#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #BrathukuPusthakam, #బ్రతుకుపుస్తకం, #TeluguMoralStories, #నైతికకథలు
Brathuku Pusthakam - New Telugu Story Written By Palla Venkata Ramarao
Published In manatelugukathalu.com On 17/11/2024
బ్రతుకు పుస్తకం - తెలుగు కథ
రచన: పల్లా వెంకట రామారావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
మొబైల్ రింగ్ అవ్వడంతో ఎవరా అని చూశాడు హరీష్. గోపి చేస్తున్నాడు. లిఫ్ట్ చేసి చెప్పరా గోపీ అన్నాడు. ఇప్పుడు నీకేమైనా పనుందా ఫ్రీగా ఉన్నావా? అడిగాడు గోపి. ఫ్రీ యే చెప్పు అన్నాడు హరీష్. అయితే వెంటనే వచ్చేయ్ పనుంది అంటూ తను ఎక్కడున్నాడో చెప్పాడు గోపి.
ఐదు నిమిషాల్లో చేరుకున్నాడు హరీష్. "ఏంట్రా! ఏంటి విషయం?" అడిగాడు.
"ఏం లేదు రా జ్యోతిష్యం చెప్పించుకుందామని" అన్నాడు గోపి.
"దేనికి రా! నీకు ఏమైనా కష్టం వచ్చిందా?"అడిగాడు హరీష్.
అడ్డంగా తల ఊపాడు గోపి.
"ఏమైనా నష్టం వచ్చిందా?"
లేదని బదులిచ్చాడు గోపి.
"మరి దేనికి రా?"అడిగాడు హరీష్.
"అంటే ఏవైనా కష్టాలు, నష్టాలు వస్తేనే వెళ్లాలా? నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది".
"నీకేంట్రా! మంచి ఉద్యోగం ఉంది. చక్కని ఫ్యామిలీ ఉంది. సొంత ఇల్లు ఉంది. ఏ లోటు లేదు. ఫ్యూచర్ గురించి కంగారు ఎందుకురా?" అడిగాడు హరీష్.
"అన్నీ ఉంటే సరిపోతుందా? నా ఫ్యూచర్ ఎలా ఉందో? నేను ఏ స్థాయికి వెళ్తానో తెలుసుకోవాలని ఉంది. కోటీశ్వరుని అవుతానో, ఎమ్మెల్యేను.. ఎంపీ.. "
వాడి మాటలకి అదోలా చూస్తూ చాల్లే పద అంటూ మధ్యలోనే కట్ చేసి బైక్ తీశాడు హరీష్.
***********
బైకు జ్యోతిష్యుని షాప్ ముందు ఆగింది. లోపలికి వెళ్లారు ఇద్దరు. ఖాళీగానే ఉంది. కస్టమర్లు ఎవరూ లేరు. అక్కడ బోర్డు మీద 'హైటెక్ జ్యోతిష్యం చెప్పబడును' అని రాసుంది. కంప్యూటర్ ముందర కూర్చుని ఉన్నాడు ఒక వ్యక్తి.వీరిని చూస్తూనే రండి కూర్చోండి అన్నాడు.
గోపిని డేట్ అఫ్ బర్త్, పుట్టిన సమయం అడిగాడు. వాటిని బట్టి మీ జాతకం ఆల్రెడీ ఫీడ్ అయిపోయుంటుంది అని చెప్పుకొచ్చాడు. కాసేపు కంప్యూటర్ లో చూసి అవి ఇవి బటన్ లు నొక్కి మొహం లో వింత భావంతో గోపి వైపు చూశాడు.
"నువ్వు పుట్టిన సమయంలో గ్రహాలన్నీ చిందర వందరగా ఉన్నాయి. కాబట్టి నీ జాతకం కూడా.." అంటూ మధ్యలో ఆపేశాడు.
దానికి గోపి "చిందర వందరగానే ఉంటుందంటావ్" అంటూ పూర్తి చేశాడు.
దానికి హి హి అని నవ్వాడు జ్యోతిష్యుడు.
"ఇంతకీ నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది?" అడిగాడు గోపి.
"నీ ఫ్యూచర్ కేం బాగానే ఉంటుంది.ఉద్యోగివి. మంచి జీతం, జీవితం.ఏ లోటూ లేకుండా గడిచిపోతుంది" అన్నాడు జ్యోతిష్యుడు.
"నేను జీవితాంతం ఉద్యోగమే చేస్తానా? వ్యాపారం కూడా చేస్తానా?"అడిగాడు.
"ఉద్యోగం చేస్తావు. వ్యాపారం.. రెండూ చేస్తావు" చెప్పాడు జ్యోతిష్యుడు.
"ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వెళితే బాగుంటుందా? రాణిస్తానా?" అడిగాడు గోపి.
"ఇప్పుడు మన శక్తి సామర్థ్యాలను బట్టి పనులు చేయాలి. దాన్నిబట్టి ఫలితాలు ఉంటాయి" చెప్పుకొచ్చాడు జ్యోతిష్యుడు.
పక్కన ఉన్న హరీష్ "మా వాడికి ఒకటే పెళ్లా? రెండో పెళ్ళాం ఏమైనా వస్తుందా?" అడిగాడు.
"ఒక పెళ్లే కష్టంగా అయ్యుంటుంది. రెండోది అవకాశం లేదులే" అంతే స్పీడుగా చెప్పాడు జ్యోతిష్యుడు.
"అదీ.." అని ఇంకా ఏదో అడగ బోతుంటే "ఇంకా వివరాలు ఎక్కువ కావాలంటే ఒక పుస్తకం లో రాసిస్తాను. ఫీజు ఎక్కువ అవుతుంది" చెప్పాడు జ్యోతిష్యుడు.
"ఇక చాల్లే పదరా!"అంటూ పైకి లేచాడు హరీష్. ఇద్దరూ బయటికి వచ్చారు.
"ఏరా! ఇక ఇంటికేనా?" అడిగాడు హరీష్.
"ఏదిరా! ఏం తెలిసిందనీ. వీడు ఏమి అడిగినా ఆకుకు అందకుండా పోకకు పొందకుండా చెబుతున్నాడు" అన్నాడు గోపి.
"అంతేరా ఇలాంటి వాళ్లేమైనా శాస్త్రాన్ని ఔపోషణ పట్టి ఉంటారా? ఏదో మిడిమిడి జ్ఞానంతో, పుస్తకాలు చదివి చెబుతుంటారు. నాకు కూడా జ్యోతిష్యం అంటే అభిమానమే కానీ ఇలా సగం సగం పరిజ్ఞానం వాళ్ళతో కుదరదు" చెప్పాడు హరీష్.
గోపి "అయితే ఇంకో జ్యోతిష్యుడి దగ్గరకు.." అనగానే హరీష్ ఇష్షో అనుకుని ఇలా అడిగాడు.
"ఒరే గోపీ!నువ్వు కాలేజీ రోజుల్లో కథల పుస్తకాలు, నవలలు బాగా చదివే వాడివి కదా!"
"అవును ఇప్పటికీ టైం దొరికితే చదువుతా" బదులిచ్చాడు గోపి.
"సరే ఏదైనా నవల చదవడం మొదలుపెడితే మొదటి పేజీ నుంచి చదువుతావా? లేదా ముందుగానే క్లైమాక్స్ చదువుతావా?" అడిగాడు.
"అదేంటి?పిచ్చి ప్రశ్న.మొదటి నుంచి చదువుతూ వెళ్తే ఆ కథ ప్రారంభం, మలుపులు, చిక్కుముళ్ళు అవన్నీ ఆనందిస్తూ పోతూ ఉంటే చివర్లో క్లైమాక్స్ అనేది మజాగా ఉంటుంది. నేరుగా క్లైమాక్స్ చదివితే అర్థం కాదు, థ్రిల్ ఉండదు" అన్నాడు.
"కరెక్ట్ గా చెప్పావు. జీవితం కూడా అంతేరా! మన బ్రతుకు పుస్తకాన్ని కూడా ఒక్కో పేజీ చదువుతూ పోవాలి. ఒక్కో రోజు ఒక్కో పేజీ, ఒక్కో అనుభవం. ముందుగానే క్లైమాక్స్ తెలిసిపోతే జీవితంలో థ్రిల్ ఏముంటుందిరా” అన్నాడు హరీష్.
----------
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.
@veeraiahkatam4399
• 3 hours ago
nice story
Pula Afzal
•5 hours ago
Bagundi story
@BalaramuduBalaramudu-of2te
• 1 day ago
Nice
shaik maktumsab
•1 hour ago
Nice video ❤❤
Dr. PALLA KRISHNA
•2 hours ago
🎉🎉🎉 అభినందనలు