#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #BhuviloAmrutham, #భువిలోఅమృతం, #TeluguStoryOnCoffee
'Bhuvilo Amrutham' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 04/10/2024
'భువిలో అమృతం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
చిన్నప్పటినుంచి నాకు ఇంట్లో కాఫీ అలవాటు చేసారు.. అమృతం అంటే, ఇదేనేమో అనేలాగా. తెల్లవారగానే ముఖం కడుక్కోగానే, గొంతులో వేడి కాఫీ పడాలి. స్కూల్ లో చదువుతున్న రోజుల నుంచే ఆ అమృతం రుచి చూసాను. అప్పట్లో అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ కోసం ప్రతి ఉదయం చూసేవాడిని.
ఇప్పుడు నేను పెద్ద చదువుల కోసం ఒక పల్లెటూరిలో చదువుతున్నాను. ఉదయాన్నే కాఫీ తాగాలంటే, ఒక కిలోమీటర్ నడిచి వెళ్ళాలి.. అక్కడే మంచి కాఫీ దొరుకుతుంది మరి. కాఫీ తాగిన తర్వాతే, నా రోజు మొదలవుతుంది. నాకు చిన్నప్పటినుంచి నిప్పంటే చాలా భయం.. అందుకే వంట కూడా నేర్చుకోలేదు.
చదువు అయిపోయాక.. నాకు ఒక టీచర్ గా పల్లెటూరిలో పోస్టింగ్ వచ్చింది. అక్కడా అదే పరిస్టితి. మంచి కాఫీ కోసం ఎంత దూరమైనా వెళ్లి తాగేవాడిని. కాఫీ కోసం ఎప్పుడూ నాకు అన్వేషణ తప్పేది కాదు.. పోనీ అమ్మ వచ్చి వండి పెడుతుందా అంటే, అక్కడ నాన్నని చూసుకోవాలి.. ఇక్కడకి రాలేదు. పోనీ, ఇద్దర్నీ నా దగ్గర ఉండమంటే, నా దగ్గరకు రారు. కాఫీకే కాదు, మంచి భోజనానికి కూడా నాకు కష్టమే అయ్యేది. ఇలా ఉండగా.. మా అమ్మ నన్ను తొందరగా పెళ్ళి చేసుకోమని తెగ బలవంత పెట్టేది. ప్రమోషన్ వచ్చిన తర్వాత చేసుకుంటానని అన్నాను.
రోజూ ఉదయం నిద్రలేచి.. కాఫీ కోసం దూరం వెళ్లి వచ్చి, ఇంట్లో పని చేసుకునేసరికి స్కూల్ టైం కాస్తా అయిపోయేది. అందుకే, ఇంటి పని చెయ్యడానికి ఒక మనిషిని పెట్టుకున్నాను. ఆమెకి ఒక అరవై ఏళ్ళు ఉంటాయి. ఆమె మనవడి చదువు కోసం నా ఇంట్లో పని చెయ్యడానికి ఒప్పుకుంది. రోజూ ఉదయం వచ్చి ఇంటి పని చేసి వెళ్ళిపోయేది.. బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చెయ్యడం లాంటివి.
ఒకరోజు, తనకి ఒంట్లో బాగోలేదని, కాఫీ పెట్టుకుంటానని అడిగింది అవ్వ. ఇంట్లో వంట చెయ్యడం లేదని చెప్పాను. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకోసం వండి పెట్టమని.. ఉదయాన్నే మంచి కాఫీ ఇవ్వమని అవ్వని అడిగాను. మామూలుగా ఆ ఊరిలో ఎవరు వేరే ఇంటిలో వంట చెయ్యడానికి ఒప్పుకోరు. కానీ నా పరిస్థితి చూసి ఒప్పుకుంది. దానికి ఆ ఊరు వారంతా అడ్డు చెప్పారు.. అప్పుడు అవ్వకి కొంత డబ్బు ఇచ్చి, తన ఇంటి ముందు ఒక కాఫీ, టిఫిన్ కొట్టు పెట్టుకోమని చెప్పాను. దానికి అవ్వ చాలా సంతోషించింది.. తన మనవడి చదువుకోసం ఈ కొట్టు ఉపయోగపడుతుందని చాలా మురిసిపోయింది.
ఒకరోజు, నాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. మా అమ్మ, నాన్న ఆక్సిడెంట్ లో చనిపోయారని. ఎప్పుడూ నాకోసం రాని మా అమ్మ, నాన్న నా కోసమే నా దగ్గరకి రావడం కోసమే బయల్దేరారు. ట్రైన్ ఆక్సిడెంట్ లో ఇద్దరినీ పోగొట్టుకున్నాను. ఈ లోకంలో ఇప్పుడు నాకంటూ ఎవరు లేరు. కొన్ని రోజుల తర్వాత మా అమ్మ రాసిన చివరి ఉత్తరం నాకు అందింది. దానిని చదువుతున్న నాకు, మా అమ్మ నాకోసం చూసిన ఒక అమ్మాయి గురించి అందులో చెప్పింది.. ఆ విషయం మాట్లాడడానికే బయల్దేరి వస్తున్నానని అందులో రాసింది. మా అమ్మ చూసిన అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను.
ఇంటిముందు కొట్టు పెట్టుకున్న అవ్వ.. రోజూ నా కోసం ఇంటి ముందరే మంచి కాఫీ ఇచ్చేది. మా అమ్మ చేసిన కాఫీయే గుర్తుకొచ్చి కంట్లో నీళ్ళు తిరిగాయి. ఒక సంవత్సరం గడిచింది. మా అమ్మ చూసిన అమ్మాయి తండ్రి నుంచి నాకు కబురు వచ్చింది. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం, తన కూతురిని ఇవ్వడానికి అడిగారు. వెంటనే నేను ఒప్పుకున్నాను. ప్రమోషన్ రావడం, సిటీ కి వెళ్ళాల్సి వచ్చింది. అవ్వని కొట్టు జాగ్రతగా చూసుకోమని చెప్పి వెళ్ళాను. ఆ తర్వాత నా పెళ్ళి అమ్మ చెప్పిన అమ్మాయితోనే జరిగింది.
సిటీ లో కొత్త కాపురం.. నన్ను ప్రేమగా చూసుకునే పెళ్ళాం. రోజూ తన చేతి కాఫీ తాగిన నాకు, మా అమ్మ చేతి కాఫీయే గుర్తుకు వచ్చేది.. ఆ తర్వాత అవ్వ కాఫీ.. ఆ కాఫీ కొట్టు గుర్తుకొచ్చేది. కానీ, అక్కడికి వెళ్ళడానికి నాకు తీరిక ఉండేది కాదు. ఇప్పుడు నేను స్కూల్ కి హెడ్ మాస్టర్. ఇలా ఐదు సంవత్సారాలు గడిచిపోయాయి.
ఒకరోజు.. "ఎందుకండీ మీకు కాఫీ అంటే అంత ఇష్టం.. ?" అడిగింది నా భార్య
"అమృతం ఎలా ఉంటుందో నాకు తెలియదు. చిన్నప్పటినుంచి ఇదే అమృతం అనుకునేవాడిని.. ఇప్పటికీ భువిలో అమృతం అంటే నాకు ఇదే.. " అని అన్నాను
అప్పుడే నా భార్యతో ఆ ఊరు, అవ్వ, ఆ కాఫీ కొట్టు గురించి చెప్పాను. తనని అక్కడికి తీసుకుని వెళ్ళమని అడిగింది. ఎప్పటినుంచో నాకు వెళ్ళాలని ఉంది.. కాబట్టి ఒక ఆదివారం ట్రిప్ కి ప్లాన్ చేసాము. అనుకున్నట్టుగా ఇద్దరం అక్కడికి వెళ్ళాం. ఊరు అప్పటికీ ఇప్పటికీ చాలా మారి పోయింది. అవ్వ కొట్టు కోసం చుట్టూ చూసాను. ఎక్కడా కనిపించలేదు. కాఫీ తాగాలనిపించి..
అదే దారిన పోతున్నపెద్దాయనని.. 'ఇక్కడ మంచి కాఫీ ఎక్కడ దొరుకుతుంది' అని అడిగాను. ఆ సందు చివర ఉన్న హోటల్ లో దొరుకుతుందని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే అక్కడకు వెళ్ళాను. ఆ హోటల్ లో అబ్బాయి నన్ను చూసి.. నేను తెలిసినట్టుగా నమస్కారం చేసాడు.. నాకు ఏమీ అర్ధం కాలేదు.
"మీరు నాకు తెలుసు సర్.. మీరు మునుపు ఇక్కడే మాస్టారి గా పని చేసారు కదా.. "అన్నాడు ఆ అబ్బాయి
"అవును.. నీకెలా తెలుసు.. ? ఇక్కడ ఒక అవ్వ కాఫీ కొట్టు ఉండేది.. నీకు తెలుసా.. ?"
"ఆ అవ్వ మనవడినే నేను. ఆమె అనారోగ్యంతో చనిపోయింది. చనిపోతూ.. మీ గురించే చెప్పి.. ఈ కొట్టుని పెద్దగా డెవలప్ చెయ్యమని చెప్పింది. అప్పుడు మీ పేరుతో ఈ హోటల్ డెవలప్ చేసాను.. అదృష్టం కలిసి వచ్చింది.. హోటల్ పెద్దగా అయ్యింది. ఇదిగోండి సర్, బ్లాంక్ చెక్.. మీరు చేసిన సహాయానికి మేము ఎప్పటికీ మర్చిపోలేము.. "
అప్పట్లో నేను చేసిన సహాయం కాఫీ కోసమే, అందులో నా స్వార్ధం కూడా ఉంది. నాకు డబ్బులు వద్దు, కాఫీ కి కాఫీ ఇస్తే చాలు.. " అని నవ్వుతూ అన్నాను
*******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
コメント