#TVLGayathri, #TVLగాయత్రి, #CheyadaggaSayam, #చేయదగ్గసాయం, #TeluguStories, #తెలుగుకథలు

Cheyadagga Sayam - New Telugu Story Written By - T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 20/02/2025
చేయదగ్గ సాయం - తెలుగు కథ
రచన: T. V. L. గాయత్రి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ప్రతి శనివారం వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి రావడం సుధకు అలవాటు. ఆరోజు ఆఫీసు ఉండదు కాబట్టి భార్య కోరిక మేరకు ప్రతి శనివారం సాయంత్రం పూట భార్యను గుడికి తీసుకొని వెళ్తాడు శ్రీకాంత్.
"మీ దగ్గర పది రూపాయలు నోట్లు ఉన్నాయా? ఒక ఇరవై దాకా చాలు!" అందిసుధ.
ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు అడుక్కునే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. చిన్నబిడ్డల్ని చంకనేసుకొని, చిరిగిన బట్టలతో ఆడవాళ్లు కొందరూ, అవిటివాళ్లయిన ముసలి మగవాళ్ళు కొందరూ, మరీ పదేళ్ల లోపు పసిపిల్లలు కూడా.. మాసిన బట్టలు.. నీరసపు మొహాలు.. వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంటుంది సుధకు.
అందుకని తలా ఒక పది రూపాయలు ఇస్తూ ఉండేది. అలాగే గుడిమెట్ల మీద కూడా.. బిక్షగాళ్ళు కనిపిస్తూ ఉంటారు.n వాళ్లకు కూడా తలా ఒక పది రూపాయలు చిల్లర వేస్తూ ఉండేది. ఎక్కడికైనా వెళ్తుంటే కొంత చిల్లర దగ్గర పెట్టుకుంటుంది సుధ.
"ఆ భిక్షగాళ్ళ వెనకాల పెద్ద పెద్ద ముఠాలు ఉంటాయి సుధా! వాళ్ళని అలా భిక్షగాళ్లగా తయారు చేసి కొందరు దుర్మార్గులు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు!" అన్నాడు శ్రీకాంత్.
"పాపం మరెలా!వాళ్ళు మరీ దీనంగా అడుక్కు తింటుంటే జాలి వేస్తుందండీ!"
"ఏదన్నా తినుబండారాలు ఇవ్వు! బిస్కెట్లో లేకపోతే అరటి పళ్లో!.. ఇలా అయితే కనీసం వాళ్ళ ఆకలి అయినా తీరుతుంది! మనం డబ్బులు దానం చేసి మరీ దుర్మార్గులను పెంచి పోషించటం సరిఅయిన పని అవుతుందా? చెప్పు !" అన్నాడు శ్రీకాంత్.
ఆ పైవారం అలవాటుగా దేవాలయానికి బయలుదేరడానికి తయారవుతున్నాడు శ్రీకాంత్. కొంచెం పెద్దది.. జనపనార సంచీని మోసుకొస్తున్న భార్యవంక చిత్రంగా చూసాడు.
"ఇదేమిటి? "
"మీరే చెప్పారు కదా!అడుక్కు తినే వాళ్ళకి ఏదైనా తినడానికి తీసుకొని రమ్మని! శుభ్రంగా నాలుగు కేజీల పులిహోర చేశాను! ఒక మనిషికి సరిపడా ఆకుల్లో పొట్లాలు కట్టి, కాగితం బ్యాగుల్లో పెట్టాను! దారిలో కనిపించిన బిక్షగాళ్ళకు, గుడి దగ్గర అడుక్కుతినే వాళ్లకు ఒక్కో బ్యాగ్ ఇస్తే సరి!.. వాళ్ళ ఆకలీ తీరుతుంది!.. నాక్కూడా అన్నదానం చేశానని తృప్తీ మిగులుతుంది!.. అయినా మనం పెట్టే ఖర్చులో ఇదంతా ఎక్కువేం కాదు లెండి!" అంది సుధ భర్తకు సర్ది చెబుతున్నట్లుగా.
"మంచిపనే!" అంటూ నవ్వాడు శ్రీకాంత్.
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Comments