బస్ జర్నీ
- Mohana Krishna Tata
- Oct 29, 2023
- 3 min read

'Bus Journey' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 29/10/2023
'బస్ జర్నీ' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. హైదరాబాద్ లో వర్క్ చేస్తూ, అమ్మ చేతి వంట తింటూ హ్యాపీ గా ఉన్నాను. చేస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవడం చేత, కొత్త ప్రాజెక్ట్ కోసం నన్ను చెన్నై ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేసారు. వరుసగా సెలవులు వస్తే చాలు, ఇంటికి బయల్దేరి వచ్చేసేవాడిని.. మా అమ్మ కోసం.. ఒక్కగానొక్క కొడుకుని కదా!
అలా, చెన్నై ఆఫీస్ లో కొంచం సెట్ అయిన తర్వాత ఒక రోజు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది.
"కళ్యాణ్! పండుగ వస్తోంది కదా.. నాలుగు రోజులు సెలవు పెట్టి రావోచ్చు గా... ఇక్కడ నీ కోసం మంచి సంబంధం చూసాను. నీకు పెళ్ళైతే నా బాధ్యత కుడా తీరిపోతుంది"
"ఇప్పుడే పెళ్ళి ఎందుకు నాకు.. చెప్పు!. ఇంకా చాలా పెద్ద పొజిషన్ లోకి వెళ్ళాలి"
"నా ఆరోగ్యం అంతగా బాగోలేదు.. కొంచం ఆలోచించు కళ్యాణ్!"
"వచ్చిన తర్వాత మాట్లాడుతాను లే అమ్మా!"
దసరా పండుగ కి ఆఫీస్ లో ఇచ్చిన సెలవు కాకుండా.. రెండు రోజులు సెలవు పెట్టి.. బస్సు లో ఇంటికి బయల్దేరాను.. బస్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం!
సాయంత్రం బస్సు ఎక్కి, నా ఫేవరెట్ విండో సీట్ లో కూర్చున్నాను. జర్నీ లో పాత పాటలు వింటూ రిలాక్స్ అవడం అంటే నాకు చాలా ఇష్టం.
ఒక గంట జర్నీ తర్వాత, బస్సు ఒక పెద్ద స్టాప్ లో ఆగింది. చాలా మంది అక్కడే ఎక్కుతున్నారు. ఒక అందమైన అమ్మాయి నా దగ్గరకు వచ్చి... నా పక్కన కూర్చుంది. సినిమా హీరోయిన్ అంత అందంగా ఉంది చూస్తుంటే..
"హలో! నాకు విండో సీట్ ఇస్తారా ప్లీజ్? నాకు అక్కడ కూర్చోవడం అంటే చాలా ఇష్టం. లాస్ట్ మినిట్ లో టికెట్స్ దొరకకా, ఉన్న ఒక్క సీటు బుక్ చేసుకున్నాను. మీలాంటి మంచి వారిని రిక్వెస్ట్ చేస్తే, ఒప్పుకుంటారని అనుకున్నాను"
మంచి వాడినని మార్క్స్ పడిపోయాయి అప్పుడే.. చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఇచ్చిన మార్క్స్ కి, ఆమె అందానికి ఎవరైనా సరే.. సీట్ ఇవ్వకుండా ఉండలేరు.. నవ్వుతూ తల ఊపాను..
అమ్మాయి నా పక్కనే కూర్చుంది.. తెగ నచ్చేసింది. మాట్లాడి, స్నేహం చేద్దాం అంటే, ఏమనుకుంటుందో తెలియదు. పక్కన కుర్చున్నందుకు ఫీల్ అయితే కష్టమని.. ఊరుకుని, మళ్ళీ పాటలు వింటూ కళ్ళు మూసుకున్నాను.
ఈలోపు ఆ అమ్మాయి నా భుజం తట్టింది. ఒక్కసారి కళ్ళు తెరిచి.. హెడ్ ఫోన్స్ తీసి... చూసాను.
"ఏ పాటలు వింటున్నారు?... నాకు పాటలంటే చాలా ఇష్టం"
"ఎలా స్టార్ట్ చేద్దామా! అనుకున్న నాకు.. తనే స్టార్ట్ చెయ్యడంతో.. ఎంతో హ్యాపీ గా ఫీల్ అయ్యి... పాత ఘంటసాల పాటలు" అని చెప్పాను.
"ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా?" టక్కున అడిగేసింది.
"నా పేరు కళ్యాణ్!" అన్నాను.
"నా పేరు కావ్య!" అని పరిచయం చేసుకుంది.
ఇంతలో ఫోన్ వచ్చింది...
"హలో కావ్యా! ఎక్కుడున్నావు? నిన్ను పికప్ చేసుకోవడానికి బస్ స్టాప్ కు వస్తాను.. అక్కడే ఉండు"
"ఓకే! బై.. గుడ్ నైట్.. స్వీట్ డ్రీమ్స్... " అని ఫోన్ పెట్టేసింది కావ్య.
"ఎవరో బాగా క్లోజ్ లాగ ఉన్నారు?"
"మా ఫ్రెండ్... నన్ను పికప్ చేసుకోడానికి... "
"ఫ్రెండ్ అంటే ఎవరు కావ్యగారు?"
"నన్ను పికప్ చేసుకోడానికి వస్తుంది లెండి!"
"హమ్మయ్యా! భలే చెప్పారు లెండి"
"మీరు చెన్నై లో జాబ్ చేస్తారు కదా! గ్రేట్!.. మీకు పెళ్ళయిందా?"
"లేదు కావ్యగారు!"
"మిమల్ని ఎవరు చేసుకుంటారో... చాలా లక్కీ కళ్యాణ్ గారు"
"ఎందుకండీ అలా అనిపించింది"
"పక్కనే అమ్మాయి ఉన్నా.. చాలా డీసెంట్ గా ఉన్నారు. నో బ్యాడ్ హ్యాబిట్స్.. ఇందాక మీరు మీ అమ్మ తో మాట్లాడిన మాటలు బట్టి గ్రహించాను. మీకు మీ మదర్ అంటే, చాలా ఇష్టం అని అర్ధమైంది.. అమ్మని బాగా చూసుకున్నవాడు... పెళ్ళాన్ని బాగా చూసుకుంటాడు కదా!"
"థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్"
"హైదరాబాద్ లో మా అక్కా బావ ఉన్నారు.. ఎందుకో రమ్మనారు... వెళ్తున్నాను"
మాట్లాడుతూనే.. ఇద్దరికీ నిద్ర పట్టేసింది. నిద్ర లేచేసరికి.. హైదరాబాద్ లో ఉంది బస్సు.
"ఓకే కళ్యాణ్ గారు! నేను ఇక్కడే దిగేస్తాను.. బై... నైస్ మీటింగ్ యు" అని ఒక స్మైల్ ఇచ్చి దిగేసింది..
నేను లాస్ట్ స్టాప్ లో దిగి ... మా ఇంటికి వెళ్లిపోయాను. ఇంటికి వచ్చినా... మనసంతా కావ్య ఆలోచనలతోనే నిండి ఉంది. పెళ్ళి చూపులు ఎలాగైనా రిజెక్ట్ చెయ్యాలని అనుకున్నాను.
పెళ్లి చూపులలో అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాను. ఎదురుగా ఎవరో కాదు.. కావ్య. నన్ను చూసి.. మళ్ళీ ఒక స్మైల్ ఇచ్చింది కావ్య.
"బాబూ! అమ్మాయితో విడిగా మాట్లాడాలంటే, బాల్కనీ లోకి వెళ్ళు" అన్నారు కాబోయే మావగారు.
వెంటనే, ఇద్దరూ బాల్కనీ లో వేసిన రెండు చైర్స్ లో కూర్చున్నారు..
"హలో మేడమ్ !... నన్ను చూసి స్మైల్ ఇచ్చావంటే, నా గురించి నీకు ముందే తెలుసా?"
"మా అక్క మీ ఫోటో పంపించింది"
"అంటే నేనే అమాయకుడినా? నాకు నీ ఫోటో మా అమ్మ పంపలేదు... నేనూ అడగలేదు".
"లేదు కళ్యాణ్... బస్సు ఎక్కిన తర్వాత.. నిన్ను చూసాను. వెంటనే, నా సీట్.. నీ పక్క సీట్ తో మార్చుకున్నాను. మీరు నాకు బాగా నచ్చారు కళ్యాణ్! నేను మీకు నచ్చానా?"
"బస్సు లో జరిగిన పెళ్ళి చూపులలోనే, మీరు నచ్చేసారు కావ్య.. ఈ రెండో పెళ్ళిచూపులు ఒక ఫార్మాలిటీ మాత్రమే!"
"నాదీ అదే ఫీలింగ్ కళ్యాణ్!"
*****
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments