top of page
Writer's pictureNallabati Raghavendra Rao

భస్మాసుర భస్మీపటలం - 2099



'Bhasmasura Bhasmipatalam - 2099' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 02/09/2024 

'భస్మాసుర భస్మీపటలం - 2099' తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



అది 2019 సంవత్సరం.. 


సిటీలోని పెద్ద హాస్పిటల్లో ఓ తల్లి కడుపున పుట్టాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయికి అదృష్టరావు అని పేరు పెట్టారు. విద్యలన్నీ నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు. 


అలా అలా అలా 2019 నుండి 2059వ సంవత్సరం వచ్చేసింది. 


అంటే 40 సంవత్సరాల వయసులో 2059వ సంవత్సరంలో రాజ్యలక్ష్మి అనే ఆమె తో పెళ్లయింది.. అదృష్టరావుకి. 


2059వ సంవత్సరం లో పెళ్లయిన.. మరుసంవత్సరమే వాళ్లకు అబ్బాయి పుట్టాడు. 


ఒకరోజు ఇలా అన్నాడు అదృష్టరావు భార్యతో.. 

''రాజ్యం, అబ్బాయికి పేరు ఏం పెడదాం.. నువ్వు చెప్పే ముందు నా ఉద్దేశం ఏమిటి అంటే.. వీడు పెరిగి పెద్ద వాడు అయ్యేసరికి అంటే వీడికి 40 ఏళ్ల వయసు వచ్చేసరికి అంటే.. ఇది 2059వ సంవత్సరం కదా.. 2099వ సంవత్సరం వచ్చేసరికి అప్పటి పరిస్థితులకు తగ్గట్టు గా ఉండాలి పేరు'' అంటూ అడిగాడు. 


''అదేదో మీరే చెప్పండి'' అంది రాజ్యలక్ష్మి. 


''వీడి పేరు భస్మాసుర అని పెడదాం'' చెప్పాడు అదృష్టరావు. 


''బాగుంది కానీ మనం కూడా ఈ పాత చింత కాయ పచ్చడి పేర్లు పక్కన పడేసి మనపేర్లు కూడా మార్చు కుంటే బాగుంటుంది కదా. ''.. సూచన చేసింది రాజ్యలక్ష్మి. 


''అదెంత సేపు.. నేను కూడా నువ్వు అనుకున్నట్టే మార్చేసుకుందా మనుకుంటున్నాను. ఇక నుంచి నా పేరు అదృష్టరావు కాదు భయంకర సర్పదృష్ట. నీ పేరు రాజ్యలక్ష్మి కాదు బ్రహ్మరాక్షసి. ఎలా ఉందో చెప్పు. ''


''మీరు పేర్లు పెట్టడం దానికి నేను పేరు పెట్టడమా?సూపర్.. భయంకర సర్పదృష్ట గారు. ''


అలా అలా 2060వ సంవత్సరంలో పుట్టిన ఆ బిడ్డ భస్మాసుర ఆ దంపతుల పెంపకంలో విద్యలు అన్నీ నేర్చుకుంటూ అలా అలా పెరిగి పెద్దవాడయ్యాడు. అతని వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు. 


అంటే.. ఇప్పుడు.. 2099వ సంవత్సరం ప్రారంభం అయింది అన్న మాట. 


*****


ప్రస్తుతం ప్రపంచం 2099వ సంవత్సరములో ఉంది. 


మనం 2099వ సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాము. 

వెళ్ళిపోతున్నాము.. వెళ్ళిపోతున్నాము.. 

వెళ్లిపోయాం. 


**


''డాడ్.. నేను చంద్రమండలం వెళ్తున్నా. '' తండ్రి దగ్గరికి వచ్చి అన్నాడు భస్మాసుర. 


''వెల్! ఎప్పుడు ప్రయాణం.. అన్ని కుదిరాయా.. '' అడిగాడు తండ్రి భయంకర సర్పదృష్ట. 


''అక్కడ ఎయిర్ టెక్నాలజీ కోర్స్ 30 రోజులు ఉంటుంది డాడ్. అది చేసి వస్తే ఒక సంవత్సరంలో హైదరాబాద్ మొత్తం కొనేయవచ్చు. ''


'''వెరీ గుడ్ నువ్వు ఇంత ప్రయోజకుడివి అవుతావని నేను ఊహించలేదు. గో ఎ హెడ్. ''


అలా ఒక ప్రత్యేకమైన కోర్సు నేర్చుకోవడం కోసం చంద్రమండలం బయలుదేరి వెళ్లాడు భస్మాసుర. అక్కడ ఉన్న సాధారణ కోర్సులు విషయాలు తెలుసుకున్నాక అతని మనసుకు ఇంకా ఏదో సాధించాలి అనిపించింది. వెంటనే ఐడియా కార్నర్ సిస్టం టచ్ చేశాడు. 


అది.. స్పేస్(అంతరిక్షం) సమాచారాన్ని పూర్తిగా ఇచ్చింది. ఎగురుతూ గంతులేసినట్టు అయిపోయాడు భస్మాసుర.. వెంటనే తండ్రికి ఎయిర్ విండ్ సౌండ్ మెసేజ్ పెట్టాడు. 


''భస్మాసుర.. ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది?. చంద్ర మండలం ఎలా ఉంది. అక్కడ స్పెషలై జేషన్ కోర్సులు ఎలా ఉన్నాయి?'' ఆత్రుతగా అడిగాడు తండ్రి భయంకర సర్పద్రష్ట. 


'''నీ కొడుకు అంటే ఏంటనుకున్నావ్ డాడ్. సాధించాను. నీకు పేరు తేవడమే నా లక్ష్యం.. అయితే ఇక్కడ చంద్ర మండలంలో కోర్సులు సాదాగానే ఉన్నాయి డాడ్. నాకు నచ్చలేదు. కానీ స్పేస్ లో అంటే రోదసీలో బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ దొరికింది డాడ్. ''


''ఫెంటాస్టిక్.. అవును స్పేస్ లో మనుషులు ఉండడానికి అవకాశంలేదట. భయంకరమైన చీకటిగా ఉంటుందట. కొంచెం వివరంగా చెప్పు. ''


''అవన్నీ 2024వ సంవత్సరం నాటి పాత చింతకాయ పచ్చడి రోజులు డాడ్. అప్పటినుండి ఇప్పటివరకు75 సంవత్సరాలు గడిచింది కదా. మనం ఇప్పుడు 2099 లో ఉన్నాం కదా డాడ్. సిస్టంలన్నీ మారిపోయాయి. ప్రపంచం మొత్తం మెడి కల్ గా కూడా సూపర్ అభివృద్ధి చెందింది. ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు చీకటంతా పోయి వెలుతురుగా కనిపిస్తుంది. మరో పిల్ వేసుకుంటే చాలు సెకనులో అమెరికాలో ఉంటాం. సిరప్ తాగితే చాలు పది సంవ త్సరముల దాకా భోజనం చేయనక్కర్లేదు. అది కదా మనం జీవిస్తున్న ఈ 2099 వ సంవత్సరం ప్రత్యేకత. 


అసలు విషయం విను డాడ్. 


స్పేస్ లో 3 పాజిటివ్, 3నెగిటివ్ కోర్సులు ఉన్నా యి డాడ్. పాజిటివ్ కోర్సులు విషయానికి వస్తే


ఒకటి.. నీతి.. న్యాయం

రెండవ కోర్సు.. మంచి.. మానవత్వం

మూడో కోర్సు.. కృషి.. పట్టుదల 

చిత్రం ఏమిటంటే డాడ్ ఈ మూడు కోర్సుల దగ్గర ఒక్క స్టూడెంట్ లేడు. 


ఇకపోతే సెకండ్ వింగ్ ఏమిటంటే నెగిటివ్ కోర్సులు.. అవి

కూడా మూడు కోర్సులే ఉన్నాయి. 


మొదటిది

పగ.. ప్రతీకారం, 

రెండవది కుళ్ళు.. కుట్ర, 

మూడవది మోసం.. మాయ. 


ఈ మూడు కోర్సుల దగ్గర జనమే జనం. అడ్మిషన్ మాట ఎలా ఉన్నా కొట్టుకుచచ్చి పోతున్నారనుకో. మొత్తానికి ఇక్కడ అందరూ మన తెలుగు రాష్ట్రాల వాళ్లే. ఈ మూడింటిలో నాకు ఏ కోర్సు సెలెక్ట్ చేసుకో వాలో తెలియక నీకు మెసేజ్ చేశాను డాడ్. "


"వెల్ మైడియర్ బాయ్! మన తెలుగువాళ్ళ గొప్పతనం తెలియంది ఏముందిరా. అన్ని రంగాల్లో మనమే కదా ఫస్ట్. సరే నువ్వు మూడవ కోర్సు అదే ''మోసం మాయ'' కోర్సు సెలెక్ట్ చేసుకో. ఎప్పటికైనా ఉపయోగించేది అదే. నువ్వు ఒక్క సంవత్సరంలో కాదు ఒక్క నెలలో హైదరాబాద్ కొనేయగలవు.. ఏ కాలానికి అయినా మన మానవులకు బాగా ఉపయోగించేది ఆ కోర్స్ మాత్రమే. పుట్టుకతోనే ఆ కోర్స్ కొంతమందికి అలవాటవుతుంది కానీ ఇలా అంతరిక్షంలో స్పెషలైజేషన్ చేసి రావడం వల్ల నీకే కాదు నాకు కూడా బోలెడంత పేరు.. 


పాపులారిటీ. ఇప్పుడు కావలసింది అదే. ఓకే.. వెల్ డన్ మై డియర్ సన్. '' ఎయిర్ విండ్ సౌండ్ సిస్టం కట్ చేశాడు భయంకర సర్పదృష్ట. 


** 


అంతరిక్షంలో ఐదు రోజుల కోర్సు ముగించుకుని ఇంటికి వచ్చాడు భస్మాసుర.. ఆ 2099 వ సంవత్సరంలో


''డాడ్.. అక్కడ ''ఐ ఎస్సై ఎస్సై '''అని ఉంది. అది మన భూతలంలో చాలాదేశాలు కలిపి ఏర్పాటు చేసిన స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థ. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నమాట. మన భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. 


అక్కడ నుండి ఎవరికీ తెలియని ఒక గాఢాంధకారమైన స్పేస్ సీక్రెట్ ప్లేస్స్ లో నేను వెళ్ళిన స్పెషలైజేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారో కూడా తెలియదు. అక్కడ మనుషు లు ఎవరు కనిపించరు కానీ ఈ కోర్సులు నడుస్తూ ఉంటాయి. 


నేను.. నువ్వు చెప్పిన ''మోసం మాయ'' కోర్సు లోనే జాయిన్ అయ్యాను డాడ్. నన్ను కన్న తల్లిదండ్రులుగా అమ్మానాన్నలను ముందుగా గౌరవించాలి కదా డాడ్. అది ఐదు రోజుల కోర్స్. పూర్తయింది. కానీ ఒక నా మనసులో ఒక ఆలోచన తొలిచి తొలిచి పడేస్తుంది

.. చిన్న సందేహం డాడ్.. 


పూర్తయిన ఆ కోర్స్ ఎవరి మీద అయినా ప్రయోగిస్తే ఎలా పనిచేస్తుందో అన్నది ప్రయోగంగా చేసి చూడాలి కదా. ఇతరుల మీద ఎందుకు? మన ఇంట్లోనే ఉన్న మీ ఇద్దరిమీద అంటే అమ్మానాన్నల మీద ప్రయోగిద్దాం అని ఉంది. '' మత్తుగా జోగుతూ తూలుతూ అన్నాడు భస్మాసుర. 


''నేను ఊహించాను మై డియర్ సన్.. ప్రొసీడ్. '' అన్నాడు అతని తండ్రి భయంకర సర్పదృష్ట ఏమాత్రం కంగారు పడకుండా. 


భస్మాసుర వెంటనే తల్లిదండ్రులను చీకటి గదిలో బంధించి అన్నవస్త్రాలు ఇవ్వకుండా రాక్షస కృత్యాలు చేస్తూ వేధించాడు నాలుగు రోజులు. 


కొన్ని కాగితాలు తెచ్చి పూర్తి ఆస్తులు తన పేరు మీద బదిలీ అయ్యేటట్టు ఇద్దరినీ సంతకాలు పెట్టమన్నాడు. 


''ఈ మాత్రం దానికి అంతరిక్షంలో కోర్స్ ఎందుకురా.. 75 సంవత్సరాలుగా మన భూలోకం లోనే ఇందులో చాలామంది ఆరితేరి విజయం సాధించారు కదా. '' వికటంగా నవ్వుతూ అన్నాడు తండ్రి భయంకర సర్పదృష్ట. 


''అంతరిక్షంలో నేర్చుకొని వచ్చిన.. ''మోసం మాయ'' స్పేస్ స్పెషలైజేషన్ కోర్స్ అంటే నాకు ప్రత్యేకత ఉంటుంది సమాజంలో. నేను బంగారు కొమ్ములు తయారు చేయించి నెత్తి మీద పెట్టుకుని మరీ తిరిగే అర్హత సాధించానన్నమాట'' అంటూ భస్మాసుర తన తల్లిదండ్రులు ఇద్దరు సంతకాలు పెట్టిన కాగితాలు తీసుకొని వాళ్లను బయటకు గెంటేసాడు ఆ పట్టపగలు. 


2099 వ సంవత్సరం.. సెప్టెంబర్ నెలలో.. వేలాది మంది జనం చూస్తుండగా.. అని ఎవరు పట్టించుకో వడం లేదు సరదాగా సంతోషంగా ఆనందంగా.. డబల్ గెవా కలర్ సినిమా చూస్తున్నట్టుగా మహాదా నందంగా వెళ్ళిపోతున్నారు. 


*


రెండు నెలలు నడిచాయి. 


భస్మాసుర తన 'మోసo మాయ' ఉపాయాలతో ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ముఖ్యమైన కొన్ని కొన్ని పర్వతాల ఉపరితలాలు కొనేశాడు. కొన్నిదీవులు కూడా తన సొంతం చేసుకున్నాడు. 


తన ఛాంబర్ లో కూర్చుని ఫైవ్ ఎక్స్ ఎక్స్ బాటిల్ క్రిందకు దింపకుండా తాగుతున్న భస్మాసుర తనకు ఎయిర్ విండ్ సౌండ్ రావడంతో.. ఆన్ చేశాడు. అటునుండి అతని డియరెస్ట్ ఫ్రెండ్ నరకాసురది ఆ కంఠం. 


"హలో మైడియర్ భస్మాసుర, నేను రా. నీ డియరెస్ట్ ఫ్రెండ్ నరకాసురుడుని. బాగున్నావా అని అడగటం లేదు. ఎందుకంటే నీ బాగోగులు అన్ని నేను ఎంక్వయిరీ చేస్తున్నాను ఎప్పటికప్పుడు. విషయం ఏమిటంటే.. 


హైదరాబాదులో


'చిత్ర విచిత్ర మాయ అపార్ట్మెంట్స్ ' మీద నీ దృష్టి ఎందుకు పడలేదు. 1000 అపార్ట్మెంట్ల సముదాయం అది. ఆ అపార్ట్మెంట్స్ మొత్తం నీ సొంతం కావాలి. పైగా ఆ ప్రదేశంలో భూమిలో విలువైన ఖనిజాలు ఉన్న అవకాశం ఉందట. మాయోపాయమే చేస్తావో మంత్రో పాయమే చేస్తావో నాకనవసరం. డీల్ ఓకే అయినట్టు నీ నుండి నాకు ఎయిర్ విండ్ సౌండ్ మెసేజ్ రావాలి ఓకేనా. '' అంటూ భస్మాసుర ప్రాణమిత్రుడు నరకాసుర తన ఎయిర్ విండ్ సౌండ్ సిస్టం కట్ చేశాడు. 


‘నిజమే, తన ప్రాణ స్నేహితుడు చెప్పినట్టు ఆ అపార్ట్మెంట్స్ సముదాయం మొత్తం తన సొంతం కావాలి. అప్పుడే ఈ 2099 సంవత్స రములో ప్రపంచంలో తనకు గుర్తింపు’.. 

అనుకుంటూ పావులు కదపటం మొదలు పెట్టాడు భస్మాసుర. 'మాయ మోసం '.. చేసి ఆ అపార్ట్మెంట్స్ మొత్తం పైసా చెల్లించకుండా కొట్టేయాలన్నది అతని ప్లాన్. 


అంతే.. 50 కోట్ల విలువైన తన లగ్జరీ కారు మీద అపార్ట్మెంట్స్ ముందు ఆగాడు. అక్కడ రాసి ఉన్న నోటీసు బోర్డు మీద పడింది అతని దృష్టి. 


''ఇది చిత్ర విచిత్ర మాయా మయసభ లాంటి అపా ర్ట్మెంట్స్. మీరు లోపలకు ప్రవేశించి ఒక ప్లాట్ బుక్ చేసుకోవాలంటే ముందుగా ఎడమ పక్కన కనిపిస్తున్న రౌండ్ గ్లోబులోకి వెళ్లి మూడు బటన్స్ నొక్కండి. అది ఆగే వరకు మళ్లీ బటన్స్ ఆపరేట్ చేయకండి. అలా అయితేనే మీరు మేనేజర్ని చేరగలుగుతారు. ఈ పద్ధతి తాము ప్లాట్ కొనుక్కుని సొంతం చేసుకోవాలనుకునే వారికి పరీక్ష లాంటిది అన్నమాట. అలా గెలిచిన వారే ఈ అపార్ట్మెంట్లలో బ్రతికి బట్ట కలుగుతారు.. రాంగ్ బటన్ ఆపరేట్ చేస్తే ప్రాణాంతకం కావచ్చు దానికి మా బాధ్యత లేదు. 


అంత అద్భుతం అన్న మాట ఈ కాన్సెప్ట్. ఇదే ఈ చిత్ర విచిత్ర మాయా మయసభ లాంటి అపార్ట్మెంట్స్ ప్రత్యే కత. అందుకోసమే ప్రపంచ దేశాలలో అగ్రనాయకులు కూడా ఎగబడుతున్నారు. "


అలా ఎంట్రన్స్ లో గోల్డెన్ లెటర్స్ తో రాసి ఉన్న

నోటీసు బోర్డు చదివి.. చదివి.. అపార్ట్మెంట్ గేటు దాటి లోపలికి వెళ్లి రౌండ్ గ్లోబులో ప్రవేశించాడు భస్మాసుర. 


'ఆ.. ఏమవుతుందిలే ఇదంతా ఫోకస్ మ్యాజిక్. ఉత్తి బోగస్. అంతరిక్షంలో 'మోసం మాయ' స్పెష లైజేషన్ కోర్సు చేసి వచ్చిన నాముందు ఈ ట్రిక్స్ కుదరవు. ' అన్న అహంకారంతో అందులోని మూడు బటన్స్ ఆపరేట్ చేశాడు భస్మాసుర. దాని రిజల్ట్ పూర్తిగా చూడకుండానే మళ్లీ రాంగ్ బటన్ ఆపరేట్ చేశాడు. 


అంతే! రాంగ్ ఆపరేషన్తో ఒక స్పార్క్ వచ్చి భస్మాసుర భస్మ మైపోయాడు. ఆ రౌండ్ గ్లోబులో మాడీ మసి అయిపోయి బూడిద అయిపోయాడు. ఆ రౌండ్ గ్లోబులో ఏర్పాటు చేసిన కంప్యూటర్ సిస్టంతో ఆ బూడిద కూడా కనిపించకుండా మాయం అయిపోయింది. 


**


'చిత్ర విచిత్ర మాయ అపార్ట్మెంట్స్' మేనేజర్ 99 ఫ్లోర్ లో తన ఛాంబర్ లో నీడిల్ డ్రైవ్ ఓపెన్ చేసి పర్సనల్ బ్లాగులో డైరీ డైలీ మెసేజ్ రికార్డు చేసుకుంటున్నాడు. 


ఆ రికార్డు సారాంశం ఈ విధంగా ఉంది. 

''ఇది 2024 కాదు.. 2099. ఇక్కడ కొడుకులు తల్లి దండ్రులను బాధించడం అన్న సమస్య లేదు. వృద్ధా ప్యాన్ని జయించే మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాక ఎవరూ వృద్ధులు కారు. మృత సంజీవని ఇంజక్ష న్ మార్కెట్ లోకి వచ్చాక ఈ 2వేల తొంబై తొమ్మిదవ సంవత్సరము ఆరోగ్య సమస్యలు కూడా ఏ ఒక్కరికి లేవు. 


'మోసం మాయ' తో కొడుకులు హింసిస్తారని ముందు గానే తల్లిదండ్రులు రకరకాల విధానాల్లో ఎవరికి వారే జాగ్రత్త పడటం మొదలు పెట్టేసారు. తల్లిదండ్రులే కొడుకులను మట్టి కరిపిస్తున్నారు. మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఈ 2099వ సంవత్సరం లో ఇది హర్షించదగిన విషయం అంటూ మేధావులు సైతం సంతోషిస్తున్నారు. ఈ మార్పు అని వార్యం. ఇది మంచి పరిణామం. 


అది 'చిత్ర విచిత్ర మాయ అపార్ట్మెంట్స్ ' మేనేజర్ చేస్తున్న రికార్డు సారాంశం. 


అంతేకాదు ఇంకా ఈ క్రింది విధంగా రికార్డు చేయడం కూడా మొదలుపెట్టాడు. అతను. 


అలాగే నేను కూడా నా జాగ్రత్తలో నేను ఉన్నాను జాగ్రత్త పడ్డాను.. సరిగ్గా 2 నెలల క్రితం నా కొడుకు నా ఆస్తి మొత్తం లాగేసుకుని నన్ను నా భార్య బ్రహ్మ రాక్షసిని భయంకరంగా పట్టపగలే బయటకు గెంటేశాక బినామీల దగ్గర నేను జాగ్రత్తపెట్టుకున్న ఆస్తులతో మళ్లీ శత కోటీశ్వరుడు అయిపోయాను. 


ఈరోజు నా 'చిత్ర విచిత్ర మాయ అపార్ట్మెంట్స్' ప్రవేశిస్తూ ఎంట్రన్స్ లోనే అత్యాశకుపోయి రాంగ్ బటన్ ఆపరేట్ చేసి మసైపోయినవాడు నా కన్న కొడుకు భస్మాసురే!!!. 


అయినా ఐ డోంట్ కేర్. ఈ దశకంలో రక్తం.. సంబంధం.. 

తల కొరివి.. ఈ పదాలన్నీ ఉత్తుత్తి ట్రాష్.. ఇదంతా జాంతానై.. అదంతా ఒక బూటకం.. అదంతా ఒక మాయ.. ". 


అలా తన పర్సనల్ బ్లాగులో డైరీ మెసేజ్ రికార్డు చేసుకున్నాక నీడిల్ డ్రైవ్ క్లోజ్ చేసి సీక్రెట్ పాయింట్లో భద్రపరిచాడు భయంకర సర్పదృష్ట.. అలియాస్ అదృష్ట రావు.. 



 2060 సంవత్సరంలో ఒక మగ బిడ్డను కన్న తండ్రి.. 2099వ సంవత్సరం వచ్చాక కూడా ఆ మగబిడ్డ వల్ల ఏమాత్రం భయపడలేదు. కొడుకు వల్ల అన్యాయం కాలేదు. అవస్థల పాలు కాలేదు. ఆకలికి అలమటించే సమస్యకు లోను కాలేదు అతనే ద సూపర్ గ్రేట్.. ''చిత్ర విచిత్ర మాయ అపార్ట్మెంట్స్'' మేనేజర్ ఆఫ్ భయంకర సర్పదృష్ట.. అలియాస్ అదృష్టరావు.. 



 అది 2099 వ సంవత్సరం మరి


****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 




32 views0 comments

Comments


bottom of page