'Bichhagadu To Business Man' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 06/08/2024
'బిచ్చగాడు టు బిజినెస్ మేన్' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
అదొక చిన్న పల్లెటూరు. పెద్ద టౌన్ కు ఆమడ దూరంలోనే ఉన్నా. . వాహనాలు మరియు వాటి హారన్ చప్పుళ్ళు వినపడటం తప్ప ఏ వాహనం ఆ ఊరు వచ్చి ఎరుగదు. అలాంటి ఆ ఊరికి ఆ రోజు వరుస కార్లు హోరెత్తాయి. అందరూ చాలా ఆశ్చర్యంతో చూడగా, పిల్లలు తమ ఊరికి కార్లు రావటంతో ఆనందంతో వాటి వెనుక పరిగెత్తటం మొదలెట్టారు. ఆ కార్లు పెద్ద ఇంటి వద్ద ఆగాయి. ఇక కొందరు సెక్యురిటి నడుమ వివేక్ కారు దిగాడు. అయితే తనకు కావల్సిన వ్యక్తి అక్కడ లేరని మరో దగ్గర ఉన్నారని తెలిసి షాక్ గురయ్యాడు. మరియు అదే ఊరిలో వేరే దగ్గర ఉంటున్నారని తెలిసి ఆనందంతో అక్కడకి వెళ్ళాడు వివేక్. కానీ అతడు ఉంటున్న ఆ ఇంటిని చూసి ఖిన్నుడయ్యాడు. చిన్న మంచం పై సేద తీరుతున్న యాభై ఐదేళ్ల గురవయ్య మాష్టారుని ఆప్యాయంగా పలకరించాడు వివేక్. కానీ. . ఊ. . అనలేదు ఆ. . అనలేదు అతడు.
మంచానికి ఆనుకుని నేలపైనే కూర్చొని "మాష్టారు. . నేనెవరో మీకు గుర్తు లేకపోవచ్చు కానీ. . ! మీరెవరో నాకు గుర్తు ఉంది " అనేసరికి గురవయ్య మాష్టారు తల తిప్పి వివేక్ వైపు చూశాడు.
"అవును మాష్టారు. . మీరు వందలమందికి చదువు చెప్పారు. అందులో నేను మాత్రమే పేదోడిని”.
"నువ్వు వివేక్ హ. . "
అంతమంది విధ్యర్డులకు విద్యాబుద్ధులు చెప్పిన అతడికి తన పేరు ఇంకా గుర్తు ఉండటంతో కంటనీరు పెట్టి హత్తుకున్నాడు. అప్పుడు గురవయ్య కూడా కన్నీటితో గతాన్ని తలుచుకున్నాడు.
రేపల్లె అనే పల్లెటూరు ఉంది. పేద మధ్య తరగతికి చెందిన ఆ ఊరిలో ఒకరో ఇద్దరో డబ్బు కలవారు ఉన్నారు. అందులో ఒకడు గురవయ్య.
గురవయ్య ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆ పదవితో పాటు ఊరిలో ఉన్న ఒకరిద్దరు డబ్బు కలవాళ్ళలో తానొకడిననే అహంకారం అతనిలో కనపడుతుండేది. ఉద్యోగం వచ్చి దాదాపు ఐదేళ్లు అయ్యాక త్రివేది పట్టణంలో ఒక జిల్లా పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలకు బదిలీ అయ్యాడు. అక్కడ ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు ఉంది. కానీ ఇంటర్ కు గురవయ్య బోధించడు. పదివరకు మాత్రమే అతడి బోధన. ఆ పాఠశాలలో మూడో తరగతి విద్యార్ధే వివేక్. తరగతిలో దాదాపు నలభై మంది విద్యార్థులు ఉండగా అందరూ బాగా చదివేవాళ్ళే. ఇక వివేక్ చేసే చేష్టలు కొత్తగా వచ్చిన ఆ గురవయ్య మాష్టారుకు నచ్చేవి కావు. వివేక్ దుస్తులు కూడా మాసినవిగా ఉంటాయి. చిరిగిన దుస్తులు కుట్టినట్లు అందవికారంగా ఉంటాయి. అసలే అతడికి పేదలంటే చులకన. వివేక్ మాష్టారు పాఠం చెప్పినప్పుడు మిగతా పిల్లల కంటే శ్రద్ధగా వింటాడు. అయితే నోట్స్ చెప్పినప్పుడు మాత్రం తరగతిలో నిద్రపోతుంటాడు. ఎప్పుడూ గురవయ్య మాష్టారుతో తిట్లు తింటాడు. బెంచ్ పై నిలబడతాడు. స్కూల్ కు కూడా ఏనాడూ టైంకి వచ్చేవాడు కాదు. లేటుగా వచ్చినందుకు కూడా రెడీగా బెత్తం దెబ్బలు తినటానికి సిద్దమయ్యేవాడే కానీ. . సమయానికి పాఠశాలకు వస్తానని ఎప్పుడూ ఆలోచించేవాడు కాదు. అలా రోజు వివేక్ గురవయ్య మాష్టారుతో తిట్లు, దెబ్బలు తినేవాడు.
ఇలా రోజులు గడవగా పంద్రాగష్టు ఏర్పాట్లు పాఠశాలలో ఘనంగా నిర్వహించటానికి అవసరమైన సామగ్రి, బహుమతుల కోసం ముందు రోజు సాయంత్రం పాఠశాల విడిచాక అందరు ఉపాధ్యాయులతో కలిసి త్రివేది పట్టణానికి వెళ్ళాడు.
దూరం నుంచే ఎవరో పిల్లవాడు వీల్చ్చైర్ లో ఉన్న తన తల్లిని తోసుకుంటు రోడ్డు పై వెళ్ళటం చూశాడు. అలా అలా ఆ పిల్లవాడు ఉపాధ్యాయులు ఉన్న షాపునకు సమీపించగా అతడు ఎవరో కాదు తరగతికి లేటుగా వచ్చింది కాక నిద్రపోయే వివేక్. గురవయ్యకు కళ్ళు చెమర్చాయి. అతడి తల్లి అని బహుశా గురవయ్య మాష్టారుకు అర్థం అయింది. కానీ అతడి తల్లి కళ్ళు తెరిచే ఉన్నా చలనం లేదు. వివేక్ జీబ్రాక్రాసింగ్ వెంట తన తల్లిని రోడ్డు దాటిస్తున్నాడు. ఆ సమయంలో ఆటు ఇటు వస్తున్న వాహనాలు ఆగాయి. వాహన చోదకులు తమ కోసం వాహనాలు ఆపినందుకు వాళ్ళకి వంగి నమస్కారించాడు.
ఇక్కడే వివేక్ గురవయ్య మాష్టారు మనసులోకి చొచ్చుకెళ్ళాడు. అసలు వివేక్ కి ఇంత చిన్న వయసులోనే జీబ్రా క్రాసింగ్ వద్ద నుండి రోడ్డు దాటాలని ఎవరు చెప్పారు. .? రోడ్లు గూర్చి ఉన్న పాఠం చెప్పి దాదాపు రెండు నెలలు కావొస్తుంది. ఈపాటికి తన తోటి పిల్లలు నోట్స్ రాసి ఆ పాఠం కూడా మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే ఆ పాఠం తర్వాత మరో నాలుగు పాఠాలు అయిపోయాయి. అలాగే ఇతర సబ్జెక్టు పాఠాలు కూడా వాళ్ళు మర్చిపోవటానికి కారణం కావొచ్చు. కానీ. . !నోట్స్ చెప్పినప్పుడు నిద్రపోయే వివేక్ పాఠం మాత్రం ఇంత చక్కగా వింటిడా. . ? అతడి మేధాతనం అంతగా ఉంటుందా. .? అలాగే ఇంత చిన్న వయసులోనే అంత సంస్కారమా. . ! వాస్తవానికి జీబ్రాక్రాసింగ్ వద్ద వాహనాలు ఆపటం పరపాటి. అయినా. . తమ కోసం వాహనాలు ఆపిన వారందరికీ వంగి నమస్కరించటం గొప్ప విషయం కదా. . ?
ఉపాధ్యాయులు తమ పని పూర్తి చేసుకున్నారు. గురవయ్య మాష్టారు ఇంటికి బయలుదేరాల్సి ఉన్నా. . వెళ్ళకుండా వివేక్ ని ఆనుసరించాడు.
అతడు తన తల్లిని తోసుకుంటు నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద సిగ్నల్ పడగానే భిక్షాటన చేస్తున్నాడు. గురవయ్య మాష్టారు మనసు చివుక్కుమంది. సాయంత్రం ఆరున్నర కావస్తోంది. వివేక్ తన తల్లిని ఇంటికి తీసుకెళ్లి భిక్షాటనతో వచ్చిన డబ్బుతో మెడికల్ షాపులో తల్లి కోసం మందులు కొన్నాడు. మరలా బయటకు వెళ్ళాడు. రోడ్ల పై పాస్ట్ పుడ్ సెంటర్ లు వద్ద రాత్రి పది వరకు పని చేశాడు. అప్పటి వరకు గురవయ్య మాష్టారు వివేక్ ని అనుసరిస్తూనే ఉన్నాడు. తల్లి కోసం అతడు పడుతున్న బాధలు చూసి తన ఆకలిని సైతం మర్చిపోయినాడు. అక్కడ వివేక్ నకు ఇచ్చిన కొంత ఆహారాన్ని పరుగుపరుగున వెళ్ళి తల్లికి తినిపించి మిగిలింది తాను తిన్నాడు. అతి కష్టం మీద తల్లిని మంచం పై వేసి పడుకోబెట్టి తాను నిద్రపోయాక టెక్స్ట్ బుక్ లు ఓపెన్ చేశాడు. అలా రాత్రి ఒంటిగంట వరకు చదివాక నిద్రకు ఉపక్రమించాడు వివేక్. మరలా ఎంతకు నిద్రలేస్తాడో. . ఏం చేస్తాడో చూడ్డానికి గురవయ్య మాష్టారు అసలు నిద్రే పోలేదు. మరలా ఉదయం ఐదయ్యే సరికి టిఫిన్ సెంటర్ లో ప్లేట్లు కడుగుతూ తొమ్మిదింటికి పరుగుపరుగున ఇంటికి వచ్చి తల్లికి తినిపించి మిగిలింది తాను తిని పాఠశాలకు బయలుదేరుతున్నాడు.
ఈ తతంగం అంతా చూసి గురవయ్య మాష్టారుకి అహంకారం చెల్లాచెదురయ్యింది. తనలో మానవత్వం అనే విత్తనం మొలకెత్తింది. తర్వాత రోజు ఆలస్యంగా వచ్చినందుకు వివేక్ బెత్తం దెబ్బలు తినటానికి చెయ్యి చాచగా ఆ చేతులను తన చేతుల్లోకి తీసుకుని మనసుకి హత్తుకుని కన్నీరు పెట్టాడు గురవయ్య మాష్టారు. పిల్లలు అందరితో చప్పట్లు కొట్టించాడు. వివేక్ లాంటి పేద విద్యార్థులు కోసం ఒక స్వచ్ఛంద సేవ సంస్థను ఏర్పాటు చేశాడు. పదిలోనే వివేక్ తల్లి మరణిస్తే అన్నీ తానై ధైర్యం చెప్పి ముందుండి నడిపించాడు. ఇంటర్ వరకు తన సొంత డబ్బులు పెట్టి చదివించాడు. ఒకటికి పదిసార్లు తన ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. వివేక్ ఇంటర్ తర్వాత చిన్న చిన్న వ్యాపారులతో కలిసి పని చేయటం మొదలు పెట్టాడు. దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత దేశంలో టాప్ బిజినెస్ మెన్ లో తానొకడిగా ఎదిగాడు.
ఆలా గురవయ్య మాష్టారు గతం నుండి బయటపడి.
" నాయనా. . తల్లి కోసం భిక్షాటన చేసి బిచ్చగాడు స్థాయి నుంచి బిజినెస్ మెన్ గా ఎదిగిన నీ ప్రస్థానం నాకు గర్వంగా అనిపిస్తుంది. చల్లగా ఉండు నాయనా" దీవించాడు.
తర్వాత వివేక్ గురవయ్య మాష్టారు పరిస్థితి గూర్చి ఆరాతీశాడు. తన జీతంలో కొంత మొత్తాన్ని, అలాగే రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ లో సగం స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నాని కొడుకులు గెంటేయగా భార్య లేని తాను ఒక్కడినే బతకు ఈడ్చుతున్నట్లు తెలుసుకుని చింతించాడు వివేక్.
తనకు చిన్నప్పటి నుండి అండగా నిలిచి అన్ని తానై నడిపించిన, విద్యాబుద్ధులు నేర్పిన తన గురువునకు కష్టం వస్తే తన కష్టంలా భావించి తనతో సహా తీసుకుపోవటానికి నిర్ణయించుకున్నాడు వివేక్. గురువు ఋణం అలా తీర్ఛుకోవటానికి గురవయ్య మాష్టరుని కారులో ఎక్కించుకుని రేపల్లె నుండి త్రివేది పట్టణానికి బయలుదేరాడు వివేక్.
**** **** **** **** **** ****
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments