top of page
Writer's picturePeddada Sathyanarayana

బస్సు టికెట్ 

#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #BusTicket, #బస్సుటికెట్


Bus Ticket - New Telugu Story Written By - Peddada Sathyanarayana   

Published In manatelugukathalu.com On 08/11/2024

బస్సు టికెట్ తెలుగు కథ 

రచన: పెద్దాడ సత్యనారాయణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



 రాజమండ్రి బస్సు స్టాండ్లో సామర్లకోట వెళ్లే బస్సు కోసము నిరీక్షిస్తున్నాడు విశ్వనాథము. పదినిముషాల తర్వాత బస్సు వచ్చింది. వర్షాకాలం ప్రభావము వలన ప్రయాణికులు తక్కువగా ఉన్నందువలన, సీటు తేలికగా దొరికినందుకు ఉత్సాహముగా కిటికీ దగ్గర కూర్చున్నాడు.

 

 పంచెకట్టుతో తన పక్కకి వచ్చి ఒక వ్యక్తి కూర్చున్నాడు, చూసేందుకు పురోహితుడు అని తేలికగా గుర్తు పట్టవచ్చు అనే తీరులో ఉన్నారు. పక్కన కూర్చొని, “నాపేరు జోగయ్య శాస్త్రి, పోరోహిత్యము, స్థిరనివాసము సామర్లకోట” అని చెప్పారు.

 

 “నాపేరువిశ్వనాము, స్వగ్రామము తణుకు" అని, అని పరిచయము చేసుకున్నారు. ఆ విధముగా పదినిమిషాలు ఇద్దరూ లోకాభి రామాయణము మాట్లాడుకున్నారు. 


“విశ్వనాథం గారూ! మీరు రాజమండ్రికి మొదటసారి రావడమా?” అని అడిగారు జోగయ్య శాస్త్రి.

 

“అవునండి, మా అమ్మాయి సంబంధము గురించి రాజమండ్రి వచ్చానండి”. 


“శుభము. త్వరలో పప్పన్నము పెట్టే అవకాశము ఉందన్నమాట”. 


 “మా తాహతుకి మించిన సంబంధము. పొసగ లేదండి” అని జవాబిచ్చాడు విశ్వనాథం. 


“శివ కేత్రము లో శివుడి దర్శనము చేసుకొనే ఉద్దేశముతో సామర్ల కోట వెళ్తున్నానండి దర్శనము తర్వాత తణుకు వెళ్లి పోతానండి”

 

 “అలాగా, విశ్వనాథం గారు, నాకు పరిచయ మున్న సంబంధము ఉంది. మీకు అన్ని విధాలా నచ్చుతుందని నా అభిప్రాయము. ఎంతయినా దైవానుగ్రహము ముఖ్యము”, అని బస్సు టికెట్ మీద పెళ్లి వారి ఫోన్ నంబర్ విశ్వ నాథానికి ఇచ్చారు.

 

 “చాలా, సంతోషమండీ” అని చొక్కాజేబులో టికెట్ పెట్టుకున్నారు విశ్వనాథం గారు. శివ దర్శనము అయిన తర్వాత తణుకు బస్సెక్కి ఇంటికి చేరుకున్నారు.


“ బాగా అలిసి పోయినట్టున్నారు. స్నానము చేసి రండి, భోజనము వడ్డిస్తాను” అంది కమల. 


 భోజనము వడ్డించిన తర్వాత, “కమలా! సంబంధం పొసగ లేదు” అన్నాను బాధగా. 


“అసలేమైందండీ?” అని అడిగింది కమల. 


“వాళ్ళ గోతెమ్మ కోరికలు తీర్చడము మన వల్లకాదు. అబ్బాయి నల్లగా ఉన్నా ఆస్తిపరులు అన్న విషయము నీకు కూడా తెలుసు. కట్నము వద్దు, పెళ్లికొడుకుకి పడవ లాంటి కారు వారి అంతస్తుకి తగినట్టు ఇవ్వాలి అని చెప్పారు”.

 

“ఇదేమి చోద్యమండి.. మనది మధ్య తరగతి కుటుంబము అని తెలిసి కూడా ఎలా అడిగారండి”.


“కమలా! ప్రతి విషయానికి కారణము ఉండదు. అంతా మన తలరాత” అని అంటాడు.


 “ఏమండీ! మీచొక్కా జేబులో బస్సు టికెట్ మీద ఎవరిదో ఫోన్ నెంబర్ రాసిఉంది” అని విశ్వనాథానికి ఇచ్చింది.

 

“కమలా! బస్సు లో జోగయ్య శాస్త్రి గారు, మనకి అన్నివిధాలా నప్పుతుంది అని పెళ్లి వారి ఫోన్ నెంబర్ ఇచ్చారు”.


“ ఏ పుట్టలో ఏముందో, ఒకసారి ఫోన్ చేసి కనుకోండి” అని తొందర పెడుతుంది కమల. 


విశ్వనాథం ఫోన్ చేస్తే 'రాంగ్ నెంబర్' అని అవతల వ్యక్తి ఫోన్ కట్ చేస్తాడు. మరల ఫోన్ చేస్తే 'రాంగ్ నెంబర్' అని కట్ చేసాడు. మూడోసారి ఫోన్ చేస్తే అవతలి వ్యక్తి ‘హలో ఎవరు’ అని అడుగుతాడు. 


“నాపేరు విశ్వ నాథం” అంటాడు. “మీరు రామశాస్త్రి గారా అండీ” అని అడుగుతాడు.


అవతలవ్యక్తి “నాపేరు ఖాసీం” అని జవాబిస్తాడు.


“క్షమించండి” అని విశ్వ నాథం కాల్ కట్ చేస్తాడు. 


 వారము రోజుల తర్వాత విశ్వనాథం సెల్ మోగితే ‘ఎవరండీ’ అని అడుగుతాడు. 


అవతల వ్యక్తి “నా పేరు గంగాధరం అండి. జోగయ్య శాస్త్రి గారు మిమ్ములను పెళ్లి సంబంధము గురించి సంప్రదించ మన్నారు” అంటాడు. 


 “చాల సంతోషమండీ”, అని ఇరు పక్షాలవారు పెళ్లి విషయాలు మాట్లాడు కొని ఒక శుభముహూర్తాన వివాహము జరిపిస్తారు.

 

 విశ్వ నాథానికి ఒక విషయము అర్థము కాలేదు. తన ఫోన్ నెంబర్ జోగయ్య శాస్త్రి గారికి ఎలా తెలిసింది. 


విశ్వనాథం జోగయ్య శాస్త్రికి ఫోన్ చేసి, “శాస్త్రిగారు, మీరు నాకు ఇచ్చిన ఫోన్ నెంబర్ తప్పు నంబరని గంగాధరం కి ఫోన్ చేయలేక పోయాను. నా నెంబర్ మీకు ఎలా లభించిందో అర్థము కాలేదు” అంటాడు.


 “విశ్వనాథం గారు, మీకు నేను రాసిచ్చిన ఫోన్ నెంబర్ బస్సు కుదుపులో, ఆరు కి బదులు ఎనిమిదిగా రాయబడింది.

 

 రెండో విషయము, మీ ఫోన్ నెంబర్ బస్సు కౌంటర్లో చెప్పినప్పుడు నాకు గుర్తు ఉండి పోయింది. తర్వాత జరిగిన విషయాలు మీకు తెలుసు గదా. విశ్వనాము గారు.. దీనినే దైవేచ్ఛ అంటారు”. 


“శాస్త్రి గారు, మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజము” అంటాడు విశ్వనాథం. 


 --------------------------------------------------------------------------------------------------------------------------

పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు   నా  నమస్కారములు.

పేరు: పెద్దాడ సత్యనారాయణ   B .A  విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్                                                               

డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్   

విద్యాభ్యాసము సికింద్రాబాద్                                                                    

సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి  4 కధలు 1 నాటిక                                                

వ్యాసాలకి పారితోషికం  మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.                                            

సంఘసేవ:  గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి   మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.


 


46 views0 comments

コメント


bottom of page