భారతీయత
- Sudarsana Rao Pochampalli
- Feb 10, 2024
- 1 min read

'Bharathiyatha' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 10/02/2024
'భారతీయత' తెలుగు కవిత
రచన : సుదర్శన రావు పోచంపల్లి
భారతీయులం - మేము భారతీయులం
భరతమాత ముద్దుబిడ్డలం
దయాభరిత హృదయ దాన శీలురం
కాశ్మీరు కన్యాకుమారి ఆ సాంతం మా స్వంతం
అని విశ్వమంతా వినిపించే వివేక శీలురం
మతాలన్ని గౌరవించే మతం మాదిరా
శరణార్థుల నాదరించు కరుణ మాదిరా
పరుల సొమ్ము నాశించే పాడు బుద్ధి మాకు లేదురా
మరి హద్దు మీరి మా సరిహద్దు దాటనిచ్చె
ఉదాసీన వైఖరి ఉదయించబోదురా
వెన్ను జూపి పోవువారల వెంబడించబోమురా
చేవలేక చావగోరు చేస్టలింక వదలరా
వందకోట్ల భారతీయులదొక్కటే దేహం
ఒక్క మనసనే చక్కనైన సంస్కారం
నిక్కచ్చిగ మాదిరా
భారతీయులం మేము భారతీయులం
భరతమాత ముద్దు బిడ్డలం
దయాభరిత హృదయ దాన శీలురం .
--సుదర్శన రావు పోచంపల్లి
Comments