'Bhavikatha Premakatha' - New Telugu Poem Written By M. Laxma Reddy
Published In manatelugukathalu.com On 24/06/2024
'భావుకత ప్రేమకథ' తెలుగు కవిత
రచన: M. లక్ష్మా రెడ్డి
ఓ ప్రభాతం ఇంత అందమా .. ప్రభాతం ఇంత అందమా... ఈ అందమే ప్రభాత కారణమా.. నేనెరగని ఈ సౌందర్యం..నా ఎదురుగా కనీసం కనుతిప్పని తీరు మరీ పొగరుగా అయినను.. సుకుమార వీక్షణం నేరం కాదే లావణ్య సమ్మోహనం నయన వేడుకే అన్న నా ఫిలాసఫికి.. కళ్ళు మనసూ రెంటినీ తనవేపు లాగేసుకుంటుంటే నే చేష్టలుడిగి పోయా.. మా లోగిలే వేదిక..మనసంతా వేడుక.. అతి సర్వత్ర ...అన్నట్టు .. నా మస్తిష్క భావన తను కన్నట్టు.. ఈ వేళకి ఈ మాత్రమే నీ నయన ఆకలికి నా అల్పాహారం అన్న చందాన.. అంతర్థానం.. ఎవరో తెలుసా.. ఏ మాయో.. ఏమాయె మనసా.. ఏదో హాయే.. ఇక కనులు వెతికే ప్రతి ఘడియ నీకై సాయంవేళ సన్నజాజులు కోస్తావని.. రాతిరేల చుక్కల లెక్కకొస్తావని.. అన్నీ ఆశలే.. ప్రతి పూటా నిరాశే.. పగటి పూట..సగటు అడపిల్లలా మేడ మీద వలువలు ఆరేస్తూ నా కంట చిక్కకుండా తప్పించుకోవులే..అనుకున్నా .. ఆ బాధ్యత నీది కాదని.. మీర్జాపూర్ మహారాణి స్థాయిని అంచనా వేయలేక ఆ ఎండ వేళల నే మండిపోయా.. ఇక ఇంతే..అని గుండె సర్దుకునే వేళకి.. ఏ పక్షానికో.. కేలండర్లో ఇదే తారీఖు కనబడే నెల వేళకో.. మళ్ళీ అదే సోయగం .. ఈసారి ఓర చూపు.. క్షణంలో వేయవ వంతు అంటే కాస్త ఎక్కువనేమో.. ఆ చూపు మహత్తు .. మరుసటి వేళ వీక్షణకి నిరీక్షించే ఉత్సాహమంత.. మళ్ళీ కనబడగానే గుండె వడి మార్చే ఉత్తేజమంత.. సుకుమారం అని ఒక్క మాటలో తేల్చేస్తే.. మిగతా పోలికలు గుక్క పెట్టి ఏడ్చి.. వాటి ఉసురు నాకు తగిలే ప్రమాదం ఉంది కనక.. దాదాపు దరిదాపు చేరే అవకాశం లేదని తెలిసీ నా మనసు ఉబలటాన్ని తీర్చ నీ వర్ణన..నా కోణాన విరిసిన విరజాజిలా.. ఉదయవేళ నీ ప్రస్థానం.. తాజా మరుమల్లిలా ..నీ ఆగమనం అద్భుతం.. నీ దరహాసం.. అందానికే చేవ్రాలు కవినవ నీ కనులని చూస్తే చాలు సాగర తీరాన సందెవేళ సూర్యాస్తమయం కడు రమణీయం.. సమీపాన నను దాటి నీవెల్లే క్షణాన ..కనులకి నీ సౌందర్యం మరింత కమనీయం.. మరునాడు సూర్యోదయం.. షరా మామూలే.. నీ దర్శన సౌభాగ్యం మటుకు ప్రశ్నార్థకమే.. ప్రకాశమయ్యే నా ప్రతివేళ నీ వల్ల ప్రభావితమయ్యే నా ప్రతి కదలిక నీ వల్ల ప్రేమ అనలేను గానీ.. ఆకర్షణ అంటే సరికాదు గానీ.. అభిమానం అంటే సరిపోదు గానీ.. అభిమానం వల్ల ప్రేమతో కూడిన ఆకర్షణ అంటే కాస్త నిజమో..ఇంకాస్త అతిశయోక్తో.. ఎలా విన్నవించినా.. ఎద నిశ్శబ్దంగా నినదించెనే.. ఒక్కటి నిజం.. నీతో ఈ ప్రయాణం బావుందే.. నీవల్ల మనసు పరిపరి విధాల సంబరపడెనే.. ముగింపు లేని..ప్రేమకథ ఇది ముగించలేని.. భావుకత నాది.. |
M. లక్ష్మా రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి. మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి. గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/laxmareddy నేను లక్కీ.. లక్మారెడ్డి రసాయన శాస్త్ర బోధన వృత్తి.. ప్రైవేటు కళాశాలే సుమా.. అడపా దడపా.. కలం కాగితం కనబడగానే...మనసు మాటలు అక్షరాల రూపంలోకి దొర్లి.. మనసు తేలిక అవుతుంది...ఆ ప్రయాసలోనే.. ఆ ప్రహసనం లోనే.. నా కవితలు.. చిన్ని కథానిక లాంటి నాలుగు పంక్తులు.. నచ్చితే..ఒకాట చెప్పండి.. ఇంకోటి రాస్తాను.. నచ్చకుంటే భేషుగ్గా చెప్పండి... ఇంకాస్త పద్ధతిగా రాస్తాను... ధన్యవాదాలు... |
Comments