top of page

బీ కేర్ ఫుల్

#SudhavishwamAkondi, #BeCareful, #బీ కేర్ ఫుల్, #సుధావిశ్వంఆకొండి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Be Careful - New Telugu Story Written By - Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 19/02/2025 

బీ కేర్ ఫుల్తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


క్రాంతి ఓ మెడికల్ స్టూడెంట్. హైదరాబాద్ లో ఓ ఇంట్లోని పోర్షన్ లో అద్దెకు వుంటూ చదువుకుంటోంది. 

 ఆ ఇంటి వాళ్ళు పెద్దవాళ్ళు. ఇద్దరే వుంటారు. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యారు. 

 బయటి ఫుడ్ ఇష్టం లేక తన పోర్షన్ లోనే చిన్నగా కిచెన్ పెట్టుకుంది. అంతా బావుంది. 


 ఓ రోజు ఇంటికి త్వరగా వచ్చింది. ఫ్రెష్ అయి టీ తాగుతుంటే పక్కింట్లో వుండే బంటి వచ్చాడు అక్కా అంటూ. 

ఎవరు అన్నట్టుగా చూసింది. 


 "నా పేరు అలోక్ అక్కా! అందరూ బంటి అని పిలుస్తారు. మేము ఈ పక్క ఇంట్లోనే ఉంటాం. నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను. నిన్ను చాలాసార్లు బయట చూశాను" అంటూ పరిచయం చేసుకున్నాడు. 

 "ఓ అలాగా! పాలు తాగుతావా నువ్వు?" అంది. 

 "ఏంటి నేను చిన్న పిల్లోడిని అనుకున్నవా? నేనూ టీ తాగుతా" అన్నాడు

 వాడి మాట తీరుకి ముందు ఆశ్ఛర్యపోయి, తర్వాత టీ తెచ్చి ఇచ్చింది. అది మొదలుగా తను ఎప్పుడు ఇంటికొస్తే అప్పుడు వచ్చేవాడు. సరే ఏదో చిన్న పిల్లాడు అని ఊరుకుంది. 

 ఆ మరుసటి రోజు "అక్కా! నీ సెల్ ఫోన్ ఇవ్వవా! గేమ్స్ ఆడుకుంటాను. మా అమ్మ అస్సలు ఆడనివ్వదు. కొద్దిసేపే" అని అడిగాడు నెమ్మదిగా


 సరేనని ఇచ్చింది. ఇక అప్పట్నుంచి ఇంచుమించు ప్రతిరోజూ వచ్చి సెల్ ఫోన్ తీసుకుని, కాసేపు ఆడుకుని వెళ్ళేవాడు. 


 @@@@@


 ఓ రోజు క్రాంతి ఫ్రెండ్.. 

 "ఏంటి ఈ మధ్య చాలా వీడియోలు పోస్ట్ చేస్తున్నావు ఫేస్బుక్ లో. ఆ పోస్టులు కూడా అన్నీ ఏమేమో అశ్లీలమైన పిచ్చి పోస్టులు వస్తున్నాయి. నీ ఇన్ స్ట్రా గ్రామ్ అకౌంట్ లో కూడా అంతే! ఏమైంది అలా? నువ్వు ఫ్రెండ్ వు కాబట్టి డైరెక్ట్ గా అడుగుతున్నా! నీ పోస్టుల గురించి ఇంకా చాలామంది నాతో అన్నారు" అంది


 "అవునా! నేను ఈమధ్య ఫేస్బుక్ గట్రా ఏవీ చూడట్లేదు. ఇంటికి వెళ్తాను కదా! వెళ్ళగానే వాడు.. బంటి వచ్చి సెల్ తీసుకుని గేమ్స్ ఆడుకుంటాడు. రాత్రి అలసటకు త్వరగా నిద్రపోతున్నాను. నేను పోస్టులు ఏమీ పెట్టకుండా ఎలా వస్తున్నాయి? ఏమైందో మరి! ఏమైనా హ్యాక్ అయ్యిందంటావా?" అంది ఆశ్ఛర్యపోతూ


 "ఏమో చెక్ చేసుకో ఓ సారి! లేదంటే చాలా సమస్యలు వస్తాయి" అని సలహా ఇచ్చి వెళ్ళింది ఆ స్నేహితురాలు


 @@@@@@@


 ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యిందో లేదో మళ్లీ బంటి ప్రత్యక్షం. 


వాడితో.. 


 "ఒరే! నా ఫోన్ హ్యాక్ అయినట్టుందిరా! అన్నీ అశ్లీల వీడియోలు వస్తున్నాయట. జాగ్రత్తగా ఆడుకో గేమ్స్" అంది 


 "అవును అక్కా! మా ఇంట్లో కూడా ఇలాగే అన్నారు. ఒకవేళ నెట్ సమస్య అనుకుంటా" అన్నాడు


 ఆ తర్వాత సమస్య తీవ్రతరం అయ్యింది. ఏమి జరిగిందో అర్థంకాక జుట్టు పీక్కుంది. 


 ఫేస్బుక్, ఇన్ స్ట్రా గ్రామ్ అన్నింటిలో తను పోస్ట్ చేసినట్టుగా వస్తున్నాయి అని అందరు ఫ్రెండ్స్ చెబుతున్నారు. తనకు ఓపెన్ చేయడానికి రావట్లేదు. పాస్ వర్డ్ రాంగ్ అని చూపిస్తోంది. టెన్షన్ లో ఏమి చేయాలో తోచలేదు. చివరకు ఒక ఫ్రెండ్ సలహాతో, వాళ్ళ మామయ్య సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారని తెలుసుకుని, ఆయన్ని కలిసింది. 


 విషయం విన్న ఆయన 'మా ఎక్స్పర్టులు ఏ విషయం తేల్చేస్తారు!' అని ధైర్యం చెప్పి, పంపించాడు. 


 ఆ మరునాడే ఆయన పోలీస్ ఎంక్వయిరీ చేసి కనుక్కున్న విషయం విన్న క్రాంతి ఆశ్చర్య చకితురాలయ్యింది. 


 క్రాంతి వద్దకు వచ్చే బంటినే ఫోన్ లో పాస్ వర్డ్ మార్చి, ఈమె అకౌంట్ నుంచి అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. పిల్లవాడు అని ఆ కోణంలో ఆలోచించలేదు, గమనించలేదు. 


 చివరకు పోలీసులు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పి, ఆ పిల్లవాడిని గద్దించేసరికి 

 "అలా చేయడం నాకలవాటు. మజా వస్తుంది" అని అన్నాడు


 తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. క్రాంతికి అయితే బాధ కలిగింది. ఆ బంటిని పోలీసులు సైబర్ నేరం క్రింద అరెస్ట్ చేసి, జువెనైల్ కోర్టుకు తీసుకెళ్లారు. 


 ఏ వస్తువు అయినా మనం ఎలా ఉపయోగిస్తామో అలా దాని ప్రభావం ఉంటుంది. పిల్లలకు చిన్నతనంలోనే సెల్ ఫోన్ వాడకం చేయడం, అందులో వాళ్లకు కూడా ఫేస్బుక్ అకౌంట్ పెట్టడం, ఇంకా ఇతర సోషల్ మీడియా వాడకం లాంటివి ఇలా ఎంతగా ప్రమాదం కొని తెస్తుందో ఈ కథనే ఉదాహరణ! నిజంగా జరిగిన సంఘటన కథగా మల్చడం జరిగింది. 


 ఇంకా కొందరు తల్లిదండ్రులు చిన్నవాళ్లకు బైక్ లు, కార్లు ఇస్తుంటారు. ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఆలోచించండి. అంత చిన్న వయసులో అసలు అవసరమా! అని ఆలోచించుకోవాలి. 


 ఏ వయసులో ఏది ఉపయోగించాలో అదే ఇవ్వాలి. దానిలోని మంచి, చెడులు చెప్పాలి. అప్పుడే పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారు.. 

నిజమే కదా!


మీరేమంటారు?

-సుధావిశ్వం


  ###


సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Комментарии


bottom of page