top of page

చెట్టు ఇచ్చిన తీర్పు!.. శ్రీలేఖ కాపాడిన ఊరు!

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #ChettuIchhinaTeerpuSrilekhaKapadinaVuru, #ChettuIchhinaTeerpuSrilekhaKapadinaVuru, #TeluguKathalu, #తెలుగుకథలు


Chettu Ichhina Teerpu Srilekha Kapadina Vuru - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi

Published In manatelugukathalu.com On 01/01/2025

చెట్టు ఇచ్చిన తీర్పు!.. శ్రీలేఖ కాపాడిన ఊరు! - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


శ్రీలేఖ ఒక చురుకైన కళాశాల విద్యార్థిని. "సామాజిక సంక్షేమం" ప్రోజెక్ట్ - వర్క్ కోసం ఏదో ఒక పల్లెకు వెళ్లి, అక్కడ ప్రజలకు గల సౌకర్యాలు గమనించి, వాటిని ఎలా తీర్చి దిద్దాలో నివేదిక తయారు చేయాలి. 


శ్రీలేఖ తన చిన్ననాటి స్నేహితురాలు మేఘన ఉండే పల్లెటూరు "కాళహస్తి పల్లె" ని ఎన్నుకుంది. అక్కడికి వెళ్ళింది. 


 ఇద్దరూ స్నేహితురాళ్ళు చాలా కాలం తరువాత కలిశారు కాబట్టి.. ఆలింగనం తో మొదలయ్యి.. ఆప్యాయత - అనురాగం తో అల్లుకుపోయిన పలకరింపులు అయ్యాక.. పాత జ్ఞాపకాలతో కూడిన ముచ్చట్లు కూడా ముగిశాయి. 


భోజనాలలో ఆ పల్లె యొక్క అపురూపమైన వంటకాలతో - రుచులతో - గుమ-గుమ-లతో కూడిన వడ్డన చేశారు. కొత్త పదార్థాలు కాబట్టి శ్రీలేఖ కు భలే గా నచ్చేసాయి. కడుపు నిండి పోయింది. వంటకాల పేర్లు మరియూ అవి ఎలా తయారు చేయాలో కూడా (మేఘనను అడిగి) అన్నీ తెలుసుకొని మరీ వ్రాసుకుంది తన పుస్తకంలో.. తీపి పదార్థం తో పాటు. 


భుక్తాయసం తీర్చుకోవటానికి, మళ్లీ కబుర్లు మొదలు పెట్టారు. 

తెలియకుండానే ఎన్నో గంటలు అలా గడచి పోయాయి.. మధుర పాత జ్ఞాపకాలతో పాటు కొత్త విషయాలతో నిండిన విషయాల పై కొనసాగించిన కబుర్లతో. 


కాసేపు నడుము వాల్చారు. 

***


సాయింత్రం సంధ్యా సమయం. సూర్యుడు మండటం తగ్గించాడు. శ్రీలేఖ మరియు మేఘన ముఖం కడుక్కొని అలా నడక మొదలు పెట్టారు భుజం - భుజం మీద చేతులు వేసుకొని. ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు, ఆవులు - గేదెలు.. అక్కడక్కడా నాగలి పట్టుకొని రైతులు వెళ్ళటం.. ధాన్య రాశులు పోసి ఉండటం అక్కడక్కడా (ఇళ్లలో మరియు ఇళ్ళ బయిట).. శ్రీలేఖ కు అంతా కొత్తగా ఉన్నది. 


ఇద్దరు ప్రాణ స్నేహితులు పల్లె మధ్యలో పెద్ద దిగుడు బావి వద్దకు చేరారు. అందులో అంత నీరు చూసి "ఇది మా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ - టాంక్ బండ్ సరస్సు లా ఉన్నది ", అంటూ నవ్వేసింది శ్రీలేఖ. 


రెండు చినుకులు పడితే, "మేఘన ఊర్లో, మేఘాలకేమి లోటు? మేఘాలకు తక్కువా?" అని పక్కున నవ్వింది శ్రీలేఖ. 


కొద్ది దూరంలో కుండలు - బిందెలు పట్టుకుని, పల్లెలోకి వస్తున్న ఆడపడుచులు కనిపించారు. "ఇదేదో పాత తెలుగు సినిమా దృశ్యం లా ఉంది" అంటూ గట్టిగా నవ్వింది ఈసారి. పల్లె ప్రాంతం అంతా కొత్త అనుభూతి లా ఉన్నది (హైదరాబాద్) పట్నం అమ్మాయి శ్రీలేఖ కు. 


ఏదో సందేహం వచ్చి ఇలా అమాయకంగా అడిగింది, "ఓ మేఘనా! ఇక్కడ నిండుగా నీరు ఉన్న దిగుడు బావి పెట్టుకుని.. అంత దూరం నుండి ఎందుకు బెందెలలో నీరు మోసుకొని వస్తున్నారు.. ఆ మహిళలు.. నడక - వ్యాయామం కొరకా?" 


మేఘన విచారంగా ముఖం పెట్టి, "ఓ శ్రీలేఖ! ఏమని చెప్పను? ఎలా చెప్పను? ఈ పల్లె భూస్వాములు మరియు ధనికులు మాత్రమే ఈ బావి నీరు వాడవచ్చు. పేద వారు వాడకూడదు. 5 కిలోమీటర్లు దూరంగా పల్లె పొలిమేర లో ఉన్న దిగుడు బావి నుండే తెచ్చుకోవాలి. ఒక వేళ పేద వారు ఈ నీరు తీసుకుంటే - వాడితే.. అది భూస్వాములకు తెలిస్తే.. ఈ ఊరు నుండి వెలి-వేస్తారు. వేరే ఊరు చూసుకోవాలి. ఇక్కడి సంప్రదాయం ఇది", అన్నది. 


శ్రీలేఖ ఆవేశంగా, "ఇది సంప్రదాయం కాదు.. ఈ భూస్వాముల - ధనికుల అహంకారం, అహంభావం. దానిని ఎలా అణిచి వేస్తానో నువ్వే చూస్తావు గా.. రేపు జాతర లో.. మనుషులంతా ఒక్కటే అని గుణపాఠం నేర్పిస్తాను ఆ ఆధిపత్యం చెలాయించే దుర్జనులకు", అన్నది. గర్జించింది అనటం సబబు. 


ఇద్దరూ స్నేహితురాళ్ళు తిరుగు నడక మొదలెట్టారు మేఘన ఇంటి దిశగా. అస్తమించే సూర్యుడు ఎర్రగా కనిపిస్తున్నాడు.. ఈ భూస్వాముల రాక్షస నీచ నివృతికి.. దురహంకారానికి.. కోపిస్తున్నాడు అన్నట్టు. 


***

మరునాడు "కాళహస్తి పల్లె" పొలిమేరలో జాతరకు అందరూ చేరుకున్నారు. భూస్వాములు వారి కుటుంబాలతో సహా విచ్చేశారు. పల్లె ప్రజలతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసి పోయింది. రకరకాల దుకాణాలలో, ఆట వస్తువులతో మెరిసిపోతుంది ఆ ప్రాంతం. 


"పల్లె ప్రజలారా! నేనో తమాషా చూపిస్తా.. అందరూ నిశ్శబ్దంగా చూడండి", అంటూ గట్టిగా అరిచింది శ్రీలేఖ. 


శ్రీలేఖ ఆ ఊరికి కొత్త అమ్మాయి కదా, అందరూ నిశ్శబ్ధంగా చూస్తున్నారు. 


భూస్వామి కూతుర్ని పిలిచి, "అక్కడ ఉన్న చెట్టుకు కాచిన ఒక పువ్వు, కాయ, పండు కోసి తే.. అలాగే, కింద పడిన చిన్న కొమ్మ లేక కట్టె ముక్క కూడా తీసుకుని రా" అన్నది శ్రీలేఖ. 


ఆ అమ్మాయి అలాగే తెచ్చి ఇచ్చింది. 


శ్రీలేఖ ఇలా అడిగింది, "నువ్వు ఇవి కోసినప్పుడు.. ఆ చెట్టు నిన్ను నీ పేరు, నీ కులం పేరు, నీ ఆర్థిక స్థితి.. అదే నువ్వు పేదా? ధనికురాలా?.. అనే విషయాలు అడిగిందా", అని. 


ఆ అమ్మాయి ఆశ్చర్యంగా - అమాయకంగా "లేదు" అన్నది. 


వెంటనే శ్రీలేఖ ఇలా గట్టిగా లాగించింది తన భాషణను, 


"ఈ చెట్టు మనకి.. అందరూ మనుషులకు అన్నీ ఇస్తుంది.. తినటానికి కూరగాయలు, పండ్లు.. దేవుడికి పెట్టటానికి పూలు.. వంట వండటానికి కట్టెలు.. కుర్చీలు, తలుపులు చేయటానికి కట్టెలు.. ఔషధాలు తయారు చేయటానికి ఆకులు.. మండే ఎండలో నిలవటానికి నీడ.. పళ్ళెం లాంటి విస్తరాకులు.. మనమందరం పీల్చే ప్రాణ వాయువు వగైరా వగైరా. అంతే కాదు మన పరిశ్రమలు, వాహనాలు ఇచ్చే అస్వస్తమైన పొగ లోని కాలుష్యం కూడా పీల్చేస్తుంది". 


"ఇన్ని ఇచ్చే చెట్టుకు లేని తార తమ్యాలు మనకు ఎందుకు? దానికి లేని అహంకారాలు, కుల - మత భేదాలు, ధనిక - బీద హెచ్చు తగ్గులు మనకు ఎందుకు? మనుషులంతా ఒక్కటే అన్నట్టు జీవించ వచ్చు కదా". 


"ఎందుకు పేద వారు 5 కిలోమీటర్లు దూరం నడిచి నీరు మోసుకొని రావాలి? అందరూ ఈ పల్లె మధ్యలో ఉన్న పెద్ద దిగుడు బావి నుండే నీరు తీసుకోవచ్చు కదా"? 


"మనందరి జీవితాలు పరస్పరాధారితమైంది కదా! ఏ ఒక్క వృత్తి వారు లేకున్నా మనందరం ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలి ప్రతిఒక్కరూ"? 


"అంతెందుకు? మనందరినీ దేవుడు ఒకే ఎర్ర రక్తం తో పుట్టిచ్చాడు. ఈ భూమిని యే గోడలు - సరిహద్దు రేఖలు లేకుండా నిర్మించాడు. అంటే కులాల పేర్లు మనుషులు కలిపిచ్చుకున్నవి, మన వృత్తిని బట్టి. 

దేశాల పేర్లు మనం పెట్టున్నాము. దేవుడు పెట్టినవి కావు. 


"అంతర్జాతీయ సరిహద్దు రేఖలు, రాష్ట్ర రేఖలు మనం కలిపిచ్చుకున్నవి సుపరిపాలన కొరకు.. సమర్థవంతమైన పాలన కొరకు.. అంతే", అంటూ ముగించింది. 



భూస్వామి పిల్లలు ముందుగా చప్పట్లు కొట్టారు. అవాక్కయిన పల్లె ప్రజలు కేరింతలు కొడుతూ పెద్దగా అరిచారు "ఔను ఔను" అని. 


భూస్వాములకు తల కొట్టేసినంత పని అయ్యింది. పశ్చాత్తాపం తో అలా నిలపడి పోయారు తలలు దించుకుని. వారి పిల్లలు, "ఈ నాటి నుండి, ఈ పల్లె మధ్యలో ఉన్న దిగుడు బావిని అందరూ వాడుకోవచ్చు. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. మనుషులంతా ఒక్కటే లా జీవిద్దాం ఈ క్షణం నుండి. ఇది శ్రీలేఖ ఇచ్చిన తీర్పు", అంటూ కితాబు ఇచ్చారు. భూస్వాములు, ప్రజలు తలలు ఊపారు "ఔను అంటూ". 


శ్రీలేఖ వెంటనే చిరునవ్వుతో, "ఇది చెట్టు ఇచ్చిన తీర్పు.. 

మనుషులంతా ఒక్కటే.. తారతమ్యాలు లేకుండా స్నేహపూరిత జట్టు గా జీవించాలి.. అని"


అప్పటికప్పుడే శ్రీలేఖ ఒక బోర్డ్ - ఫలకం తయారు చేయిచ్చింది ఇలా, "మనుషులంతా ఒక్కటే ఊరు", అని. ఆ దిగుడు బావి దగ్గర చెట్టుకు వెలాడ తీయిచ్చింది. 


కృతజ్ఞతా పూర్వకముగా ఆ ఊరి వారు ఇంకో (రెండో) బోర్డ్ - ఫలకం తయారు చేసి మొదటి ఫలకం పక్కన వెలాడ తీశారు ఇలా:

 "ఇది శ్రీలేఖ కాపాడిన ఊరు.. శ్రీలేఖ ఊరే"".. అని. 


***


నీతి: దేవుడు అందరి - మనుషులను ఒకే ఎర్ర రక్తం తో ప్రాణం పోశాడు. మొత్తం భూమిని - ప్రపంచాన్ని సరిహద్దు రేఖలు మరియు గోడలు లేకుండా ఒకే ప్రపంచ - దేశంగా నిర్మించాడు (దేవుడు). 


"మనుషులంతా ఒక్కటే లా".. తారతమ్యాలు లేకుండా స్నేహపూరిత జట్టు గా జీవించాలి అందరూ.. మనందరి జీవితాలు పరస్పరాధారితమైంది.. ఏ ఒక్క వృత్తి వారు లేకున్నా వెలితిగా ఉంటుంది.. రకరకాల సమస్యలు వస్తాయి. 

---------- X X X --------- X X X ------ X X X ------


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






40 views1 comment

1 Kommentar


mk kumar
mk kumar
02. Jan.

శ్రీలేఖపాత్రలోని ధైర్యం, సమాజ సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలను ఆవిష్కరించేందుకు ఆమె చేసిన ప్రయత్నం ఎంతో శ్రేయస్సుగా ఉంది. కథలోని "చెట్టు ఇచ్చిన తీర్పు" ఆలోచనామయమైన సందేశాన్ని అందిస్తుంది, మనిషి సమానత్వం, సహజ వనరులపై సమాన హక్కులు, పేద - ధనిక భేదాలను అధిగమించాల్సిన అవసరాన్ని చూపిస్తుంది.


అలాగే, కథలోని గ్రామీణ వాతావరణ చిత్రణ చాలా సహజంగా ఉంది. శ్రీలేఖ, మేఘన మధ్య ఉన్న స్నేహబంధం కూడా హృదయాన్ని హత్తుకునేలా ఉంది.


Gefällt mir
bottom of page