#KandarpaMurthy, #కందర్పమూర్తి, #చదువుకోవాలని, #Chaduvukovalani, #TeluguMoralStories, #నైతికకథలు
'Chaduvukovalani' - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 05/10/2024
'చదువుకోవాలని' తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"సూరిగా, బడికి టైమయిపోనాది. ఇంకా బయటికి రావేటి" కొడుకు సూరిబాబును కేకేస్తున్నాడు రిక్షా సింహాద్రి.
"అయ్యా, బడి బట్టలేసుకున్నాను, పద " అంటూ సూరిబాబు స్కూల్ బేగు వీపు మీదేసుకుని సైకిలు రిక్షా
ఎక్కి కూర్చున్నాడు.
సింహాద్రి సైకిల్ రిక్షా ముందుకు కదిలింది.
గతంలో కెళితే..
బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చిన సింహాద్రికి పనులు దొరక్క చిల్లర దొంగతనాలు చేస్తు బ్రతుకుతున్నాడు.
ప్రయాణీకుల జేబులు కొట్టినప్పుడు అదృష్టం బాగుండి పెద్ద మొత్తంలో డబ్బు దొరికితే కొద్ది రోజులు జల్సా చేస్తాడు. ఒక్కొకసారి చిల్లరతో సరిపెట్టుకుంటాడు.
ఆడాళ్ల పర్సులు కొట్టినప్పుడు బంగారం వస్తువులు దొరికితే మార్వాడీ శేఠ్ కి అమ్మి డబ్బులు చేసుకుంటాడు.
ఒకసారి పెళ్లాం లచ్చి ముచ్చట పడిందని బంగారు గొలుసు చిక్కితే దాని మెడలో వేసాడు. ఆ గొలుసును భద్రంగా దాచి మెడలో వేసుకునేది లచ్చి.
నోటుబందీ వచ్చినప్పటి నుంచి జనాలు పర్సుల్లో పెద్ద రూపాయి నోట్లు ఉంచుకోకుండా మొబైల్ స్మార్ట్ ఫోన్లలో ఆర్థిక లావాదేవీలు జరుపుతుండటం వల్ల జేబుదొంగ సింహాద్రి చేతిలో డబ్బులకు
కరువొచ్చింది.
అందువల్ల ఖరీదైన మొబైల్ స్మార్ట్ ఫోన్లు దొంగతనం చేసి మొబైల్ షాపతనికి అమ్మిన డబ్బుతో రోజులు వెళ్లదీస్తున్నాడు.
సింహాద్రి ఆరేళ్ల కొడుకు సూరిబాబుకు చదువంటే ఇష్టం. రోజూ రోడ్డు మీద గోలీలాడేటప్పుడు స్కూలు పిల్లలు రంగు రంగుల యూనిఫారాలతో వీపు మీద పుస్తకాల బేగులతో వెల్తుంటే ఆశక్తిగా చూస్తుంటాడు.
'బడికి పోతానంటే అయ్య పోనివ్వడు. పుస్తకాల సంచి, పలక బలపం కొనమంటే పైసలు లేవని కసురుకుంటాడని' బాధ పడుతుంటాడు.
ఒకరోజు ఉదయాన్నే లచ్చి ఆప్యాయంగా చూసుకునే తన బంగారు గొలుసు కానరావడం లేదని కేకలేస్తోంది.
"సరిగ్గా చూసుకోయె, అక్కడే ఎక్కడో పడుంటాది. మనింటికి దొంగలెవురొత్తారని" మంచం మీద సిగరెట్టు కాలుస్తున్న సింహాద్రి సర్ది చెబుతున్నాడు.
"లేదు మావా!, రేతిరి తొంగున్నప్పుడు మెడలోనె ఉండాది. పొద్దుగాల నుంచి కానరావడం లేదు. అంతా ఎతికినా దొరకలేదు. ఈయాల చిన్నోడు బేగె ఆడుకోడానికి పోయినాడు. " సోది చెప్పుకు పోతోంది లచ్చి..
ఇద్దరూ గుడిసెలోంచి బంగారం గొలుసు ఎట్టా పోయినాదని తర్జనభర్జన పడుతున్నారు.
మధ్యాహ్నమైంది. చిన్నోడు ఇంకా బువ్వకి రాలేదని ఎదురు చూస్తున్నారు ఇద్దరూ.
ఇంతలో సూరి చేతిలో పుస్తకాల సంచిలో పలక, బలపం పెట్టుకుని వచ్చాడు.
సూరిబాబును చూడగానే లచ్చి " ఏరా, చిన్నా! నా బంగారం గొలుసు చూసినావటరా?" అని నిలదీసింది.
"అవునే, అమ్మా ! నువ్వు తొంగున్నప్పుడు నానే ఆ గొలుసు తీసినాను. అయ్యని పుస్తకాల సంచి కొనమంటే డబ్బులు లేవని, నీకెందుకురా సదువని కసురుకుంటాడు. అందుకని నీ బంగారం గొలుసు మార్వాడీ శేఠ్ దగ్గిర కుదువ పెట్టి ఆ పైసలతో ఈ పుస్తకాల సంచి, పలక బలపం కొని తెచ్చుకున్నా" అన్నాడు అమాయకంగా సూరిబాబు.
ఆడి మాటలు విని సింహాద్రి రెచ్చిపోయి కేకలేస్తున్నాడు.
ముందు లచ్చి కోపం తెచ్చుకున్నా సదువు మీద ఆడికున్న శ్రద్ధ చూసి సింహాద్రికి నచ్చ చెప్పి దగ్గిరలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలిసి విషయం చెప్పి సూరిబాబును అక్కడ చదువులో చేర్పించి తను స్వీపరుగా పనిలో కుదిరింది.
ప్రధానోపాధ్యాయుడు సింహాద్రిని పిలిపించి చదువు విలువ తెలియచేసి దొంగతనాలు మానేయమని చెప్పగా రిక్షా తొక్కడం మొదలెట్టాడు సింహాద్రి.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments