top of page

బుందేల్‌ఖండ్‌‌ విముక్తి

(రాజా ఛత్రసాల్‌ వీర గాథ)



'Bundel Khand Vimukthi' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 20/03/2024

'బుందేల్‌ఖండ్‌‌ విముక్తి' తెలుగు కథ

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ఉన్న బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ఒక హిందూరాజ్యాన్ని పదిహేడవ శతాబ్దంలో జుఝూర్‌సింగ్‌ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని రాజధాని ఓర్ఛా.


 షాజహాన్‌ చక్రవర్తి కాలంలో మొగల్‌సైన్యం దాడికి దిగి, ఓర్చాను ఆక్రమించుకుంది. రాజు జుఝూర్‌సింగ్‌, అతడి కొడుకు విక్రమ్‌సింగ్‌ల తలలను నరికి ఆసైన్యం, షాజహాన్‌కు పంపింది. వారి రాణులను అంతఃపురానికి చేర్చి

నీచ కార్యాలకు వినియోగించారు. రెండో కుమారుడు ఉదయభాన్‌ను మతం మారవలసిందిగా షాజహాన్‌ నిర్భందించాడు. అతడు తిరస్కరించడంతో శిరచ్ఛేదం చేయించాడు. ఓర్ఛా రాజ్యాన్ని మొగల్‌ సామ్రాజ్యంలో కలిపివేశాడు. 


జుఝూర్‌సింగ్‌ కొలువులో చంపత్‌రాయ్‌ అనే క్షత్రియుడు సరుదార్‌ గా ఉండేవాడు. అతడు మహావీరుడు. హిందూ ధర్మాభిమాని. అతడి ప్రేరణతో ఓర్ఛారాజ్య ప్రజలు తిరగబడి, ఎక్కడికక్కడ మొగల్‌ సైనికదళాల మీద దాడులు సాగించారు. 


ఈ కల్లోలం మధ్యనే చంపత్‌రాయ్‌ భార్య లాల్‌కున్వర్‌ కు కుమారుడు జనించెను. అతనికి ఛత్రసాల్‌ అను నామము తో పిలువసాగిరి. తల్లిబిడ్డలను స్వగ్రామంలో ఉంచి, చంపత్‌రాయ్‌ రాజ్యమంతా తిరుగుతూ మొగల్‌ సైన్యాలతో పోరాడసాగాడు. 


తల్లి కున్వర్‌ తన కుమారుడు ఛత్రసాల్‌కి చిన్నతనం లోనే

రామాయణ, మహాభారత కథలను బోధించి, అతడిలో హిందూ ధర్మ నిష్ఠను కలిగించింది. జంఝూర్‌, విక్రమ్‌ ల శిరచ్ఛేదం తన తండ్రి హిందూధర్మరక్షణ పోరాటంలో యోధుడిగా ఉండటం అన్నింటినీ తల్లి ద్వారా విన్నాడు. స్వతహాగా అతడు మహేవాలోని చేతన గోపాలస్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలలో, దైవసంకీర్తనలలో, భజనలలో పాల్గొని పారవశ్యం పొందుతూ ఉండేవాడు. 


అయితే, ఆ ఆ గ్రామంలో వెలసియున్న వింధ్యవాసిని దేవాలయాన్ని కూల్చివేయడానికి మొగల్‌ సైనికదళం తరలి వచ్చిందనే కబురు ఛత్రసాల్‌ చెవిని పడింది. వెంటనే పదకొండేళ్ళ ఛత్రసాల్‌, తన మిత్రబృందాన్ని కలుపుకుని

పొలిమేరలకు వెళ్ళి, మొగల్‌ సైన్యాన్ని అక్కడే అడ్డుకుని కత్తికొక కండగా నరికాడు. 


ఆ రాత్రి ఇంటికి వచ్చిన చంపత్‌రాయ్‌, కుమారుడి పరాక్రమాన్ని తెలుసుకుని పరమానంద భరితుడయ్యాడు. ”ఛత్రా; హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని రక్షించడమే నా జీవన ధ్యేయం. కానీ నేను వృద్ధుడినయ్యాను. నా తరువాత ఈ ధర్మ పోరాటాన్ని ఎవరు సాగిస్తారా అనే చింత నాకిప్పుడు తీరిపోయింది. ” అని కుమారుడిని కౌగలించుకున్నాడు చంపత్‌రాయ్‌. 


”నాన్నగారూ; మీరు నిశ్చింతగాఉండండి. హిందూధర్మరక్షణ, శత్రుసంహారం నా చేతులతో జరుగుతాయి. ” అని మాట ఇచ్చాడు ఛత్రసాల్‌. 


”దక్షిణభారతదేశంలో శివాజీ మహారాజు హిందూధ‌ర్మరక్షణ కోసం పోరాడి విజయం సాధిస్తున్నాడు. నీకు ఎప్పుడేనా అవసరం అయితే, ఆయన సాయం తీసుకో” అని చెప్పి మళ్ళి యుద్దయాత్రలకు బయలుదేరాడు చంపత్‌రాయ్‌. ఈ సారి లాల్‌ కున్వర్‌ కూడా ఆయనను అనుసరించింది. 


అప్పటికి ఔరంగజేబు మొగల్‌ చక్రవర్తి అయ్యాడు. చంపత్‌రాయ్‌ని పట్టి అప్పగించకపోతే సహించనని

బుందేల్‌ఖండ్‌ లేని రాజులందరికీ హెచ్చరికలు పంపాడు. దంధేరా రాజ్యపాలకులు ఆ హెచ్చరికకు భయపడ్డారు. తమ ఆశ్రయం కోరి వచ్చిన చంపత్‌రాయ్‌ను, లాల్‌‌కున్వర్‌ను వంచనతో బంధించడానికి సిద్ధమయ్యారు. వృద్ధ దంపతులు కత్తులతో పొడుచుకుని ఆత్మత్యాగం చేసుకున్నారు. దంభేరీలు చంపత్‌రాయ్‌ తల నరికి ఔరంగజేబ్‌కు గుర్తుగా పంపారు. 


ఛత్రసాల్‌ తన అన్న అంగద్‍తో కలిసి, బుందేల్‌ఖండ్‌లోని హిందూరాజులను, జాగీరుదారులను కలుసుకుని, హిందూరాజులు సంఘటితులై, మ్లేచ్ఛులు చేసే దారుణాలను ప్రతిఘటించవలసి ఉందని విన్నవించారు. హిందూధర్మం ఆపదలో ఉన్న మాట నిజమే అయినా, మొగలులపై దండెత్తి కత్తి దూయడానికి సాహసించలేమని వారంతా బదులిచ్చారు. నిరాశ చెందిన ఛత్రసాల్‌ మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. 


అక్కడ ఆయుధ ప్రయోగంలో, గుర్రపుస్వారీలో, తీక్షణమైన సాధన చేసి, నైపుణ్యాన్ని సాధించాడు. తన ఈడు యువకులను కూడగట్టి, శస్త్రాస్త్ర ప్రయోగంలో నిపుణులను గావించాడు. పదిహేడు యేళ్ళు వచ్చేసరికి బలిష్టమైన శరీరంతో, అందమైన యువకుడుగా తయారయ్యాడు. పవార్‌ వంశానికి చెందిన దేవకున్వర్‌తో అతడికి వివాహము జరిగింది. 


మొగల్‌ సామ్రాజ్యానికి లక్షల కొద్ది సైనికులు, వేలాది ఫిరంగులు, వందలాది కోటలు, అపార ధన సంపద ఉన్నాయి. వారిని గెలవాలంటే, మొదటగా కనీసం వారి వ్యూహరచననైనా అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో అమేరు సంస్థానం రాజపుత్రప్రభువు, మహాశూరుడు మీర్జా రాజా జయసింగ్‌, మెగల్‌ పాదుషా సైన్యాధిపతులలో ప్రసిద్దుడు. ఛత్రసాల్‌ ఆయన సైన్యంలో చేరాడు. ఔరంగజేబు

ఆదేశంపై జయసింగ్‌ పెద్దసైన్యంతో శివాజీ మీదకు దండయాత్రకు బయలుదేరుతున్న సమయమది. 


మరో రెండు నెలలలో జయసింగ్‌ సైన్యం నర్మదా నదిని దాటి, పూనా చేరి, శివాజీకి చెందిన పురంధర కోటను ముట్టడించింది. ఆ యుద్దంలో శివాజీ లొంగి వచ్చి, సంధి చేసుకున్నాడు. కొంత కాలానికి ఔరంగజేబుతో రాజకీయ సమాలోచనల కోసం శివాజీ ఆగ్రా వెళ్ళి, నిండు సభలో ఔరంగజేబును ధిక్కరించి, నిర్భందానికి గురై, తిరిగి చాకచక్యంగా తప్పించుకుని, తన రాజధాని రాయగఢ్‌కు చేరుకున్నాడు. 


అప్పటికి ఏడాదిన్నరగా మొగల్‌ సైన్యంలో ఉండి, దాని గుట్టుమట్లను బాగా గ్రహించిన ఛత్రసాల్‌, ఇక శివాజీని కలుసుకోవాలనుకున్నాడు. 


వేటకు వెళ్ళడానికి అనే నెపంతో, మొగల్‌ సైన్యాధికారి దిలీర్‌ఖాన్‌ అనుమతి తీసుకుని, భార్యతో సహా మొగల్‌ శిబిరం నుంచి ఛత్రసాల్‌ బయటకు వచ్చాడు. ఇద్దరూ గుర్రాలపై దౌడుతీసి, కొన్నాళ్ళకు రాయగఢ్‌ చేరుకున్నారు. మరునాడే ఛత్రసాల్‌ కు శివాజీ మహారాజు దర్శనం లభించింది. తనకు నమస్కరించిన ఛత్రసాల్‌ను శివాజీ ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. 


“దివంగతులైన మా తండ్రిగారు మీ దర్శనం చేసుకోవలసిందనీ, మీ మార్గదర్శకత్వంలో దేశరక్షణ

ధర్మరక్షణ చేయవలసిందిగా నన్ను ఆదేశించారు. ” అని ఛత్రసాల్‌, శివాజీకి విన్నవించాడు


“మీ తండ్రిగారి గురించి నేను విన్నాను. ఆయన మహాసాహసి, ధర్మవీరుడు. బుందేల్‌ఖండ్‌ లోని తోటిహిందూ పాలకులు ఆయనకు తోడ్పడి ఉంటే, చరిత్ర వేరుగా ఉండేది. దుృదృష్టం ఏమిటంటే మన హిందువులే చాలామంది కాసులకు కక్కుర్తిపడి, మొగల్‌లో చేతిలో కలుపుతున్నారు.” అన్నాడు శివాజీ. 

“మహారాజా; నేను ఇక్కడే ఉండి, మీ కృషిలో పాలుపంచుకుంటాను. అనుమతించండి;” అన్నాడు

ఛత్రసాల్‌. 


“కుమారా; నువ్వు నా సరుదారులలో ఒకడు కానవసరం లేదు. నువ్వు నా అంతటి వాడివి. నేను ఇక్కడ చేసిన పనినే నువ్వు బుందేల్‌ఖండ్‌లో చెయ్యి. బుదేలాలను సంఘటితం చేసి, అక్కడి మొగల్‌ పాలనను అంతం చెయ్యి. వారి పాలనను సమూలంగా పెకిలించి వెయ్యి. నీకు ఎప్పుడు కావాలన్నా మహారాష్ట్రం నుంచి సహకారం అందుతుంది” అన్నాడు శివాజీ ప్రేమగా. 


అప్పటికి ఛత్రసాల్‌కు ఇరవైఒక్క ఏళ్ళు. 

ఔరంగజేబుకు గల మతధ్వేషం వర్ణనాతీతమైనది. ఓర్ఛాలోని హిందూ దేవాలయీలన్నింటినీ కూల్చి

వేయాలని అతడు ఆజ్ఞలు జారీచేసెను. దీనితో 1, 800 మంది అశ్వికదళంతో ఫిదాయీఖాన్‌ గ్వాలియర్‌

బయలుదేరాడు. అది తెలిసి బుందేల్‌ఖండ్‌ ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. వారందరూ ప్రజా సైన్యంగా

ఏర్పడి, తామే ఎదురు వెళ్ళి, ధూమ్‌ఘాట్‌ అనే చేట శత్రువులను అడ్డుకున్నారు. 


అనుకోని దాడికి తట్టుకోలేక ఫిదాయీఖాన్‌ సైన్యం కకావికలమయ్యాయి. అప్పుడే మహారాష్ట్రం నుంచి వచ్చిన ఛత్రసాల్‌ని బుందేల్‌ ప్రజలు తమ నేతగా చేసుకున్నారు. దైవానుగ్రహం అన్నట్లుగా ఛత్రసాల్‌కు ఆ విధంగా

సైన్యం తయారయ్యింది. 

ఇక తన వ్యూహరచనతో, మొగల్‌స్థావరాల మీద, సైనిక శిబిరాల మీద ఛత్రసాల్‌ దాడులు ఆరంభించి, ఖాలిక్‌, రుహుల్లాఖాన్, తహవ్వర్‌ఖాన్‌, షేక్‌అన్వర్‌ మొదలై మొగల్‌సేనానులను అనేక యుద్దాలలో ఓడించి బుందేల్‌ఖండ్‌ ప్రాంతాన్ని విముక్తం చేయసాగాడు. 


ధనసంపత్తి లేక సతమతమవుతున్న సమయంలో దైవానుగ్రహమేనా అన్నట్లుగా, మవూ అనే ప్రాంతంలో అతనికి సంత్‌ ప్రాణనాథ్‌ దర్శనమయ్యింది. 


పన్నీనగరంలో భూగర్భంలో ఉన్న వజ్రాల గురించి సంత్‌ప్రాణనాథే, ఛత్రసాల్‌కు తెలిపాడు. పన్నాను

రాజధానిగా చేసుకుని ఛత్రసాల్‌, ఆ సంపదలను సధ్వినియోగం చేశాడు. బుందేల్‌ మొత్తాన్ని విముక్తం

చేసి, హిందూ రాజ్యాన్ని స్థాపించాడు. మొగల్‌ సేనానులు బహలోల్‌ఖాన్‌, షేర్‌ఆఫ్గన్‌లు అప్పటి యుద్దాలలో అతి దారుణంగా మరణించారు. 


ఛత్రసాల్‌ ఎనుబది ఏళ్ళ వయసులో బంగేశ్‌ అనే మొగల్‌ సేనాని అతడి మీదకు దండెత్తి వచ్చాడు. పరిస్థితి తీవ్రతరం కావడంతో, అప్పటి పీష్వా యువకిశోరం బాజీరావు వచ్చి, బంగేశ్‌ను తరిమికొట్టాడు. 


బాజీరావును పుత్రసమానంగా గౌరవించి ఛత్రసాల్‌, తనరాజ్యంలో అతడికి కూడా సొంతకుమారులతో

సమానంగా భాగాన్ని పంచాడు. 

——————————————శుభంభూయాత్‌——————————————————————

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు. 



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








137 views0 comments

Comments


bottom of page