top of page
Writer's pictureGoparaju Venkata Suryanarayana

చెదరిన సుఖ జీవనం

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Chedarina Sukha Jivanam' - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana

Published In manatelugukathalu.com On 14/12/2023

'చెదరిన సుఖ జీవనం' తెలుగు కథ

రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పరంధామయ్య గారు డెబ్భై ఏళ్ళు దాటిన.. బాగా బ్రతికి, నేడు వానప్రస్థంలో.. ఒంటరి జీవితం గడుపుతున్న వ్యక్తి. పూర్వాశ్రమంలో గవర్నమెంటు ఉద్యోగంలో గెజిటెడ్ రేంకులో పనిచేసి.. మంచి హోదా అనుభవించి.. రిటైర్ అయిన ఆయనకు.. ఇప్పటికీ.. పెన్షన్ రూపేణా.. ముట్టే దాంతో.. జీవితం గడవడానికి ఏ ఇబ్బందీ లేదు. 


ఉద్యోగం చేస్తున్న రోజుల్లో.. ఆఫీసులోనూ, కుటుంబంలోనూ.. ఎదురు లేకుండా.. అధికారం చెలాయించిన ఆయన్ను.. ఇప్పుడిప్పుడే.. ఒంటరితనం, ఉదాసీనతలు.. పీడిస్తున్నాయి. పాతరోజులు తరచూ గుర్తుకొస్తున్నాయి! భార్య పిల్లలతో.. ‘ గృహమే కదా స్వర్గసీమ. ’.. అన్నట్లుగా గడిపిన దినాలు.. పదే పదే జ్ఞప్తికొచ్చి.. దిగులు పుట్టిస్తున్నాయి! కళ్ళు మూసుకుంటే పాతరోజులు సింహావలోకనంగా మనసులో మెదులుతున్నాయి..


భార్య శాంతమ్మ సాహచర్యం, ఆమె అణకువ.. ఇంటి వ్యవహారాలు చూసుకోవడంలో.. ఆమె కున్న నేర్పు, ఓపిక ధర్మమా అని.. అప్పట్లో ఆయనకు.. జీవితం చాలా సాఫీగానే సాగిపోయింది. ఇద్దరు పిల్లలు.. నవీన్, రమ్యలను పెంచడం లోనూ.. ఆయన పెద్దగా శ్రద్ద పెట్టిందేమీ లేదు. తల్లిగా.. శాంతమ్మే ఓర్పుగా, .. తనే బాధ్యతగా.. వారిని సాకి పెద్ద చేసింది. 


పరంధామయ్యగారు తమకున్న పరపతి, స్తోమతు మేరకు.. పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసి.. తమ బాధ్యత తీర్చుకున్నారు. అమ్మాయి రమ్య.. ప్రస్తుతం చేరుకోలేనంత దూరంలో.. అమెరికాలో ఉంటోంది. సంసార జీవితంలో.. తనకు ఎలాంటి.. అలుపు సొలుపు లేకుండా.. తోడూనీడగా నిలిచిన భార్య శాంతమ్మ అలిసిపోయి.. వివిధ రుగ్మతలతో.. కోవిడ్ మహమ్మారికి గురై.. ఈమధ్యే తనువు చాలించిన నాటినుంచే.. పరంధామయ్య గారికి అసలు గృహ కష్టాలు.. ఒక్కుమ్మడిగా తెలియవచ్చాయి! తన అవసరాలనెరిగ.. అన్నీ సమకూర్చే.. గృహలక్ష్మి నిష్క్రమణంతో.. అప్పటివరకూ తెలియని లోటు.. ఆయనకు అనుభవంలోకి రావటం మొదలయ్యింది. 


ఆత్మీయంగా తన అవసరాలు తీర్చేవారు.. ఆయనకు బ్రతుకు బాటలో.. తెరమరుగయ్యారు! పెళ్ళైన కొత్తలో.. కొన్నాళ్లు తమతోనే ఉన్నా.. ప్రస్తుతం.. కొడుకు నవీన్ కుటుంబం కూడా.. ఉద్యోగ రీత్యా.. దూరంగానే ఉంటున్నారు. అయినా.. వారి కోడలు సౌమ్య కూడా.. అత్తింటివారి పట్ల చూపే.. అణకువ, ఆప్యాయత మర్యాదలు కూడా.. అంతంత మాత్రమే! మావగారి తత్వానికి.. అసలు సరిపడదు. 


పరంధామయ్యగారి మనస్తత్వం.. సొంత ఇల్లూ, అలవాటయిన ఊరూ వదిలి.. వేరే చోటికి మారి.. ఈ వయసులో, .. సర్దుకు పోగలిగిన నైజమూ కాదు! అందుచేత.. ఒంటరి జీవితం అలాగే నెట్టుకొస్తున్నారు అన్ని ఇబ్బందులనూ భరిస్తూ! ఆయనకయితే.. వంటయింటి వ్యవహారం.. బొత్తిగా తెలియనిది! అందుచేత.. ఊళ్ళోనే ఉన్న.. వంటలు చేసి.. నాలుగిళ్ళకు కేరియరు భోజనాలు అందించే వారితో ఏర్పాటు చేసుకున్నారు. కారాలు, మసాలాల వంటకాలు తినలేకున్నాను.. కాస్త తగ్గించమని అడిగితే.. ‘ నలుగురి కోసం చేసే వంటలు అలాగే ఉంటాయి! .. సర్దుకుపోవాలి!! ‘ అని జవాబు! 


మరో గత్యంతరం లేక.. తినగలిగినంత తిని.. రోజులు గడుపుకొస్తున్నారు.. మరో దారి లేక! అసలే భోజన ప్రియుడైన ఆయనకు.. ఆ తిండి ఏమాత్రం సంతుష్టి కలిగించడం లేదు! అయినా.. మరో మార్గం లేని పరిస్థితి! సౌష్టవంగా ఉండే ఆయన శరీరం.. బక్కచిక్కి పోయింది! మసాలాలు తినడంతో.. ఎప్పుడూ అనుభవానికి రాని ఎన్నో శరీర రుగ్మతలు తోడయి ఆయన్ను భాధిస్తున్నాయి! అంతకుమించి.. ఒంటరితనం.. తోడులేక ఎవ్వరికీ చెప్పుకోలేని ఏకాకి కావడంతో, .. ఏ వ్యాపకం లేక.. సమయం గడవక.. చిరాకు, చికాకు కలిగిస్తూ.. జీవితం ఇలా.. ఇంకెన్నాళ్ళు అని.. విసుగుతో నైరాశ్యం..ఆయన మనసులో కమ్ముకుంటోంది. 


ఈ పరిస్థితి.. ముదిమి వయసులో.. సామాన్యంగా భార్యావిహీనులందరకు.. ఎదురయ్యే ధుర్భర మానసిక స్థితే! ఈ స్థితి.. మన దేశ కాలమాన పరిస్థితుల్లో.. స్తీలకంటే.. పురుషులనే.. ఎక్కువగా హైరాన పరుస్తుందనటంలో సందేహం లేదు! పరంధామయ్య లాంటి ఒంటరి బ్రతుకులకు.. జీవన పరిష్కారంగా పుట్టుకొస్తున్నవే.. నేడు వివిధ వసతులతో వెలుస్తున్న.. నేటి ఆధునిక వృధ్ధాశ్రమాలుగా తోస్తుంది!


అక్కడైనా.. పరంధామయ్యగారి వంటి.. విశ్రాంత ఒంటరి జీవితాలకు.. చింతలేని.. సుఖ జీవనానికి అవసరమైన.. ఆహ్లాదకరమైన వాతావరణంలో.. అన్ని సదుపాయాలతో.. కూడిన జీవనం.. లభిస్తుందని ఆశిద్దాం!


 సమాప్తం!


గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

 ముందుగా మన తెలుగు కథలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కథలను, కథకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!

నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు.నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.

వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.

ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కథలంటే బాగా ఇష్టపడతాను.ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కథలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!






140 views2 comments

2 Comments


Surekha Arunkumar
Surekha Arunkumar
Dec 18, 2023

Sir, I am from HMT Hyd..(HMT LMH, MTP, MKTG, MTH) ..Nice to meet in this platform..

Like
vsgoparaju
Dec 23, 2023
Replying to

Very glad to have contact of another HMT person on this literary platform. Please give some more details of your present interests and location.

Like
bottom of page