#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #BudgetBhaskar, #బడ్జెట్భాస్కర్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
Budget Bhaskar- New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 25/12/2024
బడ్జెట్ భాస్కర్ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఏమండి.. ఏమండి.. ! ఒక మాట.. " అంటూ కంగారుగా పిలిచింది పద్మ.
"ఏమిటే.. ఇంత పొద్దున్నే.. "
"ఆ చెవు కాస్త ఇటు పడేయండి.. చెబుతాను.. "
"మన అమ్మాయి పుష్పవతి అయింది.. అందరినీ ఇంటికి పిలవాలి.. ఫంక్షన్ అదీ గ్రాండ్ గా చెయ్యాలి.. అందరినీ పిలవాలి" చెప్పింది పద్మ.
"అదేంటి అప్పుడేనా.. ? నా లెక్క ప్రకారం ఇంకా చాలా టైం ఉందే?"
"ఈ కాలంలో అమ్మాయిలు అంతేనండి.. ఏం చేస్తాము.. ?"
"నేనైతే బడ్జెట్ ఇంకా ఏమీ ప్లాన్ చేసుకోలేదే.. ఫంక్షన్ కష్టం. భోజనాలకే ఒక లక్ష అయ్యేటట్టు ఉంది"
"ఉన్న ఒక్క అమ్మాయి ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యకపోతే, ఎవరూ ఒప్పుకోరు.. నేను అసలే ఒప్పుకోను" అంది పద్మ.
"అసలే మీ బంధువులు, మా బంధువులు కలిపితే ఒక ఊరిజనం అంత అవుతారు.. మన ఈ చిన్న కొంప కూడా చాలదు.. "
"అందుకే చెబుతున్నాను.. ఒక రిచ్ ఫంక్షన్ హాల్ బుక్ చెయ్యండి.. " అడిగింది పద్మ.
"ఫంక్షన్ హాల్ అంటే బోలెడు ఖర్చు.. నో.. " అన్నాడు భాస్కర్.
"పెద్ద హోటల్ లో భోజనాలు బుక్ చెయ్యండి.. "
"పెద్ద హోటల్.. నో.. "
"అందరికీ బట్టలు పెట్టాలి.. నాకు కొంచం గ్రాండ్ గా కావాలి.. "
"చూద్దాం.. "
"ఇంకొకటి.. నాకు పిలుపులు కుడా గ్రాండ్ గా ఉండాలి. ఈ రోజుల్లో ప్రతీదానికి ఇన్విటేషన్ వేయిస్తున్నారు.. ఒక ఐదొందలు ప్రింట్లు వేయించండి.. " అంది పద్మ.
"మళ్ళీ అదో ఖర్చా.. మెసేజ్ పెట్టేస్తే సరిపోదా.. ? ఫోన్లో ఒక మంచి కార్డు తయారు చెయ్యి.. ఫ్రీ యాప్స్ ఉన్నాయిగా. అవే అందరికి పంపించేస్తే సరి.. ఇంకా కావాలంటే, ఫోన్ లో పిలిస్తే సరి.. కాల్స్ ఫ్రీ యే కదా.. అందరితో మాట్లాడినట్టుగా ఉంటుంది. మరీ కావాలంటే వీడియో కాల్ చేసుకో.. ఇంతకన్నా గ్రాండ్ ఎక్కడుంటుంది చెప్పు.. ?"
"ఏమిటండి మీ బడ్జెట్ లెక్కలు మీరునూ.. ! అన్నింటికీ 'నో' బదులు దేనికి 'ఎస్' అంటారో చెప్పండి.. కాస్తా.. "
"భోజనాలు తప్పదు కాబట్టి 'ఎస్'.. బట్టలు నీకోసం 'ఎస్'.. కాకపోతే, నేను చెప్పే స్టైల్ లోనే చెయ్యాలి.. "
"అదీ ఏమిటో చెప్పండి.. "
"ఫంక్షన్ మన ఇంట్లో మేడ మీద చేద్దాం. మా ఫ్రెండ్ కి టెంట్ షాప్ ఉంది.. డిస్కౌంట్ లో వస్తువులు వచ్చేస్తాయి.. కుర్చీలు కుడా మన అపార్ట్ మెంట్ లో ఒక్కొకరి ఇంట్లో ఒక నాలుగు తెస్తే సరిపోతుంది.. పగటి పుట ఫంక్షన్ కాబట్టి లైటింగ్ అవసరం లేదు.
"ఇంకెందుకు మరి.. మంచి హోటల్ లో భోజనాలు ఆర్డర్ పెట్టండి.. బట్టలకి ఎక్కడికి వెళ్దాం.. ? బక్కన్న బ్రదర్స్ లో చీరలు బాగుంటాయండి.. "
"మనం ఫంక్షన్ కి అందరిని పిలుస్తున్నాము.. కానీ మనకి ఖర్చు అవకూడదు.. గిఫ్ట్స్ బాగా రావాలి.. " అన్నాడు భాస్కర్.
"అదెలా అవుతుందండి.. ?"
"మన ఇంట్లోనే, మేడ మీద ఫంక్షన్, భోజనాలకి మనమే వంట చేసుకోవాలి.. ఫంక్షన్ కి ఆడవాళ్లు చాలా మంది వస్తారుగా.. ఒక్కొకరు ఒక్కో పది నిమిషాలు కేటాయిస్తే.. వంట అయిపోతుంది.. "
"ఆడవారు కంగారులో వంట చేస్తే, సరిగ్గా కుదరదండి.. "
"అదే మనకి ప్లస్.. అప్పుడే సగం ఖర్చు తగ్గిపోతుంది.. ఏదీ బాగోకపోతే, పెరుగన్నం తింటారులే.. ! ఇక స్వీట్స్ అంటావా.. రవ్వ తో చేసెస్తే సరి.. సులువు.. ఖర్చు తక్కువ.. "
"పోనీ బట్టలైన మంచి షాప్ లో కొందాం.. ప్లీజ్"
"అక్కడికే వస్తున్నా.. గత చాలా సంవత్సరాలుగా మనం ఎన్నో ఫంక్షన్ లకి వెళ్ళాం కదా.. అందరూ రొటీన్ గా బట్టలు పెట్టేసారు.. అవన్నీ బీరువాలో అలా పడి ఉన్నాయి.. ఇక అవి పాడయిపోతాయి.. వాటికీ రొటేషన్ కావాలిగా.. బయటవారు మంచి బట్టలే పెడతారుగా"
"అంటే.. ?"
"ఆ బట్టలు తిప్పి తిప్పి అందరికీ పెట్టేసేయ్.. ఒకళ్ళు పెట్టిన బట్టలు వేరే వారికి పెట్టాలి.. ఇంటికి వెళ్లి ఓపెన్ చెయ్యాలి అని కండిషన్ కుడా పెట్టాలి.. "
"అలాగైతే మనకి బట్టలు ఉండవు కదా.. నేను ఒప్పుకోను.. "
"మనకి మళ్ళీ బట్టలంటావా.. ! కొత్త స్టాక్, కొత్త డిజైన్ తో మళ్ళీ వచ్చేస్తాయిలే.. మన బంధువులంతా మంచివారేగా.. "
"బాగానే ఉంది కానీ.. "
"కానీ గీనీ ఏమీ లేదు.. చూడు.. ఎంత లాభం వస్తుందో.. ! గిఫ్ట్స్ కాకుండా.. మిగిలినవారంతా కనీసం నూట పదహారులు చదివించినా.. అన్నీ ఖర్చులు పోనూ.. నీకూ, మన అమ్మాయికి రెండు బంగారు నెక్లెస్ లు అయితే ఖాయం.. ఏమంటావ్ పద్మ.. ?"
"అయితే సరే.. " అని నవ్వుతూ ఒప్పుకుంది పద్మ.
**********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comentários