'Chaduvu Nerchukondi' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally
'చదువు నేర్చుకొండి' తెలుగు కవిత
రచన: సుదర్శన రావు పోచంపల్లి
చదువు చదువు చదువు చదువు
చదువు నేర్చుకొండి బతుకు బాట మార్చుకొండి
చదువు వ్రాత రెండు నేర్చి సంసారం చక్కదిద్దుకొండి
సర్కరోళ్ళు ముందుకొచ్చి చదువు నేర్పబూనుకొని
పలుక బలుపమిచ్చి వారు పంతుళ్ళను బంపించిరి
పొద్దున్నే పిల్లలకు పొద్దుగృంక పెద్దలకు
వద్దన్నా చదువు జెప్పి ఉద్దరించ వారొచ్చిరి
కాయకష్టం చేసుకుంటె కడుపు నిండునేమొకాని
వ్రాయరాక చదువరాక జీవితాన
మోయలేని బరువైనా మోసుకుంటు మొత్తుకుంటె
చేయ బోరు సాయమెవరు చేతనైన వారు గూడ
రోజికొక్క గంటైనా రోతలేక నేరుస్తె
రోజు రోజు వ్రాతలన్ని చేతనయ్యే రీతి దెలుసు
చదువురాని వారి చేత చాకిరీలు చేయించే
శ్రమ దోపిడీల పెద్దల్ని దరి జేరకుండ చూడండి
తూనికలు కొలతల లో తుఛ్చమైన చేష్టలన్ని
మానుకునే మాటలన్ని చదువుల మూటవిప్పి చెప్పండి
కూలినాలి జేసుకుంటు కూడబెట్టిన సొమ్మంత
వేలిముద్రలేసుకొని జాలి లేక దోచుకునే జాతి రీతి మార్చండి
సంతకాలు నేర్చుకొని స్వంత బుద్ధి తెలుసుకొని
సావుకార్ల తెలివి యింక సాగకుండ జూడండి
ప్రమిదలోన ఒత్తి వేసి చమురు బోస్తె వెలిగినట్టు
చదువు మీరు నేర్చుకొని సాహసంగ బ్రతుకండి
చదువు చదువు చదువు చదువు
చదువు నేర్చుకొండి బతుకు బాట మార్చుకొండి
చదువు వ్రాత రెండు నేర్చి మీ సంసారం చక్క దిద్దుకొండి.
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Σχόλια