చందమామ సందేశం
- Gadwala Somanna
- 3 minutes ago
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChandamamaSandesam, #చందమామసందేశం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 65
Chandamama Sandesam - Somanna Gari Kavithalu Part 65 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 24/04/2025
చందమామ సందేశం - సోమన్న గారి కవితలు పార్ట్ 65 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
చందమామ సందేశం
----------------------------------------
ఆశయాల సాధనలో
ఆచరణ అతిముఖ్యము
సత్ఫలితాల చేదనలో
పోరాటం అవసరము
మహనీయుల బాటలో
ఆదర్శం అపారము
విజ్ఞానపు తోటలో
ఆహ్లాదం అనంతము
కన్నవారి సేవలో
జీవితాలు బహు ధన్యము
వారు చూపు ప్రేమలో
కన్పించును శిఖరాగ్రము
భగవంతుని సన్నిధిలో
మనశ్శాంతి పుష్కలము
వారి నామ స్మరణలో
పవిత్రమగును హృదయము

పరోపకారులు
----------------------------------------
ఫలములిచ్చు తరువులు
పంటలిచ్చు పొలములు
బహు పరోపకారులు
జలములిచ్చు చెరువులు
విద్య పంచు గురువులు
ప్రేమ పంచు మిత్రులు
బహు పరోపకారులు
ఆపదలో ఆప్తులు
పూలనిచ్చు మొక్కలు
పాలనిచ్చు గోవులు
బహు పరోపకారులు
కాపు కాయు కుక్కలు
కాంతినిచ్చు దివ్వెలు
నాదనిచ్చు మువ్వలు
బహు పరోపకారులు
సొగసులీను నవ్వులు
ముద్దులొలుకు పిల్లలు
పరిమళించు మల్లెలు
బహు పరోపకారులు
కడుపు నింపు పల్లెలు

సాటిలేని మేటి అమ్మ
----------------------------------------
కొనలేనిది కాసులతో
కొలువలేనిది త్రాసులతో
అమ్మ ప్రేమ అవనిలోన
తలచుకొనుము మనసులోన
మల్లెలా గుబాళించేది
వల్లిలా చిగురించేది
తల్లి త్యాగమొక్కటే
ఎల్లలసలు లేనిదది
అమ్మ మాట చల్లదనము
పిల్లలకది మూలధనము
గైకుంటే దీవెనలు
బాగుపడును జీవితాలు
అమ్మ మనసు నవనీతము
దివిలోని పారిజాతము
నొప్పిపెట్ట కూడదోయ్!
తప్పు అలా చేస్తేనోయ్!

అమ్మ అమృత వాక్కులు
----------------------------------------
దిక్కులేని పిల్లలను
విధి వంచిత వనితలను
పరిహాసం చేయరాదు
వయసులోన పెద్దలను
ఫలములిచ్చు తరువులను
చదువు చెప్పు గురువులను
అగౌరవపరచరాదు
భువిని తల్లిదండ్రులను
సాయపడిన మనుషులను
ప్రేమలొలుకు మనసులను
గుర్తుపెట్టుకోవాలి
కడుపు నింపు రైతులను
సరిహద్దు సైనికులను
పారిశుద్ధ్య కార్మికులను
సదా స్మరించుకోవాలి
మహిలో మహనీయులను

కన్నవారిది తొలి స్థానము
----------------------------------------
కన్నవారికివ్వాలి
మదిలో తొలి స్థానము
ఆసక్తి చూపాలి
వారిపై అనుదినము
త్యాగానికి చిహ్నాలు
కుటుంబాన దీపాలు
మరవరాదు వారిని
వీడరాదు మంచిని
వారికి సేవ చేస్తే
పుష్కలం దీవెనలు
వెనుకడుగే వేస్తే
దూరమగును శుభములు
తల్లిదండ్రులు భువిలో
కనిపించే వేల్పులు
స్మరించుకో మదిలో
భాసిల్లును బ్రతుకులు
-గద్వాల సోమన్న
コメント