'Bhayam' - New Telugu Story Written By Shilpa Naik
Published In manatelugukathalu.com On 18/04/2024
'భయం' తెలుగు కథ
రచన: శిల్పా నాయక్
"ఇంతరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయమేస్తుంది. మా పేరెంట్స్ కి తెలుసు నాకు ఒంటరిగా ఉండడం భయమని. కానీ వాళ్ళేమో ఆ భయాన్ని పోగొట్టడానికే నన్ను ఇంట్లో ఒంటరిగా ఈ రాత్రంతా గడపాలని చెప్పారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నాకు చీకటంటే భయం లేదు, ఆ చీకట్లో ఎవరున్నారన్నది భయమని.
‘చెప్పడం మర్చిపోయా రోజూ నన్ను ఒకడు ఫాలో చేస్తున్నాడు. వాడు ఈరోజు కనిపించలేదు. ఏమైపోయాడో ఏంటో. ఈ రాత్రి ఎలాగైనా గడిచిపోతే చాలు’
అంటూ దీప తన వాట్సాప్ లో తన ఫ్రెండ్ నైనకి వాయిస్ మెసేజ్ పెడుతుంది. లంకంత ఇంట్లో దీపం అన్ని రూంల లైట్స్ ఆన్ చేసి ఒంటరిగా ఒక రూమ్ లో కూర్చుని ఇంస్టాగ్రామ్ చూస్తుంటుంది.
అప్పుడే కిచెన్ లో టాప్ ఓపెన్ ఐయి నీళ్లు కారుతున్న శబ్దం వినిపించడంతో దీప ఫోన్ బెడ్ మీద పెట్టి మెల్లగా కిచెన్ లొకి వెళ్తుంది. కిచెన్ లో టాప్ ఓపెన్ అయి వాటర్ అంతా సింక్ లోకి వెళ్తుంది. దీప టాప్ క్లోజ్ చేసి తన రూమ్ కి వెళ్తుంది. కానీ బెడ్ మీద పెట్టిన ఫోన్ కనిపించలేదు.
దీప కంగారుగా రూమంతా వెతుకుతుంది. కానీ ఫోన్ ఎక్కడా కనిపించదు. దాంతో హాల్ లోనే టెలిఫోన్ వైపు వెళ్తుంది. కాని ఫోన్ పని చేయకపోవడం వల్ల ఇక్కడేదో ఉందని కంగారు పడుతూ బైటికి వెళ్లాలని మెయిన్ డోర్ వైపు పరిగెడుతుంది. కానీ డోర్ ని ఎవరో బైట నుంచి లాక్ చెయ్యడం వల్ల దీప ఇంకా భయపడుతుంది.
అప్పుడే కిచెన్ నుంచి తన రూమ్ కి ఏదో ఒక నల్లటి ఆకారం వేగంగా వెళ్లినట్టు అలికిడి వినిపిస్తుంది. దీప టెర్రస్ మీద వెళ్తే తన పక్కింటి వాళ్ళని సహాయం కోసం పిలవచ్చని, టెర్రస్ మెట్లు వేగంగా ఎక్కుతుంది. కానీ టెర్రస్ డోర్ కూడా లోపలనుంచి లాక్ చేసి ఉండడం గమనించిన దీపకి ఒక విషయం గుర్తుకు వస్తుంది.
సాయంత్రం తన పేరెంట్స్ ఊరెళ్లినా తర్వాత నుంచి తను అసలు టెర్రస్ వైపు వెళ్ళలేదని విషయం. మరి ఆలాగైతే టెర్రస్ డోర్ ని ఎవరు లాక్ చేసుంటారని ఆలోచనకి దీప భయంతో వణుకుతుంది. ఇంట్లో వస్తువులన్నీ గోడకేసి ఎవరో కొడుతున్నటుగా శబ్దాలు వినిపిస్తాయి. దీప తన జడలో ఉన్న హెయిర్ పిన్ తో డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇంట్లో కరెంటు పోవడంతో డోర్ దగ్గర ఉన్న లైట్ కూడా ఆఫ్ అయిపోయి చీకటిగా ఉంటుంది. ఐనా దీప చీకట్లో ఏం
కనిపించకపోయినా తను తాళం తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది.
అప్పుడే టెర్రస్ మెట్లు ఎవరో ఎక్కుతున్నటుగా అడుగు చప్పుడ్లు వినిపించడంతో దీప ఏడుస్తూ ఇంకా వేగంగా తాళం తీయడానికి ప్రయత్నిస్తుంది. ఆ అడుగుల చప్పుడు కూడా వేగంగా వస్తున్నట్టుగా వినిపిస్తాయి. ఆ అడుగులు దగ్గర వచ్చేసరికి డోర్ లాక్ ఓపెన్ ఐయిపోవడంతో గడియ తీసి బైటకి వెళ్ళేలోపు ఎవరో వెనుక నుంచి దీప జుత్తు పట్టుకుని చీకటి ఇంట్లో లాక్కెళ్లిపోతారు.
3వ రోజు పత్రికలో, "17 ఏళ్ళ అమ్మాయి ఇంట్లో నుంచి మిస్ అయ్యిందంటూ, దీప ఫొటోతో ఒక ఆర్టికల్ ప్రింట్ అవుతుంది.
***
శిల్పా నాయక్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు శిల్ప. నేను రచయిత్రిని అని చెప్పలేను. కానీ అప్పుడప్పుడు ఫాంటసీ, భయం కల్పించే కథలు రాస్తుంటాను. కథలు రాయడం ఇప్పుడే నేర్చుకుంటున్నా.
Comments