top of page

బాల్యమే భాగ్యము

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #BalyameBhagyamu, #బాల్యమేభాగ్యము, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 56


Balyame Bhagyamu- Somanna Gari Kavithalu Part 56 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 12/04/2025

బాల్యమే భాగ్యము - సోమన్న గారి కవితలు పార్ట్ 56 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


బాల్యమే భాగ్యము

----------------------------------------

అందమైన బాల్యము

తలపించును స్వర్గము

కల్మషమే లేనిది

జీవితాన భాగ్యము


సాగుతుంది నదిలా

సంగీత నాదంలా

సంతోషం అమితము

అవస్థలు పరిమితము


ఖరీదైన బాల్యము

మధురమైన స్వప్నము

మానవ జన్మలోనే

అత్యంత అమూల్యము


బాల్యానికి న్యాయము

చేయుట మన ధర్మము

నిర్లక్ష్యం చేస్తే

చేజారును నాకము


వెట్టిచాకిరితోన

బాల్యమగు నాశనము

వారి చోటు బడిలోన

చేయకు బందిఖానా


బాల్యము బహు భాగ్యము

దేవుని బహుమానము

తరచి తరచి చూడగా

మరువలేని జ్ఞాపకము















ఆర్యోక్తులు భవితకు బాటలు

----------------------------------------

ఎవరి తవ్విన గుంతలో

వారే పడతారు నిజము

ఏ పంట వేస్తే అదే

కోస్తారోయ్!ఖచ్చితము


"చెరుపకురా! చేడేవు"

మహనీయులే అన్నది

ఈ అక్షర సత్యమన్నది

లోకమంతా విన్నది


దురాశ దుఃఖముకు మూలము

కోరికలు కూడా కేంద్రము

గౌతమ బుద్ధుడు చెప్పింది

అందులో వాస్తవముంది


ఉపయోగము ఆర్యోక్తులు

వినిన బాగుపడు బ్రతుకులు

నిర్లక్ష్యము గనుక చేస్తే

ముప్పు వెనుకడుగు వేస్తే











సంస్కారమివ్వని విద్య విద్య కాదు

----------------------------------------

సంస్కారం నేర్పని

విజ్ఞానము పంచని

ఎంత చదువు చదివినా!

లాభము ఉండేనా!


శ్రమ దానం చేయని

ముందడుగే వేయని

ఏ పని ఫలిమివ్వదు

జగతి ప్రగతి జరగదు


ఆశయం మంచిదే

సంకల్పం గొప్పదే

ఆచరణ లేకున్న

ఫలితాం గుండు సున్న


గురిలేని ప్రయాణము

సరిలేని జీవితము

మరీ మరీ కష్టము

తెచ్చిపెట్టు నష్టము


















బాలల లోకము నాకము

----------------------------------------

చిన్నారుల లోకము

నవ్వుల నవలోకము

ఈతిబాధలు లేని

దైవముండు నాకము


మోసాలకు దూరము

మదిని దోచు తీరము

పసి పిల్లల లోకము

అత్యంత పవిత్రము


ఆనంద నిలయమది

ప్రవహించు జీవనది

ఇల బాలల లోకము

సకల నిధుల ద్వీపము


ఉండదు దౌర్జన్యము

మాయము అరాచకము

పసి పిల్లల రాజ్యము

ప్రేమకు ప్రతి రూపము


అంతా శాంతిమయము

చూడ సుఖనివాసము

ఉండవోయ్! ఘోరాలు

జరగవోయ్! నేరాలు


చింతకు తావు లేదు

శాంతికి కొదువ లేదు

బాలల ప్రపంచము

ముగ్ధమనోహరము











బాలిక చదవాలి!

----------------------------------------

బాలిక చదువుకుంటే

బ్రతుకంతా వెన్నెల

లేకపోతే భవిత

పోతుందోయ్! వెలవెల


చదువే ఆధారము

బ్రతుకులో బాలికకు

లేక అంధకారము

ప్రమాదం మనుగడకు


బ్రతుకే బంగారము

కోరితే చదవాలి

ఆడపిల్ల చదువే

భవితకు సింగారము


బాలికలు చదవాలి

అన్నిటా ఎదగాలి

చక్కగా చదువుకుని

స్ఫూర్తిగా నిలవాలి


-గద్వాల సోమన్న


Comentarios


bottom of page