'Cast Feeling' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 08/03/2024
'క్యాస్ట్ ఫీలింగ్' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఈరోజుల్లో చాలామంది యువతి యువకులకు చదువంటే లెక్కలేదు, ప్రేమంటే పిచ్చి, తల్లిదండ్రులు బాద పట్టదు. గురువులంటే గౌరవం ఉండదు, ఇది వరుస. పిల్లలేమో మంచి, చెడు అని చూడకుండా ఏది నచ్చితే అది చేసుకుంటున్నారు. లోకంలో ప్రేమించని వారు లేరు. అందరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. కానీ.. ! ప్రేమించే వయసు ఏదో.. మనస్ఫూర్తిగా ప్రేమించే వారి పేరు కూడా చెప్పలేరు. పిల్లలు ఏ దారిన పోతున్నారో కనిపెట్టలేని తల్లిదండ్రులుపై కొందరు మేధావులు పెదవి విరుస్తుంటారు.
కానీ.. అందరి తల్లిదండ్రులు పిల్లలను కనిపెట్టుకు కూర్చోలేరు కదా.. ? మోసం చేస్తు, అబద్ధాలు చెప్తు, నాటకాలు ఆడుతు తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చకుండా పిల్లలు ఆరాచకాలకు బలవుతున్న తల్లిదండ్రులుపై కొంతమందైనా జాలి చూపాలి. ఇది కొంతమంది తల్లిదండ్రులుకు మాత్రమే. ఇది ఒక దశ.
కొంతమంది ప్రేమించుకునే ప్రేమికులు నిజంగా ప్రేమంటే దానికి ఒక అర్ధాన్ని చూపిస్తారు. నిజాయితీగా ప్రేమిస్తారు. ప్రేమంటే దానికి కులం, మతం, పేద, ధనిక అంటు ఏ అవధులు ఉండవు కదా అయితే.. ! ఇక్కడ కొందరి ప్రేమ ఓడిపోవటానికి తల్లిదండ్రులు ప్రధాన కారణం అవుతున్నారు. ప్రేమంటే అంత ఆషామాషీ కాదు. ఇరువురికి నచ్చాలి.
నమ్మకం ఏర్పడి అది బలపడితే ఆ బంధాన్ని ప్రేమజంట అంటారు. కొందరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుని కలిసి బతకాలని నిర్ణయించుకున్నాక చివరిగా తల్లిదండ్రులు పరువు అనే పాపానికి బలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా, మరికొందరు మనసులో మరువలేని జ్ణాపకాలతో గుండె రాయి చేసుకుని ప్రేమించిన వాళ్ళని వదిలి తల్లిదండ్రులు తెచ్చిన వాడితో చస్తూ బతుకుతుండగా, ఎవరో కొద్దిమంది ధైర్యం చేసి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు.
ఆ కోవకు చెందిన ప్రేమ జంటే అనిల్- మోహిని.
అనిల్ మోహినిల ప్రేమ స్కూల్ స్థాయి నుండే కొనసాగటంతో ఇప్పుడు అనిల్ సాప్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా కూడా మోహిని అతడిని మరిచిపోలేకపోయింది. అంతగా వారి ప్రేమ బలపడింది. అనిల్ ఇతర కులానికి చెందినవాడైనా మోహిని కులం చూడలేదు. అనిల్ ప్రేమని చూసింది. అప్పుడప్పుడు బయట కలిసి తిరుగుతుండేవాళ్ళు.
అలా ఒకరోజు వీళ్ళ తిరుగుడు మోహిని ఊరి వాళ్ళు కొందరు చూసి మోహిని తల్లిదండ్రులు ఆనందరావు-మాణిక్యం గారికి తెలిపారు. అంతే తక్కువ కులం వాడికి ప్రేమించిందని మోహినిని తిట్టారు. అతడినే పెళ్లి చేసుకుంటానని మోహిని మొండికేయగా కొట్టారు. నిజంగా ఇది విడ్డూరమే.
ఎందుకంటే.. ! పెద్ద కూతురు అని తమని బాగా చూసుకుంటుందని అల్లరిముద్దుగా పెంచారు. ఏది కావాలంటే అది కొని తెచ్చారు. అలాంటి తల్లిదండ్రులు జీవితాంతం ప్రేమించిన వాడితో కలిసి బతకుతానంటే మాత్రం అడ్డు చెప్తున్నారు. మోహిని వలన మిగిలిన ఇద్దరు కూతుళ్ళు శ్రావణి స్పందనలు కూడా ఇలాగే చేస్తారని.
ఇక్కడ ఈ తల్లిదండ్రులు అతడు ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, మంచి లక్షణాలు ఉన్నవాడు అనేవి ఆలోచించటం లేదు.
ఎవరో మనం ఇబ్బందుల్లో ఉంటే ఒక్క ముద్ద కూడా పెట్టని మన కులపోళ్ళు,, మన ఇరుగుపొరుగు, తక్కువ కులపోడికి ప్రేమించిందని చెప్పుకుంటున్నారని తమ పరువు పోతుందని కూతురు ప్రేమను కాదంటున్నారు. అక్కడితో ఆగక తమ కులానికి చెందిన వాడితో పెళ్లికి సిద్దం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో మోహిని బాదను అక్షరాలు కూడా వర్ణించలేవు. ప్రేమించినోడిని దూరం చేసుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో చివరకు తల్లిదండ్రులుకు చెప్పకుండా అనిల్ తో గుడిలో పెళ్ళి చేసుకుంది
అగ్రశ్రేణి కులం అమ్మాయి, తక్కువ కులపోడికి పెళ్లి చేసుకుందని ఊరువాడ చెప్పుకుంటుంటే ఆనందరావు పరువుపోయిందని సిగ్గుతో నా కూతురు చచ్చిపోయిందని శవంలేని చీతికి నిప్పు పెట్టి కర్మకాండలు చేశాడు. అప్పటి నుండి ఇద్దరు కూతుళ్ళని, బార్యని పట్టించుకోకుండా ఇంట్లోనే సిగ్గుతో ఉంటు బతికేవాడు ఆనందరావు.
ఇక అనిల్ తనది తక్కువ కులమైనా తన వారందరిని వదిలేసి వచ్చిన మోహినిని కన్నీరు పెట్టించకుండా బాగా చూసుకుంటున్నాడు. నిజంగా అనిల్ తెలివైనోడు, ధైర్యవంతుడు, మంచివాడు కూడా. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు అనిల్-మోహిని లు షాపింగ్ కి వెళ్ళారు. అక్కడ మోహిని పెద్ద చెల్లి శ్రావణి పనిచేస్తుండటం చూసింది.
జరిగింది చెల్లి ద్వారా తెలుసుకుంది. తాను చనిపోయానని చెప్పినందుకు మోహిని ఏడవలేదు కానీ.. ! తండ్రి సిగ్గుతో ఇంటివద్దే ఉంటు అమ్మను, చెల్లెళ్లను పట్టించుకోక పోవటంతో వాళ్ళ పరిస్థితికి ఏడ్చింది. తన భార్య బాధ తన బాధగా భావించి శ్రావణికి బిజినెస్ చేసుకునేందుకు తాను డబ్బులు ఇస్తానని మాట ఇచ్చాడు. అంతేనా..
అమ్మ, నాన్న, చెల్లి- శ్రావణి సంపాదనపై ఆధారపడుతున్నారని తెలుసుకుని బిజినెస్ ఏర్పాట్లు పూర్తి అయ్యేవరకు శ్రావణికి డబ్బులు ఇస్తూనే ఉన్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు.
"అక్క బావా డబ్బులు ఇస్తున్నారని మాత్రం చెప్పకూడ"దని.
ఇన్నాళ్ళకి మోహినికి అనిల్ కి ప్రశాంతత దొరికినట్లు అయింది. ఎందుకంటే.. !ఎంత ప్రేమించినోడినైనా తల్లిదండ్రులుకు చెప్పకుండా పెళ్ళి చేసుకున్నందుకు ఆడదిగా మోహినికి బాదపెడుతుంది కదా.. ? అలాగే తక్కువ కులం వాడైనా మంచి లక్షణాలు ఉన్నా పెళ్లికి ఒప్పుకోకపోతే మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకోవటం అంటే అనిల్ మోహిని తల్లిదండ్రులుకు మోసం చేసినట్లు కాదా.. ? ఇప్పుడు వాళ్ళకి సహాయం చేసి త్రుప్తి పడ్డారు.
అనిల్ తన కంపెనీలో ప్రమోషన్ అయ్యాడు. ఒకరోజు తాను పనిచేస్తున్న కంపెనీ ఇంటర్వ్యూకి మరదలు స్పందన రావటం చూశాడు. విషయం అర్థం చేసుకుని స్పందనకు పిలిచి తన బాస్ దగ్గరకు తీసుకెళ్ళి అక్కడే ఉద్యోగం ఇప్పించాడు.
ఇద్దరు కూతుళ్లు సంపాదిస్తుండటంతో ఆనందరావు బయటకు వచ్చాడు.
తక్కువ కులపోడికి పెళ్లి చేసుకుంటే ఆపలేని వాడు మిగిలిన కూతుళ్ళు అలాంటి బుద్దులే వచ్చి వాళ్ళు కూడా అలాగే పోతారని వెక్కించిన ఇరుగుపొరుగు వాళ్ళకి సమాధానం చెప్పటానికి.
"పెద్ద కూతురు చచ్చిపోయినా మిగిలిన కూతుళ్ళు తన కుటుంబం బాధ్యత కోసం కష్టపడ్డారని అందరితో చెప్తుండేవాడు. పెద్ద కూతురు ఏడాది పిండ ప్రధానం చేస్తున్నాడనే విషయం స్పందనకు తెలిసి
"అక్క బావే నాకు కంపెనీలలో ఉద్యోగం ఇప్పించారని బావ లేకపోతే నాకు ఉద్యోగం రాద" ని చెప్పింది.
శ్రావణి కూడా బావకిచ్చిన షరతు పక్కనపెట్టి
" షాపింగ్ మాల్ లో పని చేస్తున్నప్పుడు అక్కతో కలిసి వచ్చాడని నన్ను చూసి బిజినెస్ చేసుకునేందుకు పది లక్షలు, కుటుంబం బాధ్యత కోసం మరో రెండు లక్షలు ఇచ్చాడని బావ వలనే ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాన"ని చెప్పింది.
అక్కంటే నీకెందుకు ఇంత ద్వేషం. కులము కులము అని ఏడ్చే ఈ ఇరుగుపొరుగు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కడైన వచ్చి సహాయం చేశాడా.. ? కనీసం పలకరించారా.. ? తక్కువ కులపోడికి చేసుకుందని ఎవడినైతే నువ్వు అవమానించావో వాడే ఇన్నాళ్లు మనకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నాడు. ఇప్పుడు చెప్పండి ఎవడిచ్చిన డబ్బులుతో మనం ఇన్నాళ్లు బతికాము.. ? మన కులపోడైతే మాత్రం అక్కని జాగ్రత్తగా చూసుకుంటాడని గ్యారెంటీ ఇవ్వగలవా.. ?
పిల్లలు ఒక వయసకి వచ్చాకా తమకు ఏమి కావాలో తెలుసుకోలేనంత అమాయకులు కాదు. అనవసరంగా ఈ లోకంలో తల్లిదండ్రులు పంతానికి పోయి పిల్లలు ప్రేమను అర్థం చేసుకోవటంలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయితే మాత్రం కూలిపోవటం లేదా.. ఒక మనిషి ఎలాంటివాడనేది చూడాలి కానీ ఏ కులపోడనేది అనవసరం ఇప్పటికైనా మారండి అక్కబావని ఇంటికి పిలిచి గర్వంగా అక్కను అత్తారింటికి పంపండి ఇప్పుడు అక్క ప్రెగ్నెంట్ కూడా° అని శ్రావణి తల్లిదండ్రులును ఒప్పించింది.
తన కూతురు ఇన్ని మాటలు ఎక్కడ నేర్చిందో కానీ.. చాలా చక్కగా చెప్పిందని ఆమె చెప్పిన ప్రతిదాంట్లో నిజం ఉందని తానే అనవసర కుల ప్రస్తావన తెచ్చి ఆరోగ్యం పాడుచేసుకున్నానని బాదపడి కూతురు అల్లుడిని ఇంటికి పిలిపించి మోహినికి శ్రీమంతం చేసి ఊరువాడ అందరికీ పిలిపునిచ్చాడు. ఆనందరావు మారినందుకు మోహిని అనిల్ ఎంతో ఆనందించారు.
**** **** **** **** **** ****
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Kandukuri Sunitha kumar
•5 hours ago
Super 👍👍