top of page

బోసినవ్వుల గాంధీతాత

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్ర రావు, #BosiNavvulaGandhiTata, #బోసినవ్వులగాంధీతాత, #TeluguStories, #తెలుగుకథలు


'Bosi Navvula Gandhi Tata' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 20/10/2024 

'బోసినవ్వుల గాంధీతాతతెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



 కాకినాడ శ్రీనగర్ కాలనీ బొడ్డుగారిదిబ్బ సెంటర్లో జనం గోలగోల చేస్తున్నారు. 


గాంధీగారి విగ్రహం కనిపించడం లేదు. 

గాంధీగారి విగ్రహం కనిపించడం లేదు. 

గాంధీగారి విగ్రహం కనిపించడం లేదు. 


అనుకుంటూ ప్రజలు గగ్గోల చేస్తున్నారు. కల తిరుగు తున్నారు హడావిడి పడుతున్నారు. 


కట్ చేస్తే.. 


అదే కాకినాడ రామారావు పేట లో సుబ్బయ్య హోటల్ దగ్గర గాంధీగారు.. బిల్లగోచి తో చేతి కర్ర తో.. ఊడి కింద పడిపోయేటట్టు ఉన్న కళ్ళజోడు తో నడుస్తున్నారు సజీవంగా. 


"ఒయ్ అబ్బాయి ఆగు.. " అన్నాడు ఆయన ఓ అబ్బాయిని చూసి


"అరే.. గాంధీతాత.. భలే బాగుంది వేషo.. !". అంటూ ఆ కుర్రోడు ఎగిరెగిరి గంతులు వేశాడు. 


"వేషం కాదు అబ్బాయి.. నేను నిజం గాంధీనే. శ్రీరామ నగర్ గాంధీని. మీ టీవీలలో ఈరోజు నా మీద కార్యక్రమాలు ఉంటాయి కదా. టీవీలో నా రంగులబొమ్మ చూసుకోవాలనే చిన్న ఆశ తో దేవుడిచ్చిన శక్తితో ప్రాణం పోసుకుని వచ్చాను. చూపిస్తావా?".. అడిగారు గాంధీగారు. 


చూపిస్తానంటూ గాంధీగారిని తన ఇంటికి తీసు కెళ్ళాడు ఆ అబ్బాయి. 


"నువ్వు ఈ కిటికీ దగ్గర నిలబడి చూడు.. " అంటూ ఆ అబ్బాయి తన ఇంటికి గాంధీతాతను తీసు కొని వెళ్లి తాను ఇంటి లోపలికి వెళ్లి తన కుటుంబ సభ్యుల చేతినుంచి రిమోట్ తీసుకోవాలని రంగుల గాంధీ తాత ఉన్న టీవీ ఛానల్ పెట్టి అందులో రంగు రంగుల గాంధీ తాతను ఇప్పటి నిజంగానే వచ్చిన గాంధీ తాతకు చూపించాలని తెగ ప్రయత్నించాడు.. కానీ కుదరలేదు. 


"ఏయ్ అబ్బాయి చాలా లేట్ అయిపోతుంది నీ వల్ల కాదా.. ? మీ వాళ్లు అందరూ అన్ని చానల్స్ మార్చి మార్చి చూసుకుంటున్నారు. నేను ఉన్న ఛానల్ ఎవరు పెట్టారే.. లవ్ ట్రాక్స్, సీరియల్స్, కామెడీ సీన్లు, సిని మాలు, అడ్వర్టై జ్మెంట్లు.. అవే చూస్తున్నారు. " అంటూ గాంధీగారు ఇక అక్కడ వర్కవుట్ కాదని.. కూడా ఆ అబ్బాయిని తీసుకొని బయలుదేరారు


ఆనందభారతి సెంటర్ లో లక్ష్మీకళ ఉట్టిపడే ఓ ఇంటి తలుపు తట్టారు. ఆ ఇద్దరూ కలసి. ఆ ఇంటి ఇల్లాలు తలుపు తీసింది. 


లోపల వాళ్ల అబ్బాయి టీవీ లో వస్తున్న క్రికెట్ చూడ కుండా దాని ఎదురుగా ఉన్న సోఫా లో మత్తుగా పడు కున్నట్టు గాంధీగారు గ్రహించారు. 


"చూడమ్మాయి.. నువ్వు నమ్మకపోయినా నేను నిజం గాంధీతాతను. టీవీలో నా రంగులరూపం చూసుకోవాలని నా ఉబలాటం. ఎలాగూ మీ అబ్బాయి పడుకున్నాడుగా.. అక్కడేమో క్రికెట్ ఛానల్ రన్ అవుతుంది.. ఈ సమయంలో ఒక నిమిషం.. చానల్ మార్చి నా రంగుల రూపం నాకు చూపించావనుకో.. అర నిమిషంలో తిరిగి శ్రీరామనగర్ వెళ్ళిపోతాను. అక్కడ నా గురించి వెతుక్కుంటూ ఉంటారు.. నిజం" అని అడిగారు గాంధీగారు. 


"ఇదిగో గాంధీతాత.. నువ్వు నిజమో అబద్ధమో నాకనవసరం. మా అబ్బాయికి క్రికెట్ చూస్తూ స్నానం చేయడం, భోజనంచేయడం, పడుకోవడం అలవాటు. క్రికెట్ చానల్ ఎప్పుడు అలా ఆన్ అయ్యే ఉండాలి. ఏమాత్రం చానల్ మార్చినా లేచి చిరాకుపడతాడు. నాకు మావాడి సుఖo ముఖ్యమా నీ సరదా ముఖ్యమా''.. అంటూ తలుపు దబాలున వేసేసింది ఆ ఇల్లాలు.. 

గాంధీగారు సిగ్గుపడిపోయారు. కూడా వచ్చిన ఆ కుర్రవాడు తన మటుకు తాను వెళ్ళిపోయాడు ఈ చిత్రం అంతా చూడ లేక. 


జగన్నాధపురంసెంటర్, బ్రిడ్జిటౌన్, సర్పవరం జంక్షన్, కల్పనాసెంటర్, హండ్రెడ్ బిల్డింగ్స్ ఏరియా భానుగుడి సెంటర్.. ఇలా గాంధీగారు చాలా చోట్ల ప్రయత్నాలు చేశారు గాంధీ గారు.. తన రంగుల బొమ్మ టీవీలో చూసుకోవడం కోసం.. కానీ పని జరగలేదు. 


నడుస్తూ నడుస్తూ.. ఓ చోట పెంటకుప్ప వారగా కాలు విరిగి పడిఉన్న తన విగ్రహాన్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టు కొని.. దాన్ని తీసి కొంచెం దూరంగా ఓ పాకలో పెట్టి మళ్ళీ నడక మొదలుపెట్టారు. 


బాధతో బీచ్ ఒడ్డున తచ్చాడుతుండగా.. అమ్మ.. 

"భారతమాత".. ఎదురయింది.. తను కూడా సజీవం గానే ఉంది. 


" గాంధీ.. " నిన్నేనయ్యా బోసి నవ్వుల గాంధీ''.. అంటూ ప్రేమగా పిలిచింది. 


"అ.. అమ్మా.. నువ్వా.. సమయానికి భలేగా వచ్చావు తల్లి.. చూడమ్మా నాకు ఈ దేశం లో ఎంత విలువ ఉందో. నన్ను అందరూ మర్చి పోయారు. నా విగ్రహాలు కూడా చాలా చోట్ల చేయివిరిగి, కాలు విరిగి, మొండెము ఊడి పడి బురద కాల్వల్లో, పెంటకుప్పల్లో.. చాలా బాధ గా ఉంది తల్లి.. నేను ఏమన్నా వీళ్ళని విగ్రహాలు పెట్ట మన్నానా.. ?? పెట్టి ఇలా అవమానించడం భావ్యమా తల్లి??.. '' అంటూ భారతమాతను అడిగారు గాంధీ గారు. 


"ఇంకా విను తల్లి.. వైట్ ఎనామిల్ పెయింట్ వేసుకొని నా రూపంలో పెద్దలు, చిన్నపిల్లలు కూడా రోడ్లమీద ఆడుక్కుతింటున్నారు. చిన్న పిల్లల చేత కూడా అలా వేయించటం నిజంగా నాకు ఏడుపు వస్తుంది తల్లి.. ఏ ప్రభుత్వ అధికారి, ఏ ప్రజా ప్రతినిధి.. ఈ చర్యలు ఎందు కు ఆపలేకపోతున్నారు?? వాళ్లు కూడా సరదాగా చూసి ఆనంది స్తున్నారా.. ? మాట్లాడవే తల్లి?


వీళ్లంతా ఆఫీసుల్లో, కార్యాలయాలలో.. మొక్కు బడికి.. కేవలం ఫ్యాషన్గా ఉంటుందని మాత్రమే నా ఫోటోలు పెట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. అదంతా పక్కన పెట్టుతల్లి.. 


చివరికి.. ఈరోజు.. టీవీలో వచ్చే నా కార్యక్ర మాలు.. నా ఆకారం.. కనీసం ఒక్కరు కూడా చూడటం లేదు తల్లి.. అదే నా బాధ.. తట్టుకోలేకపోతున్నానమ్మ".. బాధపడుతూ చెప్పారు గాంధీగారు. 


"ఓస్.. ఇదే కదా నీ బాధ.. నీ బాధ తీరుస్తాను గాంధీ నాతో రా..".. అంది భారతమాత. 


గాంధీగారు ఆశ్చర్యపోతూ "ఎక్కడకమ్మా" అని అడిగారు. 


"నాలుగుదేశాలు తిప్పి తీసుకొస్తాను నాతో రావయ్య. 

కంగారుపడకు. " అన్నది గాంధీ గారి చేయి పట్టుకుంటూ


"అమ్మో.. నేను శ్రీరామనగర్ వెళ్ళిపోవాలి కదా". 

గాంధీ గారు చాలా కంగారుగా అన్నారు. 


"పర్వాలేదు గాంధీ. నేను భారతమాతను కదా. నాకు అడ్డు ఉండదు. నాలుగు దేశాలు తిరగడానికి నాలుగు నిమిషాలే. ".. అంటూ భారత మాత గాంధీ గారిని అమెరికా తీసుకు వెళ్ళింది.. అట్లాగే మరో మూడు దేశాలు కూడా తిప్పి.. తిరిగి భారతదేశం తీసుకు వచ్చేసింది. 


"అమ్మో.. చాలా ఆనందంగా ఉంది తల్లి. శరీరం జల దరించి పోతుంది భారతమాత.. అన్ని దేశాలలోనూ ఈరోజు.. నేను ఉన్న చానలే పెట్టుకుని ఆనందంగా పరవశించిపోయి చూస్తున్నారు. 


 నా దేశంలో నన్ను మరచిపోతున్నారు కాని.. దేశం కాని దేశంలో నాకు ఎంత విలువ ఉందో అర్థమైంది తల్లి?".. మహదానంద పడిపోయారు గాంధీగారు. 


"సరే కానీ గాంధీ.. నీ కళ్ళలో ఏమిటా కన్నీరు?". కళ్ళ నీళ్లు తుడుస్తూ అడిగింది భారతమాత. 


"కన్నీరు కాదమ్మా.. ఆనందబాష్పాలు. " బిగ్గరగా ఏడుస్తూ అన్నారు గాంధీ గారు. 


"సర్లే ఆపు నీ బడాయి.. ఇలాంటప్పుడు కళ్ళు తుడుచు కోడానికి- కాస్తంత గుడ్డముక్క కూడా మిగుల్చుకోలేక పోయావు. నేను ఏదన్నా అంటే.. అమ్మా.. ఇలా అన్నావా? అని బాధపడతావు. అసలు తప్పoతా నీదేనయ్యా గాంధీ. " ఎగతాళి చేస్తున్నట్టుంది అన్నది భారతమాత. 


"అమ్మా.. ఇదొకటా.. నేనేం తప్పుచేశాను తల్లి?"

ఆశ్చర్యంగా ప్రశ్నించారు గాంధీగారు. 


"నువ్వు అహింసావాదివి.. నిరాడంబరజీవివి.. త్యాగ 

శీలివి.. కరుణామూర్తివి.. మద్యపానం మానమన్నా వు.. సత్యమునే పలకమన్నావు.. ఈ గొప్ప ఆదర్శాలు.. ఇప్పుడు ఎవరికీ అవసరం లేదు. వాళ్లు సృష్టించుకున్న ఆదర్శాలు వేరే ఉన్నాయి. వాళ్లు 'చరిష్మా'.. అంటుంటారే.. అది నీలో ఇప్పుడు ప్రజల పట్ల తగ్గి పోయింది. అందుకనే ఈరోజు టీవీలో నిన్ను ఎవరూ చూడటం లేదు. 


సరే.. నా మాట విని.. నీ వయసును బట్టి.. కొత్త సమస్యలు తెచ్చుకోకు. జరిగే చిత్రాలన్నీచూస్తూ "కృష్ణా రామా.. ".. అనుకుంటూ విగ్రహంగానే ఉండు. ".. అని హితబోధ చేసి మాయమైపోయింది భారతమాత. 


 *****


అంతే.. శ్రీరామనగర్ లో.. గాంధీగారు విగ్రహం మళ్లీ మునుపటిలాగే వెలసింది. విగ్రహం ఎందుకు మాయం అయిందో.. మళ్లీ ఎలా వచ్చిందో.. ప్రజలకు అర్థం కాలేదు. తల గోక్కుని.. తమ తమ పనుల్లో నిమగ్నమై పోయారు. 


అయితే ఇప్పుడు గాంధీ గారి విగ్రహం ముఖం మాత్రం 

ముసి ముసి నవ్వులతో కళకళలాడుతూ అందంగా లేదు. వెల వెల బోయి ఉంది ఆ విగ్రహం ముఖం. 


 **

సమాప్తం


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






20 views0 comments

Comments


bottom of page