top of page

భిన్నత్వంలో ఏకత్వం!!!

#BhinnatwamloEkathwam, #భిన్నత్వంలోఏకత్వం, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Bhinnatwamlo Ekathwam - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 11/11/2024

భిన్నత్వంలో ఏకత్వంతెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


"శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణ శుభాంగం

లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యం

వందేవిష్ణుం భవభవహరం సర్వలోకైకనాథం!!


ఆషాడ మాసపు శుద్ధ ఏకాదశి ’ తొలి ఏకాదశి’. దీనికి మరోపేరు శయన ఏకాదశి. ఎందువలన అనగా, శ్రీ మహా విష్ణుమూర్తి ఆరోజు నుండి ’కార్తీక శుద్ధ ఏకాదశి’ వరకు యోగనిద్రలో ఉంటారని. ఆనాటినుండి శ్రీహరి భక్తులు కామక్రోధధులను వర్జించి ప్రయాణాలు చేయకుండా, ఒకేచోట ఉండి శ్రీహరులను అర్చిస్తూ, తిరిగి ’కార్తీక శుద్ధ ఏకాదశి’ మరోపేరు ఉత్దాన ఏకాదశి వరకు నాలుగు మాసములు దీక్షతో చాతుర్మాస్య వ్రతం చేయుట అన్నది మహా విశేషకరమైనదని మన ఆర్యుల వివరణ.


కనుక.... నీవు ఆ శ్లోకాన్ని జపిస్తూ ఆ దీక్షను పాటిస్తూ శ్రీ విష్ణుమూర్తిని అర్చించిన, నీ మనో అభిష్టాన్ని తప్పక ఆ శ్రీమన్నారాయణుల వారు నెరవేరుస్తారు రమణ. నీవు నా శిష్యుడవు. నా మాట మీద నమ్మకం వున్నవాడివి. ఆ కారణంగా నీ సమస్య విని, నాకు తోచిన ఆ సలహాను ఇచ్చాను. చిత్తశుద్ధితో ఆచరించు" 


చిరునవ్వుతో చెప్పారు గురువులు శ్రీ శంకరశాస్త్రి గారు.

రమణ... ముఖంలో ఆనందం... గురువులకు పాదాభివందనం చేసి, వారి ఆశీర్వచనాన్ని తీసుకొని బయలుదేరబోయాడు రమణ.


"రమణా!...." పిలిచారు శ్రీ శంకర శంకరశాస్త్రిగారు.


"గురూజీ!... చెప్పండి."


"ఒక గంట కూర్చోగలవా!" చిరునవ్వుతో అడిగారు గురువుగారు.


"తప్పకుండా గురూజీ!" నేల గురువులకు ఎదురుగా కూర్చున్నాడు రమణ. గురువుల ముఖంలోకి చూచాడు.


శ్రీ శంకర శాస్త్రిగారు కళ్ళు మూసుకొన్నారు. చేతివ్రేళ్లతో గణిస్తూ మనస్సున ఏదో ధ్యానం. రమణ దీక్షగా గురుల చర్యను గమనిస్తున్నాడు. వారినోటినుండి....


"యోగః కర్మసు కౌశలం" కర్మ కౌశలమే యోగం

’సమత్వం యోగ ఉచ్యతే’ - సమత్వమే యోగం

’మమేకం శరణ వ్రజ’ - నన్నే శరణు పొందు

’ఏకమేవ ద్వితీయం’ - ఒక్కటే. రెండవది లేదు


కర్మ, యోగ, భక్తి, జ్ఞానాలను సూచించే 

ఈ నాలుగింటి అర్థమూ ఒకటే. ఒకే సత్యం భిన్న ముఖాలుగా ప్రదర్శించబడింది.

(ఓం నమో భగవతే శ్రీరమణాయ)

గురువుగారు మెల్లగా కళ్ళు తెరిచారు. చిరునవ్వుతో శిష్యుడు రమణ ముఖంలోకి చూచాడు.


"రమణా!..."


"గురూజీ!"


"ఏకోనారాయణుడు ఒక్కడే!..... అందరు మానవులు సములు ఒక్కటే. కుల మతాలు, సిద్ధాంతాలు మానవ కల్పితాలు. కోట్లు జనాభా వున్న అవని ఇది. భాషలు వేరు, తత్త్వాలు వేరు. కానీ మనుషులంతా ఒక్కటే. వారందరికీ వుండవలసిన తత్త్వం, భావన ఒక్కటే. సృష్టిలో వున్న అన్ని జీవరాసులలో మహోన్నతుడు మానవుడు. పరస్పర ఆదరాభిమానాలను, ప్రేమానురాగాలను కలిగి మానవ సమాజం సఖ్యతతో జీవించాలి. విశ్వశాంతికి పాటుపడాలి. ఇదే హైందవ సిద్ధాంతం. ఈ నామాటలను నీవు నమ్ముతావా రమణా!" ఆశగా గురూజీ రమణ ముఖంలోకి చూచాడు.


"నమ్ముతాను గురూజీ!..."


"ప్రస్తుతం మన దేశంలో అరాచకాలు జాస్తి అయినాయి. కొందరు అతివలు మన సనాతన హైందవ ధర్మాలను మరచి పాశ్చాత్య నాగరీకత వ్యామోహంలో తమ ఉనికి విస్మరిస్తూ, పురుష నిరసనతో తాము, అన్ని విషయాల్లో పురుషులకు సమానమనే భావనతో భర్త తన మాటలను గౌరవించకపోయినా, విమర్శించినా, తప్పు అని తనకు తోచిన మంచి సలహానిచ్చినా, పాటించకుండా, ఆదరించి గౌరవించకుండా, విడాకులను కోరుతున్నారు. అర్థాంగి అనే పద పరమార్థాన్ని విస్మరిస్తున్నారు. ఈ ధోరణి హైందవతకు గొడ్డలి వేటు. స్త్రీ తత్వానికి కళంకం. జాతి నిర్వీర్యతకు కారణం. ఈ తీరును మార్చాలి. ఇది ఒక సమస్య. 


రెండవది మత, కుల వ్యామోహం కులపరమైన వర్గాలు, మతపరమైన సమాజాలు, పార్టీలు, నాస్తిక వాదం పెరుగుతున్నాయి. కనుక యావత్ హైందవ జాతి పేదా, గొప్పా తేడా లేకుండా (కుల మత రహితంగా) పరస్పర గౌరవాభిమానాలతో ఏకం కావలసిన తరుణమిది. సాటి వ్యక్తుల మనస్సున సమతను మమతను నింపాలి. అందరం భారతీయులం అనే భావన ప్రతి హృదయంలోను కులమతాలకు అతీతంగా నిండిపోవాలి. వ్యక్తిగత, మత, కుల పర విమర్శలు అనుచితం. సఖ్యత సౌభ్రాతృతం అత్యవసరం.


నీలాంటి విద్యావంతులైన యువకులంతా సద్భావంతో యావత్ భారత జాతి సఖ్యతకు పాటుపడాలి. ఈ భూమిమీద జన్మించిన ప్రతి ఒక్కరూ (మత కులాలకు అతీతంగా) భారతీయులే!. ఆ పవిత్ర భావన అందరి హృదయాల్లో నిండాలి. నింపాలి...


ఇలాంటి భావాలతో యువత ముందుకు ప్రగతిపథంలో నడవాలి. అందరూ భారత్ సేవా సమాజ్ (B.S.S) సభ్యులుగా మారాలి. అమాయక ప్రజల హృదయాల్లో వారిని గురించి వారు తెలిసికొనే రీతిగా పరివర్తనను కలిగించాలి.


పుట్టిన మనిషి ఒకనాడు గిట్టుట తధ్యం. ఆ తరువాత మిగలాలి అతని సుచరిత్ర భావి తరానికి ఆదర్శంగా. పుట్టాము ఒట్టి చేతులతో... పోతాము అదేరీతిగా ఒట్టి చేతులతోనే... ఆర్జించినది ఏదీ మనతో రాదు. నిలిచేది ఒక్కటే ఇలపై అది నీ మంచితనం. కనుక మత కులాలకు అతీతంగా, సాటివారందరూ, మనలాంటి వారే అనే భావనతో సమాజంలో మమతను పంచాలి. మానవతను పెంచాలి. అదే మానవత్వం.


కృత యుగము (సత్యయుగము) కాలం 1728000 సంవత్సరాలు 

గడచిన కలి యుగము (సత్యయుగము) కాలం (CE) 5125 సంవత్సరాలు 

శేష కలి యుగము (సత్యయుగము) కాలం (CE) 426875 సంవత్సరాలు 

(కలియుగ ప్రారంభం 17/18 ఫిబ్రవరి 3102 (BCE) కలియుగ అంతం 428899 CE (BCE అంటే బిఫోర్ క్రైస్ట్) (CE అంటే ఆఫ్టర్ క్రైస్ట్) కనుక కాలయుగ శేషకాలాన్ని అనుసరించి దేశంలో ప్రజల మధ్యన మంచి మానవత్వం స్నేహభావం, సఖ్యత ఎంతో అవసరం.


రమణా!.... ఏదైనా మొదట ఒక తత్త్వమో, సిద్ధాంతమో, సందేశమో ఎవరో ఒకరినుండి సమకాలికులకు తెలుస్తుంది. ఉదాహరణకు విమానం, రైట్ సోదరులు 1905 నుండి 1907 వరకు వారు ఫ్లయింగ్ యంత్రాన్ని మొదట ఆచరణాత్మక కార్యదీక్షతో కనిపెట్టి, నిర్మించి, నియంత్రించి 1905 డిసెంబర్ 17వ తేదీన తొలుత గాలిలో ఎగిరించారు. 1905 నుండి 1907 వరకు ఆ సోదరులు వారి ఫ్లయింగ్ యంత్రాన్ని మొదట ఆచరణాత్మక స్థిర వింగ్ విమానంగా అభివృద్ధి పరిచారు.


స్థిరవింగ్ (రెక్కలు) ఆధారంగా విమాన నియంత్రణను సాధ్య చేయటం మొదట కనిపెట్టినవారు ఆ ఇరువురూ రైట్ సోదరులు, అమెరికన్స్. వారి పేర్లు ఓర్విల్లే, విల్బర్. వారి జననం ఓర్విల్లే 19.08.1871. మరణం 30.01.1948. విల్బర్ జననం 16.04.1867. మరణం 30.05.1912. వారి తర్వాత ఆ నమూనాల ప్రకారం గొప్ప గొప్ప విమానాలు తయారు చేయబడ్డాయి.


అలాగే సనాతన ఋషి హైందవ పరంపరలో అద్వైతము, ద్వైతము విసిష్టాద్వయము, క్రమంగా ఏర్పడినవి. ఇవి మూడు జీవుడికి దేవుడికి వున్న అవినాభవ సంబంధాన్ని తెలియజేయు మహోన్నత తత్వాలు. అద్వైత వివరణ కర్తే శ్రీశ్రీ జగత్ గురువులు ఆది శంకరులవారు. ద్వైతార్థ వివరణ చేసినది శ్రీ శ్రీరామానుజాచార్యులు. విశిష్టాద్వత వివరణ చేసింది శ్రీశ్రీ మధ్వాచార్యులు ఆదికాలంలో ఈ ముగ్గురు కన్నా పూర్వం మహర్షి వేదవ్యాసుల వారు అన్ని వేదములను క్రమబద్ధీకరించి నాలుగు వేదములుగా విభజించారు. వేదరచన చేసింది శ్రీశ్రీ వాల్మీకి మహర్షిగారు.

ప్రస్థాన్ త్రాయి, అని పిలువబడే త్రిమూర్తుల గ్రంధాలు ఉన్నాయి. ప్రస్థానం - త్రయి. అవి మూడు. 


1. ఉపనిషత్తులు (వేదాంత లేదా వేదాల ముగింపు భాగం)

2. బ్రహ్మ సూత్రం

3. భగవద్గీత


వేదాలు అపౌరుషే. ఆపౌరుషే అంటే వెల్లడయైన జ్ఞానం.

బ్రహ్మసూత్రం మరియు భగవత్‍గీత, మహర్షి వేదవ్యాసుల సృష్టి. అద్వైతం అంటే రెండు కానిది. లేనిది. అంటే నీ మనస్సున భగవత్ వాక్కుగా ఏది నిలుచునో అది. అది ఒక్కటే (రెండవది లేదు) 

రమణా!.... మన హైందవ జాతి అంతా అద్వైత సిద్ధాంత బద్దులే. కనకనే మనం చర్చి, మసీదులను మన దేవాలయాలుగా భావి వెళ్ళగలం. వారు పిలిస్తే వెళతాము. మనకు దైవ విషయంలో భేదం లేదు.


ప్రపంచంలోని మొత్తం దేశాలు - 195

ఆసియా ఖండంలో మొత్తం దేశాలు -  43

ఆఫ్రికా ఖండంలో మొత్తం దేశాలు -  54

ఐరోపా ఖండంలో మొత్తం దేశాలు -  44

లాటిన్ అమెరికా / 

కరేబియన్లలో మొత్తం దేశాలు -  33

ఓషియానియాలో మొత్తం దేశాలు -  14

ఉత్తర అమెరికాలో మొత్తం దేశాలు -  2


పై సంఖ్యలో 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యులు. హోలీస్, పాలస్తీనా దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యులు కారు. ప్రపంచ అన్ని దేశాలకు (పాకిస్థాన్, చైనా తప్ప) మన ఈ భారతదేశం పట్ల ఎంతో గౌరవ అభిమానాలు. దానికి కారణం, మనదేశం మరో ప్రపంచం.


2001 జనాభా లెక్కల ప్రకారం మన భారతావనిలో 122 ప్రధాన భాషలు, మరియు 1599 ఇతర భాషలు వున్నాయి. వారందరిలో వివిధ సాంప్రదాయాలు, ఆచారాలు, సిద్ధాంతాలు కలిగివున్నారు. బయట దేశాల వారికి తెలిసింది. మనలోని "భిన్నత్వంలో ఏకత్వం."


ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులను అనుసరించి నీలాంటి విద్యావంతులైన యువత, మన ఈ భరతజాతి సఖ్యతకు పరస్పర సమభావాలను, ప్రతి వ్యక్తిలో వెలిగించేదానికి పాటుపడాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలి. రమణా! ఆ మార్గాన పయనిస్తానని నాకు మాట ఇవ్వగలవా!..." చిరునవ్వుతో తన కుడిచేతిని ముందుకు సాచాడు గురూజీ.


రమణ... ఆశ్చర్యంతో గురువుగారి ముఖంలోకి తదేకంగా చూడసాగాడు. అతని మనస్సున... ’నా గురుదేవులు సామాన్యులు కారు. సుధీర్ఘ చర్చలో ఎన్ని అంశాలు, ఎన్ని విభిన్న విషయాలు, ఎంత ప్రాపంచిన జ్ఞాన సంపద!!! గురుదేవా!... మీకు సాటి మీరే!...’ అనుకొన్నాడు.


తన కుడిచేతిని వారి చేతిలో వుంచి....

"గురుదేవా!... మనసా, వాచా, కర్మణా నా జీవితాంతం నేను మీ వూహల్లో వున్న మన పవిత్ర భారత సేవా సమాజ్, ముఖ్య సభ్యునిగా, కార్యకర్తగా మీ మహోన్నత ఆశయాన్ని నెరవేర్చేదానికి పాటుపడతాను." ఆనందంగా చిరునవ్వుతో చెప్పి, రెండు చేతులను చేర్చి, గురూజీ పాదాలు తాకాడు రమణ శ్రీశంకర శాస్త్రిగారు, అతని తలపై తన వామహస్తాన్నుంచి మనసారా దీవించారు. ఆ సమయంలో ఇరువురి నయనాల్లో కన్నీరు.... అవి ఆనందభాష్పాలు....


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


22 views0 comments

Comentários


bottom of page