#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #BalyamBangaram, #బాల్యంబంగారం
Balyam Bangaram - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 06/01/2025
బాల్యం బంగారం - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
విలువైనది బాల్యము
జీవితాన భాగ్యము
చీకు చింత లేనిది
బహు అమూల్యమైనది
స్వేచ్చగా సాగునది
స్వచ్ఛమైన వెండి అది
బాల్యము బంగారము
బ్రతుకున సింగారము
పవిత్రతకు నిలయము
ఇల బాల్య జీవితము
విరబూసిన పువ్వులు
వెలుగులీను దివ్వెలు
ఉండదోయ్! కల్మషము
రేపదోయ్! కలవరము
స్వర్గసీమ బాల్యము
ప్రశాంతతకు మార్గము
అమ్మ ఒడిలో బాల్యము
అత్యంత సురక్షితము
మరో జన్మ ఉంటే
కోరుకుంటా! బాల్యము
బాల్యంలో స్నేహము
నిలుచును చిరకాలము
బాల్యానికి మించినది
సృష్టిలో చూడలేము
-గద్వాల సోమన్న
Comments