బాలిక భవిత
- Yasoda Gottiparthi
- Jan 24
- 1 min read
Updated: Jan 31
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #బాలికభవిత, #BalikaBhavitha

Balika Bhavitha - New Telugu Poem Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 24/01/2025
బాలిక భవిత - తెలుగు కవిత
రచన: యశోద గొట్టిపర్తి
అమ్మ గర్భంలోనే అన్యాయం
అంతం చేస్తూ అపహాస్యం
ఇప్పటికీ మర్వలేని మనో వేదన
ఇలపైన అలుసుగా చూడ వద్దన్న
అన్నిచోట్ల అసమానతలు తొలగాలి
అపురూప మంటూ కడతారు అడ్డుగోడలు కూల గొట్టాలి
అనుకూలం లేని చదువుల అడ్డంకులు పోవాలి
బరువు కాదు బాలిక
భూమికి బ్రతుకు దీపం
బ్రతక నివ్వండి బాలికలను
భద్రత పెంచండి చేయూతనివ్వండి భవితకు వారే మూలం
బంగారు భవిష్యత్తుకు
చేయు సాయం
చదువుల్లో రాణించేలా
చేయూత కావాలి
చదువుల తల్లి జగతికి సిరి
అన్ని రంగాల్లో చేరాలి
అనురాగం పంచాలి
అక్కున చేర్చుకోవాలి
అన్నదమ్ముల అనుబంధం
అన్ని వేళలా కావాలి
***

-యశోద గొట్టిపర్తి
బాలిక భవిత: యశోద గొట్టిపరి
దీనికి రక రకాలు గా ఆలోచించి ... ఒక మంచి వ్యవస్తీకరణ తేవాలి