'Bheshaja Sunya Bhashabhimanam' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally
'భేషజ శూన్య భాషాభిమానం' తెలుగు కవిత
రచన: సుదర్శన రావు పోచంపల్లి
ప్రాచ్య దేశమని ప్రాశస్త్యము కలిగి
అప్రాచ్యపు అలవాటులు బొందుచు
పలుకుల తల్లికి పరిపరి విధముల
ములుకులు గ్రుచ్చెడి పలుకులు బలుకుట
తెలుగు నేలపై వెలుగులు జిందే
తెలుగు తల్లి వెల వెల బోవగ
భాషావేశం భావోద్రేకం
భేషజమసలు లేశం లేక
ఎంగిలి పలుకుల ఇంగిలీషుతొ
తల్లి తండ్రి గురువును సైతం
తప్పని ఎంచక మమ్మీ డాడీ మాస్టారంటూ
అన్నా తమ్ముడు అక్కా చెల్లెలు
మరి ఇంకెందరొ మనవాళ్ళైనా
ఆంటీ అంకుల్ సిస్టర్ బ్రదర్
లాంటివి ఎన్నో పదములు వాడుచు
భాషకు తోడుగ వేషం మార్చి
భవితలొ ఉండే మన ఉనికిని తలువక
పూర్వ చరిత్రకు పూజ్యం జుట్టి
నేర్చే భాషలొ నేర్పరి గాలేకయు గూడ
మార్పే గోరుచు అలవాటులు
నేర్చే భావన అటు ఇటు గాక
త్రిశంకు స్వర్గం తిప్పలు దప్పవు
మన తెలుగు తల్లికి తేజం తరిగెడి
రోజులు వచ్చును తస్మాత్ జాగ్రత.
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comentários