top of page
Writer's pictureGadwala Somanna

బాలల దినోత్సవం

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న#BalalaDinotsavam, #బాలలదినోత్సవం


Balala Dinotsavam - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 14/11/2024

బాలల దినోత్సవం -  తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


వచ్చింది వచ్చింది

నెహ్రూ జన్మదినం

తెచ్చింది  తెచ్చింది

బాలల దినోత్సవం


బాలలకు సంబరం

తాకింది అంబరం

చాచాజీ స్నేహం

దొరికింది అబ్బురం


భారత తొలి ప్రధాని

జవహర్ లాల్ నెహ్రూ

బాలలతో గడిపిన

అద్భుతమైన రోజు


చాచాకు పిల్లలతో

మైత్రి కుదిరిన రోజు

అదే అదే బాలల

దినోత్సవ శుభదినం



-గద్వాల సోమన్న



16 views0 comments

Comments


bottom of page