చల్లని సాగరతీరం!
- A . Annapurna
- 2 days ago
- 1 min read
#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #ChallaniSagaraTheeram, #చల్లనిసాగరతీరం ! , #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Challani Sagara Theeram - New Telugu Poem Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 13/04/2025
చల్లని సాగరతీరం! - తెలుగు కవిత
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
నా ఎదుట అంతు తెలియని లోతైన సాగరం
నా తలెత్తిచూస్తే అనంతమైన నీలాకాశం
నా పాదాలను తాకి గిలిగింతలు పెట్టె అలలు పసిపాపలు
నా ఆనందాన్ని పంచుకునే చోటు చల్లని సాగరతీరం
ఏ తీరాలనుంచో ఆత్రంగావచ్చే అలలు అందుకో చూద్దాం అంటూ
నన్నుతాకి అల్లరి చేస్తూ చిలిపిగా పరుగులు తీసేయి
అలుపు ఎరుగక నిరంతరమూ ఎగిరిపడుతూ తీరంచేరి చల్లగా జారుకుంటాయి
లోకబాంధవుడు ఉదయిస్తూ అందరినీ పలకరించి ''గుడ్మార్కింగ్ '' చెబుతాడు
రోజంతా వెలుగును పంచి ప్రజలకు పనిచేసే శక్తిని ఇస్తాడు
సంధ్యవేళ కాగానే నారింజరంగులోకిమారి ''గుడ్నైట్ ''చెబుతాడు
పిల్లలకు నీళ్లంటే ఎంతయిష్టమో భయ పదారు కేరింతలు కొడతారు
పిచ్చుక గూళ్ళు కడతారు కేసెల్ సృష్టిస్తారు తోట వేస్తారు
మనంఊహించని నిర్మాణాలు చేస్తారు చిట్టి బుర్రలో ఎన్నో ఆలోచనలు
పెద్దలు పిల్లల ఆలోచనకు ప్రోత్సాహం ఇవ్వాలి తప్ప పెద్దల ఆశలను
బలవంతాన వారిపై రుద్దకూడదు అప్పుడే వారు వృద్ధిలోకి వస్తారు
సరిఐనాబాటలోపయనించి ఎనలేనిఖ్యాతిని గడిస్తారు
చిట్టిచేతులతో ఎన్నో కళాకృతులు కత్తిరిస్తారు
నింగీనేలా ఏకంచేసి మనకు ఆనందంకలిగిస్తారు
సాగరం లేనిచోట నదీతీరాలు ఉల్లాసం కలిగిస్తాయి
మెత్తని ఇసుకలో పరుగులు తీస్తూ చిన్నా పెద్దా తేడాలేకా ఆడుకుంటాము
కలలు కంటాము స్నేహాలు పంచుకుంటాము వేదనమరచి సేదతీరుతాము
దిగులునుమరచి ఎక్కడదొరకని మనఃశాంతిని పొందుతాము
*******************

-ఏ. అన్నపూర్ణ
Comments