‍ను సాల్వ్ చేయడానికే నేను వచ్చాను. మిస్టర్ పాపాచాన్ గారితో మాట్లాడి త్వరలో వర్క్ జరిగేలా చేస్తాను సార్!.. " భవ్యంగా చెప్పాను.
వారు నా మాటలను నమ్మారు. గౌరవంగా మాట్లాడారు. నాకు మనస్సున ఆనందం.
హోటల్‍కు వెళ్ళి భోంచేసి, రూముకు వెళ్ళి ఒక గంట విశ్రాంతి తీసుకొన్నాను. తన ఇంట్లో భోంచేసి గణేష్ రెండు గంటలకు నా గదికి వచ్చాడు. రెండున్నరకు పాపాచాన్ సైట్ ఆఫీస్‍కు బయలుదేరాము. రెండు ముక్కాలుకు వారి ఆఫీసుకు చేరాము. అప్పటికి పాపాచాన్ గారు ఆఫీసుకు రాలేదు. కొంతసేపు వారి నిర్మిస్తున్న క్వార్టర్స్ ను చూచి, ఆఫీస్‍ను సమీపించాము.
కరెక్ట్ గా పాపాచాన్‍గారు మూడుగంటలకు కార్లో వచ్చి దిగారు. ఆఫీసులో ప్రవేశించారు.
గణేష్ వెళ్ళి వారికి నేను వచ్చిన విషయాన్ని తెలిపారు. వారు నన్ను లోనికి వెళ్ళ అనుమతించారు.
గణేష్ ముందు వెనుక నేను వారి గదిలో ప్రవేశించాము.
*
"నమస్తే మిస్టర్ పాపాచాన్ సార్!" చిరునవ్వుతో చేతులు జోడించారు.
వారు నన్ను చూచి కుర్చీనుండి లేచి..
"నమస్తే సార్!.. బైటియే (కూర్చోండి)" అన్నారు.
"సార్! మీరు పని తిరిగి ప్రారంభించాలి సార్!.. " వినయంగా కోరాను.
"చేస్తాను. నాకు ఇవ్వవలసిన ఎనిమిది లక్షలు ఇచ్చిన మరుదినం" పాపాచాన్ గారి జవాబు.
"మీరు అలా చెప్పడంలో తప్పులేదు సార్!.. కానీ.. " నేను పూర్తి చేయకముందే..
"ఏమిటి కానీ!.. " (హిందీలో) అడిగారు పాపాచాన్ గారు.
"మేము అంత మొత్తం, మాకు MNOC నుండి పేపెంట్ రానందున ఒకసారిగా ఇవ్వలేము సార్!" అనునయంగా చెప్పాను.
"ఎంత ఇస్తారు?" (హిందీలో) వారి ప్రశ్న.
"ఐదు లక్షలు!" నా జవాబు.
"ఎప్పుడు ఇస్తారు?" వారి ప్రశ్న.
"వారం రోజుల్లో!" చెప్పాను.
"మంచిది సార్!.. మీరు ఐదు లక్షలు ఇవ్వండి. నేను పని ప్రారంభిస్తా. "
"పనిని మీరు నేను చెప్పినట్లుగా ప్రారంభించండి. పదిహేను రోజుల్లో మా బిల్లింగ్ షెడ్యూల్‍కు తగినట్లు, గణేష్ చెప్పిన పనులను పూర్తి చేయండి. మా మొదటి బిల్లులో మీకు ఒకటిన్నర లక్షను, రెండవ బిల్లులో బ్యాలెన్స్ ఒకటిన్నర లక్షను ఇస్తాను. ఈనా మాటకు ఎలాంటి మార్పు ఉండదు. ఇకపై ఈ ప్రాజెక్టు వర్కును పూర్తి అయ్యేవరకూ చూడబోయేది నేనే. నేను NMOC ఆఫీసులో మీ గురించి చాలా గొప్పగా విన్నాను. కలిసి పనిచేద్దాం. నన్ను మీ సోదరుడిగా భావించండి. మాటను తప్పను పాపాచాన్ భాయి సాబ్!" చిరునవ్వుతో చెప్పి నేను కుర్చీనుండి లేచాను.
"భైటియే.. బైటీయే!.. చాయ్ పిఏంగే! రేయ్ తీన్ కప్ చాయ్ లావ్!.. " ద్వారంవైపు చూచి అన్నారు. (రేయ్!.. మూడు కప్పుల టీని తీసుకురండి)
నేను కూర్చున్నాను. పాతిక సంవత్సరాల గిరిజన యువతి టీ కప్పులను తెచ్చి మా ముగ్గురి ముందు చిరునవ్వుతో ఉంచింది. టీ తాగాము. నేను వారి ప్రక్కకు వెళ్ళి..
"పాపాచాన్ సాబ్!.. బాత్ ఈజ్ బాత్!.. (మాటంటే మాటే)" నవ్వుతూ చేతిని ముందుకు సాచాను.
వారు కుర్చీనుండి లేచి నాతో నవ్వుతూ తన చేతిని కలిపారు.
"థాంక్యూ భాయ్ సాబ్!.. మిలేంగే!.. (కలుద్దాం)" అన్నాను.
వారి గదినుండి నేను బయటికి నడిచాను. గణేష్ నన్ను అనుసరించాడు.
మా ఎం. డి గారికి ఫోన్ చేసి విషయాన్ని అంటే మిస్టర్ పాపాచాన్ గారితో జరిగిన మీటింగ్ అవుట్ కమ్‍ను తెలియజేశాను. వారు నన్ను ఆఫీసుకు రమ్మన్నారు. నేను చెన్నై వెళ్ళిపోయాను. ఆఫీసులో ఎం. డి గారితో మరోసారి అన్ని విషయాలను చర్చించాను. వారు సమస్యను అర్థం చేసుకొన్నారు. రెండు రోజుల తర్వాత వారు నాకు ఐదు లక్షలు చెక్ CFO నుండి ఇప్పించారు. మరుదినం నేను బైలాడిలాా (బచేలీ అని దానికి మరో పేరు) బయలుదేరాను.
పాపాచాన్ గారిని మరుదినం కలిసి చెక్‍ను వారికి అందించాను. వారు చాలా సంతోషించారు. మరుదినం పని ప్రారంభించారు. ఆ తరువాత NMDC ఆఫీసర్స్ ను కలుసుకొని పని ప్రారంభించమని చెప్పాను. వర్క్ బిల్లింగ్ షెడ్యూలకు అనుగుణంగా ఎలా చేయాలనే విషయాన్ని గురించి గణేష్‍తో చర్చించి నేను చెన్నై బయలుదేరాను. అది మొదలు, ప్రాజెక్ట్ వర్కు, బిల్స్ రెయిజింగ్ క్రమంగా సాగింది. రెండు మాసాల్లో పాపాచాన్ గారి బ్యాలన్స్ మూడు లక్షలు ఇచ్చేశాను. ఆయనకు నామీద అపారనమ్మకం గురుత్వం ఏర్పడింది. మేము చెప్పిన విధంగా కావలసిన లేబర్‍ను అరెంజ్ చేసి పనులను నిర్వర్తించేవారు.
NMOC అధికారుల వద్ద నుండి ప్రాజెక్టు పూర్తి పని ముగించి ప్లాట్‍ను కమీషన్ చేసేదానికి తొమ్మిది నెలల టైమ్ యక్స్ టెక్‍షన్ను తీసికొన్నాను. పెనాలిటీతో వారి టైమ్ మరో తొమ్మిది నెలలకు పొడిగించారు.
అన్ని యూనిట్ల పనులు ముమ్మరంగా సాగుతున్న సమయం అది. నేను ప్రతి నెల బైలాడిలాకు వెళ్ళి NMOC ఆఫీసర్లను, పాపాచాన్ గాని కలిసి, గణేష్‍తో త్వరగా పనిని ఎలా పూర్తి చేయాలి అనే విషాయాలను చర్చించి రెండు మూడు రోజులు వుండి తిరిగి వచ్చేవాడిని. లోయలో సంఘిణీనాలా (నీటి కాలువ) అక్కడ పంపింగ్ స్టేషన్ నిర్మాణం ప్రారంభించారు. అక్కడినుండి ఆ పర్వత మార్గంలో ఎత్తు పల్లాల మీదుగా పద్దెనిమిది కిలోమీటర్ల ఐరన్ పైపు ద్వారా నీటిని కొండ మీదికి, ట్రిట్‍మెంటు ప్లాంట్ నిర్మాణం జరిగే చోటికి నీటిని తీసుకొని రావాలి. అవసరమైన 300MMDIA పైపులను సప్లై చేసి, పైలైన్ లేయింగ్ పనిని కూడా ప్రారంభిచాము. ప్రాజెక్టు ముగింపుకు ఐదు నెలల కాలం మిగిలి వుంది.
ఆ సంఘిణీనాలా చుట్టు ప్రక్కన అంతా దట్టమైన అరణ్యం ఆ ఏరియాల్లో నక్సల్స్ వుంటారనే వార్త. అయినా నిర్భయంగా దైవంమీద భారం వేసి మేము వెళ్ళేవాళ్ళం. గణేష్ ఘారక్‍పూరు వాసి మనిషి సాహసవంతుడు. సంఘిణీనాలా వద్దకు ఇద్దరు ముగ్గురు వచ్చి జరుగుతున్న పనిని కొంతసేపు చూచి వెళుతున్నారని గణేష్ నాతో, వారు నక్సల్స్ అని చెప్పాడు. వారు కూలిపని కావాలంటే ఇస్తాము అని చెప్పని గణేష్‍కు చెప్పాను. డిసంబర్‍కు పని పూర్తి చేసి జనవరి తొలి వారంలో ప్లాంట్ కమీషన్ చేయవలసి ఉంది.
నేను ఆగష్టు తొలివారం బెలాడీలకు వెళ్ళాను. నేను ఎప్పుడూ అక్కడికి చేరే సమయం రాత్రి పదకొండున్నర పన్నెండు. అస్వస్థతగా ఉన్నందున హిల్‍టాప్‍కు వెళ్ళి జరుగుతున్న పనులను చూచుకొని, విశ్రాంతి కోసం నేను రూముకు వచ్చాను.
గణేష్ సంఘిణీనాలా పంపింగ్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు, రాత్రి ఏడున్నర ప్రాంతంలో గణేష్ నా రూముకు వచ్చాడు. ఎప్పుడు నా ముందు నవ్వుతూ వుండే గణేష్ వదనం విచారంగా గోచరించింది.
"క్యా భాయ్!.. డల్ దిక్ తేహో!.. (ఏం తమ్ముడూ డల్‍గా వున్నావు) అడిగాను.
అతను నా చేతికి ఒక చీటిని అందించాడు.
వ్రాత హిందీలో ఉంది.
సారాంశం.. ’మాకు మీరు లక్ష రూపాయలు ఇవ్వాలి. లేకపోతే మేము సంఘిణీనాలా వర్క్ ను ఆపేస్తాము. "అది ఆ హిందీలో వ్రాత సారాంశం.
"ఇది ఎక్కడ దొరికింది గణేష్!" అడిగాను.
"పంప్ హౌస్‍కు యాభై కిలోమీటర్ల దూరాన మన దారి ప్రక్కన వున్న చెట్టుకు వేలాడుతుండినది సార్!" అన్నాడు.
"ఎవరు చేసి వుంటారు ఈ పని?"
"వాళ్ళే సార్ నక్సల్స్!"
"అలాగా!"
"అవును సార్!"
"నీ ఉద్దేశ్యం ఏమిటి?"
"వాళ్ళు లక్ష అడిగారు. మనం కొంత కనీసం యాభైవేలన్న ఇవ్వకపోతే సంఘిణీనాలా దగ్గర పనిచేయలేము సార్" విచారంగా చెప్పాడు గణేష్.
"గణేష్!.. మన కంపెనీ గురించి నీకు బాగా తెలుసు కదా!.. యాభైవేలు కాదు. ఒక్క రూపాయి కూడా మనం వారికి ఇవ్వలేము!.. " నా అభిప్రాయాన్ని గణేష్‍కు చెప్పాను.
"వాళ్లకు కోపం వచ్చిందంటే మన పని వాళ్ళను, మనల్ని అటాక్ చేసి చంపేస్తార్ సార్!" అతని ముఖంలో విచారం, భయం.
"పద!.. "
"ఎక్కడికి సార్!"
"NMOC ఆఫీసుకు. వాళ్ళు తొమ్మిది గంటల దాకా పనిచేస్తుంటారుగా"
"అవును సార్!"
"చల్.. చల్" ఇరువురు జీప్‍లో NMOC ఆఫీసుకు చేరి GM ప్రాజెక్టును కలిశాము. ఆ కాగితపు ముక్కను వారికి చూపించాము వారూ ఆశ్చర్యపోయారు.
"అయితే ఇప్పుడు మీరేం చేస్తారు సార్!.. " నన్ను అడిగారు వారు.
"చేయవలసింది నేను కాదు సార్ మీరు!.. "
"మేమా!.. " ఆశ్చర్యపోయారు వారు.
"సార్ మీరు మా పనివారికి మాకు, పోలీస్ ప్రొటక్షన్‍ను ఇప్పించండి. మేము పని కొనసాగిస్తాం" అన్నాను.
"మీరు ఏదైనా వారు కోరిన విధంగా ఇవ్వలేరా!"
"ఇవ్వలేము సార్!"
"ఐతే.. "
"తమరి పోలీస్ ప్రొటెక్షన్‍తో మేము పని సాగిస్తాం!.. "
"ఏం గణేష్!.. " అడిగారు ఆ ఆఫీసర్ గణేష్‍ను..
"నాకు చాలా భయంగా ఉంది సార్!.. " దీనంగా చెప్పాడు గణేష్.
"గణేష్!.. ఇందులో భయపడవలసిన విషయం ఏముందిరా!.. భయపడకు. హిల్‍టాప్ వర్క్స్ కు నోప్రోబ్లం. అక్కడికి వారు రాలేరు. ఇక సంఘిణీనాలా పంపింగ్ స్టేషన్. అది వారి ఏరియా. మన ఈసార్ గారు, పోలీస్ ప్రొటక్షన్ మనకు ఇస్తే, మనం అక్కడికి వెళ్ళి పనిచేస్తాం, లేకపోతే లేదు. ఇది కేవలం మన సమస్య కాదు, NMOC కీ సమస్యే. అధైర్యపడకు. ఉయ్ ఆర్ ప్రొజెక్ట్ ఇన్‍ఛార్జ్" నవ్వుతూ చెప్పాను.
గణేష్ విచారంగా తలదించుకొన్నాడు.
"చూడు గణేష్!.. నేను పన్నెండు ప్రాజెక్టులను దేశంలో వేరు వేరు ప్రాంతాల్లో నార్త్ సైడ్ చూస్తున్నాను. నేను ఇక్కడ వుండలేను. ఏ సైట్‍కు వెళ్ళినా రెండు లేక మూడు రోజులు అవసరాన్ని బట్టి నేను వుంటాను. కనుక సమస్యను నీవు ధైర్యంగా ఎదుర్కోవాలి సోదరా!" అన్నాను.
"సాబ్, మై సంఘిణీనాలా సైట్‍కు జాసక్తా నహీ సాబ్!" దీనంగా చెప్పాడు గణేష్.
"నేను వెళతాను"
"కబ్ సాబ్!"
"టుమారో!.. నా వెనుక మన సార్, వారి ఇంజనీర్లు, పోలీసులు రావాలి. ఓకేనా సార్. మీరు పోలీస్ ప్రొటెక్షన్ గురించి ఆలోచించండి. ఇక మేము హిల్‍టాప్‍కు వెళతాం సార్!" అనునయంగా చెప్పాను.
"అలాగే సార్!.. " అన్నారు వారు.
నేను గణేష్ వారి గదినుండి బయటికి నడిచాము.
*
మరుదినం ఉదయం ఏడుగంటలకల్లా నేను రెడీ అయ్యాను. డ్రైవర్ మున్నాతో ఒక ఆరు అడుగు దాడీవాలా, నాగదికి వచ్చారు. అతను చూచేదానికి నా కళ్ళకు రౌడీలా కనిపించాడు.
’ఈ అగంతకుడు ఎవరు? నన్ను చూచేదానికి ఎందుకు వచ్చినట్లు?’ అనుకొన్నాను.
వారిని చూసి "భైటియే" అన్నాను.
అతను కుర్చీలో కూర్చున్నాడు. నన్ను నిశితంగా చూడసాగాడు.
"బోలియే!.. ఆప్ కా నామ్?" చిరునవ్వుతో అడిగాను.
"భీరూసింగ్!.. " అన్నాడు అతను.
క్షణం తర్వాత.. "హమారా సో సొసైటీహై. ఆప్ కుచ్ డొనేషన్ దేనాహై!" అన్నాడు (మాకు ఒక సొసైటీ ఉంది. దానికి మీరు డొనేషన్ ఇవ్వాలి)
"దేఖియే సాబ్!.. మై కంపెనీకా నౌకర్‍హు మాలిక్ నహీ!.. మై అబ్ ఆప్ కూ కుచ్ భీ నహీ దేసక్తా!.. (చూడండీ సార్!.. నేను కంపెనీ ఉద్యోగిని. ఇప్పుడు నేను మీకు ఏమీ ఇవ్వలేను)" చిరునవ్వుతో చెప్పాను.
"కబ్ ది ఏంగే? (ఎప్పుడు ఇస్తారు?)" వారి ప్రశ్న.
"మై చెన్నై జాకర్ అప్నా బాస్ సే ఆప్ కే బారేమే కహూంగా!.. ఓ కుచ్ ది ఏ తో మై నెక్ట్స్ ట్రిప్ అకర్ ఆప్‍కు దివుంగా!.. అగర్ ఓ కుచ్ భీ నదియాతో మైకుచ్ భీ నకర్ పావూంగా!.. (నేను చెన్నై వెళ్ళి మీ విషయాన్ని మా బాస్‍కు చెబుతాను. వారు ఏదైనా ఇచ్చి మీకు ఇవ్వమంటే, నేను మరలా వచ్చినప్పుడు ఇవ్వగలను. వారు ఏమీ ఇవ్వకుంటే, నేను ఏమీ చేయలేను)" అని చెప్పాను.
"కుచ్‍నా కుచ్ కరో! (ఏదో ఏదైనా చేయండి)" అన్నాడు అతను.
"జరూర్!.. (తప్పకుండా)" నవ్వుతూ చెప్పాను.
అతను లేచి వెళ్ళిపోయాడు.
"రేయ్!.. మున్నా ఎవరురా ఈ వింతమనిషి?" అడిగాను డ్రైవర్‍ని.
"సాబ్, ఏ రౌడీహై. తీన్ బార్ జైల్‍కు జాకోహై. కల్ హీ బహర్ ఆయా!.. ( సాబ్!.. వీడు రౌడీ. మూడుసార్లు జైలుకు వెళ్లాడు. నిన్ననే బయటికి వచ్చాడు)” చెప్పాడు మున్నా.
గణేష్ వచ్చాడు. NMOC ఆఫీసుకు వెళ్ళాము. జి. యం గారిని కలిశాము.
"సార్!.. నేను జీప్‍లో ముందు, నా వెనుక ట్రాక్టర్ ట్రక్‍లో పనివారు బయలుదేరుతాము. మీరు పోలీస్ ఫోర్స్ తో మా వెనుక సంఘిణీనాలాకు రావాలి. మేము సిద్ధం, మీరు సిద్ధమేనా సార్!.. " అడిగాను.
"మనం బయలుదేరుదాం సార్. పోలీసు మన వెనకాలే జీపులో వస్తారు" అన్నారు జి. యం. గారు.
ముందు నా జీప్, నేను డ్రైవర్ మున్నా..
వెనుక మా ట్రాక్టర్ కమ్ ట్రక్, లేబర్
డిపార్టుమెంటు జీపులు రెండు..
దాని వెనుక పోలీస్ జీపు.
బయలుదేరాయి సంఘిణీనాలా సైట్‍కు..
గణేష్ హిల్‍టాప్ వాటర్ ట్రీట్‍మెంటు సైట్లో దిగిపోయాడు.
నేను.. దైవాన్ని తలుచుకొంటూ జీపులో కూర్చున్నాను.
గంటలో సంఘిణీనాలా సైట్‍కు అందరమూ చేరాము.
లేబర్ పని ప్రారంభించారు. మార్గమధ్యలో మాకు ఎవరూ ఎదురు పడలేదు.
మున్నా చేత ఫుడ్ పాకెట్స్ తెప్పించి ఒకటిన్నరకు అందరికీ అందించాము.
మూడు గంటలకు డిపార్టుమెంటు ఆఫీసర్లు వెళ్ళిపోయారు.
ఏడుగంటలకు పని ముగించి అందరం బచేలీకి వచ్చేశాము. అలా రెండు రోజులు సంఘిణీనాలా వద్ద పని జరిగింది. మూడవరోజు గణేష్ ఏమనుకొన్నారో ఏమో మాతో ఆ సైట్‍కి వచ్చాడు.
విషయాన్ని మా బిగ్‍బాస్‍కు ఫోనులో తెలియజేశాను. మరో రెండు రోజులు వుండి, నన్ను వారు చెన్నైకి రమ్మన్నారు. రెండు రోజులు వున్నాను. సంఘిణీనాలా పని నిర్విఘ్నంగా సాగింది. నేను మూడవరోజు చెన్నైకి బయలుదేరేముందు..
"గణేష్!.. దేనికీ భయపడకు NMOC సపోర్టు మనకుంది. మన పనిని ఎవరూ ఆపలేరు. ధైర్యంగా సంఘిణీనాలా పంపింగ్ స్టేషన్ సైట్‍కు వెళ్ళు. ఎవరి వలనైనా నీకు ఒత్తిడి కలిగితే. నాకు ఫోన్ చెయ్యి. విషయాన్ని NMOC జి. ఎం. గారికి చెప్పు. నేను వెంటనే వస్తాను. " గణేష్‍కి ఆవిధంగా చెప్పి నేను చెన్నై బయలుదేరాను.
పదిరోజుల తర్వాత.. నేను మరలా బచేలీకి వెళ్ళాను. గణేష్ ఆనందంగా కనిపించారు.
"ఎనీ ప్రాబ్లం?" అడిగాను గణేష్‍ను.
"నో ప్రాబ్లం సార్!.. " నవ్వుతూ జవాబు చెప్పాడు గణేష్.
అది అక్టోబర్ నెల. మా ఎలక్ట్రికల్, ఇన్స్ ట్రూమెంటేషన్ ఇంజనీర్లు కలిసి బైలాడిలాకు వెళ్ళాము. మూడువారాల్లో అన్ని పనులు ముగించాము.
ఒకనెల ముందుగానే అంటే.. నవంబర్ లో పూర్తి ప్లాంట్‍ను కమీషన్ చేశాము. సంఘిణీనాలా నుండి గంగమ్మ తల్లిని హిల్‍టాప్ వాటర్ ట్రీట్‍మెంటు ప్లాంటుకు పంపుచేశాము. NMOC ఆఫీసర్స్ కు పార్టీ ఏర్పాటు చేశాము. వారంతా మా ఆర్గనైజేషన్ గురించి గొప్పగా ప్రసంగించారు. డిలేకి వేసిన పెనాల్టీని రద్దు చేసి మాకు పేమెంట్ ఇచ్చారు.
ఆ మహా యజ్ఞంలో నాకు అండగా నిలిచిన NMOC ఆఫీస్ స్టాఫ్ అందరికి, మా పిటీ కాంట్రాక్టర్స్ కు, లాడ్జి, హోటల్ యజమానులకు ధన్యవాదాలు తెలియజేసి విజయానందంతో దైవాన్ని తలచుకొంటూ చెన్నైకి బయలుదేరాను. సమైక్యతతో సంఘీభావనతో చేయలేని పని అంటూ లేదు. ఎవరు ఏ పని చేసినా దైవనమ్మికతో చేయాలి. ఆ కనబడని మహాశక్తి నమ్మినవారిని సదా రక్షిస్తుంది. అండగా వుండి విజయాన్ని ప్రసాదిస్తుంది.
ఓం నమఃశివాయ, ఓం నమో నారాయణ!.. జగత్ జనులందరికీ అది తారకమంత్రం వరప్రదం.
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Commentaires