#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChaduvuAvasyakatha, #చదువుఆవశ్యకత, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 30
Chaduvu Avasyakatha - Somanna Gari Kavithalu Part 30 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 10/03/2025
చదువు ఆవశ్యకత - సోమన్న గారి కవితలు పార్ట్ 30 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
చదువు ఆవశ్యకత
చదువుకుంటే జీవితము
అజ్ఞానం తొలగిపోయి
అవుతుంది తేజోమయము
అక్షరాల వాస్తవమ్ము!
అభివృద్ధికి రాచబాట
భవిష్యత్తుకు కంచుకోట
విజ్ఞానం వికసిస్తే
బ్రతుకగును పూలతోట
అన్నింటికీ మూలము
అవనిలో చదువు ఒకటే!
గురువుల మాట వింటే!
దీవెనలు వెనువెంటే!
చదువు విలువ తెలుసుకో!
తలరాతను మార్చుకో!
గురువు ఆవశ్యకతను
అనిశమూ! గుర్తించుకో!

పంతులమ్మ పలుకులు
----------------------------------------
కన్నవారి ఆశలు
నెరవేర్చే పిల్లలు
పుడమిలోన ధన్యులు
బ్రతుకంతా శుభములు
గురుదేవుల పలుకులు
స్వీకరించు శిష్యులు
ఎదుగుతారు బ్రతుకున
వెలుగుతారు జగమున
పెద్దల హెచ్చరికలు
సరైన జాగ్రత్తలు
తీసుకున్న వ్యక్తులు
అవుతారోయ్! శక్తులు
ఆలోచన ముఖ్యము
ఆచరణ అవసరము
శ్రమించు తత్వమున్న
సుఖమయము జీవితము

బాలల ప్రతిన
----------------------------------------
వేళకు నిద్దుర పోతాం
వేకువజామున లేస్తాం
శుచిగా స్నానం చేస్తాం
శుభ్రంగా మేముంటాం
త్వరగా బడికి చేరుతాం
తరగతి గదిలో ఉంటాం
గురువుకు దండం పెడుతాం
పాఠాలు బాగా వింటాం
శ్రద్ధగా మేం చదువుతాం
బుద్ధిగా మేం మసలుతాం
హద్దుల్లో మేం ఉంటూ
పద్ధతిగా జీవిస్తాం
కాలం విలువనెరుగుతాం
జాప్యం మేం తరుముతాం
వాయిదా వేయుట మాని
సాఫీగా సాగుతాం
నిర్లక్ష్యమే వీడుతాం
చురుకుదనమే చూపుతాం
సాహసమే చేసేస్తాం
చరిత్రనే సృష్టిస్తాం
ఉన్నతంగా ఎదుగుతాం
వినయంతో ఒదుగుతాం
దేశభక్తిని చాటుతాం
దేశకీర్తిని నిలుపుతాం

శ్రేష్టమైన సమయం
----------------------------------------
విలువైనది సమయము
ఎవరి కొరకు ఆగదు
సద్వినియోగమైతే
జీవితం సార్థకము
గడిచినట్టి కాలము
ఎన్నడు తిరిగిరాదు
ఎవరి మాట వినదది
వ్యర్థం చేయరాదు
కాలాన్ని వాడుకో!
దానితో సాగిపో!
అది ఎవరికి లొంగదు
క్షణమైనా నిలువదు
రెప్పపాటు కాలము
అదెంతో అమూల్యము
చేయి జారనీయకు
వాయిదాలు వేయకు
కాలంతో ఆటలు
జీవితాన మంటలు
కాలం సాక్షిగా!
బ్రతుకుము దివ్యంగా!

మాస్టారు మంచి మాటలు
----------------------------------------
ఒక్క క్షణం యోచించు
ఆవేశము తగ్గించు
అమితమైన ప్రమాదము
చెరుపునోయ్! ఆరోగ్యము
అతి వేగము అనర్ధము
ఆర్పేయునోయ్! అసువులు
నిదానమే ప్రధానము
మిగులునోయ్! కుటుంబాలు
అనునిత్యం జగడాలు
హరించును ఆనందము
శృతిమించిన ఆగడాలు
చేయు సర్వ నాశనము
వేయరాదు వేషాలు
చేయరాదు మోసాలు
ఎప్పుడైనా అపాయము
తెలియును నిజ స్వరూపము
-గద్వాల సోమన్న
Comments