top of page

చిగురించిన కొత్త జీవితం

#ChigurinchinaKotthaJivitham, #చిగురించినకొత్తజీవితం, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguKathalu, #తెలుగుకథలు

Chigurinchina Kottha Jivitham - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 14/04/2025

చిగురించిన కొత్త జీవితం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


సాయంకాలమైంది. వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ఆదివారమైనందున పార్కులో జనం సందడిగా కనబడుతున్నారు. పల్లీలమ్ముకునే వారు, ఐస్ క్రీమ్, ప్లాస్టిక్ బొమ్మలు, గాలి బూరాలు అమ్మేవారు పార్కులో తిరుగుతున్నారు. 


పెరిగిన గెడ్డం చిందర వందర నలుపు తెలుపు జుత్తుతో విరాగిలా మున్సిపల్ పార్కులో ఒక మూలనున్న సిమ్మెంటు బెంచీ మీద ఒంటరిగా కూర్చున్న సూర్యం పార్కులోకి వస్తున్న యువ జంటలను చూసి తనకి గతం జ్ఞాపకం వచ్చింది. 


  *

తను, అనూరాధ ఇదే పార్కులో ఇదే సిమ్మెంటు బెంచీ మీద గడిపిన మథుర క్షణాలు మరిచిపోలేనివి. పల్లీలు, ఐస్ క్రీమ్ లు తింటూ ఏవేవో కబుర్లు చెప్పుకునేవారిమి. నాకు అనూరాధ దూరమై ముప్పై సంవత్సరాలు గడిచినా ఆ జ్ఝాపకాలు నిన్న మొన్న జరిగినట్టనిపిస్తోంది. మా మద్య దూరాలు పెరగడానికి కారణం అంతస్థులే. 


నాన్న నా చిన్న తనంలోనే చనిపోవడంతో అమ్మ బ్రతుకు తెరువు కోసం పల్లె గ్రామం వదిలి పట్నం రావడం జరిగింది. బస్తీలో చిన్న ఇల్లు బాడుగకు తీసుకుని ఉంటూ పేపర్ మిల్లు

యజమాని శ్రీనివాస రావు గారింట్లో పనికి కుదురుకుంది. 


సారు గారి భార్య చనిపోవడంతో పదేళ్ల వారి అమ్మాయి అనూరాధ బాగోగులు అమ్మ చూసేది. అమ్మకోసం అప్పడప్పుడు నేను శ్రీనివాసరావు గారింటికి వెళ్లే వాడిని. అక్కడ అనూరాధ కనబడేది. తనకి ఎవరు తోడు లేనందున నాతో కబుర్లు చెప్పేది. 


అమ్మ నన్ను మందలించినా శ్రీనివాసరావు ముద్దుల కూతురి ఆనందం చూసి ఏమీ అనేవారు కాదు. ఊళ్లో ఉన్న హైస్కూలులో ఇద్దరం కలిసి చదివినందున అనూరాధ చనువుగా ఉంటు చదువులో తనకి తెలియని విషయాలు నన్నడిగి తెలుసుకునేది. 


యజమాని శ్రీనివాసరావు కంపెనీ పనుల మీద తరచు బయట తిరుగుతుండేవారు. అందువల్ల అనూరాధకు అమ్మ దగ్గిరే చనువు ఎక్కువ. కాలంతో పాటు మా వయసులు పెరిగి యుక్త వయసు కొచ్చాము. చిన్నప్పటి నుంచి పెరిగిన అనుబంధం మా మద్య తెలియని ప్రేమానుబంధానికి దారి తీసింది. 


అమ్మ హెచ్చరికలతో నేను నా పరిది దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదు. నా మీదున్న అనురాగంతో ఒక్కొక్కప్పుడు అనూరాధ తన మనసులోని భావాలను వ్యక్త పరిచినా నా హద్దుల్లో ఉండే వాడినే కాని నా మూగ ప్రేమను బయట పడనియ్య లేదు. 


వీలున్నప్పుడు ఇదే పార్కులో ఇదే సిమ్మెంటు బెంచీ మీద కూర్చొని ఐస్ క్రీములు తింటూ కబుర్లు చెప్పుకునేవారిమి. రోజులు గడుస్తున్నాయి. నేను శ్రీనివాసరావు గారి దయతో

కాలేజీ డిగ్రీ పూర్తి చేసి బియెడ్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత పక్కఊరిలో టీచర్ గా జాబ్ వస్తే అక్కడికి వెళ్లవలసి వచ్చింది. కాలగమనంలో రోజులు గడుస్తున్నాయి. అనూరాధ పట్నంలో ఇంజినీరింగ్ కోర్సులో జాయినవడంతో మా మద్య దూరం పెరిగి రాకపోకలు తగ్గినాయి. 


అనూరాధ ఇంజనీరింగ్ పూర్తవగానే శ్రీనివాసరావు విదేశంలో ఉన్న వారి మేనల్లుడితో ఆమె ప్రమేయం లేకుండా వివాహం జరిపించారు. తప్పని పరిస్థితుల్లో అనూరాధ విదేశాలకు వెళ్లి

నాకు దూరమైంది. అమ్మ హెచ్చరికలతో నన్ను నేను సంభాళించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాను. 


పెళ్లికి అమ్మ ఎంత వత్తిడి చేసినా అనూరాధ మీదున్న అనురాగంతో ఆ పని చెయ్యలేకపోయాను. ఇంతలో పేపర్ మిల్లు యజమాని శ్రీనివాసరావు గుండెపోటుతో కాలం చెయ్యడంతో విదేశంలో ఉన్న వారి అల్లుడు మిల్లును అమ్మేయడంతో అమ్మ నా దగ్గరే ఉంటూ చివరిరోజులు గడిపింది. 


ఇప్పుడు నేను వంటరి పక్షినయాను. టీచర్ గా సుదీర్ఘ కాలం సర్వీసు తర్వాత పదవీ విరమణ పొంది విశ్రాంత జీవితం గడుపుతూ అవకాశం ఉన్నప్పుడు పార్కుకి వచ్చి నేనూ అనురాధ గడిపిన ఆనందానుభూతుల్ని నెమరు వేసుకుంటూంటాను. మొదట్లో మేము కలిసినప్పుడు చిన్నగా ఉండే చింతచెట్టు పలవలు కొమ్మలతో విస్తారంగా ఎదిగింది. పరిసరాలు గమనిస్తు ఆలోచిస్తున్నాడు సూర్యం. 

  *

"సూర్యం" అన్న పిలుపుకి ఈలోకంలో కొచ్చి, తన ఎదురుగా తెల్లని బాబ్డ్ హైర్ తో పంజాబీ డ్రెస్సులో ఉన్న అనూరాధను చూసి సంబ్రమాశ్చర్యాలకు గురయాడు సూర్యం. 


"మీరు, శ్రీనివాసరావు గారి అమ్మాయి అనూరాధ కదూ!" ఉత్కంఠతో అడిగాడు. 


"ఔను, నేను నీ చిన్ననాటి ఫ్రెండ్ అనూరాధనే. నా ప్రమేయం లేకుండా ఇంజనీరింగ్ అవగానే నాన్న నా పెళ్లి మా బావతో జరిపించి నీకు దూరంగా పంపేసారు. అక్కడి కెళ్లాక తెల్సింది మాబావ అక్కడి వేరొక అమ్మాయితో కాపురం చేస్తున్నాడని. అందువల్ల మామద్య మనస్పర్థలు పెరిగి విడాకులతో వేరుగా ఉంటూ అక్కడే జాబ్ లో జాయినయాను. ఇంతలో నాన్నగారు స్వర్గస్తులవడం పేపర్ మిల్లు అమ్మడం జరిగింది. 


ఇంతకాలం నీ జ్ఞాపకాలు వస్తున్నా పరిస్థితులకు తలొగ్గి నిస్సార జీవితం సాగిస్తు వచ్చాను. మీ అమ్మ చనిపోవడం, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితం సాగిస్తున్నావని తెల్సింది. 


విధివంచితులమైన మనం ఈ ఆఖరి మజిలీ లోనైన కలిసి బ్రతుకుదామని నిశ్చయించి ఇండియాకు తిరిగి వచ్చేసాను. ఇప్పుడు మనల్ని ఎవరూ వేరు చెయ్యలే”రని పరవశంతో

సూర్యం భుజం మీద తల పెట్టి సేద తీరింది అనూరాధ. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


コメント


bottom of page